అల్జీరియా విమాన శకలాలు లభ్యం | Algeria fragments available | Sakshi
Sakshi News home page

అల్జీరియా విమాన శకలాలు లభ్యం

Published Sat, Jul 26 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

అల్జీరియా విమాన శకలాలు లభ్యం

అల్జీరియా విమాన శకలాలు లభ్యం

విమానంలోని 116 మంది మృతి

 పారిస్: ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో కూలిపోయిన అల్జీరియా విమానం శకలాలు లభించాయి. బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు బుధవారం అర్ధరాత్రి బయలుదేరిన 50 నిమిషాలకే ఈ విమానం మాలిలోని గోస్సి ప్రాంతంలో కూలింది. విమానంలోని 116 మంది మృతిచెందారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండె ప్రకటించారు.

ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నా ఉగ్ర దాడి సహా ఏ కోణాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఈ ప్రమాదంలో 51 మంది తమ దేశ జాతీయులు మృతిచెందారన్నారు. తమ బలగాలు ఘటనాస్థలికి చేరుకొని విమాన శకలాల సమీపంలో పడిఉన్న బ్లాక్‌బాక్స్‌ను గుర్తించాయన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement