
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో హాకీ జట్ల సన్నాహకాలపై చర్చించేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ నెల 13న వీడియో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హెచ్‌ఐ అధికారులు పాల్గొంటారు. ఇందులో భారత పురుషుల, మహిళల జట్లకు ఏర్పాటు చేసే శిబిరాలు, సన్నాహాకాలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. దీంతో పాటు దేశవాళీ హాకీ లీగ్‌లపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment