ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది | Black box of Indonesian crashed plane found | Sakshi
Sakshi News home page

ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది

Published Tue, Aug 18 2015 11:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది

ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది

జకార్తా: ఇండోనేసియా రాజధాని జకర్తాలోని పుపువా ప్రాంతంలో ఆదివారం కూలిపోయిన ట్రిగానా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ని కనుగొన్నారు. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జె.ఎ. బరత మంగళవారం వెల్లడించారు. పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగానా ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొండను ఢీకొని కూలిపోయిన సంగతి తెలిసిందే. 

టేకాఫ్ అయిన 33 నిమిషాలకే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం మొత్తం 54 మంది ఉన్నారు. వీరిలో 49 మంది ప్రయాణికులు, కాగా ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు శిశువులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలోని మొత్తం 54 మృతదేహలను గుర్తించామని నేషనల్ సెర్చి అండ్ రెస్క్యూ అఫీస్కు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement