
సాక్షి,హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. హౌజ్‌అరెస్ట్‌పై రాజాసింగ్ స్పందించారు.‘అందరూ గుడికి వెళ్తున్నారు.నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు.
నన్ను ఇవాళ హౌజ్ అరెస్టు చేసినా రేపైనా గుడికి వెళ్తాను. హిందువులకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిందువుల గుళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.ఇది సరికాదు. ఈ ఘటనలో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలి.కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: టెన్షన్..టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment