జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనే జట్టును ఆంధ్రప్రదేశ్ హకీ సంఘం ఎంపిక చేసింది.
జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనే జట్టును ఆంధ్రప్రదేశ్ హకీ సంఘం ఎంపిక చేసింది. ఈ జట్టు కెప్టెన్‌గా వైష్ణవి వ్యవహరించనుంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఈ పోటీలు భోపాల్‌లో జరగనున్నాయి. ఏపీ జట్టు 13వ తేదీన తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. తర్వాత 14న తమిళనాడుతో, 15న మిజోరాంతో పోటీపడనుంది. ఈ జట్టు కోచ్‌లుగా ఖాదర్ బాషా, హుస్సేన్‌లు వ్యవహరిస్తారు.
జట్టు: వైష్ణవి (కెప్టెన్, హైదరాబాద్), చిన్ని (కడప), కీర్తన (కడప), సమీర (కడప), అమూల్య (ప్రకాశం), భార్గవి (రంగారెడ్డి), సంధ్య (నిజామాబాద్), దేవిక (గుంటూరు), మస్తాన్ బీ (గుంటూరు), శేషు కుమారి (తూర్పు గోదావరి), శ్రీబాల (తూర్పు గోదావరి), నజియా బేగం (హైదరాబాద్), అచ్యుతాంబ (కృష్ణ), లహరి రెడ్డి (కృష్ణ), గౌరి (తూర్పు గోదావరి), ప్రియాంక (రంగారెడ్డి), హిమబిందు (రంగారెడ్డి), గంగా భారతి (కడప).