
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 6–1 గోల్స్ తేడాతో బెంగాల్ జట్టును ఓడించింది.
ఆంధ్రప్రదేశ్ తరఫున మునిపల్లి నాగ నందిని (22వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... పరికి లక్ష్మి (15వ నిమిషంలో), చిల్లూరు నాగతేజ (38వ నిమిషంలో), కెపె్టన్ కుప్పా తులసీ (46వ నిమిషంలో), రాగుల నాగమణి (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెంగాల్ జట్టుకు శ్రేష్ట ఛటర్జీ (43వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది.
గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో గత ఏడాది రన్నరప్ జార్ఖండ్ 5–0తో ఛత్తీస్‌గఢ్ జట్టుపై, ఉత్తరాఖండ్ 3–1తో రాజస్తాన్ జట్టుపై, కర్ణాటక 5–0తో జమ్మూ కశ్మీర్ జట్టుపై, ఒడిశా 5–0తో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై గెలిచాయి. గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment