three movies
-
ట్రిపుల్ బొనాంజా
‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి సినిమాలతో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. శనివారం (సెప్టెంబరు 2) సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా సుదీప్ మూడు చిత్రాలను ప్రకటించి, తన అభిమానులకు ట్రిపుల్ బొనాంజా ఇచ్చారు. సుదీప్ హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు కథ అందించిన రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ విజన్ చేస్తుండటం విశేషం. ఆర్సీ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 2024లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత... ఇప్పటివరకూ సుదీప్ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మాణిక్య’ (2014) తర్వాత దర్శకుడిగా సుదీప్ మరో సినిమాకు మెగాఫోన్ పట్టలేదు. అయితే పదేళ్ల తర్వాత సుదీప్ నటిస్తూ, ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్. మ్యాక్స్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘మ్యాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకాలపై కలైపులి యస్. ధాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే
‘‘థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనడం కరెక్ట్ కాదు. సినిమా టికెట్ ధరలు తగ్గించడంతో పాటు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా వస్తారు. ఇటీవల విడుదలైన కొత్త చిత్రాలతో పాటు అగ్రహీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు (పోకిరి, జల్సా) రీ రిలీజ్ అయినా ఆదరించారు’’ అని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు నట్టి కుమార్. కాగా ఈ సినిమాని నేడు రీ రిలీజ్ చేస్తున్నారాయన. అదే విధంగా నేడు నట్టి కుమార్ 50వ పుట్టినరోజు. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘త్రీ’ చిత్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ విడుదల చేస్తున్నాం. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఫుల్ అయ్యాయి. ఇక ఇటీవల కొందరు నిర్మాతలు ఏకాభిప్రాయంతో బంద్‌కు పిలుపునివ్వడం వల్ల చిన్న నిర్మాతలు, కార్మికులు, పెద్ద నిర్మాతలు సైతం నష్టపోయారు. ఈ బంద్ ఎందుకు చేశారో అర్థం కాలేదు. త్వరలో మీడియా రంగంలోనికి అడుగు పెట్టనున్నాను. నట్టీస్ ప్యూర్ విలేజ్ ప్రొడక్టుల పేరిట హోల్‌సేల్, రీటైల్ వ్యాపారం ప్రారంభిస్తున్నాను. సినిమా కార్మికులకు అండగా నిలబడేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అన్నారు. చదవండి: ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే.. -
జోరు పెంచిన కమల్ హాసన్
చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ ఏడాది జోరు పెంచారు. కమల్ నటించిన మూడు సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదలయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం తమిళ హాస్యం చిత్రం 'ఉత్తమ విలన్'లో నటిస్తున్నారు. 'విశ్వరూపం' సినిమాకు సీక్వెల్‌గా కమల్ హీరోగా రూపొందిస్తున్న 'విశ్వరూపం2' విడుదలకు సిద్ధమైంది. 'విశ్వరూపం2' చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఏ సమయంలోనైనా విడుదల కావచ్చని కమల్ చెప్పారు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తీస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'దృశ్యం'ను తమిళంలో కమల్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 15న ఆరంభం కానుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయనున్నట్టు దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒకే ఏడాదిలో కమల్ మూడు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.