రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. శనివారం ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో 33 మంది భారత కార్మికులను ఇద్దరు వ్యక్తుల నుంచి విడిపించినట్లు చెప్పారు. నిందితుల నుంచి అర మిలియన్ యూరోలు (సుమారు రూ. 45 లక్షలు) స్వాధీనం చేకున్నామని పేర్కొన్నారు.
ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ ముఠా ఇండియా నుంచి సీజనల్ వర్క్ పెర్మిట్‌తో ఇక్కడి వ్యవసాయ కార్మికులను తీసుకువస్తారు. వారికి మంచి ఉపాధి చూపిస్తాని చెప్పి.. 17000 యూరోలు (సమారు రూ.15లక్షలు) కట్టమని చెబుతారు. వారానికి 7 రోజులు, రోజు 10-12 గంటలు పని. ఒక్క గంటకు నాలుగు యూరోలు ఇస్తామని ఒప్పందం చేయించుకుంటారు. కానీ, అలా చేరిన కార్మికులను బానిసలు పని చేయించుకుంటారు.
.. మరికొంత డబ్బు ఇస్తే.. శాశ్వత వర్క్ పర్మిట్ ఇస్తామని నమ్మిస్తారు. కానీ, అది కూడా ఎప్పటికీ జరగదు. బాధిత కార్మికులు ఈ ముఠా సభ్యులు ఇటలీలో భద్రత, ఉపాధి అవకాశాలు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని మోసం చేస్తూ పని బానిసత్వంలోకి దించుతారు’అని పోలీసులు తెలిపారు.
ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో ఇక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంతో ఇతర దేశాల వ్యవసాయ కార్మికులను మోసం చేస్తారు. లేబర్ చట్టాల ఉల్లంఘనలను ఇటలీ తీవ్రంగా ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment