
లండన్: గ్లోబల్ టీచర్ ప్రైజ్–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లున్నాయి. టాప్–50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న పి.హరికృష్ణతోపాటు బెంగాల్ లోని ఆసన్‌సోల్ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ దీప్ నారాయణ్ నాయక్ ఉన్నారు.
130 దేశాల నుంచి అందిన 7 వేలకు పైగా నామినేషన్ల నుంచి ఈ 50 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో ఉన్న 10 మంది నుంచి విజేతను ఈ ఏడాది చివర్లో గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమీ ప్రకటించనుంది. వర్కీ ఫౌండేషన్, యునెస్కో, యూఏఈకి చెందిన దుబాయ్ కేర్స్ కలిసి ఏ టా విజేతకు ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్ డాలర్లను అందజేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment