ట్రిపుల్‌ బొనాంజా | Kiccha Sudeep three movie announced | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ బొనాంజా

Published Sun, Sep 3 2023 4:47 AM | Last Updated on Sun, Sep 3 2023 4:47 AM

Kiccha Sudeep three movie announced - Sakshi

‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి సినిమాలతో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. శనివారం (సెప్టెంబరు 2) సుదీప్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా సుదీప్‌ మూడు చిత్రాలను ప్రకటించి, తన అభిమానులకు ట్రిపుల్‌ బొనాంజా ఇచ్చారు. సుదీప్‌ హీరోగా ఆర్‌. చంద్రు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలకు కథ అందించిన రచయిత వి. విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు స్క్రిప్ట్‌ విజన్‌ చేస్తుండటం విశేషం. ఆర్‌సీ స్టూడియోస్‌ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 2024లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

పదేళ్ల తర్వాత...
ఇప్పటివరకూ సుదీప్‌ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మాణిక్య’ (2014) తర్వాత దర్శకుడిగా సుదీప్‌ మరో సినిమాకు మెగాఫోన్‌ పట్టలేదు. అయితే పదేళ్ల తర్వాత సుదీప్‌ నటిస్తూ, ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్‌.

మ్యాక్స్‌
సుదీప్‌ హీరోగా విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘మ్యాక్స్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్‌ పతాకాలపై కలైపులి యస్‌. ధాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement