భారతీయులు అరెస్ట్
రోమ్: ఇటలీలోని వెరోనా ప్రావిన్స్‌లో వ్యవసాయ క్షేత్రాల్లో 33 మంది భారతీయులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఆరోపణలపై సూత్రధారులైన ఇద్దరు భారతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.33 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఇదే ప్రావిన్స్‌లో తోటల్లో పనిచేసే సత్నాం సింగ్ అనే భారతీయుడు ఇటీవల ప్రమాదవశాత్తూ చేతి కోల్పోగా యజమాని అతన్ని రోడ్డు పక్కన వదిలేయడం, వైద్య సాయం ఆలస్యమై మరణించడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రధాని మెలోనీ కూడా దీన్ని ఖండించారు. ఈ ఘటనతో ఇటలీ వ్యవసాయ క్షేత్రాల్లో అనధికారికంగా పనిచేసే భారతీయ కారి్మకుల దుస్థితి వెలుగులోకి వచి్చంది. సుమారు 2 లక్షల మంది భారతీయులు ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో మగ్గిపోతున్నారని విదేశాంగ శాఖ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment