ఇదేం ధ‘రొయ్యో’..! | Crop break in several villages in West Godavari district | Sakshi
Sakshi News home page

ఇదేం ధ‘రొయ్యో’..!

Published Thu, Apr 24 2025 4:13 AM | Last Updated on Thu, Apr 24 2025 6:04 AM

Crop break in several villages in West Godavari district

అడ్డగోలుగా ధర తగ్గిస్తున్న సిండికేట్‌

పట్టించుకోని కూటమి సర్కారు

ఆక్వా రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి 

సాగు సమ్మె దిశగా వేగంగా అడుగులు 

ధరలు గిట్టుబాటు కావంటూ ఆవేదన  

పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో పంట విరామం  

ఇతర జిల్లాల్లోని రైతులందరిదీ అదే బాట 

రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతు­న్నారు. ట్రంప్‌ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదా­రులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో ఈ దు­స్థితి తలెత్తింది. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సాగు సమ్మె బాట పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పట్టుబడి పూర్తయిన 25 శాతం విస్తీర్ణంలో మెజార్టీ రైతులు పంట విరామం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన, కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి, అమరావతి

పశ్చిమగోదావరిలో నిరసన గళం 
వారం రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శి­ర­గాలపల్లి, పాలకొల్లు మండలం చందుపర్రు గ్రా­మాల రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చు­ట్టారు. తాజాగా ఇదే జిల్లాలో నరసాపురం మండ­లం తూర్పుతాళ్లు గ్రామంతోపాటు పోడూరు మండ­ల రైతులు కూడా సాగు సమ్మెకు సిద్ధపడుతు­న్నా­రు. ఆక్వా సాగు ఇక చేయలేమని,  క్రాప్‌ హా­లి­డే పాటించాలని నిర్ణయించామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏ­లూ­రు, తూర్పుగోదావరి, కృష్ణా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం జి­ల్లాల రైతులూ సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు.   

5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు 
రాష్ట్రంలో ఈ–ఫిష్‌ డేటా ప్రకారం 1.62 లక్షల మంది ఆక్వా రైతులు 5.72 లక్షల ఎకరాల్లో సాగు చేçస్తున్నారు. అత్యధికంగా ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనే 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.

కౌంట్‌ల పేరిట.. అడ్డగోలు దోపిడీ
ప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్‌ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్‌కు చేరాలంటే కిలోకు రూ.330–350 వరకు, గరిష్టంగా 30 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.450 చొప్పున ఖర్చ­వు­తుంది. కానీ ప్రస్తుతం 100 కౌంట్‌ రూ.230, 50 కౌంట్‌ రూ.325, 30 కౌంట్‌ రూ.425 చొప్పున కంపెనీలు ధరలు ప్రకటించాయి. 

ఈ ధర­ల్లోనూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్‌ కంపెనీలు, వ్యాపారులతో­పా­టు గ్రామ స్థాయిలో రొయ్యలు కొనుగోలు చేసే షె­డ్ల నిర్వాహకు­లు సిండికేట్‌గా మారి అడ్డగోలుగా కోత విధిస్తున్నారు. కిలోకు రూ.పది నుంచి రూ.30 వ­రకు కోత పెడుతున్నారు. 1–3 టన్నుల్లోపైతే 100 కౌంట్‌కు రూ.220, 50 కౌంట్‌కు రూ.310, 30 కౌంట్‌కు రూ.400 చెల్లిస్తున్నారు. అదే నాణ్యత కొంచెం తక్కువగా ఉంటే ధరలో ఇంకా భారీగా కోత పెడుతున్నారు. 

ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు 
ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదు. 100 కౌంట్‌కు కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంటే, కంపెనీలు రూ.230 ధరగా ప్రకటించాయి. అది కూడా 3 టన్నుల పైబడి అమ్మితేనే ఈ ధర. 3 టన్నులలోపు అయితే వ్యాపారులు అడ్డగోలుగా కోత కోస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందువల్లే సాగు సమ్మెకు దిగాల్సి వచి్చంది.  – మామిడిశెట్టి గిరిధర్‌ తూర్పుతాళ్లు, పశ్చిమగోదావరి జిల్లా

రూ.13 లక్షలు నష్టపోయాను 
ఎగుమతి దారులు, ప్రాసెసింగ్‌ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారు. ఈ సీజన్‌లో ఎకరాకు 1.50 లక్షల రొయ్య పిల్లలు వేశాను. ఆరెకరాలకు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టా. 70 కౌంట్‌ వచి్చంది. వ్యాపారులు ధర బాగా తగ్గించా­రు. కిలో రూ.280 చొప్పున ఇచ్చారు. రూ.­17లక్షల రాగా, రూ.13 లక్షలు నష్టపోయా. గతంలో ఎప్పుడూ ఇలా లేదు.  – ఈమన రామాంజనేయులు పోడూరు, పశ్చిమగోదావరి జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement