
సాక్షి,హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు.
పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment