Family life
-
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
‘కష్టాల్లో, సుఖాల్లో భర్తకు తోడుగా’ అంటుంటారు. కష్టాలు, సుఖాల్లోనే కాదు... వృత్తిలోనూ భర్తకు తోడూ నీడగా ఉంటుంది జ్యోతి. భర్త డ్రైవర్, భార్య క్లీనర్!జ్యోతి ఎందుకు క్లీనర్ కావాల్సి వచ్చింది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... లారీ డ్రైవర్ అయిన భర్త శోభనాద్రి దూరప్రాంతాలకు వెళుతుండేవాడు. ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా‘ఎక్కడ ఉన్నాడో... ఏం తింటున్నాడో’ అని ఎప్పుడూ భర్త గురించి బెంగగా ఉండేది. అందుకు తగ్గట్టే డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన భర్త బక్కచిక్కి కనిపించే వాడు.ఒకరోజు అడిగింది...‘నేను నీతోపాటే వస్తాను’‘మరి ఇల్లు?’ అన్నాడు భర్త.‘బండే మన ఇల్లు’ అన్నది ఆమె. ఇక ఆరోజు నుంచి బండే వారి ఇల్లు, బండే స్వర్గసీమ. లారీ ఎక్కడికి కిరాయికి వెళ్లినా క్లీనర్‌గా జ్యోతి భర్త వెంటే వెళుతుంది. లారీలోనే వంట సామగ్రి ఏర్పాటు చేసుకుని, మార్గ మధ్యంలో భర్తకు అవసరమైన భోజనం, టీ, అల్పాహారం వంటివి ఏర్పాటు చేస్తుంది. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో సరైన భోజనం లేక శోభనాద్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. భర్త వెంట వెళితే ఇబ్బందులు ఉండవని జ్యోతి భావించింది. రాత్రి పూట భర్త డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర రాకుండా ఉండేందుకు భర్తతో ముచ్చట్లు పెడుతూ అతడిని అప్రమత్తం చేస్తుంటానని చెబుతోంది జ్యోతి. కోళ్ల దాణా, ధాన్యం, బొగ్గు, మొక్కజొన్న వంటివి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రవాణా చేస్తుంటామని, భార్య తోడు రావడం వల్ల ఇంటి బెంగ కూడా ఉండదని శోభనాద్రి చెబుతున్నాడు.చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!‘పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. బాధ్యతలు తీరిపోయాయి. ఇక మా ఇద్దరి జీవనం ఇలా కలిసిమెలిసి సాగిపోతోంది’ అని భార్యాభర్తలు చెబుతున్నారు. వీరిది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం.జి.వి.వి. సత్యనారాయణ, సాక్షి, కొవ్వూరు -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌తో క్యాంపర్ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!
రోమ్: కొంతమంది తమ ఇంటి బాధ్యతల నుంచి తప్పించకుని స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఏ బాధ్యతలు లేకుండా హాయిగా గడపటం కోసం ఏం చేయడానికైనా లేదా ఎలాంటి చోట ఉండటానికైనా సిద్దపడతారు. అచ్చం ఇలాగే ఇటలీకి చెందిన ఓ వ్యక్తి స్వేచ్చగా ఉండటం కోసం కుటుంబానికీ దూరంగా జైల్లో ఉండాలనుకుంటున్నాడు. అంతేకాదండోయ్ నన్ను జైల్లో పెట్టండి అంటూ పోలీసులను కూడా అభ్యర్థించాడు. (చదవండి: బాబోయ్ ముఖం అంతా టాటులే!) వివరాల్లోకెళ్లితే.....గైడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల అల్బేనియన్ అనే వ్యక్తి ఇంట్లో తన భార్యతో కలిసి జీవించలేనని, చాలా నరకప్రాయంగా ఉందని కారబినీరి పోలీసులకు తెలిపాడు. అంతేకాదు ఈ కుటుంబ జీవితంతో విసుగు చెందానని, నా భార్య నుంచి తప్పించుకోవడం కోసం నన్ను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని పోలీసలు చెబుతున్నారు. ఈ మేరకు టివోలి కారబినీరికి చెందిన పోలీస్ కెప్టెన్ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే మాట్లాడుతూ...అల్బేనియన్ చాలా నెలలుగా మాదకద్రవ్యాల నేరం కింద గృహ నిర్బంధంలో ఉన్నాడని పైగా ఆ శిక్ష ఇంకా ముగియలేదని చెప్పారు. అంతేకాదు తాను ఇక గృహ నిర్భంధంలో కొనసాగాలేనని అది చాలా నరకప్రాయం ఉందని చెప్పడన్నారు. ఈ మేరకు తాను జైలుకు వెళ్లాలనకుంటున్నానని తనను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని కూడా అన్నారు. ఈ క్రమంలో పోలీసులు గృహ నిర్భంధాన్ని ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడమే కాక అతడిని జైలుకు తరలించాలని న్యాయశాఖ అధికారులు ఆదేశించారని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) -
సర్దుబాటుతనమే దాంపత్య జీవనసూత్రం
భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు వివాహ వ్యవస్థపై ‘ప్రభాకరవాణి’ చర్చావేదిక రాజమహేంద్రవరం కల్చరల్ : వివాహ జీవితం ఆనందమయం కావాలంటే.. వధూవరులమధ్య ‘సర్దుబాటుతనం’ చాలా అవసరమని భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు అన్నారు. ప్రభాకరవాణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విక్రమ హాల్లో ‘ఆధునిక వివాహ వ్యవస్థ’ అనే అంశంపై జరిగిన చర్చావేదికలో నారాయణరావు మాట్లాడుతూ సర్దుబాటు తనం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుం దన్నారు. ఆధునిక వివాహ వ్యవస్థ అనాలో, వివాహ అవస్థ అనాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ సమయంలో ఉమా మహేశ్వరులను, వాణీహిరణ్య గర్భులను, సీతారాములను, అరుంధతీ వశిష్ఠులను సంస్మరించేది భారతీయవైవాహిక వ్యవస్థ ఒక్కటేనన్నారు. పెళ్ళిళ్ళు పెటాకులు కావడానికి కారణాలను విశ్లేషిస్తూ నిశ్చితార్థం జరిగాక వివాహానికి ఎక్కువ వ్యవధి ఉండటం మంచిది కాదన్నారు. నిశ్చితార్థం అయిన అనంతరం వీడియో ఛాటింగ్‌లో అబ్బాయి అమ్మాయితో ‘పెళ్ళిచూపుల నాడు కన్నా నీవు కొంచెం లావెక్కినట్టు ఉన్నావే’నని యాథాలాపంగా అన్న మాటతో అమ్మాయి వివాహం రద్దు చేసుకున్న వైనాన్ని వివరించారు. యుక్త వయసులో వివాహాలు జరగడం మంచిదని, మా అబ్బాయికి 34 ఏళ్ళే, అమ్మాయికి 34 ఏళ్ళే అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు లాప్టాప్లను ఒడిలో పెట్టుకుని కూర్చుంటే పురుషుడిలో కొంత శక్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. యువతరానికి మన సాహిత్యసంపదను అందించాలని, సనాతనధర్మం వివాహ వ్యవస్థకు ఇచ్చిన ప్రాముఖ్యతను గుర్తించే లా చేయాలని సూచించారు. వివాహం.. రెండు కుటుంబాల బంధం ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ వివాహమనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాక రెండు కుటుంబాల మధ్య బంధమని గుర్తించాలన్నారు. వివాహాలు విఫలమయ్యాయంటే ఆ రెండు కుటుంబాలే కారణమన్నారు. మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘వెనుకటి తరంలో అమ్మాయిని ఎటువంటి వరుడు కావాలని అడిగితే మా నాన్నని అడగమని చెప్పేది. ఈతరంలో కన్యాదాతను మీ అమ్మాయికి ఎటువంటి వరుడు కావాలని అడిగితే–అమ్మాయిని అడిగి చెబుతానంటున్నాడు. మార్పు ఎక్కడ వచ్చిందో కనుక్కోవాలి’ అన్నారు. ఆర్థికస్వేచ్ఛ మితిమీరితే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకుడు ఉప్పలపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ఒక జ్యోతిషవేత్తగా నిత్యం తనవద్దకు వివాహితులు వచ్చి సమస్యలను ఏకరువు పెడుతుంటారని, వీటిలో చాలా భాగం సృష్టించుకున్న సమస్యలేనని అన్నారు. మహా మహోపాధ్యాయ దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలాధారమయినది వివాహ వ్యవస్థేనన్నారు. వాడ్రేవు వేణుగోపాలరావు, అజ్జరపు హరిబాబు, టి.కె.విశేశ్వరరెడ్డి, ధూళిపాళ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం ప్రాణాలు తోడేస్తున్నారు
- కుటుంబసభ్యుల ఉసురు తీస్తున్న కిరాతకులు - నిన్న షాహినాయత్‌గంజ్.. నేడు బాలాపూర్ సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి కోసం కుటుంబసభ్యుల ప్రాణాలను బలిగొంటున్నారు కొందరు దుర్మార్గులు...మొన్న నాగోల్‌లో భార్య, కొడుకుని కిరాయి హంతకులతో చంపించాడో వ్యక్తి. నిన్న..షాహినాయత్‌గంజ్‌లో కన్న తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు మరో కిరాతకుడు. నేడు... బాలాపూర్ సాయినగర్‌లో మరో ఉన్మాది భార్య, కూతరు, తల్లిని కిరాతంగా చంపాడు. రక్తబంధాన్ని మరిచి ఆస్తి కోసం ఇలా మారణ కాండకు పాల్పడటం సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. జంట కమిషనరేట్ల పరిధిలో ఏడాది కాలంగా ఆస్తి కోసం 30కి పైగా హత్యలు జరగడం కలకలం సృష్టిస్తోంది. యాదృశ్ఛికంగా కుటుంబ దినోత్సవం రోజున(శుక్రవారం) బాలాపూర్ సాయినగర్‌లో రాంరెడ్డి అనే ఉన్మాది భార్య రాధిక, తల్లి సుభద్ర, కూతురు అక్షయల గొంతు కోసి మారణకాండకు పాల్పడ్డాడు. వరుస ఘటనల నేపథ్యంలో నగరంలోని కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఎప్పుడు ఎవరు ఉన్మాదిగా మారతారోనన్న అభద్రతా భావంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆస్తి కోసం గతంలో జరిగిన కొన్ని ఘాతుకాలు... సెప్టెంబర్ 25, 2013: కేపీహెచ్‌బీకాలనీలో పీరమ్మ (55)ను దత్తపుత్రుడు ఠాకూర్‌పాషా స్నేహితులతో కలిసి గొంతునులిమి చంపేశాడు. సెప్టెంబర్ 31, 2013: అచ్చయ్యనగర్‌లో భార్య రజనిని భర్త బాలకృష్ణ కూల్‌డ్రిక్‌లో నిద్రమాత్రలు వేసి తాగించి కత్తితో గొంతులో పొడిచి కడతేర్చాడు. నవంబర్ 8, 2013: నాగోల్‌లో శశిధర్‌రెడ్డి అనే వ్యక్తి కిరాయి హంతకులతో భార్య విజయలక్ష్మిచ కొడుకు సాకేత్‌రెడ్డి చంపించాడు. సెప్టెంబర్ 1, 2014: తనకు తెలియకుండా రూ.30 వేలు బంధువులకు ఇచ్చిందని భార్య సబితను భర్త యాదగిరిరెడ్డి గొంతు నులిమి హతమార్చాడు. నవంబర్ 20, 2014: సరూర్‌నగర్ హుటా కాంప్లెక్స్‌లో భార్య రేణుక (26) మెడకు బెల్ట్ బిగించి భర్త ప్రసాద్ చంపేశాడు. ఏప్రిల్ 20, 2014: ఉప్పల్‌లో మాజీ ఎయిర్ హోస్టెస్ రీతును భర్త సచిన్ కొట్టి చంపాడు. నవంబర్ 21, 2014: బంజారాహిల్స్‌లో కుమారుడు అన్వర్‌బేగ్ తల్లి గౌస్యబేగం(60)ను చంపాడు. మార్చి 12, 2015.. షాయినాయత్‌గంజ్‌లో కొడుకు బాబు తల్లి లక్ష్మి (60)ని చంపి ఇంట్లోని పాతిపెట్టాడు.