- కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన
- సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులు
బోథ్ నియోజకవర్గంలో సమ్మె విజయవంతం
Published Fri, Sep 2 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ఇచ్చోడ : మండలం కేంద్రంలో హమాలీలు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, తాపిమేస్త్రీ సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలురువు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.18 వేలు నిర్ణయించాలన్నారు. సమ్మె విజయవంతమైందని ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కల్లెపెల్లి గంగాయ్య, కొలిపాక అశోక్, దుబాక సుభాష్, సిరిసిల్ల భూమయ్య, యూసుప్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్ : సమ్మెలో భాగాంగా మండల కేంద్రంలో పోస్టర్లు, వినతి పత్రాలతో నిరసన తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ఎంఈవో నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మండల నాయకుల పోస్టర్లతో నిరసన తెలిపారు. ఆయా సంఘాల మండల నాయకులు ఉస్మాన్, శేక్ హస్సేన్ మాట్లాడారు. ఎమ్మార్సీ కాంట్రాక్టు ఉద్యోగులు ఎంఐఎస్ కేశవ్ లాందాడే, ఫరీన్, సావేందర్, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు జాకీర్‌ఖాన్, సురేఖ, సలీమ, మల్యాల శ్రీకర్ పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
ఇచ్చోడ(బోథ్) : మండల కేంద్రంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్ కార్యాలయంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు గంగయ్య, సుధీర్, రాజలింగు, గంగయ్య, నజీర్‌బాబు, ఫయిం, అడెల్లు, భోజన్న పాల్గొన్నారు.
బజార్‌హత్నూర్ : సార్వత్రిక సమ్మె విజయవంతమైందని ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చందర్ తెలిపారు. మండల కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, తాపీమేస్త్రీలు, పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రహ్లాద్, రాజన్న, గంగామణి, దేవశీల, హెమలత, రాధ, రత్నమాల, కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement