రన్నరప్ ఆంధ్రప్రదేశ్ | Andhra pradesh team in runner-up position | Sakshi
Sakshi News home page

రన్నరప్ ఆంధ్రప్రదేశ్

Published Sat, Jan 4 2014 12:07 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

Andhra pradesh team in runner-up position

జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి స్కూల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలుర అండర్-17 విభాగంలో పవన్ కుమార్, హరికృష్ణ, జగదీశ్‌కృష్ణ, ఆదిత్యలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు 0-3తో ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది.
 
 మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన  ఫైనల్ పోటీల తొలి మ్యాచ్‌లో పవన్ కుమార్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ... చివరకు 2-3తో శివెన్  చేతిలో కంగుతిన్నాడు. అనంతరం హరికృష్ణ 0-3తో అజయ్ చేతిలో, జగదీశ్ కృష్ణ 0-3తో కేశవ్ చేతిలో ఓటమి చవిచూశారు. పరాజయం ఖాయమవడంతో ఆదిత్య బరిలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 3-2తో తమిళనాడుపై విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement