న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ వర్మ తెలిపారు. డిజిటల్ ఇన్‌ఫ్రా, కనెక్టివిటీ, నెట్‌వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు.
అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ బాక్స్ సేవలు అందిస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,233 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్లాక్ బాక్స్ ఆదాయంలో 70 శాతం వాటా అమెరికాది కాగా యూరప్ వాటా 15 శాతంగా ఉంది. 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్య 7,000–8,000కు చేరే అవకాశం ఉందని, అత్యధికంగా హైరింగ్ భారత్‌లోనే ఉంటుందని వర్మ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment