![Telangana team suffered a heavy defeat in the hockey championship - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/17/hocky.jpg.webp?itok=8HbLo3MU)
జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 11–0 గోల్స్ తేడాతో తెలంగాణపై ఘన విజయం సాధించింది. బెంగాల్ ప్లేయర్ సంజన ‘హ్యాట్రిక్’ సహా ఐదు గోల్స్ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సుస్మిత పన్నా కూడా ‘హ్యాట్రిక్’ సాధించగా... మోనికా నాగ్ 2, అంజన డుంగ్‌డుంగ్ ఒక గోల్ చేశారు. ఈ గెలుపుతో బెంగాల్ జాతీయ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
మరో వైపు పూల్ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 11–2 గోల్స్‌తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. భారత సీనియర్ జట్టు ప్లేయర్ వందనా కటారియా ‘హ్యాట్రిక్’ సాధించగా... ముంతాజ్ ఖాన్, ఉపాసన సింగ్ చెరో 2 గోల్స్ కొటారు.
యూపీ తరఫున శశికళ, రీతూ సింగ్, స్వర్ణిక రావత్, సిమ్రన్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లలో కళ్యాణి స్వర్ణపూడి, గార్లంక వరహాలమ్మ ఒక్కో గోల్ కొట్టారు. అయితే ఈ విజయం తర్వాత కూడా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవడంతో యూపీ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment