శాంసంగ్‌ ఫోన్‌ : భారీ స్క్రీన్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా | Samsung Galaxy A7 (2018) With Triple Camera Setup Launched | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ ఫోన్‌ : భారీ స్క్రీన్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

Published Thu, Sep 20 2018 3:42 PM | Last Updated on Thu, Sep 20 2018 4:18 PM

Samsung Galaxy A7 (2018) With Triple Camera Setup Launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సౌత్‌ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను విడుదల చేసింది. శాంసంగ్‌ ఏ సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్‌ప్లే, మూడు రియర్‌కెమెరాలతో లేటెస్ట్‌ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లూ, బ్లాక్‌, గోల్డ్‌ , పింక్‌ కలర్స్‌లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 29,385గా ఉంది.  అక్టోబర్‌ ఆరంభంనుంచి యూరోపియన్‌, ఇతర ఆసియన్‌ మార్కెట్లలో లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement