Producer Natti Kumar Talk About Dhanush And Shruti Haasan 3 Movie Re-Release - Sakshi
Sakshi News home page

Producer Natti Kumar: ధనుష్‌-శ్రుతి హాసన్‌ ‘త్రి’ రీ రిలీజ్‌.. నిర్మాత నట్టి ఏమన్నారంటే

Published Thu, Sep 8 2022 8:46 AM | Last Updated on Thu, Sep 8 2022 9:55 AM

Producer Natti Kumar Re Release Dhanush 3 Movie On September 8th - Sakshi

‘‘థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనడం కరెక్ట్‌ కాదు. సినిమా టికెట్‌ ధరలు తగ్గించడంతో పాటు మంచి కంటెంట్‌ ఉంటే కచ్చితంగా వస్తారు. ఇటీవల విడుదలైన కొత్త చిత్రాలతో పాటు అగ్రహీరోల బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు (పోకిరి, జల్సా) రీ రిలీజ్‌ అయినా ఆదరించారు’’ అని నిర్మాత నట్టి కుమార్‌ అన్నారు. ధనుష్, శ్రుతీహాసన్‌ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు నట్టి కుమార్‌. కాగా ఈ సినిమాని నేడు రీ రిలీజ్‌ చేస్తున్నారాయన. అదే విధంగా నేడు నట్టి కుమార్‌ 50వ పుట్టినరోజు.

చదవండి: రణ్‌బిర్‌-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత

ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘త్రీ’ చిత్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ విడుదల చేస్తున్నాం. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ కూడా ఫుల్‌ అయ్యాయి. ఇక ఇటీవల కొందరు నిర్మాతలు ఏకాభిప్రాయంతో బంద్‌కు పిలుపునివ్వడం వల్ల చిన్న నిర్మాతలు, కార్మికులు, పెద్ద నిర్మాతలు సైతం నష్టపోయారు. ఈ బంద్‌ ఎందుకు చేశారో అర్థం కాలేదు. త్వరలో మీడియా రంగంలోనికి అడుగు పెట్టనున్నాను. నట్టీస్‌ ప్యూర్‌ విలేజ్‌ ప్రొడక్టుల పేరిట హోల్‌సేల్, రీటైల్‌ వ్యాపారం ప్రారంభిస్తున్నాను. సినిమా కార్మికులకు అండగా నిలబడేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అన్నారు.    

చదవండి: ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement