బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది.
కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.
చదవండి👇
మీరొస్తానంటే.. నేనొద్దంటా!
చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి!
Comments
Please login to add a commentAdd a comment