labours
-
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. శనివారం ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో 33 మంది భారత కార్మికులను ఇద్దరు వ్యక్తుల నుంచి విడిపించినట్లు చెప్పారు. నిందితుల నుంచి అర మిలియన్ యూరోలు (సుమారు రూ. 45 లక్షలు) స్వాధీనం చేకున్నామని పేర్కొన్నారు.ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ ముఠా ఇండియా నుంచి సీజనల్ వర్క్ పెర్మిట్‌తో ఇక్కడి వ్యవసాయ కార్మికులను తీసుకువస్తారు. వారికి మంచి ఉపాధి చూపిస్తాని చెప్పి.. 17000 యూరోలు (సమారు రూ.15లక్షలు) కట్టమని చెబుతారు. వారానికి 7 రోజులు, రోజు 10-12 గంటలు పని. ఒక్క గంటకు నాలుగు యూరోలు ఇస్తామని ఒప్పందం చేయించుకుంటారు. కానీ, అలా చేరిన కార్మికులను బానిసలు పని చేయించుకుంటారు. .. మరికొంత డబ్బు ఇస్తే.. శాశ్వత వర్క్ పర్మిట్ ఇస్తామని నమ్మిస్తారు. కానీ, అది కూడా ఎప్పటికీ జరగదు. బాధిత కార్మికులు ఈ ముఠా సభ్యులు ఇటలీలో భద్రత, ఉపాధి అవకాశాలు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని మోసం చేస్తూ పని బానిసత్వంలోకి దించుతారు’అని పోలీసులు తెలిపారు. ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో ఇక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంతో ఇతర దేశాల వ్యవసాయ కార్మికులను మోసం చేస్తారు. లేబర్ చట్టాల ఉల్లంఘనలను ఇటలీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. -
మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు..
కరీంనగర్: సిరిసిల్ల ఉలిక్కిపడింది. కార్మికుల అడ్డా హత్యోదంతంతో తెల్లారింది. మద్యంమత్తులో ఓ మహిళను కొందరు అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్‌లో బిహార్‌కు చెందిన కొందరు కూలీలు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బీహార్ చెందిన రాంభిక్షు సదా, రుడల్‌సదా ఉండేవారు. వీరు స్థానిక లేబర్ అడ్డా వద్ద రోజువారీ కూలీలుగా, భవనం నిర్మాణ పనులు చేసుకునే వారు. ఈక్రమంలోనే వేములవాడ అర్బన్ మండలం కొడిముంజకు చెందిన అలకుంట రమ కూలీ పని కోసం నిత్యం సిరిసిల్ల లేబర్ అడ్డాకు వచ్చేది. పనిస్థలంలో బిహార్‌కు చెందిన కూలీలతో రమకు పరిచయం ఏర్పడింది. మద్యం అలవాటు ఉండడంతో పనులు ముగిసిన తర్వాత పలుమార్లు మద్యం తాగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అందరూ కూలి పనులు చేసుకునే సమయంలో ఏర్పడిన చనువుతో రమ బిహార్ కూలీలు ఉంటున్న గదికొచ్చినట్లు సమాచారం. మద్యం మత్తులో రాత్రి ఆమైపె అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాస్థలంలో మద్యం బాటిళ్లు, మృతురాలి ఒంటిపై బట్టలు లేకపోవడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ రఘుపతి హత్యకు పాల్పడింది ఎంత మంది అనే దానిపై స్పష్టత లేదన్నారు. మూడు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని, గది నుంచి దుర్వాసన రావడంతో హత్య విషయం వెలుగుచూసినట్లు వివరించారు. హంతకులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉండగా ఇద్దరి పెళ్లిళ్లు జరిగాయి. చాలా ఏళ్ల క్రితం భర్త చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: విధులకు హాజరై తిరిగి కారులో వెళ్తుండగా.. విషాదం! -
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా
వేములవాడ రూరల్: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణా మిడ్‌మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్‌ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు. -
రాళ్ల క్వారీలో కూలిన బతుకులు
ఐజ్వాల్: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో.. కడపటి వార్తలు అందేసరికి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాళ్ల కింద చిక్కుకున్న మరికొందరు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నయ్‌థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి. మృతులంతా బీహారీ కూలీలని అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. సోమవారమే ఈ రాళ్ల క్వారీ కూలిపోయింది. కార్మికులు మధ్యాహ్న భోజన అనంతరం పనుల్లో మునిగిపోగా.. ఈ ప్రమాదం జరిగింది. కూలీలలో 12 మందితో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలంటీర్లు తరలివచ్చారు. రాష్ట్ర విపత్తు నివారణ బృందాలతో పాటు సరిహద్దు భద్రతా దళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి. -
కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకున్న శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన ఫుడ్ కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకుని, దుర్భాషలాడుతున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహరాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా భాగంగా కూలలీలకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో తానే స్యయంగా పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. అంతేకాదు కూలీలకు నాశిరకం భోజనం అందిస్తున్న సదరు మేనేజర్ పై చేయి చేసుకుని, గట్టిగా చివాట్లు పెట్టారు. ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన పార్టీలో చేరారు. శివ సేన నాయకత్వం ఆయనను హింగోలి ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు గతంలో సంతోష్ బంగర్ ఓ వైరల్ వీడియోలో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అధ్యక్షతన తిరుబాటు చేసిని ఎమ్మెల్యేలను తిరిగి వచ్చేయండి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మిమ్మల్ని క్షమిస్తాడంటూ వార్తల్లో నిలిచారు. (చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా..) -
బయోటెక్ ఫ్యాక్టరీలో ప్రమాదం
దేవరపల్లి: ఓ బయోటెక్ ఫ్యాక్టరీలో ఫిల్టర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని పరమేశు బయోటెక్ ఫ్యాక్టరీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్సై కె.శ్రీహరి తెలిపిన వివరాలు.. ఒడిశాకు చెందిన డోమా బీరువా(24), కొవ్వూరు మండలం తిరుగుడుమెట్టకు చెందిన గాజుల శ్రీను(25) పరమేశ్ బయోటెక్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలో చాలాకాలంగా వాడుకలో లేని ట్యాంకును శుభ్రం చేసేందుకు డోమా గురువారం లోపలికి దిగాడు. విషవాయువు వల్ల గాలి ఆడకపోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది గమనించిన శ్రీను.. డోమాను రక్షించేందుకు లోపలికి వెళ్లాడు. తను కూడా ఊపిరాడక లోపలే పడిపోయాడు. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు అనిల్‌సింగ్ కూడా స్పృహ కోల్పోయాడు. ఇది గుర్తించిన కార్మికులంతా ట్యాంకు లోపల పడిపోయిన ముగ్గురినీ తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. యాజమాన్యం ఆదేశాల మేరకు వారిని చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాజుల శ్రీను, డోమా మార్గం మధ్యలోనే మృతి చెందగా అనిల్‌ను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. అధికారులు ఫ్యాక్టరీకి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. ఫ్యాక్టరీలో కార్మికులకు కల్పించిన సదుపాయాలు, రక్షణ పరికరాలను పరిశీలిస్తున్నామన్నారు. మొక్కజొన్న నుంచి పాలు ఫిల్టర్ చేసే ఈ ట్యాంకును చాలా కాలంగా వాడటం లేదని తెలిసింది. -
పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా
సాక్షి, మన్యం పార్వతీపురం కురుపాం: అసంఘటిత కార్మికులకు కేంద్రం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ–శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు రూ.లక్షల్లో ప్రమాద బీమా వచ్చేలా చర్యలు చేపట్టింది. గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ–పోర్టల్‌పై అప్పట్లో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ఇప్పుడు ఈ పథకంపై తగినంత అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్లు చేసుకుని, పథకం లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. 16 నుంచి 59 వయసు కలిగిన వారంతా ఈ పథకానికి అర్హులు కాగా, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2 లక్షలు, అంగవైకల్యం బారినపడితే రూ.లక్ష అందజేస్తారు. రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని, ఈ–పోర్టల్ ప్రారంభించిననట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 12 అంకెల నంబర్ కలిగిన ఈ–శ్రమ్ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం వారికి ఏడాది కాలానికి గాను ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన((పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి కర్షక బీమా పథకం కింద ప్రమాద బీమా వర్తింపజేస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం పొందని వారంతా ఈ పథకానికి అర్హులే కాగా, ఈ జాబితాలో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని రైతులు, మత్స్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, తోపుడు బండ్ల వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, తాపీమేస్త్రీలు, కార్పెంటర్లు, టైలర్లు, రజకులు, కల్లుగీత కార్మికులు, చేనేత, క్షౌ ర వృత్తి వారు, చిరు వ్యాపారులు ఉన్నారు. పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్లు.. ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు తపాలా శాఖ సహాయంతో అసంఘటిత కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు కూడా ఈ–శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్‌లతో జిల్లాలోని ఏ పోస్టాఫీస్‌కు వెళ్లినా ఈ–శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ విపత్తు సమయంలో వలస కూలీలు, అసంఘటిత కార్మికులు పడిన ఇబ్బందులు చూసి, వారికి ఎలాగైనా ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు 2021 జూన్ 29వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ–శ్రమ్ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 2021 ఆగస్టు 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, అన్నిచోట్ల నుంచి ఇప్పుడిప్పుడే ఈ పథకానికి స్పందన లభిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్టేషన్లు అంతగా జరగకపోవడం బాధాకరం. ప్రస్తుతం కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాలకొండ, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ నమోదు ప్రక్రియ జరుగుతుండగా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పథకం సద్వినియోగం చేసుకోవాలి కార్మికులంతా ఈ–శ్రమ్ పథకం లబ్ధి పొందాలి. దగ్గరలోని పోస్టాఫీస్‌కి గానీ, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సభ్యుల వద్దకు గానీ వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. సి.హెచ్.సాయికిశోర్, ఈ–శ్రమ్ ప్రాజెక్ట్ జోనల్ ఇన్చార్జ్, కురుపాం -
కల్తీ మద్యానికి 5 గురు బలి.. మరో 22 మంది..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించిన వారిలో 5 గురు చనిపోగా, మరో 22 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాలు.. అలీఘడ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పోలీసులకు తెలియకుండా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే, వారు పోలీసుల దాడులకు భయపడి మద్యాన్ని రోహెరా గ్రామంలోని ఒక చెరువులో పారబోశారు. దీన్ని చూసిన కొంత మంది ఇటుక బట్టీ కూలీలు ఈ కల్తీ మద్యాన్ని తాగారు. కాగా, వీరందరు గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తెలియగానే స్థానిక పోలీసులు బాధితులందరిని జవహర్లాల్ నెహ్రు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, కల్తీ మద్యం బాధితులలో ఇప్పటి వరకు 5 గురు చనిపోయారని, మరో 22 మంది బాధితుల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని డాక్టర్ హరిస్ మంజుర్ తెలిపారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం వరకు (గురువారం) 27 మంది ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో మొదటి ఆరు గంటలు బాధితులకు ఎంతో విలువైందని డాక్టర్ మంజుర్ పేర్కొన్నారు. వీరిలో చాలా మంది శాశ్వతంగా చూపును కోల్పోయారని, మరో 13 మంది తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్నారని యూపీ మెడికల్ ఆఫీసర్ భానుప్రతాప్ తెలిపారు. మెడికల్ కాలేజ్ కంటి డాక్టర్ జియా సిద్ధిఖీ మాట్లాడుతూ.. వీరిలో ఆరుగురు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండగా, మరో 2 సరిగ్గా చూడలేకపోతున్నారు. మిగతా 4 కోలుకుంటున్నారని తెలిపారు. అయితే, మరికొంత మంది బాధితులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. గత నెల మే 28 న ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు, 35 మంది మరణించారు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల నుంచి చనిపోయిన వారిలో 87 మందిని పరీక్షించగా వారంతా.. కల్తీ మద్యం కారణంగానే చనిపోయానట్లు తెలింది. అప్పటి, కేసులో 34 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. -
గల్ఫ్ జీవితాలపై కరోనా దెబ్బ
కోహెడరూరల్(హుస్నాబాద్): పొట్ట నింపుకోవడానికి పని చేస్తున్నామా.. పని చేయడానికే తింటున్నామా..అని తెలియని గల్ఫ్ బతుకులు ఆందోళనలో పడ్డాయి. తల్లిదండ్రుల గోస తీర్చడానికి కాసుల వేటకు వెళ్లిన జీవితాలు ఆగమయ్యాయి. ఖర్చు పేట్టే ప్రతీ పైసా విలువ తెలిసిన గల్ఫ్ బతుకుల్లో కరోనా మహమ్మరి నీళ్లు చల్లింది. ఉన్న ఊరిని, అయిన వారిని వదిలి పెట్టి ఎడారి దేశాలకు ప్రయాణమైన బిడ్డలకు గల్ఫ్‌లో తిండి తిప్పలు లేక కంటి మీద కునుకులేకుండా పోయింది. క్షణ క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల నుంచి తినడానికి తిండిలేక పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉన్న ఊరికి వచ్చి కన్నోళ్లను, కట్టుకున్న వారిని చూడాలని కళ్లు కాయలు కాసేలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎడారి దేశంలో ప్రతి రోజు కరోనాతో యుద్ధం చేస్తున్న గల్ఫ్ అన్నలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.. పేదరికం, ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి కొందరు.. ఇల్లు కట్టి అప్పు అయిందని మరికొందరు.. ఎంత చదివినా సరిపడా వేతనం వచ్చే ఉద్యోగం రాక విద్యార్థులు ఇలా చాలా మంది వివిధ కారణాలతో నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబ కష్టాలు తిరుద్దామని అప్పులు చేసి అరబ్ దేశాలకు వెళ్లిన బతుకుల ఆశలు కరోనా సమాధి చేసింది. అప్పటికే అందరిని వదిలి పరాయి దేశాలకు వెళ్లిన వలస జీవుల బతుకులను కరోనా రూపంలో కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో చిల్లి గవ్వ లేక ఆకలితో అల్లాడుతూ..ఇరుకు గదుల్లో బిక్కుబిక్కుమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులను తప్ప ప్రవాసులను పట్టించుకోకపోవడంతో భయం గుప్పిట్లో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది.. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80 వేల మంది వలస కార్మికులు విదేశాల్లో ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడి ప్రాంతం నుంచి ఎక్కువగా సౌది, ఓమన్, కత్తర్, కువైట్, మస్కట్, బెహరన్ దేశాలకు ఉపాధి కోసం ఎంతో మంది వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నిండింది. తమ వారు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. మా బతుకుల్లో వెలుగు నింపడానికి వెళ్లిన బతుకులు ఎలా ఉన్నాయో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ వారు అక్కడ ఎలా ఉన్నారో అని ఫోన్లలో వీడియే కాల్ చేసి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తినడానికి డబ్బులు లేకపోతే చెప్పు బిడ్డ అప్పోసప్పో చేసి పంపిస్తా అని ఓతల్లి తన బిడ్డకు చేప్తూ గుండెలు పగిలేలా రోధించింది. ఇక్కడికి నువ్వు మంచిగా వస్తే కూలీనాలి చేసి బతుకుదాం రా బిడ్డ అని కూమారుడికి ధైర్యం చెప్పింది. గల్ఫ్‌లో పరిస్థితి ఇలా... గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేయడానికి పని లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. సుమారు 3నెలల నుంచి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో పనులు లేక తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక తాత్కాలిక వీసాలపై విదేశాలకు వెళ్లినవారు అక్కడ బిల్డింగ్ వర్క్, ప్లంబర్, లేబర్ కూలీ, డ్రైవర్, హోటళ్లు, ఐటీపరిశ్రమ, చమురు, గ్యాస్ స్టేషన్లు తదితర రంగాల్లో పనులు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో అక్కడ అన్ని కంపేనీలు మూసి వేశారు. దీంతో అక్కడ ఉపాధి పొందుతున్న భారతీయులు భారీగా నష్టపోతున్నారు. అలాగే ఇరుకు గదుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఉంచుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశాలకు వద్దామంటే విమానాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించగా ఐన వారు తోడు లేక కుటుంబ సభ్యుల చివరి చూపుకు నోచుకోక గల్ఫ్ కారి్మకుల రక్షణ సమితి సభ్యులు కుటుంబ సభ్యులుగా అండగా నిలబడి అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి 2 సంవత్సరాల క్రితం దూబాయ్ వెళ్లాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల రోజుల క్రితం మరణించాడు. కరోనా నేపథ్యంలో విమానాలు లేకపోవడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపలేక దూబాయ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. భయం భయంగా బతుకుతున్నాం... ప్రతీ క్షణం భయం భయంగా బతుకుతున్నాం. ఫిబ్రవరి నుంచి ఇక్కడ పనులు లేక కంపెనీలు మూత పడ్డాయి. మేము పని చేసిన చివరి నెల జీతం కూడా కంపెనీ చెల్లించలేదు. ఒక్క గదిలో పరిమితికి మించి ఉంటున్నాం. ఇక్కడ ఉండటానికి ఇంటి నుంచే పైసలు పంపుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కొంచెం ఆదుకుంటున్నాయి. ప్రభుత్వం స్పందించి దేశానికి రప్పించాలి. – నాయిని అనిల్, దుబాయ్‌లో ఉన్న యువకుడు స్వదేశానికి రప్పించండి... కరోనాతో పని లేక ఇబ్బంది పడుతున్న గల్ఫ్ కార్మికులను స్వదేశానికి రప్పించాలి. గల్ఫ్ కారి్మకులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశం కాని దేశంలో కార్మికులు తిండిలేక పరిగడుపున నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాలి. ఉన్నత కుటుంబాలకు చెందిన వారిని ప్రత్యేక విమానాల ద్వారా రప్పిస్తున్న మోదీ వలస కారి్మకులను పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కార్మికులను రప్పించాలి. – మంద పవన్, సీపీఐ జల్లా కార్యదర్శి, సిద్దిపేట -
వలస కూలీలకు పద్మారావు చేయూత
-
బావిలో పూడిక తీస్తూ ఇద్దరు కూలీలు మృతి
-
రోడ్డున పడ్డ 2500 మంది కార్మికులు
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరం పట్టాభిపురంలోని భజరంగ్ జూట్ మిల్లును లాకౌట్ చేయడం వల్ల 2500 మంది కార్మికులు రోడ్డు పడ్డారని, మిల్లు తిరిగి ప్రారంభించి వారికి జీవనోపాధి కల్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వైఎస్సార్ సీపీ నాయకుడు, జూట్ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. కార్మిక శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మిలతో నాయకులు గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూట్ మిల్లు లాకౌట్ చేసి వేలాది మంది కార్మికుల పొట్టకొట్టిన యాజమాన్యానికి గత ప్రభుత్వం కొమ్ముకాసిందని చెప్పారు. 1994లో బీఐఎఫ్ఆర్ పద్ధతిలో 40 శాతం కార్మికుల వాటా, 60 శాతం యాజమాన్యం వాటా కింద మిల్లును నిర్వహించేలా అప్పటి ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. 40 శాతం కార్మికుల వాటను ప్రభుత్వమే సమకూర్చేలా ఒప్పందం జరిగిందన్నారు. 2014 వరకూ మిల్లు సజావుగా సాగిందని, ఉత్తమ మేనేజ్మెంట్ అవార్డును సైతం ప్రభుత్వం నుంచి మిల్లు యాజమాన్యం తీసుకుందన్నారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని గుంటూరు జిల్లాలో ఏర్పడటంతో భూముల విలువ అమాంతం పెరగడంతో మిల్లు భూములను రియల్టర్లకు విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించుకుందన్నారు. ఇందులో భాగంగా 2015 మే 12న మిల్లు భూములను యాజమన్యం విక్రయించగా, అదే సంవత్సరం జూలై 4న యాజమాన్యం మిల్లు లాకౌట్ చేసిందని వివరించారు. బీఐఎఫ్ఆర్ పద్ధతిలో మిల్లు నిర్వహించడానికి యాజమాన్యానికి ప్రభుత్వం అనేక రాయితీలిచ్చిందని వెల్లడించారు. కానీ స్వప్రయోజనాల కోసం యాజమాన్యం మిల్లును లాకౌట్ చేసిందన్నారు. సమగ్ర విచారణ చేయిస్తాం.. మిల్లు లాకౌట్ చేసి యాజమాన్యం కార్మికుల పొట్టకొట్టిన విధానాన్ని నాయకులు వివరించిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందిస్తూ నెల రోజుల్లో అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ చేయించి నివేదికలు తెప్పించుకుని నాయకులతో మళ్లీ సమావేశం నిర్వíßహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, జూట్ మిల్లు మూత పడటంతో రోడ్డున పడ్డ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక నాయకులు పాండు, సాంబ, మోసే, వైఎస్సార్సీపీ నాయకులు షౌకత్, తోట ఆంజనేయులు, పానుగంటి చైతన్య తదితరులు ఉన్నారు. -
ఆపద వస్తే అంతే సంగతి
సాక్షి, మల్కాపురం (విశాఖపట్నం): రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. పొట్టకూటి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే సుమారు ఐదు కిలీమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి వచ్చిన వారు అనేక బాధలు పడుతున్నారు. 48వ వార్డు అచ్చినాయుడులోవ కొండ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 4,600 ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ విభాగం పర్యవేక్షణలో ఏడు నెలల నుంచి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సుమారు ఐదు వందల మంది కార్మికులు సివిల్ పనులు, రాడ్‌బెండింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం కాంట్రాక్టర్ (టాటా)బీహార్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చారు. అయితే నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కార్మికులకు కనీస వసతులు లేవు. వీరికి మరుగుదొడ్లు, సేద తీరేందుకు షెల్టర్‌గానీ లేవు. ముఖ్యంగా వైద్య సదుపాయం పెద్ద సమస్యగా మారింది. సివిల్ పనులు చేస్తున్న కార్మికులకు ఏదైన ప్రమాదం జరిగిన, మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయినా ప్రాథమిక వైద్యం అందించేందుకు కూడా సదుపాయం లేదు. గత నెల తివారీ అనే వ్యక్తి రాడ్‌బెండిగ్ పనులు చేస్తుండగా ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తొటి కార్మికులు సైట్ ఇన్చార్జ్కు సమాచారం అందించారు. ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనం లేకపోవడంతో తోటి కార్మికులే చేతుల మీద ఐదు కిలో మీటర్ల కొండ దిగువకు తీసుకువచ్చి వైద్యం చెయ్యించారు. కొండ ప్రాంతంలో పనిచేస్తుండడంతో విషసర్పాలు కాటు వేసినా లేక మరేం ప్రమాదం జరిగినా తక్షణ వైద్యం సాయం ఇక్కడ అందుబాటులో లేదు. ఒక్కోసారి క్షణం ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. బతుకు దెరువు కోసం ఇక్కడకు వస్తే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యపై ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.ఆర్.కే.రాజును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. అత్యవసర పరిస్థితి వస్తే అంతే.. తమ కార్మికులకు ప్రాణాపాయం వస్తే పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఎవరూ లేరు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఐదు కిలీమీటర్లు రావాలి. సమీపంలో వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. – రామ్‌జీ, బీహార్ కనీస వసతులు కల్పించాలి బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చాం. ఇక్కడ పరిస్థితి చూస్తే భయం కలుగుతోంది. కొండ ప్రాంతంలో తమపై ఏదైనా జంతువులు గానీ, విషసర్పాలు గానీ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటీ. వైద్య సదుపాయాలు ఇక్కడ కల్పించాలి. - ముఖేష్ తమర్, జార్ఖండ్ -
పనులు చేసినా పైసలు లేవు
సాక్షి, కొమరాడ: గ్రామాల్లో వలస నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో కూలీలకు వంద రోజులు పనులు కల్పించడంతో వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునని ప్రభుత్వం సంకల్పించింది. అయితే పథకం కూలీలకు చేతి నిండి పనులున్నా కూడా వలసలు ఆగడం లేదు. దీనికి కారణంగా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడమే. కూలీలు ఉన్న చోటికి ఉపాధి కల్పించి వలసలు నివారించాలని ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు నెలల నుంచి వేతనదారులు కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం చీమ కుట్టినట్లు అనిపించడం లేదని వేతనదారులు మండిపడుతన్నారు. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండంల్లోని నెలలు తరబడి కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చేస్తున్న చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కూలి డబ్బులు కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పనులు చేసినా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడంతో గ్రామీణులు వలస బాట పడుతున్నారు. పనులు ఫుల్.. డబ్బులు నిల్.. ఆరు నెలలుగా సరైన వర్షం లేకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలు పొట్టకూడి కోసం ఉపాధి పనులవైపు మొగ్గు చూపారు. అయితే పనులకు ఇబ్బంది లేకపోయినా డబ్బులు విషయానికి వచ్చే సరికి వారికి తిప్పలు తప్పడం లేదు. దీంతో పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నా ప్రభుత్వం లక్ష్యం మరుగు పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ వేతనదారులకు 100రోజులు నుంచి 200 రోజులు పనికల్పించి వారం వారం బిల్లులు చెల్లించాలి. కానీ క్షేత్ర స్థాయిలో కనీసం 100రోజులు కూడా పని కల్పించడం లేదు. చేసిన పనులకు బిల్లులు అందడం లేదు. కొమరాడ- సంఘాలు 960 వేతనదారులు 6542 బకాయాలు రూ.1.65కోట్లు కురుపాం.. సంఘాలు 661 వేతనదారులు 4468 బకాయాలు రూ.2కోట్లు జియ్యమ్మవలస: సంఘాలు 788 వేతనదారులు 4991 బకాయాలు రూ.2.08 కోట్లు గరుగుబిల్లి.. సంఘాలు 828 వేతనదారులు 6042 బకాయిలు రూ.2.30 కోట్లు గుమ్మలక్ష్మిపురం.. సంఘాలు 779 వేతనదారులు 6042 బకాయిలు రూ.2కోట్లు మూడు నెలలు డబ్బులు లేవు మూడునెలలు కూలీ డబ్బులు పడలేదు. కార్యాలయాలు, బ్యాంకు చుట్టూ తిరుగుతన్నా డబ్బులు పడడంలేదు. అనేక ఇబ్బందులు పడుతున్నా కుటుంబ పోషణ భారమైంది. నిత్యవసర వస్తువులు కూడా కొనక్కోలేక పోతున్నాం.– ఆకులు జయలక్ష్మి, వేతనదారులు, గుణానపురం ఇబ్బంది పడుతున్నాం నెలల తరబడి ఉపాధి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కొన్ని కుటుంబాలు వలస పోతున్నాయి. అధికారులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేదు.– బుగత ఆదినారాయణ, వేతనదారుడు, గుణానపురం అధికారులు స్పందించాలి ఉపాధి వేతనదారులకు కూలి డబ్బులు అందక వలస బాట పడుతున్నారు. పొట్ట కూటి కోసం వారు కష్ట పడినా డబ్బులు రావడం లేదు. కూలి డబ్బులు ఇవ్వకపోతే వారు ఎలా బతికేది. – అధికారి శ్రీనివాసురావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శివిని -
‘కూలీ’న బతుకులు
వంద రోజులు పని దినాలు కల్పించాలని ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది. జిల్లాలో ఇప్పటికే కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో ఉపాధి పనితోనైనా.. నాలుగు మెతుకులు తిందామంటే ఆ పనులు కూడా అందరికీ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. లక్షలాది మంది కూలీలు ఉండగా వేలాదిమంది కూలీలకే పనులు కల్పిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక జిల్లా కూలీలు వలసబాట పడుతున్నారు. మెదక్ : జిల్లాలో వర్షాలు లేవు. భూగర్భ జలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. వెరసి వ్యవసాయం మూలన పడింది. కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసల నివారణకు తోడ్పడాల్సిన ఉపాధిశాఖ అధికారులు పల్లెలో కేవలం నర్సరీల ఏర్పాటుతోనే సరిపెడుతున్నారు. జిలాలో 7,68,271 మంది జనాభా ఉన్నారు. 1,81,342 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,05,104 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరందరికీ ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించాల్సి ఉండగా 80శాతం గ్రామాల్లో ఉపాధి పనులు జరగడం లేదు. కానీ మెజార్టీ గ్రామ పంచాయతీలు నర్సరీల్లో మొక్కలను పెంచే పనిలో నిమగ్నమయ్యారు. మొక్కలను పెంచేందుకు కేవలం 10 మంది కూలీలకు మించి ఉపాధి దొరకడం లేదు. దీంతో పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. 10 వేల మందికి మాత్రమే.. 320 గ్రామ పంచాయతీల్లో ప్రతీ గ్రామం పరిధిలో వన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,05,104 మంది కూలీలు ఉండగా సుమారు 10,955 మంది కూలీలకు మాత్రమే ఈ నర్సరీల ఏర్పాటులో పని దొరకుతోంది. ఈ లెక్కన 3,94,149 మందికి పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఉన్న ఊళ్లో పనులు దొరక్క పొట్ట చేతబట్టుకొని వలసలు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు పని చేస్తున్నారు. అదనపు భత్యం మాటే లేదు.. ఉపాధి కూలీలకు వేసవికాలంలో ప్రతి ఏటా ఐదు నెలల పాటు అదనపు భత్యం అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 20 నుంచి 30 శాతం అదనంగా కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ ఊసే కానరావడం లేదు. వారం రోజులుగా జిలాల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పనులు చేసే అతికొద్ది మంది కూలీలకు సైతం ఆ భత్యం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. పనులు లేక పస్తులుంటున్నాం.. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేక పోవడం, ఎండలు ప్రారంభం కావడంతో ఆ రెండు బోర్లు నీళ్లు పోయడం లేవు. ఉపాధి హామీలో ఇచ్చే కరువు పనులు చేద్దామంటే మా గ్రామంలో ఇప్పటికి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. సార్లను అడిగినా ఫలితం లేకుండా పోతోంది. ఇక పట్నం బతుకుదెరవు పోయేందుకు సిద్ధమౌతున్నం. –జాల దుర్గయ్య , పాతూర్ జనాభా 7,68,271 జాబ్ కార్డులు 1,81,342 కూలీలు 4,05,104 పని చేస్తున్న కూలీలు 10,955(సుమారు) -
జీడీకే–10 గని మూత!
రామగిరి(పెద్దపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో మరో భూగర్భ గని మూతపడనుంది. సంస్థలో మొట్టమొదటి బీజీ(బ్లాస్టింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం ముహూర్తం ఖరారు చేసింది. ఈయేడాది డిసెంబర్లో 10వ గని మూసి వేసేం దుకు సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తు న్నారు. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు 520 మంది కార్మికులను బదిలీ చేయనున్నారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు. 157 మంది కార్మికులు ఆర్జీ–3 పరిధి ఓసీపీ–1, 2గనులకు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మరో 180 మంది కార్మికులను ఇక్కడే ఉంచనున్నారు. 1976లో ప్రారంభం 1976లో ఏర్పాటు చేసిన జీడీకే–10 ఇంక్లైన్ గని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లోని కింది రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో సింగరేణి మొత్తానికి మొట్టమొదటి సారి ఈగనిలో బీజీ ప్యానల్ ఏర్పా టు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని నిర్దశించిన ఉత్తత్పి సాదించి ఈగనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరిగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాఫ్టును ఎర్పాటు చేశారు. పనిస్థలం దూరం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో యాజమా న్యం ఈ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి ఓపీసీ–1కు అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్లో ఉత్పత్తి నిలిపివేసి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఓసీపీ–1 జీవితకాలం జీడీకే–10వ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి లోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్సరాలు పెరుగుతుంది. 2019 డిసెంబర్లో ఓసీపీ–1 ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మూడేళ్లక్రితం 10ఏ మూసివేత సింగరేణ సంస్థలో మొట్టమొదటిసారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని మూడు సంవత్సరాల క్రితం 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే–10ఏ గనిని 1985లో ఏర్పాటు చేశారు. భూగర్భంలో నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పైరెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏగనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడీకే–10, జీడీకే–10ఏ ఇంక్లైన్ గనుల్లో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా, రెండు గనుల ద్వారా 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును ఓసీపీ–1 ద్వారా వెలికితీయాలని సింగరేణి భావిస్తోంది. 34మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జీడీకే–10వ గనిని డిసెంబర్లో మూసి వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. జీడీకే–10, జీడీకే–10ఏ గనుల ద్వారా సుమారు 34 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పతి జరిగింది. మిగిలిన బొగ్గు నిక్షేపాలను ఓసీపీ–1 ద్వారా వెలికితీయనున్నాం. ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏపీఏకు ఎలాంటి ముప్పు వాటిళ్ళకుండా రెండు డ్యాంలను నిర్మిస్తున్నాం. బి.వీరారెడ్డి, ఏపీఏ జీఎం -
మారకుంటే డిస్మిస్సే..
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఉద్యోగాల లేక నిరుద్యోగులు పడరాని పాట్లు పడుతుంటే ఉన్న ఉద్యోగాలను లెక్కచేయకుండా కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు కొందరు కార్మికులు. నిర్ణీత మస్టర్లు నింపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొంత మంది కార్మికులు డిస్మిస్ అంచులకు వెళ్లారు. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్. ఇంత పెద్ద ఏరియాలో గైర్హాజరు కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు నింపాలి. ఇలా మూడేళ్లు వరుసగా 100 మస్టర్లు నిండకుంటే వారిని కంపెనీ డిస్మిస్ చేస్తోంది. గతంలో వేలాది మంది కార్మికులు ఇలాగే డిస్మిస్ అయ్యారు. 2003 వరకు మూడేళ్లు చూసి వెంటనే డిస్మిస్ చేసింది. కాలక్రమేణా వచ్చిన మార్పులతో చాలామంది డ్యూటీల బాటపట్టారు. కానీ ఇంకొందరు గైర్హాజరు అవుతూనే ఉన్నారు. వారి పట్ల యాజమాన్యం సీరియస్‌గా స్పందించాల్సి ఉన్పప్పటికీ కొత్త రాష్ట్రంలో డిస్మిస్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, కౌన్సెలింగ్ పేరుతో డ్యూటీలు చేయాలని కోరుతూ వచ్చింది. గడిచిన ఐదేళ్లుగా కార్మికులను పలుమార్లు పిలిచి కౌన్సెలింగ్ చేస్తూ రావడంతో ఇందులో కొంత సత్ఫలితాలు వచ్చింది. కాగా, ఏరియాలో గడిచిన 5 ఏళ్లుగా 100 మస్టర్ల కంటే తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారిపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారు. ఇంక్రిమెంట్లు కూడా కట్ చేసిన వారు మారడం లేదు. దీంతో వారికి చివరిసారిగా ఈ నెల 20న కౌన్సెలింగ్ నిర్వహించారు. తీవ్ర గైర్హాజరు ఉన్న 38 మందిని గుర్తించి అధికారులు పిలిచారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్‌చేసి వారిని వెంట తీసుకొని కౌన్సెలింగ్‌కు రమ్మని కోరారు. ఇందులో కేవలం 17 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు రాలేదు. వారికి చివరి సారిగా నోటీసులు ఇచ్చి చర్యలకు సిద్ధమైంది. వీరు డిస్మిస్ అయ్యేఅవకాశం కూడా ఉందని తెలుస్తుంది. నెలకు 22 మస్టర్లు చేస్తే సరి కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో చాలా మందికి యాజమాన్యం చివరి అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం డిసెంబర్, జనవరీ, ఫిబ్రవరిలో ప్రతీ నెల 22 మస్టర్లు తగ్గకుండా పనిచేయాలని జీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇలా 3 నెలలు పనిచేసి గాడిన పడాలని, ఈ 3 నెలల్లో కూడా మార్పు రాకుంటే వారిని డిస్మిస్ కోసం కార్పొరేట్‌కు సిఫార్సు చేయడానికి యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది. వ్యసనాలతో చాలా మంది ఎగనామం చాలా మంది గైర్హాజరు కార్మికులు వ్యసనాల కారణంగా డ్యూటీలు సక్రమంగా చేయకుండా గైర్హాజరు కార్మికులుగా మారారు. ఇందులో యువ కార్మికులు కూడా ఉండటం అశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబ బాధ్యత మరిచి జులాయి తిరుగుళ్లు తిరుగూ డ్యూటీలు రావడం లేదని ఇలాంటి వారిని ఇక ఉపేక్షించేది లేదని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా చివరి అవకాశంగా వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. సేవా సమితి ద్వారా మహిళలు కూడా కార్మికుల కుటుంబాల్లోని మహిళలను పిలిచి వారి సమక్షంలో కార్మికునికి కౌన్సెలింగ్ ఇచ్చి డ్యూటీలు సక్రమంగా చేసుకొని కుటుంబానికి పోషించుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి నాటికి వీరు మారకుంటే డిస్మిస్ కావడం ఖాయమని పేర్కొంటున్నారు. ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డుపై పడకుండా ఉద్యోగం నిలుపుకోవాల్సిన బాధ్యత సదరు కార్మికులపై ఉంది. -
రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ప్రతి కార్మికుడు, ఉద్యోగి రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సేఫ్టీ జీఎం రాజీవ్‌కుమార్ కార్మికులను ఆదేశించారు. మంగళవారం ఏరియాలోని వర్క్ షాప్‌లో 51వ రక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణిలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, అందుకు కారణం ఉద్యోగులు రక్షణ సూత్రాలను పాటించటమేనని అన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ కమిటీకి డీవైజీఎం ప్రసాద్, ఏజీ ఎం కిషోర్‌గంగా స్వాగతం పలికారు. అనంతరం తనిఖీ కమిటీ వర్క్‌షాప్‌లోని వివిధ యంత్రాలు, పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం రాఘవేంద్రరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేజీ తివారీ, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీరజాక్, ఏజీఎంలు మోహన్‌రావు, పి.శ్రీనివాస్, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు రవి, కె.బ్రహ్మాచారి, వర్క్‌షాప్ ఇంజనీర్లు అనిల్, ఉపేందర్, వీరస్వామి, సంపత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పిట్ సెక్రటరీ, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
లైనర్స్ కంపెనీ మూసివేతపై కార్మికుల ఆందోళన
-
‘ఆప్ నేతలు మమ్మల్ని మోసం చేశారు’
హరియాణ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమను మోసం చేశారంటూ హరియాణాలో రోజువారీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ర్యాలీలో పాల్గొంటే డబ్బులతో పాటు భోజనం పెడతామంటూ నమ్మించి...ర్యాలీ అయ్యాక ఉత్తి చేతులు చూపించారని వారు వాపోతున్నారు. హరియాణలోని హిసార్‌లో ఆదివారం జరిగిన ‘హరియాణా బచావత్’ ర్యాలీలో పాల్గొనాలని కొంత మంది ఆప్ నేతలు తమని తీసుకెళ్లారని, ర్యాలీలో పాల్గొన్నందకు ఒక్కొక్కరికి రూ.350 చొప్పున ఇచ్చి, భోజనం కూడా పెడతామన్నారని కూలీలు తెలిపారు. అయితే ర్యాలీ అయిపోయాక తమను ఎవరు పట్టించుకోలేదని, డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ ఆప్ నేతలపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హరియాణలో ఎన్నికల ర్యాలీలో పాల్గోన్న విషయం తెలిసిందే. -
అక్కడికెళితే... అంతే సంగతులు!
సాక్షి, రాయచోటి: నిత్యం కరవుతో అల్లాడుతున్న వైఎస్సార్ జిల్లా ప్రజలు జీవనోపాధికోసం వలసలు వెళ్లడం సర్వసాధారణం అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళితే మంచి ఉపాధితో పాటు మూడుపూటలా భోజనం వారే ఏర్పాటుచేస్తారని దీంతో మీరు లక్షాధికారులు కావచ్చని ఆశ చూపి, ఇక్కడి మహిళలను విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మహిళలు అష్ట కష్టాలు పడుతూ కనీసం బతికున్నారా... లేదా అనే సమాచారం కూడా తెలియపర్చలేని దుస్థితిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం గరుగుపల్లికి చెందిన లక్ష్మిదేవమ్మ అనే మహిళ తొమ్మిది నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు ఆమె గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూలి పనులు చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మిదేవమ్మ తన ముగ్గురు బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పరచాలనే ఉద్ధేశ్యంతో అప్పోసప్పో చేసి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ ఏజెంట్ ను ఆశ్రయించింది. నెలకు 18 వేలు జీతం, మూడు పూటలా భోజనం ఇస్తారని ఒక ఇంట్లో ఇంటి పని చేయాల్సి ఉంటుందని ఏజెంట్ చెప్పడంతో గల్ఫ్ బాట పట్టింది. అక్కడికెళ్ళిన లక్ష్మిదేవమ్మకు ఒక పూట మాత్రమే భోజనం ఇచ్చి, నెలకు 13 వేలు చొప్పున మూడు నెలల పాటు రెండు ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడించేందుకు అనుమతికూడా ఇవ్వలేదు. 9 నెలలు పనిచేసిన లక్ష్మిదేవమ్మకు 3 నెలలు మాత్రమే జీతం ఇచ్చారు. అధిక ఒత్తిడిని తట్టుకోలేని లక్ష్మిదేవమ్మ తాను స్వదేశానికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఏజెంట్ కు పెట్టిన డబ్బులు చెల్లించి వెళ్ళిపోవచ్చని లక్ష్మిదేవమ్మ యజమానులు డిమాండ్ చేశారు. లక్ష్మిదేవమ్మ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక్కడ స్థానికులు రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. -
కంటైనర్‌లో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి
సాక్షి, పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం వద్ద ఉన్న కియా ఫ్యాక్టరీ దగ్గర కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రించిన ఇద్దరు కూలీలు మృతిచెందారు. నారాయణ, రామాంజినేయులు అనే కూలీలు సోమవారం రాత్రి కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రపోయారు. అయితే అక్కడ ఊపిరాడకపోవడంతో వారు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
నీడ..నీరు లేదు
► ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాల కరువు ► తాగునీరూ వెంట తెచ్చుకోవల్సిందే.. ► పట్టించుకోని అధికారులు ► మొత్తం జాబ్ కార్డులు 1,14,743. కూలీలు 2,50,957 ► పనులు చేస్తున్న కూలీలు 1,31,881 ఉపాధిహామీ కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతున్న కొద్ది పనులు చేయడం ఇబ్బందిగా మారింది. పని ప్రదేశంలో అధికారులు కనీస వసతులైన నీడ, నీటి సౌకర్యం కల్పించడం లేదు. దీంతో కూలీలు ఎర్రని ఎండలో పనిచేయాల్సి వస్తోంది. నీళ్లు కూడా వెంట తెచ్చుకోవల్సిన దుస్థితి నెలకొంది. కౌటాల మండలంలోని యాపలగూడ, తలోడి గ్రామాల్లో మంగళవారం ఈ పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా కూలీలు ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. కౌటాల : ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదు. జిల్లాలో మొత్తం 1,14,743 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 69,556 వేల కుటుంబాల్లో 2,50,957 కూలీలు ఉన్నారు. ఇందులో 1,31,881మంది పనిచేస్తున్నారు. వీరిలో గతేడాది 3,664 మంది కూలీలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగి ఉన్నా ప్రభుత్వం కూలీలకు కనీస వసతులు కల్పించడం లేదు. ఉపాధి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు నీరు లేక..సేద తీరేందుకు నీడ లేక.. ఎండలోనే పనులు చేస్తూ కూలీలు వడదెబ్బకు గురువుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. గతంలో ఉపాధిహామీ కూలీలకు నీడ సౌక్యర్యం లేక ఎండదెబ్బకు పలువురు కూలీలు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు ఈ సంవత్సరం కూడా కూలీలకు నీడ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో అనేక మంది కూలీలు పనులకు రావడం లేదు. ఇబ్బందుల్లో కూలీలు ఉపాధి పని ప్రదేశాలలో నీడ, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కూలీలు ఇంటి నుంచే తాగునీరు తెచ్చుకోవల్సి వస్తోంది. ఆ నీళ్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలోని నీరు ఎండకు వేడి కావడంతో కూలీలు తాగలేకపోతున్నారు. పనులు చేస్తున్న సమయంలో కూలీలు గాయాల పాలైనా..అనారోగ్యానికి గురైన ప్రాథమిక చిక్సిత అందించేందుకు ఎక్కడా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. టెంట్లు కూడా లేకపోవడంతో నీటి సీసాలను చెట్ల కింద ఉంచాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ముఖ్యంగా కౌటాల మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో ఏ ఒక్క చోట కూడా ఎండలకు టెంట్లు వేసిన దాఖాలలు కనిపించడం లేదు. వడదెబ్బ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈజీఎస్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి పని చేసే ప్రదేశంలో తాగు నీరు, నీడ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కారణంగా అనేక మంది కూలీలు పని మానేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి, నీడ సౌకర్యాం కల్పించాలి. - బెడ్డల తుర్సబాయి, ఉపాధికూలీ, యాపలగూడ 82 నీళ్లు తెచ్చుకుంటున్నాం ఇంటి నుంచే నీటి సీసాలు వెంట తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. దీంతో నీటి తిప్పలు తప్పడం లేదు. మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచడం లేదు.- దుర్గం అర్జున్, ఉపాధికూలీ, ధనురుహెట్టి 83 టార్ఫాలిన్లు ఇచ్చాం మండలంలో పని చేస్తున్న కూలీలకు ఈ సంవత్సరం ప్రభుత్వం పంపిణీ చేసిన టార్ఫాలిన్ కవర్లను ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అందించాం. మెడికల్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కూలీలు ఎక్కువగా ఉండడంతో టార్ఫాలిన్ అందరికీ అందించలేకపోయాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.- పూర్ణిమ, ఈజీఎస్ ఏపీవో, కౌటాల 84 -
నేటి నుంచి కార్మిక సంఘాల పాదయాత్ర
– 21న కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష – 24న కలెక్టరేట్ ముట్టడి – కార్మిక చట్టాల అమలే లక్ష్యం అనంతపురం అర్బన్ : జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉపాధి చూపించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల అమలుకు బుధవారం నుంచి పాదయాత్ర చేపడుతున్నామన్నారు. హిందూపురంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 20 వరకు ఐదు ప్రాంతాల్లో 100 గ్రామాల ద్వారా 500 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్ అధ్యక్షతన జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కార్మికులు అనేక త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను కాలరాసే∙దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గపు చర్యన్నారు. బుధవారం హిందూపురంలో ప్రారంభమయ్యే పాదయాత్రకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ హాజరవుతారన్నారు. 16న కదిరి, 17న గుంతకల్లు, 18న తాడిపత్రి , అదే రోజున నగరంలో పాదయాత్ర సాగుతుందన్నారు. 20వ తేదీ నాటికి అన్ని పాదయాత్రలు అనంతపురం చేరుకుంటాయన్నారు. 21న కలెక్టరేట్ ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్నారు. 22న అన్ని రాజకీయ పార్టీలతో సంఘీభావ సభ నిర్వహిస్తామని, 24న కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వీరమణ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, ఏఐయూటీయూసీ జిలా కార్యదర్శి సుబ్రమణ్యం, ఐద్వా జిల్లా కార్యదర్శి సావితి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.