హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్కో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడురెట్లకుపైగా అధికమై రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.513 కోట్ల నుంచి రూ.795 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.432 కోట్ల నుంచి రూ.539 కోట్లకు పెరిగాయి.
ఫార్ములేషన్స్ ఎగుమతుల ద్వారా ఆదాయం రూ.334 కోట్ల నుంచి రూ.605 కోట్లను తాకింది. దేశీయంగా ఫార్ములేషన్స్ అమ్మకాల ద్వారా ఆదాయం రూ.101 కోట్ల నుంచి రూ.99 కోట్లకు వచ్చి చేరింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మూడవ మధ్యంతర డివిడెండ్ రూ.1.25 చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.
నాట్కో ఫార్మా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో బుధవారం 3.10 శాతం ఎగసి రూ.883.85 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment