Two Indians
-
ఇటలీలో 33 మందితో వెట్టి చాకిరీ.. సూత్రధారులైన ఇద్దరు
రోమ్: ఇటలీలోని వెరోనా ప్రావిన్స్‌లో వ్యవసాయ క్షేత్రాల్లో 33 మంది భారతీయులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఆరోపణలపై సూత్రధారులైన ఇద్దరు భారతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.33 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే ప్రావిన్స్‌లో తోటల్లో పనిచేసే సత్నాం సింగ్ అనే భారతీయుడు ఇటీవల ప్రమాదవశాత్తూ చేతి కోల్పోగా యజమాని అతన్ని రోడ్డు పక్కన వదిలేయడం, వైద్య సాయం ఆలస్యమై మరణించడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రధాని మెలోనీ కూడా దీన్ని ఖండించారు. ఈ ఘటనతో ఇటలీ వ్యవసాయ క్షేత్రాల్లో అనధికారికంగా పనిచేసే భారతీయ కారి్మకుల దుస్థితి వెలుగులోకి వచి్చంది. సుమారు 2 లక్షల మంది భారతీయులు ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో మగ్గిపోతున్నారని విదేశాంగ శాఖ అంచనా. -
గ్లోబల్ టీచర్ ప్రైజ్ జాబితాలో ఏపీ టీచర్
లండన్: గ్లోబల్ టీచర్ ప్రైజ్–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లున్నాయి. టాప్–50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న పి.హరికృష్ణతోపాటు బెంగాల్ లోని ఆసన్సోల్ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ దీప్ నారాయణ్ నాయక్ ఉన్నారు. 130 దేశాల నుంచి అందిన 7 వేలకు పైగా నామినేషన్ల నుంచి ఈ 50 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో ఉన్న 10 మంది నుంచి విజేతను ఈ ఏడాది చివర్లో గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమీ ప్రకటించనుంది. వర్కీ ఫౌండేషన్, యునెస్కో, యూఏఈకి చెందిన దుబాయ్ కేర్స్ కలిసి ఏ టా విజేతకు ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్ డాలర్లను అందజేస్తాయి. -
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
ఒక్కరోజే 254 మంది మృతి
బీజింగ్/న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా వైరస్) రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా వైరస్ మొదటిసారిగా బయటకొచ్చి చైనాలోని హుబాయి ప్రావిన్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 254 మంది మరణించారు. ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 1,367 మంది మరణించారు. తాజాగా మరో ఇద్దరు భారతీయులకి కోవిడ్ వ్యాధి సోకినట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి భారత్‌కు వచ్చిన హిమాద్రి బర్మన్, నగేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకిందని అనుమానాలున్నాయని కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీబీఐ విమానాశ్రయం డైరెక్టర్ కౌషిక్ భట్టాచార్జీ వెల్లడించారు. బెలియాఘాటా ఐడీ ఆస్పత్రిలో వారిద్దరినీ అందరికీ దూరంగా వారిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. మంత్రుల బృందం సమీక్ష కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల బృందం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గురువారం నాడు వీరంతా సమావేశమై భారత్‌లో వైరస్ విస్తరణ, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానంతరం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు కేరళలో మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఎవరికీ వ్యాధి నిర్ధారణ కాలేదని ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. కొత్త విధానంతో పెరిగిన కేసులు చైనాలో రాత్రికి రాత్రి కోవిడ్ కేసులు అసాధారణంగా పెరిగిపోవడానికి కారణాలున్నాయి.ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ను గుర్తించడానికి వైరాలజీ ల్యాబ్‌లో న్యూక్లిక్ యాసిడ్ అనే ఒక పరీక్షని నిర్వహించేవారు. అందులో పాజిటివ్ వస్తేనే వ్యాధి ఉన్నట్టు ధ్రువీకరించేవారు. ఇప్పుడు అలా కాదు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా సిటీ స్కానింగ్‌లో బయటకు వచ్చినా కరోనా వైరస్ సోకినట్టే లెక్కలు వేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. ఒకే రోజు 242 మంది మరణించడానికి, 14,840 కేసులు వెలుగులోకి రావడానికి కొత్త విధానం ద్వారా గణించడమే కారణమైందని హువాన్ వైద్యులు వెల్లడించారు. -
అమెరికాలో ఇద్దరు భారతీయుల నిర్బంధం
న్యూయార్క్: అమెరికాలోకి దొంగతనంగా ప్రవేశించిన ఇద్దరు భారతీయులను సరిహద్దు గస్తీ బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. న్యూయార్క్‌లోని హోగన్స్బర్గ్లో ఓ క్యాసినో వద్ద నిలిపి ఉన్న వాహనాన్ని బోర్డర్ పెట్రోల్ స్టేషన్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న ఆరుగురు భారతీయుల్లో ఇద్దరు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తేలింది. ఎటువంటి పత్రాలు లేని ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. -
దుస్తులు విప్పించి కొడుతున్నాడు.. కాపాడండి
న్యూఢిల్లీ: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు ఒకటి వెలుగుచూసింది. ఉపాధి కోసం ఖతర్‌కు వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులను దారుణంగా హింసించారు. పైఅధికారి ఒకరు వీళ్ల లోదుస్తులు విప్పించి, గుర్రం పగ్గం తీసుకుని రక్తం వచ్చేలా విచక్షణరహితంగా కొట్టాడు. వాళ్ల చేతులు, కాళ్లు, తొడలు, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తమకు తగిలిన గాయాలను వీడియో తీసి పంపారు. తాము ఆపదలో ఉన్నామని ఆదుకోవాల్సిందిగా విన్నవించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్ (24), మహ్మద్ అక్రమ్ (27) నాలుగు నెలల క్రితం పుణెకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఖతర్ వెళ్లారు. పర్వేజ్ ఐదేళ్ల కాలపరిమితిపై డ్రైవర్‌గా పనిచేసేందుకు వర్క్ వీసాపై వెళ్లాడు. కాగా వీరిద్దరినీ సౌదీ అరేబియా-ఖతర్ సరిహద్దున ఉన్న ఓ ఫామ్‌కు తీసుకెళ్లి మేకలు, ఒంటెల సంరక్షణ బాధ్యత అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఓ అధికారి తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పర్వేజ్ వీడియోలో తెలిపాడు. ఇక్కడ నరకం అనుభవిస్తున్నామని, ఇక్కడ పనిచేయడం కంటే జైల్లో ఉండటం మేలని వాపోయాడు. పర్వేజ్ ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు అఫ్తామ్ ఆలంకు ఈ విషయాలు తెలిపాడు. గాయాలతో ఉన్న పర్వేజ్, అక్రమ్ ఫొటోలను ఆలంకు పంపాడు. తాము సాయం కోరామని తెలిస్తే ఆ అధికారి తమను వేరే ప్రాంతానికి పంపించే అవకాశముందని, తమను తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమను కాపాడాలని పర్వేజ్ విన్నవించాడు. -
ఆస్ట్రేలియాలో ఇద్దరు కేరళ యువతుల మృతి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారును నార్తర్న్ ఆస్ట్రియాలోని క్వీన్ లాండ్స్ క్రాసింగ్ వద్ద సోమవారం ఓ ట్రక్ ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని అంజు మోల్(23), ఆశా మాథ్యూ (18) గా గుర్తించారు. వీరు ఇంటికి తిరిగిరాక పోవడంలో వీరి కుటుంబ మిత్రుడు రంజిత్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. వీరు ఆస్ట్రేలియాలోని టుంబాకు చెందిన కీట్ కమ్యూనిటీకి చెందినవారు. వీళ్ల స్వస్థలం కేరళ. ఆస్ట్రేలియాలో అంజు నర్సుగా పనిచేస్తోంది. ఆమె సోదరి మాథ్యూ కూడా నర్స్ కోర్సు చేస్తోంది. ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం వీరి మృత దేహాలను స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
లిబియాలో మరో ఇద్దరు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. ఇప్పటికీ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఐఎస్ తీవ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. గత జులై 31న ఇదే సిర్తే పట్టణంలో నలుగురు భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లు క్షేమంగా తిరిగిరాగా, తెలుగువారైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామ్ లు ఇంకా బందీలుగానే ఉన్నారు. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు చేస్తున్నది. -
‘మక్కా’ మృతుల్లో ఇద్దరు భారతీయులు
107కు చేరిన మృతులు.. క్షతగాత్రుల్లో ఐదుగురు హైదారాబాద్ వాసులు సహా 19 మంది భారతీయులు మక్కా: సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్రస్థలం మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 107కు, క్షతగాత్రుల సంఖ్య 238కి చేరింది. మృతుల్లో ఇద్దరు భారత మహిళలు, క్షతగాత్రుల్లో ఐదుగురు హైదరాబాదీలు సహా 19 మందిభారతీయులు ఉన్నారు. చనిపోయిన భారత మహిళలను కేరళకు చెందిన మామీనా ఇస్మాయిల్, పశ్చిమబెంగాల్‌కు చెందిన మోనిజా అహ్మద్‌గా గుర్తించినట్లు జెడ్డాలోని భారత కాన్సులేట్ తెలిపింది. క్షతగాత్రుల్లో హైదరాబాద్ వాసులతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారని, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, పంజాబ్, బిహార్, అస్సాంల నుంచి ఒకరు చొప్పున ఉన్నారని వెల్లడించింది. దుర్ఘటనలో తమ రాష్ట్రంలోని అసాన్సోల్కు చెందిన మునిజా చనిపోయినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఫేస్బుక్లో తెలిపారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారని, హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారని భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఢిల్లీలో చెప్పారు. గాయపడిన భారతీయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి మాక్కా ఆస్పత్రుల వద్ద పలువురు బారులు తీరారు. పెనుగాలులు, వర్షాలతో కూలిన క్రేన్ మక్కా మసీదు ప్రాంగణ విస్తరణకోసం వాడుతున్న భారీ క్రేన్ పెనుగాలులు, భారీ వర్షం కారణంగా కుప్పకూలిందని స్థానిక అధికారులు తెలిపారు. క్రేన్ అల్ తవాఫ్ మార్గంలో కాకుండా వేరే చోట పడి ఉంటే మృతుల సంఖ్య భారీగా పెరిగేదని మసీదులో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. మక్కా ప్రాంత గవర్నర్ ప్రిన్స్ ఖలీద్ అల్ ఫైజల్ ఆదేశంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అధికారుల నిర్ల్యక్షమే ఈ దుర్ఘటనలకు కారణమని మక్కాలోని ఇస్లామిక్ హెరిటేజ్ రీసెర్చ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు ఇర్ఫాన్ అల్ అలావీ ఆరోపించారు. ప్రణబ్, అన్సారీ, మోదీ సంతాపం.. : ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ సానుభూతి సాక్షి, హైదరాబాద్: ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ట్విటర్ ద్వారా ఆకాక్షించారు. హైదరాబాదీ క్షతగాత్రులు..: ఈ ప్రమాదంలో తమ కమిటీ ద్వారా వెళ్లిన ముగ్గురు హైదరాబాదీ లు గాయపడినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎం. షుకూర్ తెలిపారు. పాతబస్తీ భవానీ నగర్‌కు చెందిన షేక్ ముజీబ్(38) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని, రెడ్‌హిల్స్‌కు చెందిన మహ్మద్ హమీద్, అనీస్ ఖాతూన్‌లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మహమ్మద్ యానస్, సఫర్బీ అనే హైదరాబాద్ వాసులు గాయపడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. -
'కువైట్ పేలుడు' మృతుల్లో ఇద్దరు భారతీయులు
కువైట్ సిటీ: కువైట్‌లోని ఇమామ్ సిద్దీఖీ మసీదు వద్ద గత శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో మరణించినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా వలీపూర్నకు చెందిన రిజ్వాన్ హుస్సేన్ (31) మసీదులో వాచ్మన్గానూ, అంబేద్కర్‌నగర్ జిల్లా జలాల్పూర్నకు చెందిన ఇబ్నే అబ్బాస్ (25) డ్రైవర్‌గానూ కువైట్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల కోసం వారు మసీదుకు వెళ్లినప్పుడు పేలుడు సంభవించి మరణించారు. ఈ ఇరువురు సహా మొత్తం 26 మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న 200 మందిలోనూ పలువురు భారతీయులు ఉన్నారని, వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని కువైట్‌లో భారత దౌత్యవేత్త సునీల్ జైన్ చెప్పారు. కుటుంబసభ్యుల కోరిక ప్రకారం హుస్సేన్, అబ్బాస్‌ల మృతదేహాలకు ఇరాక్‌లోని పవిత్ర నజాఫ్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా, మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సౌదీ అరేబియా జాతీయుడని తెలిసింది.