Hockey championship
-
గోల్స్ సునామీ సృష్టించిన తమిళనాడు.. 60 నిమిషాల్లో 43..
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి. తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు. శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది. -
‘షూటౌట్’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!
అంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.భారత్ తరఫున మన్దీప్ (11వ ని.లో), లలిత్ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (20వ ని.లో), థామస్ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ చెరో రెండు గోల్స్ చేయగా, అభిషేక్ ఒక గోల్ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్ విఫలమయ్యారు.ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్ కొట్టగా, లుకాస్, టోబియస్ ఒక్కో గోల్ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
ఆఖరి నిమిషంలో భారత్‌కు షాకిచ్చిన పాక్.. తొలి మ్యాచ్ డ్రా
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ జట్టు చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా ముగించింది. జకార్తా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఖరి నిమిషం వరకు భారత్ పాక్‌పై ఆదిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ 8వ నిమిషంలో కార్తీ సెల్వం తొలి గోల్ చేసి భారత్‌ను అధిక్యంలోకి తీసుకువెళ్లాడు. అయితే చివరి క్వార్టర్ అఖరి నిమిషంలో పాక్ ఆటగాడు అబ్దుల్ రానా గోల్ సాధించి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. మరోవైపు మలేషియా, దక్షిణ కొరియా తమ తొలి మ్యాచ్‌ల్లో ఒమన్, బంగ్లాదేశ్‌లపై విజమం సాధించాయి. మలేషియా 7-0తో ఒమన్‌ను ఓడించగా, కొరియా 6-1తో బంగ్లాదేశ్‌పై గెలిపొందింది. ఇక మంగళవారం(మే 24)న జపాన్‌తో భారత్ తలపడనుంది. చదవండి: Nikhat Zareen: ఇది ప్రారంభం మాత్రమే.. అదే నా లక్ష్యం -
చిచ్చర పిడుగులు
ధర్మవరం రూరల్: ఆ పాఠశాల విద్యార్థులకు ఆటలంటే అమితమైన ఇష్టం. నిరంతరం సాధన చేస్తుంటారు. ఏ టోర్నీ జరిగినా విజేతగా నిలవాలని తాపత్రయపడుతుంటారు. వారి ఇష్టానికి అనుగుణంగానే ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి కూడా నిరంతరం మెలకువలు నేర్పుతున్నారు. ఆటల్లో వారిని మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. వారే చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. హాకీ, జూడో క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. తద్వారా పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. జిల్లాస్థాయి హాకీ పోటీల్లో బాలబాలికల జట్లు ఇప్పటికి పదిసార్లు చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. గడిచిన 12 ఏళ్లలో ఈ పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. స్వర్ణ పతకంపైనే గురి.. జూడో క్రీడాకారిణి నిఖిత పట్టు బిగించిందంటే బంగారు పతకం ఖాయం. గత ఏడాది అండర్–14 స్కూల్ గేమ్స్‌లో 21 కేజీల విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. అనంత క్రీడా గ్రామంలో జరిగిన సబ్ జూనియర్ –22 కేజీల విభాగంలోనూ పోటీ పడి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసుకుంది. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచింది. మోహన్‌తేజ అద్వితీయ ప్రతిభ.. జూడో, హాకీ ఆటల్లో విద్యార్థి మోహన్ తేజ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 స్కూల్ గేమ్స్ 25 కేజీల విభాగం జూడో పోటీల్లో బంగారు పతకం సాధించి.. జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. హాకీలోనూ రాణిస్తూ చిగిచెర్ల జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జాతీయస్థాయిలో సత్తా 2018– 19లో అనంత క్రీడా గ్రామంలో జరిగిన జూడో సబ్ జూనియర్, స్కూల్ గేమ్స్ పోటీల్లో ఓపెన్ వెయిట్ విభాగంలో చిగిచెర్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి.మైథిలి ప్రతిభ చూపింది. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ బంగారు పతకం సాధించింది. అదే ఏడాది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఆట అంటే ప్రాణం.. 2018–19లో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ –14 జిల్లా స్థాయి జూడో పోటీల్లో ఆర్.పవిత్ర బంగారు పతకం సాధించింది. అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సా«ధించింది. 2020–21లో జిల్లా స్థాయిలో జరిగిన జూడో పోటీల్లో బంగారు పతకం సాధించింది. అలాగే అండర్–14 జిల్లా స్థాయి హాకీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం.. జూడో క్రీడాకారుడు ఎస్.ప్రసాద్ జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2020–21లో ఆర్డీటీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీల్లో బంగారు పతకం సాధించాడు. చిరుతలా దూసుకెళుతుంది.. హాకీ, జూడోలో ఎస్.కుసుమ అద్వితీయ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంది. హాకీలో సెంటర్ ఫార్వర్డ్‌లో ఆడే ఈ క్రీడాకారిణి చిరుత వేగంతో కదిలి గోల్స్ చేయడంలో దిట్ట. ఇటీవల ఆర్డీటీ స్టేడియంలో జరిగిన జిల్లా లీగ్ పోటీల్లో అత్యధిక గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. ఈ పోటీలలో చిగిచెర్ల జట్టును విజేతగా నిలిపింది. 12 ఏళ్లుగా శిక్షణ నాకు మొదట్లో జైలు వార్డెన్ జాబ్ వచ్చింది. క్రీడలపై మక్కువతో ఆ ఉద్యోగం వదిలి చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీగా ఉద్యోగంలో చేరా. ఇçక్కడ ఏడేళ్లు పనిచేసి బదిలీపై వెళ్లా. మళ్లీ 2019లో పదోన్నతిపై చిగిచెర్లకు తిరిగొచ్చా. 12 ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నా. ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దా. – ప్రతాప్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్, చిగిచెర్ల జెడ్పీ హైస్కూల్ -
సెమీస్‌లో భారత్‌కు షాక్..
ఢాకా: రౌండ్ రాబిన్ లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో బోల్తా కొట్టింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 3–5 గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓడింది. జపాన్ జట్టుకు షోటా యమాడా (1వ ని.లో), రైకి ఫుజిషిమా (2వ ని.లో), యోషికి కిరిషిటా (29వ ని.లో), కొసె కవాబె (35వ ని.లో), ర్యోమా ఊకా (41వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (53వ ని.లో), హార్దిక్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నేడు కాంస్య పతకం కోసం పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణ కొరియా 6–5తో గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి జపాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: IND vs SA: ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్ -
శభాష్ అమ్మాయిలు.. ఫైనల్లో తెలంగాణ
మొహాలి: జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. పంజాబ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన బాలికల సెమీఫైనల్లో తెలంగాణ జట్టు 2–1 గోల్స్ తేడాతో చండీగఢ్ జట్టును ఓడించింది. మనాల్ సుల్తానా, నిదా ఖాన్, తనుశ్రీ, అక్షిత, హజ్రా, తర్పణ, హరిణి, మెహక్, అఫీరా, శరణ్య, రిషిక తెలంగాణ బాలికల జట్టులో సభ్యులుగా ఉన్నారు. మంగళవారం జరిగే ఫైనల్లో హరియాణాతో తెలంగాణ పసిడి పతకం కోసం పోరాడనుంది. -
Roller Hockey Championship: హైదరాబాద్ అన్నాచెల్లెళ్లు సూపర్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో చండీగఢ్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాలబాలికల జట్లలో హైదరాబాద్‌కు చెందిన అన్నా చెల్లెళ్లు మొహమ్మద్ సుమేర్, మనాల్ సుల్తానా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ హాకీ టోర్నీలో వీరిద్దరూ సత్తా చాటారు. గోల్నాకలోని సెయింట్ పాల్స్ గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్న వీరిద్దరూ జాతీయ పోటీల్లో పాల్గొనడం వరుసగా ఇది రెండో ఏడాది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ (వీపీజీ)లో కోచ్ అబుద్ ఖురేషీ వద్ద వీరిద్దరూ శిక్షణ పొందుతున్నారు. చదవండి: IND vs NZ Test Series: కివీస్‌తో టెస్టు... సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్‌కు చోటు! -
13న హాకీ ఇండియా ప్రత్యేక సమావేశం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో హాకీ జట్ల సన్నాహకాలపై చర్చించేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ నెల 13న వీడియో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హెచ్ఐ అధికారులు పాల్గొంటారు. ఇందులో భారత పురుషుల, మహిళల జట్లకు ఏర్పాటు చేసే శిబిరాలు, సన్నాహాకాలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. దీంతో పాటు దేశవాళీ హాకీ లీగ్‌లపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. -
అత్యుత్తమ ర్యాంక్‌లో భారత హాకీ జట్టు
లుసానే (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకుంది. 2003లో ప్రపంచ ర్యాంకింగ్స్ మొదలయ్యాక భారత్ తొలిసారి నాలుగో స్థానానికి చేరుకుంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లోని తొలి మూడు రౌండ్లలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రపంచ చాంపియన్ బెల్జియం టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మహిళల విభాగంలోభారత జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. -
భారత్‌లో 2021 జూనియర్ హాకీ ప్రపంచకప్
లుసానే: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌ను మరోసారి నిర్వహించే అవకాశం భారత్‌కు లభించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2021 జూనియర్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్‌కు కట్టబెడుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. దాంతో భారత్ రెండోసారి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోన్న దేశంగా ఘనతకెక్కింది. 2016లో తొలిసారి లక్నో వేదికగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించిన భారత్ విజేతగా నిలిచింది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా... ఇప్పటికే జర్మనీ, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్‌లు అర్హత సాధించాయి. హోస్ట్ హోదాలో భారత్ కూడా ఈ టోర్నీలో ఆడటం ఖాయమైంది. అయితే ఈ మెగా ఈవెంట్ భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు ఆరంభమవుతుందనే వివరాలను ఎఫ్ఐహెచ్ ప్రకటించాల్సి ఉంది. -
ఫీల్డ్‌లోనే హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న ఆటగాళ్లు
ఢిల్లీ: అదొక హాకీ మ్యాచ్.. జాతీయ స్థాయిలో జరిగే నెహ్రా హాకీ కప్ టోర్నమెంట్. అందులోనూ ఫైనల్ మ్యాచ్. ఇక్కడ ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోవడమే కాదు.. విజ్ఞతను కూడా వదిలేశారు. హాకీ స్టిక్స్‌తో ఒకరిపై ఒకరు తెగబడ్డారు. మ్యాచ్‌ను గెలిచి తీరాలన్న కసి కాస్తా కొట్లాటకు దారి తీసింది. ఈ కొట్లాటలో పంజాబ్ పోలీస్ జట్టు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్లు భాగమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. 56వ నెహ్రూ హాకీ టోర్నమెంట్లో భాగంగా పంజాబ్ పోలీస్ టీమ్- పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీమ్‌లు సోమవారం తుది పోరులో తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా మ్యాచ్ సాగుతోంది. ఆటలో నువ్వా-నేనా అన్నట్లు ఇరు జట్లు తలపడుతున్నాయి. తలో మూడు గోల్స్‌తో సమంగా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్ పోలీస్ జట్టు.. పీఎన్బీతో కాస్త దురుసుగా ప్రవర్తించింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు తొలుత మాటల యుద్ధానికి దిగారు. అది కాస్తా పెద్దదిగా మారి కొట్టుకునే వరకూ వెళ్లింది. హాకీ స్టిక్స్‌తో ఇరు జట్లు ఆటగాళ్లు కొట్టుకున్నారు. దాంతో మ్యాచ్ నిర్వహాకులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. దీనిపై నేషనల్ ఫుట్‌బాల్ హాకీ ఫెడరేషన్ సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టోర్నమెంట్లో నిర్వహకుల్ని కోరింది. ఈ గొడవ తర్వాత మళ్లీ మ్యాచ్‌ను కొనసాగించగా పీఎన్బీ 6-3 తేడాతో పంజాబ్ పోలీస్ జట్టుపై గెలిచింది. #WATCH Delhi: Scuffle broke out between Punjab Police Hockey & Punjab National Bank Hockey teams during Nehru Cup finals. Elena Norman, Hockey India CEO says, "We're awaiting official report from Tournament officials, based on which Hockey India will take necessary action." pic.twitter.com/Yz3LAtGPl7 — ANI (@ANI) November 25, 2019 -
గెలిచే మ్యాచ్ 5 నిమిషాల్లో డ్రా!
మార్లో (ఇంగ్లండ్): ఇంగ్లండ్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు ‘డ్రా’తో ముగించింది. శుక్రవారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 2–2తో ఇంగ్లండ్‌తో ‘డ్రా’ చేసుకుంది. నిజానికి ఈ మ్యాచ్ లో భారత అమ్మాయిలు చివరిదాకా గెలిచేస్థితిలో నిలిచారు. అయితే ఆఖరి క్వార్టర్లో ఇంగ్లండ్ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. ఆరంభంలోనే నవ్‌జోత్ కౌర్ (8వ ని.) గోల్ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి క్వార్టర్లో గుర్జీత్ కౌర్ (48వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ 2–0తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. అయితే మ్యాచ్ ముగిసేదశలో ఇంగ్లండ్ పట్టు బిగించింది. ఎలిజబెత్ నీల్ (55వ ని.), అనా టోమన్ (60వ ని.) చెరో గోల్ చేయడంతో ఆతిథ్య జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. ఈ పోరు ద్వారా భారత గోల్ కీపర్ సవిత 200 మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకుంది. -
రాష్ట్ర మహిళల హాకీ జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హాకీ ఇండియా నేషనల్స్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్ మహిళల జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎం. రేఖ, వైస్ కెప్టెన్‌గా శ్రుతి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు హరియాణాలోని హిస్సార్‌లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ హాకీ అధ్యక్షుడు సరళ్ తల్వార్ రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హాకీ సంఘం కార్య దర్శి ముకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జట్టు: రుచిక, శ్రుతి, శ్రీదేవి, గంగా జమున, హారిక, ఎం. రేఖ (కెప్టెన్), టి. ప్రియాంక, ఆర్. మాధురి, సాగరిక, వైష్ణవి, పూజ, రమ్య, కవిత, దేవి, సుమన్, బి. అశ్విన్, జ్ఞాన్ చంద్ (కోచ్), ఉదయ్ (అసిస్టెంట్ కోచ్), బి. అశ్విని (మేనేజర్). -
తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్ అశోక్
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి చెన్నైలో జరిగే జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ సీనియర్ పురుషుల జట్టుకు అశోక్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సంపత్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు సరల్ తల్వర్ ప్లేయర్లకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, విజేందర్ రెడ్డి, ముఖేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జట్టు: అశోక్ కుమార్ (కెప్టెన్), సంపత్ కుమార్ (వైస్ కెప్టెన్), సాయి వినీత్, చంద్రకాంత్ గౌడ్, ప్రశాంత్, అరవింద్, భవాని రంజిత్ చంద్, సాయి ప్రసాద్, మొహమ్మద్ అజీజ్, అవినీత్, శ్రీనివాస్, రామకృష్ణ, ముంతాజ్, సాగర్, దుర్గా ప్రసాద్, రాజశేఖర్, రాజేశ్, ఫిరోజ్ బిన్ ఫర్హాజ్. అల్ఫాన్స్ లాజరస్ (కోచ్), ఇమామ్ కరీం (మేనేజర్). -
పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా
బ్రెడా (నెదర్లాండ్స్): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 4-0 గోల్స్ తేడాతో భారత్ గెలుపొందింది. వరుస విరామాల్లో గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టారు భారత క్రీడాకారులు. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగే ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గెలిచి భారత్ శుభారంభం చేసి, ప్రత్యర్థి పాక్‌కు తమ సత్తా చూపించింది. ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ (13) కంటే మెరుగ్గా ఉన్న భారత్ (6) అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అభిప్రాయపడ్డుట్లుగానే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా భారత్ మెరుగైన ఆటతీరుతో చాంపియన్స్ ట్రోఫీలో బోణీ కొట్టింది. -
భారత్ (VS) పాకిస్తాన్
బ్రెడా (నెదర్లాండ్స్): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత పురుషుల హాకీ జట్టు సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తొలి మ్యాచ్‌లో శనివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగనున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ (13) కంటే భారత్ (6) మెరుగ్గా ఉంది. ‘టోర్నీలో శుభారంభం ముఖ్యం. పాకిస్తాన్ కూడా ఇతర ప్రత్యర్థి లాగే. నేటి మ్యాచ్‌లో భావోద్వేగాలకు తావులేదు’ అని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. మరోవైపు అనుభవజ్ఞులు, యువకులతో కూడిన పాకిస్తాన్ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా భారత మాజీ కోచ్ ఓల్ట్‌మన్స్ శిక్షణలో ఆ జట్టు రాటుదేలింది. సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ముగిసిన హాకీ జాతీయ శిబిరం
రాయదుర్గం: జాతీయ హాకీ చాంపియన్‌షిప్ సన్నాహకంగా ఏర్పాటు చేసిన సీనియర్ మహిళల హాకీ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. తెలంగాణ హాకీ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 13 నుంచి ఈ శిబిరం జరిగింది. క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రతీ జిల్లాకు ఒక హాకీ కోచ్‌ను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. అర్జున అవార్డు గ్రహీత, ఒలింపియన్ ముకేశ్ కుమార్‌ను హాకీ క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ హాకీ సంఘం చేస్తోన్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హాకీ సంఘం అధ్యక్షులు సరళ్ తల్వార్, ఒలింపియన్ ముకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా హాకీ అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోచ్ సుఖేందర్ సింగ్ పాల్గొన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు జాతీయ హాకీ చాంపియన్‌షిప్ జరుగుతుంది. రాష్ట్ర మహిళల హాకీ జట్టు డి. గీత (కెప్టెన్), ఎం. రేఖ (వైస్ కెప్టెన్), ఆర్. మౌనిక, ఎం. రుచిక, ఎం. మాళవిక, జె. కవిత, పి. సాగరిక, ఎం. సరోజ, మీనాక్షి, శ్రుతి కౌశిక్, డి. వైష్ణవి, టి. ప్రియాంక, కె. హారిక, కె. సుప్రియ, ఆర్. ప్రియాంక, ఎం. మౌనిక, సుమన్ కుమారి, అఫ్సాన్ సుల్తానా. -
రాష్ట్ర జూనియర్ హాకీ జట్టు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ మహిళల జూనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 19 నుంచి పుణేలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ హాకీ జట్టు వి.శ్రీదేవి, ఎం.శిరీష, వి.పద్మలత, బి.మాధవి, ఎం.నవనీత కుమారి,ఎస్.మహాలక్ష్మి, టి.భారతి, జె.నళిని, ఎన్. సయేషా, మహాలక్ష్మి, పి. జ్యోతి, కె.కీర్తన, బి. తరంగిణి, పి. ప్రమీళ, కె. రమ్య నాగలక్ష్మి, కె. వరలక్ష్మి, పి. మానస, కె. అనిత, టి. బాబయ్య (మేనేజర్). -
ఏపీ హాకీ కెప్టెన్‌గా వైష్ణవి
జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనే జట్టును ఆంధ్రప్రదేశ్ హకీ సంఘం ఎంపిక చేసింది. ఈ జట్టు కెప్టెన్‌గా వైష్ణవి వ్యవహరించనుంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఈ పోటీలు భోపాల్‌లో జరగనున్నాయి. ఏపీ జట్టు 13వ తేదీన తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. తర్వాత 14న తమిళనాడుతో, 15న మిజోరాంతో పోటీపడనుంది. ఈ జట్టు కోచ్‌లుగా ఖాదర్ బాషా, హుస్సేన్‌లు వ్యవహరిస్తారు. జట్టు: వైష్ణవి (కెప్టెన్, హైదరాబాద్), చిన్ని (కడప), కీర్తన (కడప), సమీర (కడప), అమూల్య (ప్రకాశం), భార్గవి (రంగారెడ్డి), సంధ్య (నిజామాబాద్), దేవిక (గుంటూరు), మస్తాన్ బీ (గుంటూరు), శేషు కుమారి (తూర్పు గోదావరి), శ్రీబాల (తూర్పు గోదావరి), నజియా బేగం (హైదరాబాద్), అచ్యుతాంబ (కృష్ణ), లహరి రెడ్డి (కృష్ణ), గౌరి (తూర్పు గోదావరి), ప్రియాంక (రంగారెడ్డి), హిమబిందు (రంగారెడ్డి), గంగా భారతి (కడప). -
ఆనందం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమితో కుంగి పోకుండా విజయానికి నాందిగా భావించాలని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు జరిగిన కోమటిరెడ్డి ప్రతీక్ స్మారక తెలంగాణ అంతర్‌జిల్లాల స్థాయి పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు మంచి తర్ఫీదుతో సాధన చేయాలన్నారు. పట్టుదలతో లక్ష్యసాధన కు కృషి చేస్తే విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించి గ్రామీణక్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానన్నారు. జేసీ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ సమష్టికృషితో ముందుకు సాగితే విజయం తధ్యమని నిరూపించే క్రీడ హాకీ అన్నారు. ఎస్పీ డాక్టర్ టి. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ జాతీయ క్రీడ హాకీకి మనదేశంలో ఎంతో ఆదరణ ఉండేదన్నారు. ఒలింపిక్స్‌లో మనదేశం తరచూగా బంగారు పతకాలు సాధించిందని గుర్తుచేశారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా హాకీ జట్టు రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉండేదని, ప్రస్తుత టోర్నమెంట్ నిర్వహణతో క్రీడాకారులను పునురుత్తేజం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నీలకంఠం, హాకీ ఇండి యా జాయింట్ సెక్రటరీ ఎం.నిరంజన్‌రెడ్డి, డీఎస్డీఓ ఎండి.మక్బూల్ అహ్మద్, హాకీ నల్లగొండ అధ్యక్షుడు ఎం.గోపి, కార్యదర్శిజి. శ్రీనివాస్, ఇర్ఫాన్ అలీ, ఓవైస్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. వెటరన్ హాకీ క్రీడాకారులను సన్మానించారు. విజేతలకు బహుమతి ప్రదానం తెలంగాణ అంతర్‌జిల్లాల స్థాయి పురుషుల సీని యర్ హాకీ చాంపియన్‌షిప్‌ను నిజామాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బుధవారం నిజామాబాద్-నల్లగొండ జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదటి హాఫ్ హోరాహోరీగా సాగినా ఆ తరువాత నిజామాబాద్ జిల్లా జట్టు విజృంభించింది. చివరకు 4-1 గోల్స్‌తో విజయం సాధించింది. ఉదయం జరిగిన సూపర్‌లీగ్ పోటీల్లో నల్లగొండ జట్టు 2-0 గోల్స్ తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. నిజామాబాద్ జట్టు 6-1 గోల్స్ తేడాతో వరంగల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. విన్నర్స్‌గా నిలిచిన నిజామాబాద్ జట్టుకు రూ.25వేల నగ దు, షీల్డ్‌ను అందజేశారు. అలాగే రన్నర్స్‌గా నిలిచిన నల్లగొండ జట్టుకు రూ. 10వేల నగదు, ట్రోఫి, తృతీయస్థానంలో నిలిచిన వరంగల్ జట్టుకు రూ.5వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. ఉత్తమ క్రీడాకారులు టోర్నమెంటులో ఉత్త మ ప్రతిభ కనబర్చిన వివిధ జిల్లాల క్రీడాకారులకు వ్యక్తిగత బహుమతులు అందజేశారు. బెస్ట్గోల్ కీపర్ : జావీర్(నిజామాబాద్), బెస్ట్బ్యాక్ : ఆజం(నల్లగొండ) బెస్ట్హఫ్: శివకృష్ణ(వరంగల్) బెస్ట్ పార్వర్డ్ : సాగర్ (నిజామాబాద్) వెల్ప్లేయర్స్ జట్టు : కరీంనగర్