ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment