
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి.
తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు.
శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment