bonanza
-
యూపీ ఉద్యోగులకు యోగీ సర్కారు హోలీ కానుక!
ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది. -
ట్రిపుల్ బొనాంజా
‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి సినిమాలతో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. శనివారం (సెప్టెంబరు 2) సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా సుదీప్ మూడు చిత్రాలను ప్రకటించి, తన అభిమానులకు ట్రిపుల్ బొనాంజా ఇచ్చారు. సుదీప్ హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు కథ అందించిన రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ విజన్ చేస్తుండటం విశేషం. ఆర్సీ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 2024లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత... ఇప్పటివరకూ సుదీప్ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మాణిక్య’ (2014) తర్వాత దర్శకుడిగా సుదీప్ మరో సినిమాకు మెగాఫోన్ పట్టలేదు. అయితే పదేళ్ల తర్వాత సుదీప్ నటిస్తూ, ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్. మ్యాక్స్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘మ్యాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకాలపై కలైపులి యస్. ధాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా..
సాక్షి, అమరావతి: టెన్త్ టాపర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొనాంజా ప్రకటించారు. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్‌లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలను విస్తరించనున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లరూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి చెప్పారు. -
ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు... బనానా రికార్డు!
Banana Bonanza: అరటి పండ్లను ఇలా వరుసగా పేర్చారేమిటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలోని షికాగోకు చెందిన జ్యువెల్ ఓస్కో అనే సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు ఇలా పండ్లను పేర్చడం ద్వారా సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇందులో పెద్ద గొప్పేం ఉంది.. ఎవరైనా ఈ రికార్డు సృష్టించొచ్చు అనుకుంటున్నారా? కానీ ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు మరి.. ఇందుకోసం వాడిన అరటిపండ్లు ఎన్నో తెలిస్తే మీరు అవాక్కవుతారు.. ఎందుకంటే ఏకంగా 31,751 కిలోల అరటిపండ్లను ఇలా వరుసగా పేర్చారు. అంటే ఒక్కో అరటిపండు సుమారు 100 గ్రాముల బరువు ఉంటుందనుకుంటే ఈ రికార్డు కోసం వాడిన అరటిపండ్ల సంఖ్య సుమారు 3 లక్షలన్నమాట! ఇలా అరటిపండ్లను వరుసగా పేర్చడానికి స్టోర్ నిర్వాహకులకు 3 రోజుల సమయం పట్టిందట. ఈ రికార్డుతో బ్రెజిల్లో 2016లో 18,805.83 కిలోల అరటిపండ్లను పేర్చడం ద్వారా నమోదైన గిన్నిస్ రికార్డు తెరమరుగైంది. గిన్నిస్ ప్రతినిధులు ఈ రికార్డును ధ్రువీకరించాక ఆ అరటిపండ్లలో కొన్నింటిని సూపర్ మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులకు నిర్వాహకులు పంచిపెట్టారు. మిగిలిన వాటిని ఉత్తర ఇల్లినాయీ ఆహార బ్యాంకుకు పంపారు. The folks from @GWR have surveyed the display and it's official! We have a new WORLD RECORD! Our roving banana reporter Leslie Harris is LIVE at the @jewelosco in Westmont (@westmontilgov) with the latest fruit-related news!#Westmont #Bananas #LotsofBanans #WorldRecord pic.twitter.com/n5Qobn13YA — 95.9 The River (@959TheRiver) June 8, 2022 (చదవండి: దురదృష్టకరమైన ఘటన... గాయపడిన పక్షిని రక్షించడమే శాపమైంది) -
వ్యాక్సినేషన్: టెస్లాకారు, ఇల్లు.. బహుమతుల బొనాంజా
హాంకాంగ్ : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్‌న్యూస్. హాంకాంగ్ నగరంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన వారికి ఖరీదైన టెస్లా కార్లను, గోల్డ్ బార్లను అందించనున్నాయి అక్కడి కార్పొరేట్ సంస్థలు. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా లీకా షింగ్ సీకే గ్రూప్, తన ఛారిటబుల్ సంస్థలతో కలిపి మంగళవారం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన వారికి లాటరీ ద్వారా 2.6 మిలియన్ డాలర్ల విలువైన షాపింగ్ వోచర్లను గిఫ్ట్‌గా ఇవ్వనుంది. మరో బిలియనీర్ అడ్రియన్ చెంగ్ నేతృత్వంలోని న్యూ వరల్డ్ గ్రోత్ కో ద్వారా టీకా తీసుకున్న అల్పాదాయ వర్గాల వారికి హాంకాంగ్ నగరంలో10 మిలియన్ డాలర్లను ఆఫర్ చేయనుందని ప్రభుత్వ ముఖ్య అధికారి క్యారీ లామ్ తెలిపారు. ఇంటిని గెల్చుకోవచ్చు! హాంకాంగ్‌లోని పటు కార్పొరేట్ కంపెనీలు, రెస్టారెంట్లు తమ ఉద్యోగులకు నగదు చెల్లింపులు, వోచర్లు ఇతర ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా సినో గ్రూప్‌నకు చెందిన చారిటీ విభాగం ఎన్జీ టెంగ్ ఫాంగ్ ఛారిటబుల్ ఫౌండేషన్, చైనీస్ ఎస్టేట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంయుక్తంగా గత నెలలో క్వాన్ టోంగ్ ప్రాంతంలో 1.4 మిలియన్ల అపార్ట్మెంటును బహుమతిగా అందిస్తామని వెల్లడించాయి. అలాగే మరో రెండు వేర్వేరు ప్రధాన హాంకాంగ్ కంపెనీలు కూడా ఈ నెలలో ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. హాంకాంగ్‌కు చెందిన అతిపెద్ద డెవలపర్ సోలార్ హంగ్ కై ప్రాపర్టీస్ లిమిటెడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి ఐఫోన్లతోపాటు, ఇతర బహుమతులను అందిస్తోంది. బిజినెస్ టైకూన్ లీ షా కీ, హెండర్సన్ ల్యాండ్ గ్రోత్ కంపెనీ గోల్డ్ బార్స్ ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఏజెన్సీ గుడ్మాన్ గ్రూప్ ఆగస్టు 31 నాటికి టీకాలు వేసుకున్న వారికోసం ఒక లాటరీని స్కీంను ప్రకటించింది. ఒక మిలియన్‌కు పైగా హాంకాంగ్ డాలర్ల బహుమతిని లాటరీ ద్వారా అందిస్తుంది. ఇందులో భాగంగా 5 లక్షల హాంకాంగ్ డాలర్ల విలువైన టెస్లా మన్నెక్విన్ 3 కారును కూడా అందించనున్నామని గుడ్‌మ్యాన్ ప్రతినిధి వెల్లడించారు. చదవండి : Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే.. -
ఆ టెక్ కంపెనీ ఉద్యోగులకు బోనస్ బొనాంజా
బీజింగ్: చైనా టెలికాం దిగ్గజం హువావే టెక్నాలజీస్ కంపెనీ ఉద్యోగులు భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా హువావే కంపెనీల ఉత్పత్తులు, చైనా వాణిజ్య బ్లాక్‌లిస్టింగ్‌ను దీటుగా ఎదుర్కొనేలా సహాయపడిన సిబ్బందికి 2 బిలియన్ యువాన్ల (286 మిలియన్ డాలర్లు) నగదు రివార్డులను అందజేస్తామని మంగళవారం తెలిపింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(పరిశోధన, అభివృద్ధి) టీమ్‌లకు ఈ నగదు బహుమతులను అందించనుంది. ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం పరికరాల ప్రొవైడర్, అమెరికాలో హార్డ్‌వేర్ ఉత్పత్తుల వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మే నెలలో అమెరికన్ సంస్థలతో వ్యాపారం చేయకుండా నిషేధించిన అనంతరం చైనా కంపెనీ ఉద్యోగులకు ఈ నగదు బోనస్‌లను ఇచ్చేందుకనిర్ణయించింది. యుఎస్ ఒత్తిడి నేపథ్యంలో ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపుగా ఇది వుంటుందని హువావే మానవ వనరుల విభాగం కంపెనీ సిబ్బందికి ఇచ్చిన నోటీసులో తెలిపింది. తద్వారా దాదాపు 1,90,000 మంది కార్మికులకు ఈ నెలలో ఇది రెట్టింపు వేతనం ఇస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా అమెరికా నిషేధం విధించడంతో ప్రత్నామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది కంపెనీకి చెందిన 5జీ నెట్‌వర్కింగ్‌కు సంబంధించి పరికరాలు భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ హువావే ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్ : బెస్ట్ డీల్స్ ఏవి?
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను మరోసారి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ బొనాంజా సేల్ పేరుతో ఈ స్పెషల్ సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై 22వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన ఫ్లిప్‌కార్ట్ పలు కంపెనీల మొబైల్స్‌ను తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్, షావోమీ, రియల్మీ, నోకియా, గూగుల్, ఆసుస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లను వెల్లడించింది. దీంతోపాటు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్: ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు కేవలం రూ. 79,999లకే లభ్యం. దీనికి తోడు 14,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారాచేసే కొనుగోళ్లపై 5శాతం డిస్కౌంట్ అదనం. శాంసంగ్ గెలాక్స్ ఎస్ 9: ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు 57,999 నుంచి ప్రారంభం. దీనికి తోడు 14,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా. హానర్ 9 ఎన్ : తాజా సేల్ లో ప్లిప్‌కార్ట్‌లో హానర్ 9 ఎన్(32జీబీ) రూ. 9,999లకే లభ్యం. దీని లాంచింగ్ ధర రూ.13,999లు. దీనికి తోడు 9,450 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా జరిపిన కొనుగోళలపై మరో 5శాతం డిస్కౌంట్. పోకో ఎఫ్1 : ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్ ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు 18,999లకే లభ్యం. రూ.2,000 ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఈ తగ్గింపు లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ధర రూ.40,999. ఎంఆర్పీ రూ.45,499. ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1: 3 జీబీ+4జీబీ వేరియంట్ రూ.9,999 ధరకే లభిస్తుంది. అసలు ధర రూ.10,999. 4జీబీ+64జీబీ ధర ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ధర రూ.10,499లభ్యం. ఎంఆర్పీ ధర రూ.12,999 ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. 3 జీబీ+4జీబీ వేరియంట్ రూ.9,999 ధరకే లభిస్తుంది. అసలు ధర రూ.10,999. 4జీబీ+64జీబీ లాంచింగ్ ధర రూ.12,999. కాగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ధర రూ.10,499. దీంతోపాటు రెడ్‌నోట్ 5 ప్రో, ఎంఐ ఏ2, రెడ్మీవై2 ఫోన్లు దాదాపు వెయ్యి రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. -
క్యాష్ బ్యాన్: పవర్ కంపెనీలకు బంపర్ బొనాంజ
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్‌మనీ ఎంతవరకు బయటికి వస్తుందే ఏమో కాని, కొండలా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు మాత్రం బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలకు బాగానే లబ్ది చేకూరుతుందట. నవంబర్ 24వరకు పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లులను పాత నోట్లతో కట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో, ఇన్నిరోజులు బిల్లులను కట్టకుండా ఎగ్గొట్టిన విద్యుత్ వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు. పాత నోట్లను రద్దు చేశాక, ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వసూలు అయినట్టు హర్యానా పవర్ రిటైలర్లు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన పది రోజుల్లో 750 మిలియన్ల(7500లక్షల) బిల్లులను వసూలు చేసినట్టు ఆ ప్రావినెన్స్ విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శ అనురాగ్ రోస్తోగి తెలిపారు. గడువు ముగిసే లోపలే చెల్లించాల్సిన బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు తెగ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రం కూడా 2,000 లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను సేకరించిందని ఆ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.సీ అరోరా తెలిపారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలు కోలుకుంటున్నాయని, ఇన్నిరోజులు రాని బకాయిలు ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులకు వెల్లువెత్తుతున్నాయని, దీంతో తమ రెవెన్యూలను మెరుగుపరుచుకోవచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కావాలని ఎగ్గొట్టిన వారు కూడా తీసుకొచ్చి పాత నోట్లతో బిల్లులు చెల్లిస్తున్నట్టు పవర్ రిటైలర్లు చెబుతున్నారు. నవంబర్ 9 నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. దీంతో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల వద్ద పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు.