నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి! | A Man Who Was Under House Arrest Asked Italian Police To Put Him In Jail To Escape His Unbearable Wife | Sakshi
Sakshi News home page

నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!

Published Tue, Oct 26 2021 3:03 PM | Last Updated on Tue, Oct 26 2021 3:27 PM

A Man Who Was Under House Arrest Asked Italian Police To Put Him In Jail To Escape His Unbearable Wife - Sakshi

రోమ్‌: కొంతమంది తమ ఇంటి బాధ్యతల నుంచి తప్పించకుని స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఏ బాధ్యతలు లేకుండా హాయిగా గడపటం కోసం ఏం చేయడానికైనా లేదా ఎలాంటి చోట ఉండటానికైనా సిద్దపడతారు. అచ్చం ఇలాగే ఇటలీకి చెందిన ఓ వ్యక్తి స్వేచ్చగా ఉండటం కోసం కుటుంబానికీ దూరంగా జైల్లో ఉండాలనుకుంటున్నాడు. అంతేకాదండోయ్‌ నన్ను జైల్లో పెట్టండి అంటూ పోలీసులను కూడా అభ్యర్థించాడు.

(చదవండి: బాబోయ్‌ ముఖం అంతా టాటులే!)

వివరాల్లోకెళ్లితే.....గైడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల అల్బేనియన్ అనే వ్యక్తి ఇంట్లో తన భార్యతో కలిసి జీవించలేనని, చాలా నరకప్రాయంగా ఉందని కారబినీరి పోలీసులకు తెలిపాడు. అంతేకాదు ఈ కుటుంబ జీవితంతో విసుగు చెందానని, నా భార్య నుంచి తప్పించుకోవడం కోసం నన్ను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని పోలీసలు చెబుతున్నారు.

ఈ మేరకు టివోలి కారబినీరికి చెందిన పోలీస్‌ కెప్టెన్‌ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే మాట్లాడుతూ...అల్బేనియన్ చాలా నెలలుగా మాదకద్రవ్యాల నేరం కింద గృహ నిర్బంధంలో ఉన్నాడని పైగా ఆ శిక్ష ఇంకా ముగియలేదని చెప్పారు. అంతేకాదు తాను ఇక గృహ నిర్భంధంలో కొనసాగాలేనని అది చాలా నరకప్రాయం ఉందని చెప్పడన్నారు.  ఈ మేరకు తాను జైలుకు వెళ్లాలనకుంటున్నానని తనను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని కూడా అన్నారు. ఈ క్రమంలో పోలీసులు గృహ నిర్భంధాన్ని ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడమే కాక అతడిని జైలుకు తరలించాలని న్యాయశాఖ అధికారులు  ఆదేశించారని పోలీసులు పేర్కొన్నారు.

(చదవండి: అమేజింగ్‌ ఆర్ట్‌ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement