Triple
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మూడింతలైన నాట్కో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్కో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడురెట్లకుపైగా అధికమై రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.513 కోట్ల నుంచి రూ.795 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.432 కోట్ల నుంచి రూ.539 కోట్లకు పెరిగాయి. ఫార్ములేషన్స్ ఎగుమతుల ద్వారా ఆదాయం రూ.334 కోట్ల నుంచి రూ.605 కోట్లను తాకింది. దేశీయంగా ఫార్ములేషన్స్ అమ్మకాల ద్వారా ఆదాయం రూ.101 కోట్ల నుంచి రూ.99 కోట్లకు వచ్చి చేరింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మూడవ మధ్యంతర డివిడెండ్ రూ.1.25 చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. నాట్కో ఫార్మా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో బుధవారం 3.10 శాతం ఎగసి రూ.883.85 వద్ద స్థిరపడింది. -
2 బిలియన్ డాలర్లపై బ్లాక్ బాక్స్ గురి
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ వర్మ తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా, కనెక్టివిటీ, నెట్వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ బాక్స్ సేవలు అందిస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,233 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్లాక్ బాక్స్ ఆదాయంలో 70 శాతం వాటా అమెరికాది కాగా యూరప్ వాటా 15 శాతంగా ఉంది. 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్య 7,000–8,000కు చేరే అవకాశం ఉందని, అత్యధికంగా హైరింగ్ భారత్‌లోనే ఉంటుందని వర్మ వివరించారు. -
ట్రిపుల్ బొనాంజా
‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి సినిమాలతో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. శనివారం (సెప్టెంబరు 2) సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా సుదీప్ మూడు చిత్రాలను ప్రకటించి, తన అభిమానులకు ట్రిపుల్ బొనాంజా ఇచ్చారు. సుదీప్ హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు కథ అందించిన రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ విజన్ చేస్తుండటం విశేషం. ఆర్సీ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 2024లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత... ఇప్పటివరకూ సుదీప్ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మాణిక్య’ (2014) తర్వాత దర్శకుడిగా సుదీప్ మరో సినిమాకు మెగాఫోన్ పట్టలేదు. అయితే పదేళ్ల తర్వాత సుదీప్ నటిస్తూ, ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్. మ్యాక్స్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘మ్యాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకాలపై కలైపులి యస్. ధాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
చమురు కంపెనీల లాభాలు మూడు రెట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరగనున్నాయి. రూ. 1 లక్ష కోట్లకు చేరనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు తగ్గడం, దేశీయంగా రిటైల్ రేట్లు అధిక స్థాయిలో ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం.. 2017–2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఓఎంసీల నిర్వహణ లాభాలు సగటున రూ. 60,000 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 33,000 కోట్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని మూడు ప్రభుత్వ రంగ ఓఎంసీల మీద నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఆయిల్ కంపెనీలకు ప్రధానంగా రిఫైనింగ్ (ముడి చమురును శుద్ధి చేయడం), రిటైల్ బంకుల ద్వారా ఇంధనాలను మార్కెటింగ్ చేయడం ద్వారా రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది. నివేదికలో మరిన్ని అంశాలు.. ► రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్ పెరగడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు సగటున బ్యారెల్‌కు 15 డాలర్లు పలికాయి. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పటికీ .. రిటైల్ ఇంధన ధరను ఆ స్థాయిలో పెంచకపోవడంతో, రిఫైనింగ్ మార్జిన్లు పటిష్టంగానే ఉన్నా.. మార్కెటింగ్‌పరంగా నష్టాలు నమోదు చేయాల్సి వచి్చంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత బలహీనపడింది. ► ఈసారి నిర్వహణ లాభాలు లీటరుకు రూ. 5–7 స్థాయికి చేరవచ్చని, స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 6–8 డాలర్ల స్థాయికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది. ► 2017–23 మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలు తమ రిఫైనింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 3.3 లక్షల కోట్లు వెచి్చంచాయి. ఫలితంగా 2017లో రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న వాటి స్థూల రుణ భారం 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.6 లక్షల కోట్లకు చేరింది. అయితే, లాభదాయకత తక్కువ స్థాయిలోనే కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఎంసీల పెట్టుబడి వ్యయాలు రూ. 54,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. ► ఈసారి క్రూడాయిల్ రేట్లు ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగినా లేక ముడిచమురు ధర తగ్గకుండా రిటైల్ రేట్లు తగ్గినా అంచనాలు మారిపోవచ్చు. -
ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి
ప్రీమియం ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. అంటే ఇది గతంలో కంటే మూడు రెట్లు అధికం. దీంతో స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్.. చైనా దాటి వేగంగా దూసుకెళ్తోంది. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ నుంచి పెగాట్రాన్ కార్ప్‌కి విస్తరించిన భాగస్వాముల ద్వారా యాపిల్ ఇప్పుడు దాదాపు 7 శాతం ఐఫోన్లను భారతదేశంలో తయారుచేస్తోంది. 2021లో 1 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశానికి ఇది గణనీయమైన పురోగతి. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని యాపిల్ తగ్గించి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గత సంవత్సరం జెంగ్జౌలోని ఫాక్స్‌కాన్ ప్రధాన “ఐఫోన్ సిటీ” కాంప్లెక్స్‌లో గందరగోళం కారణంగా యాపిల్ ఉత్పత్తి అంచనాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం తయారీ రంగాన్ని పెంపొందించడానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యాపిల్ చైనాను కాదని భారత్‌లో ఉత్పత్తిని పెంచింది. ఇదే దూకుడు కొనసాగితే 2025 నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు భారత్‌లోనే జరగనుంది. తన సప్లయి చైన్‌ను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించిన యాపిల్ భారతదేశంలో ప్రోత్సాహకాల కోసం విజయవంతంగా లాబీయింగ్ చేసింది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ కార్ప్, పెగాట్రాన్ సంస్థలతో జత కట్టింది. ఈ మూడు కలిసి భారత్‌లో దాదాపు 60,000 మందికి ఉపాధి కల్పించాయి. ఐఫోన్ 11 నుంచి తాజా ఐఫోన్ 14 వరకు మోడల్లను ఇక్కడ తయారు చేస్తున్నాయి. యాపిల్ తన మొదటి రెండు రిటైల్ స్టోర్లను వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనుంది. ఒకటి ఆర్థిక కేంద్రమైన ముంబైలో, మరొకటి దేశ రాజధాని న్యూఢిల్లీలో. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ వీటిని ప్రారంభించేందుకు స్వయంగా వస్తారని తెలుస్తోంది. -
చైనా రక్షణ బడ్జెట్ 7% పెంపు
బీజింగ్: చైనా తన సాయుధబలగాల కోసం ఈస ారి బడ్జెట్ కేటాయి ంపులు పెంచింది. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం ఎక్కు వగా 230 బిలియన్ డాలర్లకు డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచుకుంది. భారత్ తన రక్షణ అవసరాలకు కేటాయిస్తున్న బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఈ బడ్జెట్ ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్ యువాన్ల రక్షణ బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలను చైనా ప్రధాని లీ కెకియాంగ్ శనివారం ఆ దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాభల్యాన్ని కొనసాగించేందుకు చైనా ఇలా తన రక్షణ బడ్జెట్‌ను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను మరింత పటిష్టచేసేందుకు, చైనా సమగ్రత, సార్వభౌమత్వం, దేశ ప్రయోజనాలు, రక్షణలను దృష్టిలో ఉంచుకుని రక్షణ బడ్జెట్ పెంచామని ముసాయిదా పత్రాల్లో కెకియాంగ్ పేర్కొన్నారు. అయితే, 2017లో చైనా మొత్తం సాయుధ బలగాల సంఖ్యను 23 లక్షల నుంచి 20 లక్షలకు కుదించుకోవడం గమనార్హం. 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అధ్యక్షుడు జిన్‌పింగ్ ముఖ్యంగా సైన్యం పటిష్టతపైనా దృష్టిపెట్టారు. -
శాంసంగ్ ఫోన్ : భారీ స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా
సాక్షి, న్యూఢిల్లీ: సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను విడుదల చేసింది. శాంసంగ్ ఏ సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్ప్లే, మూడు రియర్‌కెమెరాలతో లేటెస్ట్ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ , పింక్ కలర్స్‌లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 29,385గా ఉంది. అక్టోబర్ ఆరంభంనుంచి యూరోపియన్, ఇతర ఆసియన్ మార్కెట్లలో లభ్యం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
తలాక్ పద్ధతిపై ముస్లిం మహిళల పోరాటం!
న్యూఢిల్లీః తలాక్ సిస్టమ్ ను తొలగించాలంటూ దేశంలోని ఏభై వేలకుపైగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. మూడుసార్లు తలాక్ చెప్తే విడాకులు ఇచ్చినట్లేనన్న ముస్లిం పర్సనల్ లా లోని ఆచారానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. ముస్లిం మతంలో ఉన్న తలాక్ విడాకుల పద్ధతిని నిషేధించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్ కోసం ఇప్పటివరకూ సుమారు 50 వేల సంతకాలు సేకరించారు. భారతీయ ముస్లిం మహిళల (బీఎంఎంఏ) సంఘం తలాక్ పద్ధతిని నిషేధించాలని కోరుతూ పోరాటం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్ కు మద్దతివ్వాలని కోరుతున్న సంఘం.. జాతీయ మహిళా కమిషన్ కూడ తమకు సహకరించాలని, ముస్లిం మతంలో ఉన్న తలాక్ పద్ధతి నిషేధించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తమ పిటిషన్ కు మద్దతుకోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంఎంఏ సహ వ్యవస్థాపకులు జికియా సోమన్ తెలిపారు. ఇప్పటివరకూ ఏభై వేల సంతకాలు సేకరించామని, మతంలోని కొందరు పురుషులు సైతం తమకు మద్దతిస్తున్నారని అన్నారు. ముస్లిం మతంలోని తలాక్ పద్ధతిపై చేపట్టిన సర్వేలో 90 శాతం పైగా మహిళలు తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తమకు మద్దతునిచ్చేవారినుంచి మరిన్ని సంతకాలు సేకరించి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంస్థ సభ్యురాలు నూర్జహా సాఫియా తెలిపారు. ఖురాన్ లో కూడ ఎక్కడా ఇటువంటి తలాక్ పద్ధతి అమల్లో ఉన్న దాఖలాలు లేవని, నేషనల్ ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ లలిత కుమార మంగళమ్ కు పంపించే లేఖలో కూడ బీఎంఎంఏ పేర్కొంది. ఈ విషయంలో ముస్టిం మత పెద్దలను, అధికారులను సైతం కలసి, దేశంలో ఇతర మహిళలకు అమలౌతున్న న్యాయమైన నిబంధనలే తమకు అమలయ్యేట్లు కోరుతామని బీఎంఎంఏ పేర్కొంది. అయితే ముస్లిం పర్సనల్ లా ను పూర్తిగా మార్చాలంటే సమయం పడుతుందని, కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో లక్షలమంది ముస్టిం మహిళలకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తమ పోరాటాన్ని కొందరు మత గురువులు వ్యతిరేకిస్తున్నారని, వారు తలాక్ ను అల్లా విధించిన చట్టంగా నమ్ముతారని మహిళలు అంటున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ఈ విషయాన్ని వ్యతిరేకించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. -
ట్రిపుల్ఐటీకి మరో 113 ఎకరాలు
తీరనున్న భూసమస్య {పభుత్వ ఉత్తర్వులు జారీ ఆట స్థలం, ఇతర సదుపాయాల కల్పన నూజివీడు, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కలల స్వప్నమైన ట్రిపుల్ఐటీ బాలారిష్టాలను అధిగమించబోతుంది. పదోతరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులను మరింత ప్రతిభాంవంతులుగా తీర్చిదిద్ది వారికి ఉన్నత విద్యాభ్యాసం అందించాలనే సంకల్పంతో అప్పట్లో మహానేత వైఎస్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యాలయాల స్థాపనకు అంకురార్పణ చేశారు. అందులో భాగంగానే నూజివీడులోనూ టిపుల్ఐటీని స్థాపించారు. దాదాపు 7 వేల మంది విద్యార్థులు చదువుతున్న ఈ ట్రిపుల్‌ఐటీని ఆరేళ్లుగా భూ సమస్య పట్టిపీడిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీకి మరో 113.60 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూసేకరణను పూర్తిచేసి ట్రిపుల్ఐటీకి అప్పగించినట్లయితే విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నూజివీడు పరిధిలోని సర్వే నెంబరు 1061/4 నుంచి 1061/17 వరకు ఉన్న 113.60 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రథమంలో వంద ఎకరాల్లోనే.... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి నూజివీడులో ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేయడంలో ప్రముఖపాత్ర వహించిన మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు స్థలం కోసం అప్పట్లో తీవ్రంగా కృషిచేశారు. ట్రిపుల్‌ఐటీని నూజివీడులో ఏర్పాటు చేయడం ద్వారా నూజివీడుకు ప్రపంచపటంలో మంచి గుర్తింపు వస్తుందని, నూజివీడు దినదినాభివృద్ధి చెందుతుందని, కోస్తా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కల్గిన పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని రైతులకు వివరించి తమ భూములను ఇచ్చేలా ఒప్పించి వంద ఎకరాలను సేకరించి ఇచ్చారు. దీంతో నూజివీడులోనే ట్రిపుల్‌ఐటీని నెలకొలిపారు. అయితే బాసరలో 400 ఎకరాలు, ఇడుపులపాయలో 300 ఎకరాలను ప్రారంభంలోనే కేటాయించి ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేశారు. నూజివీడులో ప్రస్తుతం ఆ వంద ఎకరాల్లో అప్పట్లో ఏర్పాటు చేసిన అరకొర తరగతి గదుల్లోనే పీయూసీ విద్యార్థులకు, నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్‌లలో ఇంజినీరింగు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. అలాగే బాలికలకు, బాలురకు హాస్టల్ భవనాలు నిర్మించారు. అయితే ఈ ఆరేళ్లుగా విద్యార్థులు ఆటలు ఆడటానికి ఆటస్థలం కానీ, ఆడిటోరియం గానీ, ఇంజినీరింగు బ్రాంచిలకు డిపార్ట్మెంట్ భవనాలు గానీ, సెంట్రల్ లైబ్రరీగానీ లేవు. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే కనీసం మరో 120 ఎకరాలు అవసరమవుతాయని ఆర్జీయూకేటీ వీసీ రాజకుమార్ గతేడాది ఫ్రిబవరి నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సదుపాయాల కల్పన.... ట్రిపుల్ఐటీకి ప్రస్తుతం సేకరించనున్న 113ఎకరాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇంజినీరింగు విద్యార్థులకు సెంట్రల్ లైబ్రరీ, ప్రతి బ్రాంచికి డిపార్ట్మెంటల్ భవనాలు, పరిపాలన భవనం, కాన్ఫరెన్స్‌హాల్, ఆడిటోరియం, పరిశోధనల కోసం ప్రత్యేక విభాగం భవనాలు నిర్మిస్తారు. అలాగే బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్‌పూల్, వ్యాయామశాలలతో పాటు క్రికెట్ ఆడుకోవడానికీ ఆటస్థలం అందుబాటులోకి వస్తుంది.