Shrimp farmers
-
ఇదేం ధ‘రొయ్యో’..!
రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో ఈ దుస్థితి తలెత్తింది. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.సాగు సమ్మె బాట పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పట్టుబడి పూర్తయిన 25 శాతం విస్తీర్ణంలో మెజార్టీ రైతులు పంట విరామం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన, కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి, అమరావతిపశ్చిమగోదావరిలో నిరసన గళం వారం రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందుపర్రు గ్రామాల రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఇదే జిల్లాలో నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంతోపాటు పోడూరు మండల రైతులు కూడా సాగు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఆక్వా సాగు ఇక చేయలేమని, క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులూ సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు రాష్ట్రంలో ఈ–ఫిష్ డేటా ప్రకారం 1.62 లక్షల మంది ఆక్వా రైతులు 5.72 లక్షల ఎకరాల్లో సాగు చేçస్తున్నారు. అత్యధికంగా ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనే 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.కౌంట్ల పేరిట.. అడ్డగోలు దోపిడీప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్‌కు చేరాలంటే కిలోకు రూ.330–350 వరకు, గరిష్టంగా 30 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.450 చొప్పున ఖర్చవుతుంది. కానీ ప్రస్తుతం 100 కౌంట్ రూ.230, 50 కౌంట్ రూ.325, 30 కౌంట్ రూ.425 చొప్పున కంపెనీలు ధరలు ప్రకటించాయి. ఈ ధరల్లోనూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులతోపాటు గ్రామ స్థాయిలో రొయ్యలు కొనుగోలు చేసే షెడ్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి అడ్డగోలుగా కోత విధిస్తున్నారు. కిలోకు రూ.పది నుంచి రూ.30 వరకు కోత పెడుతున్నారు. 1–3 టన్నుల్లోపైతే 100 కౌంట్‌కు రూ.220, 50 కౌంట్‌కు రూ.310, 30 కౌంట్‌కు రూ.400 చెల్లిస్తున్నారు. అదే నాణ్యత కొంచెం తక్కువగా ఉంటే ధరలో ఇంకా భారీగా కోత పెడుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదు. 100 కౌంట్‌కు కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంటే, కంపెనీలు రూ.230 ధరగా ప్రకటించాయి. అది కూడా 3 టన్నుల పైబడి అమ్మితేనే ఈ ధర. 3 టన్నులలోపు అయితే వ్యాపారులు అడ్డగోలుగా కోత కోస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందువల్లే సాగు సమ్మెకు దిగాల్సి వచి్చంది. – మామిడిశెట్టి గిరిధర్ తూర్పుతాళ్లు, పశ్చిమగోదావరి జిల్లారూ.13 లక్షలు నష్టపోయాను ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారు. ఈ సీజన్లో ఎకరాకు 1.50 లక్షల రొయ్య పిల్లలు వేశాను. ఆరెకరాలకు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టా. 70 కౌంట్ వచి్చంది. వ్యాపారులు ధర బాగా తగ్గించారు. కిలో రూ.280 చొప్పున ఇచ్చారు. రూ.17లక్షల రాగా, రూ.13 లక్షలు నష్టపోయా. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. – ఈమన రామాంజనేయులు పోడూరు, పశ్చిమగోదావరి జిల్లా -
రొయ్య సాగుపై ‘సమ్మె’ట
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు ‘సాగు సమ్మె’ వైపు తొలి అడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందపర్రు గ్రామాల రైతులు బుధవారం సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రకటించిన రొయ్యల కొనుగోలు ధరలు తమకు గిట్టుబాటు కావని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఆక్వా సాగు చేయలేమని.. అందుకే తామంతా క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామంటూ చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో మిగిలిన గ్రామాల రైతులు అడుగులు వేస్తున్నారు. చెరువుల్లో ఉన్న రొయ్యల పట్టుబడి పూర్తి కాగానే తాము కూడా సాగు సమ్మె చేపడతామని మిగిలిన గ్రామాల రైతులు కూడా చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం విధించిన ప్రతీకార సుంకాల సాకుతో రొయ్యల ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేయడంతో రొయ్యల రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రానికి లేఖ పేరిట హడావుడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. 100 కౌంట్ రొయ్యలను రూ.220కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. ఈ ధరలు తమకు గిట్టుబాటు కాదంటూ రైతులు ఒక్కొక్కరిగా సాగు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఏప్రిల్ నుంచే సమ్మెలోకి.. తొలుత జూలై నుంచి సాగు సమ్మె చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్ నుంచే అమలుకు శ్రీకారం చుడుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లిలో తాము క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ఇద్దరు రైతులు తమ చెరువుల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే గ్రామంలో 110 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా.. దాదాపు 100 ఎకరాల్లో క్రాప్ హాలిడే పాటిస్తున్నట్టు రైతులు ప్రకటించారు. సమీపంలోనే ఉన్న పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి పొరుగు జిల్లాల ఆక్వా రైతుల నుంచి మద్దతు పెరుగుతోంది. అందుకే సమ్మె చేస్తున్నాం నేను 50 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. ఈ రోజు పట్టుబడి పట్టిన 10 ఎకరాల్లో క్రాప్ హాలిడే బోర్డు పెట్టాను. రేపు మరో 10 ఎకరాలు పట్టుబడి పడుతున్నాను. దాంట్లో కూడా బోర్డు పెడతాను. ఎకరాకు లీజు రూ.80 వేలు అవుతోంది. అదనపు లోడ్, అదనపు వినియోగ సుంకం పేరిట ఏకంగా రూ.లక్ష అదనంగా విద్యుత్ బిల్లులు కట్టాను. ప్రస్తుత రేట్లు మాకు గిట్టుబాటు కావు. అందుకే క్రాప్ హాలిడేకు పాటిస్తున్నాం. – చిలుకూరి బాలాజీ, శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి 15 లక్షలు నష్టపోయాను 10 ఎకరాల్లో నాసిరకం సీడ్ వల్ల పంట నష్టపోయాను. మరో 15 ఎకరాల్లో వైరస్ వల్ల పంట దెబ్బతింది. మిగిలిన 10 ఎకరాల్లో 20 టన్నులు పట్టుబడి పడితే 30 కౌంట్‌కు రూ.400–420 మధ్య, 40 కౌంట్‌కు రూ.320–340 మధ్య ఇస్తున్నారు. ఈ సీజన్లో దాదాపు 15 లక్షలు నష్టపోయాను. ఈ రేట్లతో ఇక సాగు చేయలేం. అందుకే క్రాప్ హాలిడేకు వెళ్లాలని నిర్ణయించాం. – టీఎన్వీవీఎస్ ప్రసాద్, శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా -
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
గతంలో బస్తా ఫీడ్ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయిపోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్ ఆక్వా జోన్ ప్రాంతం. యూనిట్ రూ.4 చొప్పున కరెంట్ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్ ఆక్వా జోన్ పరిధిలో యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్ వన్ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా కోసం ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్ సంక్షోభ సమయంలో సీనియర్ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్లో ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్ పెంపు వాయిదా పడ్డా కౌంట్ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు -
కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/నరసరావుపేట: అధికారం చేపట్టిన కేవలం తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కార్ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి, ఆక్వా రైతులు రోడ్డెక్కారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాలలో రైతులు ఆందోళన బాట పట్టారు. రైతును రక్షించండి – దేశాన్ని కాపాడండి అనే నినాదంతో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం...ప్రభుత్వ తీరు విచారకరంవిజయవాడ లెనిన్ సెంటర్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద హాజరై ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మిర్చి క్వింటాకు రూ. 20వేల ధర నిర్ణయించి, ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. తెలుగు గంగా, పూలసుబ్బయ్య వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, కె. వి. వి. ప్రసాద్, తదితర రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించి రాష్ట్రంలో అన్ని పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. వరికెపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలికాగా, పల్నాడు జిల్లా రైతులకు మణిహారమైన వరికెపూడిశెల ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని పల్నాడు జిల్లా రైతు,ప్రజా సంఘాల సమన్వయ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది . రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలలో మిర్చి పంట సాగు చేసిన రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. రొయ్యల రైతుల రాస్తారోకోవీరవాసరం: రొయ్యల రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు రైతులు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని తూర్పు చెరువు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవాసరం–బ్రాహ్మణ చెరువు రహదారి నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. వీరవాసరం మండల రొయ్యల రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్ల రాంబాబు మాట్లాడుతూ రొయ్యల ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి రొయ్యల రైతులకు తీరని నష్టం కలుగజేస్తున్నారన్నారు. వారం రోజుల క్రితం కిలో 100 కౌంటు ధర రూ.250 నుంచి రూ.260 ఉండగా రెండు మూడు రోజుల నుంచి రూ.220 నుంచి రూ.230కు తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ ధరకు కొనాల్సిందే.. నష్ట పరిచే చర్యలు వద్దు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సీజన్లో పండించిన రొయ్యలను రైతుల వద్ద నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతుల సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ ఆక్వా రైతుల సదస్సుకు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు, ట్రేడర్లను కూడా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్ దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ రొయ్యల రైతులను నష్టపరిచే పనులు ఏ ఒక్కరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘సాధికార కమిటీలో 100 కౌంటు రొయ్యలకు కిలో రూ.240 నిర్ణయించాం. కానీ 100 కౌంటును రూ.225కు కొనుగోలు చేస్తున్నారు. ధర లేదంటే ప్రభుత్వం ఒక మెట్టు దిగి 100 కౌంటును రూ.210 తగ్గించి నిర్ణయం తీసుకుంది. అయినా ఆ ధరకు కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మీకు గిట్టుబాటు కాకపోతే చెప్పండి... 10 ఎకరాలు సాగుచేసే రైతును 5 ఎకరాలు సాగుచేయమంటారా’’ అని నిలదీశారు. అలా చెబితే రైతులు మానసికంగా నిర్ణయించుకుంటారని సలహా కూడా ఇచ్చారు. రైతు వద్ద ఒక కౌంటు రొయ్యలు ఉంటే లేని కౌంటు రొయ్యలను రైతులను అడుగుతున్నారని వారు చెబుతున్నారని..ఇదే విధంగా కొనసాగితే ప్రాసెసింగ్ ప్లాంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యుత్ సమస్యతో పాటు రొయ్యల రైతులకు ఉన్న అన్ని సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారని, 15 రోజుల్లో సీఎం రొయ్యల రైతులకు శుభవార్త చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్ దుగ్గినేని గోపీనా«థ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన వారిలో జిల్లా ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు మున్నంగి రాజశేఖర్, రైతులు టంగుటూరుకు చెందిన దివి హరిబాబు, కొత్తపట్నంకు చెందిన శ్రీనివాస రావు, నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర నాయుడు, గూడూరుకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి, నరేంద్ర, నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకురెడ్డితో పాటు జిల్లా మత్స్యశాఖ జేడీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మన దేశం నుంచి ఈ సంవత్సరం 8.50 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నాం. ఈక్విడార్ దేశంలో 8.85 లక్షల టన్నులు ఎగుమతి చేస్తోంది. వాళ్లకు ఇచ్చే ధర ఇక్కడ ఎందుకు ఇవ్వరు. పలు దేశాల్లో 100 కౌంటుకు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు సాధ్యం కావటం లేదో చెప్పండి. ప్రభుత్వం చొరవ తీసుకొని అందరినీ ఒకచోటకు చేర్చి సదస్సులు నిర్వహిస్తోంది. ఆక్వా రైతు అప్పుల పాలు కాకుండా చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మోహన రాజు, రొయ్య రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఈ సీజన్లో రైతులను ఆదుకోండి ఈ సీజన్లో సిద్ధంగా ఉన్న రొయ్యలను కొనుగోలు చేసి ఆదుకోండి. ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలబడింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాల వారీగా ఆక్వా రైతులతో పాటు రొయ్యలను కొనుగోలు చేస్తున్న సంస్థల యజమానులను కూడా సదస్సులకు పిలిపిస్తోంది. ఇది మంచి పరిణామం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా అందరితో కలిపి సంయుక్తంగా సదస్సులు నిర్వహించలేదు. – దుగ్గినేని గోపీనా«థ్, ప్రకాశం జిల్లా ఆక్వా రైతు సంఘం కన్వీనర్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రొయ్యలను కొనుగోలు చేస్తాం. నేను కూడా 1500 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. సాగులో నేను కూడా నష్టపోతున్నాను. అయితే ఈ సంక్షోభం తాత్కాలికమే. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆక్వా రంగంలో ఎదురవుతున్న సంక్షోభంపై చొరవ చూపుతోంది.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చొరవ చూపలేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా ఉండాలని నిర్ణయించి జిల్లాల వారీగా రైతులు, ఎక్స్‌పోర్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయటం మంచి పరిణామం. రైతులు కూడా ఖర్చులు తగ్గించుకోవాలి. – బీద మస్తాన్ రావు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఈ రెండు జిల్లాల్లో 50 టన్నులు కొంటాం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే రొయ్యలను తాము ఇక నుంచి 50 టన్నులు కొనుగోలు చేస్తాం. సింగరాయకొండ, నెల్లూరు జిల్లాల్లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఈ రెండు జిల్లాల నుంచే కొనుగోలు చేస్తాం. బయట జిల్లాల నుంచి ఇక్కడకు తెప్పించేది లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తాం... చేస్తున్నాం. రైతులు చిన్నసైజు రొయ్యల ఉత్పత్తినే లక్ష్యంగా పెట్టుకోవద్దు. మిగతా సంస్థల చేత కూడా కొనుగోలు చేయిస్తాం. – బ్రహ్మానందం, ఏపీ ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు, దేవీ సీఫుడ్స్ చైర్మన్ -
రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: రొయ్య రైతుకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్య ధరలు తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆక్వా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల వద్ద ఉన్న రొయ్యలు పూర్తి స్థాయిలో అమ్ముడయ్యే వరకు వారికి అండగా నిలవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో సీనియర్ మంత్రుల సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ రంగంలోకి దిగింది. కమిటీ సభ్యులైన మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు ప్రతి రోజు మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. రొయ్య ధరలను సమీక్షించి, ఆక్వా రైతులకు నష్టం కలగకుండా కమిటీ చర్యలు చేపడుతోంది. సమీపంలోని ప్రాసెస్ కంపెనీల ద్వారా రొయ్యలు కొనుగోలు చేయిస్తోంది. రవాణాకు అవసరమైన వాహనాలను సమకూరుస్తూ క్రయవిక్రయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి ధరలు తగ్గించే ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలకు సైతం కమిటీ సిద్ధమవుతోంది. అవసరమైతే కంపెనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని యోచిస్తోంది. త్వరలో మరోసారి రాష్ట్రస్థాయిలో ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. నిలకడగా కౌంట్ ధరలు రాష్ట్రంలో ప్రస్తుతం వంద కౌంట్ రొయ్యలు రూ.190కు, 30 కౌంట్ రొయ్యలను రూ. 370కి తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన కౌంట్ ధరలూ నిలకడగానే ఉన్నాయి. 100 కౌంట్ రొయ్యలను కనీసం రూ.240కు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో 100 కౌంట్ రూ.220కు తక్కువ కాకుండా కొనాలని కంపెనీలను ఆదేశించింది. అమెరికా, చైనా, ఈక్విడార్ దేశాల నుంచి ఆర్డర్లు ఊపందుకోగానే ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే కొంటామని కంపెనీలు చెబుతున్నాయి. వచ్చేవారంలో చైనా మార్కెట్ ఓపెన్ కానుండడంతో 100 కౌంట్ ధరలు రూ.240కు పైగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాలది దుష్ప్రచారం రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ విపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారం. రాష్ట్రంలో ఎక్కడా వంద కౌంట్ రూ.190కు తగ్గలేదు. ప్రతిరోజూ మార్కెట్‌ను సమీక్షిస్తూ కౌంట్ ధర రూ.240కి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలను ఆదేశించాం. అవసరమైతే కంపెనీలపై చర్యలకు సైతం ప్రభుత్వం వెనుకాడదు. ఆ అధికారాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధికారత కమిటీకి ఇచ్చారు. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్,అప్సడా ఆందోళన వద్దు రొయ్య రైతులు ఆందోళన చెందాల్సిన ప నిలేదు. వారం పదిరోజుల్లో చైనా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎగుమతులు పుంజుకుంటాయి. వందకౌంట్కు రూ. 240 కుపైగా ధర వస్తుంది. – ఐపీఆర్ మోహనరాజు, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు -
రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!
కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్‌స్పాట్, రెడ్గ్రిల్ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్‌కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. అదును చూసుకుని.. రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. – పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు ఇలాగే ఉంటే సాగు కష్టమే మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. – వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం -
AP: తగ్గిన రొయ్య మేత ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జోక్యంతో రొయ్య మేత తయారీదారులు దిగివచ్చారు. పెంచిన ధరలను తగ్గించారు. శనివారం నుంచి పాత ధరలతోనే రొయ్య మేత అందుబాటులో ఉంటుంది. ముడిసరుకు ధరలను సాకుగా చూపి ఇటీవల కిలోకి రూ.2.60 చొప్పున టన్నుకు రూ.2,600 మేర మేత ధరలు పెంచారు. ధరల పెంపుపై నియంత్రణ ఉండాలని, లేకుంటే సాగు చేయలేమంటూ రొయ్య రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రొయ్య రైతులు, మేత తయారీదారులతో మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సచివాలయంలో సమావేశమయ్యారు. చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు మేత ధరలపై సమీక్షించారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు కరెంట్ కోతల వల్ల జనరేటర్లపై ప్లాంట్లు నిర్వహించాల్సి వచి్చందని అందువల్లే మేత ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు చెప్పారు. ఇలా ప్రతి మూడు నెలలకు పెంచడం తమకు భారంగా మారుతోందని రొయ్య రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్సడా చట్టం ప్రకారం మేత ధరలు ఇష్టానుసారం పెంచడానికి వీల్లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలను ప్రభుత్వం ఎత్తివేసిందని మంత్రి చెప్పారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇందుకు తయారీదారులు అంగీకరించారు. టన్నుకు రూ.2,600 చొప్పున తగ్గించి శనివారం నుంచి పాత ధరలకే అమ్ముతామని చెప్పారు. ఇక నుంచి నాలుగు నెలలకోసారి సమీక్షించాలని, అప్పటి ముడిసరుకుల ధరలను పరిగణనలోకి తీసుకొని మేత ధర నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించారు. తయారీదారుల సూచన మేరకు రొయ్యల మేతలో ఉపయోగించే సోయా దిగుమతులను అనుమతించి, ఎగుమతులపై నిషేధం కొనసాగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మేత ఉత్పత్తిదారులు, ఆక్వా రైతులు ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించారు. రొయ్యల పెంపకంలో యాంటిబయాటిక్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మంత్రి చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ కో వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఆల్ ఇండియా చేపల మేత ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడుæ బీద మస్తాన్‌రావు, ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోహన్‌రాజు పాల్గొన్నారు. -
రొయ్యల ఎగుమతికి విమానం
సాక్షి, విశాఖపట్నం: పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఎగరనుంది. రోజంతా పడిగాపులు కాచి.. సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల వెతలు తీరనున్నాయి. రొయ్యలు, రొయ్య పిల్లల రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న డిమాండ్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల నేపథ్యంలో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. మెరైన్ కృషి ఉడాన్ పథకంలో భాగంగా నీలి విప్లవానికి ఊతమిచ్చేలా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీసు (బోయింగ్ 737–700) ప్రారంభం కానుంది. 18 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం చెన్నై నుంచి విశాఖ మీదుగా వారంలో 3 రోజులు (రోజు విడిచి రోజు) సూరత్‌కు, అదేవిధంగా మరో మూడు రోజులు కోల్‌కతాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే తొలి విమానం సూరత్ వెళ్లనుంది. 2.15 గంటల్లోనే విశాఖ నుంచి సూరత్‌కు... ఉత్తరాంధ్రలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో 6 నుంచి 7 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి (రైలు, రోడ్డు మార్గాల్లో) అవుతున్నాయి. ఇక్కడి రొయ్యలకు సూరత్, కోల్‌కతాల్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే రొయ్య పిల్లల్ని మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గుజరాత్, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. దీంతో మంచి లాభాల కోసం మన రైతులు సూరత్, కోల్‌కతాలకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రక్రియలో వారు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి నుంచి సూరత్‌కు తీసుకెళ్లాలంటే తొలుత ముంబయికి వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి రోడ్డు మార్గం ద్వారా గానీ విమానంలో గానీ తరలించేవారు. దీనికి 18 నుంచి 24 గంటలు సమయం పట్టేది. దీని వల్ల రొయ్యల పిల్లలకు సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడేవి. ఆహారానికి ఉపయోగించే రొయ్యలు పాడై పనికిరాకుండా పోయేవి. ఇప్పుడా ఇబ్బందులు తొలగిపోవడంతో ఆక్వా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సూరత్, కోల్‌కతాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసు రావడం రొయ్యల ఉత్పత్తికి, ఎగుమతికి ఊతం ఇస్తుందని అంటున్నారు. ఈ విమానం విశాఖ నుంచి సూరత్‌కు 2.15 గంటల్లో, కోల్‌కతాకు 1.25 గంటల్లో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఒక్కో విమానంలో రొయ్యలు, రొయ్య పిల్లలు కలిపి ఒకటిన్నర టన్నుల ఎగుమతికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆక్వా ఎగుమతులకు మంచి రోజులు కార్గో విమాన సర్వీసు ప్రారంభం కావడంతో రొయ్యల ఎగుమతులు పెరగనున్నాయి. ప్రయోగాత్మకంగా ఒక సర్వీసు రోజు విడిచి రోజు 135 రోజుల పాటు, మరో సర్వీసు 246 రోజుల పాటు నడపాలని నిర్ణయించారు. ఇక్కడ సరకు రవాణాకు డిమాండ్ ఉండటం వల్ల సర్వీసులు నిరంతరం కొనసాగే అవకాశాలున్నాయి. – రాజకిషోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ 30 శాతం నష్టపోయేవాళ్లం రొయ్య పిల్లల్ని సూరత్, కోల్‌కతాకు పంపించాలంటే యాతన పడేవాళ్లం. ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు చేసి రోడ్డు, రైలు మార్గాల్లో పంపించేవాళ్లం. అయినప్పటికీ ఆక్సిజన్ సరిపోక 30 శాతం పిల్లలు చనిపోయేవి. ఇప్పుడు కార్గో విమాన సేవలు రావడంతో నష్టపోము. – గరికిన కింగ్, రొయ్యల ఎగుమతిదారు, మంగమారిపేట, విశాఖపట్నం -
రొయ్యల రైతులకు వైఎస్ జగన్ వరాలు
సాక్షి, గణపవరం: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల రైతులు, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. 169వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల బాధను చూసి..: ‘‘పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టిన నాకు.. రైతులు, స్థానికులు తమ సమస్యలు చెప్పారు. చేపలు, రొయ్యలకు మంచి రేట్లుంటే మా బతుకులు బాగుంటాయని వారు తెలిపారు. పంట రేట్లు తగ్గిపోయి, దళారుల దోపిడీ పెరగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడంలేదని రైతులు బాధపడుతున్నారు. ఏలూరు కాలువ ఉన్నా.. రెండో పంటకు నీరు రావట్లేదని, ఎండాకాలంలో తాగునీరు కూడా లేదని, బోర్లు వేస్తే ఉప్పునీళ్లొస్తున్నాయని రైతులు వివరించారు. ఈ పరిస్థితుల్లో రొయ్యల పంటను బతికించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నా.. చెరువులు మార్చుతుంటే వైరస్ సోకి చనిపోతున్నాయన్నా.. అని చెబుతూ బాధపడ్డారు. పుట్టలకొద్దీ హ్యాచరీస్ పుట్టుకొస్తున్నా.. సీడ్ నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు మాత్రం లేవని, హ్యాచరీస్-ప్రైవేట్ ల్యాబ్‌లు కలిసి రైతుల్ని మోసం చేస్తున్నారని, దాణా కంపెనీలు కూడా ఇష్టారీతిగా ధరలు పెంచుతున్నాయని, వీటన్నింటికి తోడు కరెంటు కష్టాలూ ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. కరెంటు చార్జీలు తగ్గిస్తాం: దివంగతనేత వైఎస్సార్ హయాంలో చేపలు, రొయ్యల రైతులకు కరెంటు యూనిట్ 90 పైసలకే ఇచ్చారు. ఇప్పుడేమో 3.80 రూపాయలు గుంజుతున్నారు. అదిగాక, అడిషనల్ చార్జీల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నారు. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మాటిస్తున్నా. రైతులకు విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే ఇస్తాం. ఈ పంటలకు అనుబంధంగా నడిచే ఐస్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రస్తుతం 7 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాన్ని 5 రూపాయలకు తగ్గిస్తాం. రొయ్యలకూ మద్దతు ధర ఉండాలన్నది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెంచాలి. మనం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సముద్రతీరమంతటా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మిస్తాం. నాలుగో ఏట రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం. సీడ్ తయారీ, దాణా తయారీ.. అన్ని చోట్లా దళారీ వ్యవస్థను రూపుమాపుతాం. తాగునీరు, పేదలకు ఇళ్లు ఇక్కడి ప్రధాన సమస్యలని స్థానికులు చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని గ్రామాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నిర్మించుకుందాం. వాటిని గోదావరి, కృష్ణ జలాలతో నింపుకొందాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేనే తీసుకుంటా.. కొల్లేరుపై పకడ్బందీ వ్యూహం: కొల్లేరు సరస్సుకు సంబంధించిన సమస్యలను కూడా ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఈ సమస్యల గురించి కైకలూరు సభలో నేను సుదీర్ఘంగా ప్రసంగించాను. కొల్లేరు సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిఉంటుంది. అందుకే దీనిపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి, నా పక్కనే కూర్చొబెట్టుకుంటాను. అధికారంలోకి వచ్చినవెంటనే కొల్లేరు రీసర్వేకు ఆదేశిస్తానని హామీ ఇస్తున్నా. కాంటూరును తగ్గించి రైతులకు మేలు చేకూర్చుతానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన ఆయనకు కొల్లేరుగానీ, ప్రత్యేక హోదాగానీ గుర్తుకురాదు. తీరా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి, నెపం వేరేవాళ్లపై నెట్టడానికి బీజేపీతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లికూతురు కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు. అబ్బా! బాబుకు బాధకలిగిందట!!: మట్టి నుంచి గనుల దాకా, గుడి భూముల నుంచి గుడిలో దేవుడి ఆహరణాల దాకా అన్నింటినీ స్వాహా చేస్తోన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు, మోసాలతోనే పరిపాలన సాగిస్తున్నాడు. నిన్న విశాఖపట్నంలో ఆయన అబద్దాలు క్లైమాక్స్‌కు చేరాయి. అవి వింటే.. ఈయన ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడా అనిపిస్తుంది. బాబు చేసేదేమో ధర్మపోరాటమట, తిరుపతిలో అర్చకులు చేసేదేమో అధర్మపోరాటమట! పైన చంద్రబాబు.. కింద జన్మభూమి కమిటీ మాఫియాలు జనాన్ని పీడిస్తున్నారు. ఈ మనిషా.. ధర్మపోరాటం చేసింది? కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తుంటే బాధ అనిపించిందట! మరి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, అందులో నలుగురి మంత్రులుగా చేసి, డిస్క్వాలిఫై కాకుండా స్పీకర్ పదవిని దిగజార్చినప్పుడు? కనీసం వడ్డీలకు కూడా సరిపోని డబ్బుచెల్లించి.. అదేదో మొత్తం రైతుల రుణాల మాఫీ అయినట్లు చెప్పుకున్నాడు. ఉదయం ట్విటర్లోనేమో రూ.13 వేల కోట్లు అని, సాయంత్రం సభలో రూ.25వేల కోట్లని రెండు మాటలు చెబుతాడు. ఈ అబద్ధాలకోరు.. వైఎస్సార్ పేరును కూడా తీసుకొస్తాడు. వైఎస్సార్ 50 శాతం హామీలే పూర్తిచేశాడట, ఈయనేమో 100 శాతం చేశాడట! నాలుగేళ్లలో 2 లక్షల ఇళ్లు కట్టలేనోడు.. సంవత్సరంలో 19 లక్షల ఇళ్లు కట్టిస్తాడట! దివంగత నేత వైఎస్సార్ 13 జిల్లాల ఆంధ్రలో 26 లక్షల ఇళ్లు, 23 జిల్లాల ఆంధ్రలో 68 లక్షల ఇళ్లు కట్టించిన సంగతి ప్రజలకు తెలియదా.. చంద్రం విచిత్రాలు వినతరమా?: నోరు తెరిస్తే అబద్ధాలు, సొంత డబ్బా తప్ప పనికొచ్చే మాట ఒక్కటీ మాట్లాడడీ చంద్రబాబు. స్వాతంత్ర్యపోరాటం జరిగినప్పుడు నిక్కరు కూడా తొడగని చంద్రబాబు.. నేనే స్వాతంత్ర్యం తెచ్చానంటాడు. ఇంకా నయం.. అప్పుడుగిన ఆయన ఏ నాయకుడో అయి ఉంటే.. స్వాతంత్ర్యం మనకెందుకు.. బ్రిటిష్ వారితో లాలూచీ పడదాం అనేవాడు! ఈ మహానుభావుడు దోమలమీద దండయాత్ర చేశాడట. ఒక్క శాశ్వత భవనమూ కట్టలేదుగానీ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాడట. అంతేనా, కంప్యూటర్లు, సెల్ఫోన్లు కనిపెట్టానంటాడు. ప్రైవేట్ జెట్లలో విదేశాలకు పోయి.. ఏ దేశానికి పోతే ఆ దేశం నుంచి ఏదో వచ్చేస్తుందంటాడు. పాపం సత్యా నాదెండ్ల కష్టపడి చదివి పైకొచ్చి, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో అయితే.. నా వల్లే అని క్రెడిట్ లాగేసుకుంటాడు చంద్రబాబు. సింధు చమటోడ్చి షెటిల్ ఆడితే.. ఆమెకు ఆట నేర్పించిందే నేనని చెప్పుకుంటాడు. ఈ మధ్య ఇంకోటి.. ఎండలు తగ్గించాలట! 10 డిగ్రీల ఎండను తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాడు.. సూర్యుడితో ఫోన్లో మాట్లాడి తగ్గిస్తాడేమో!! పొరపాటున కూడా క్షమించొద్దు: రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి.. అంటూ హామీలిచ్చి, ఏ ఒక్కదానినీ అమలు చేయకుండా ప్రజల్ని మోసపుచ్చాడు చంద్రబాబు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా? ఈ మోసకారి బాబును పొరపాటున కూడా క్షమిస్తే, ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటా కొత్త ఎత్తులతో వస్తాడు. ఒక నాయకుడు మైక్ పట్టుకుని మాటిస్తే, దాన్ని నెరవేర్చలేని రోజు రాజీనామా చేసే పరిస్థితి రావాలి. అది జగన్ ఒక్కడితోనే సాధ్యంకాదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే మన ప్రభుత్వంలో ప్రజలకు చేయబోయే మేళ్లను నవరత్నాల ద్వారా వివరించాం. ఇవాళ పేద పిల్లల చదువుల కోసం మనం ఏమేం చేయబోతున్నామో మరోసారి వివరిస్తాను.. పిల్లల చదువులకు ఎంత ఖర్చైనా నాదే బాధ్యత: ప్రతి పేద ఇంట్లో ఒక డాక్టర్‌గానీ, ఇంజనీర్గానీ ఉండాలన్నది మహానేత వైఎస్సార్ కల. అలాగైతేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడగలవు. పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు వేస్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ. 15,000 అందిస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంతవరకు అయ్యే ఖర్చును, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
రొయ్యయ్యో.!
ఒంగోలు టౌన్:జిల్లాకు చెందిన రొయ్య రైతులు ధరాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం, రైతులంతా అమెరికావైపే మొగ్గు చూపడంతో ధరలు పడిపోయాయి. రోజురోజుకూ రొయ్య ధరలు దిగజారిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మున్ముందు ధరలు ఏవిధంగా ఉంటాయో తెలియక కలవరపడుతున్నారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో దాదాపు 8 వేల హెక్టార్లలో రొయ్యల చెరువులు ఉన్నాయి. 3500 మందికిపైగా రైతులు రొయ్యల చెరువులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో 100 కౌంట్ రూ.220, 90 కౌంట్ రూ.230, 80 కౌంట్ రూ.240, 60 కౌంట్ రూ.280, 50 కౌంట్ రూ.260, 40 కౌంట్ రూ.300 ధర పలుకుతోంది. కీలకమైన 40 కౌంట్ మినహా మిగిలిన ధరలు కొంతమేర అటూ ఇటుగా ఉంటూ వస్తున్నాయి. రూ.400 ఉన్న 40 కౌంట్ ధర ఒక్కసారిగా రూ.300కు పడిపోయింది. 40 కౌంట్ ధర రూ.100 తగ్గడంతో ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరికొన్ని రోజులు ఇదే మాదిరిగా ధర పడిపోతే రొయ్య రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. యూరోపియన్ నుంచి యూ టర్న్:భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు వెళ్తుంటాయి. యూరప్‌లోని పది దేశాల్లో ఇక్కడి రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. అయితే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీబయోటిక్స్‌ను వాడటంతో యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ప్రతి రెండు కంటైనర్ల ఎగుమతుల్లో ఒకదానికి శాంపిల్స్ తీస్తున్నారు. నిషేధిత యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసుకునే లైసెన్స్‌ను సంబంధిత రైతులు కోల్పోతున్నారు. తిరిగి లైసెన్స్ పొందాలంటే ఆ రైతుకు చుక్కలు కనిపిస్తాయి. అయితే అమెరికాకు ఎగుమతి చేసే రొయ్య ఉత్పత్తుల్లో శాంపిల్స్ తక్కువగా చేస్తుండటంతో భారతదేశానికి చెందిన రైతులు ఎక్కువగా ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాకు పది కంటైనర్లు ఎగుమతికి పెడితే వాటిలో కేవలం రెండు కంటైనర్ల శాంపిల్స్ చూస్తున్నారు. మిగిలిన ఎనిమిది కంటైనర్లను యధాలాపంగా ఎగుమతి చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూడా అమెరికాకు ఎగుమతులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో రెండు క్రాప్ల్లో రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. మొదటి క్రాప్‌లో 24 వేల టన్నులు, రెండవ క్రాప్‌లో 12 వేల టన్నుల రొయ్య దిగుబడులు వస్తున్నాయి. అంటే ఏడాదికి రెండు క్రాప్‌ల కింద 36 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 90 శాతం రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. స్టోరేజీ సౌకర్యం లేక ధరలనుతెగ్గోసుకుంటున్నారు:జిల్లా నుంచి ఏటా 36 వేల మెట్రిక్ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ధరలు ఆశాజనకంగా లేని సమయంలో వాటిని నిల్వ చేసుకునేందుకు స్టోరేజీలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. «ఎకరాకు రూ.80 వేలపైగా ఖర్చు చేస్తున్న రైతులు చివరికి వాటికి వచ్చే ధరలను చూసే నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాలను బట్టి «కౌలు ధర నిర్ణయించారు. రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు కౌలు ధర ఉంది. అంటే ఆ రైతు కౌలు ధరè చెల్లించి, పెట్టుబడి ఖర్చులు తీసివేయగా ఏమైనా మిగిలితే మిగిలినట్లు..లేకుంటే నష్టాలను మూటగట్టుకోవలసిందే. ఒక్కో చెరువులో లక్ష రొయ్య పిల్లలను వదిలితే ప్రస్తుత వాతావరణంలో 60 వేల పిల్లలు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఒకవైపు దిగుబడి పడిపోయి, ఇంకోవైపు ధరలు పతనం కావడంతో రొయ్య రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది. జిల్లాకు సంబంధించిన ఆర్ధికాభివృద్ధి రేటులో రొయ్య ఎగుమతుల పాత్ర ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రొయ్య రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వాటిని నిల్వ చేసుకునేలా ప్రభుత్వం స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే కొంతమేర వారు గట్టెక్కే అవకాశం ఉంటుంది. లేకుంటే రొయ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి చిక్కుకొని చివరకు కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. -
చినుకు విలువ డాలర్!
► రొయ్యల రైతులు ఎదురు చూపులు ► సకాలంలో వర్షాలు పడితేనే దిగుబడికి అనుకూలం ► రొయ్య పిల్లలు స్టాక్ చేసిన రైతులు డాలర్ పంటగా పిలుచుకొనే రొయ్యల రైతులు ఇప్పుడు గాబరా పడుతున్నారు. సాగుకు ఎంతో కీలకమైన వర్షం ఉంటే రైతులు ఆనందంగా నాట్యం చేస్తాయి. చెరువుల్లో ఉప్పు శాతం తగ్గి పంటలో ఎదుగుదల ఉంటుంది. అంటే చినుకు పడితే ఇంట్లో డాలర్లు వచ్చినట్లేనని రైతులు ఆనంద పడతారు. వర్షానికి చెరువులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి చల్లబడుతుంది. ఎలాంటి రోగాలు కూడా రావు. పిల్లలు కూడా ఆహారం ఎక్కువగా తీసుకొని బలంగా పెరుగుతాయి. కానీ కొత్తపట్నం మండలంలోని రొయ్యల చెరువుల్లో ఇప్పటికీ వర్షపు నీరు నిలవలేదు. దీంతో రైతుల్లో నిస్తేజం అలముకుంది. కొత్తపట్నం: ఈ ఏడాది సీజన్లో వర్షం ముఖం చాటేసింది. వర్షం పడితే నేచురల్ ఫీడ్ అయిన ప్లైటోప్లాంటీన, జూప్లాంటీనాలు చెరువుల్లో ఉత్పత్తి అవుతాయి. దీంతో రొయ్యలు ఈ సహజమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని ఉత్పత్తి చేసే మేత తక్కువ తీసుంటాయి. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది. వరుణుడి కోసం ప్రార్థనలు మండలంలో 2200 ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. కాగా 1700 ఎకరాల్లో రైతులు రొయ్య పిల్లలు వదిలి వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తే 500 ఎకరాల్లో నీరు నింపాలని ఎదురు చూస్తున్నారు. ఆయా ప్రాంత నీటి తీరునుబట్టి సంవత్సరానికి రెండు సార్లు పిల్లలు వదిలి సాగుబడి చేస్తారు. ప్రధానంగా సముద్రపు నీరు, బోరు నీరు, వర్షం నీరు ఉంటే రొయ్యల సాగు లాభదాయంగా ఉంటుందని రైతులంటున్నారు. ఎకరాకు 2 లక్షల పిల్లలు జూన్ నుంచి అక్టోబర్ వరకు.. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరా చెరువుకు 1,50 లక్షల నుంచి 2 లక్షల వరకు రొయ్య పిల్లలు వదులుతారు. ఒక్కొక్క రొయ్య పిల్లను హేచరీల్లో 30 నుంచి 33 పైసలకు విక్రయిస్తారు. 4 నెలల 15 రోజుల వరకు పిల్లల్ని పెంచుతారు. ఒక్కో పిల్ల 20 నుంచి 30 గ్రాముల దాకా పెరుగుతుంది. 30 గ్రాములు పెరిగితే మాత్రం రైతుకు లాభం చేకూరుతుంది. అయితే వైరస్లు, డీఓ, చెరువులో పిల్లలు లేకపోవడం, ఇతర వ్యాధులు సోకడం వంటివి సంభవిస్తే భారీ నష్టం తప్పదు. బీడు భూముల్లో కోట్ల సిరులు వ్యవసాయ పంటలకు పనికరాని చౌడు భూముల్లో డాలర్ల పంట పండటం అదృష్టమే. సుమారు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రొయ్యలు ఉత్పత్తి చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా సాగుబడి పెరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోంది. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు కొన్ని వసతులు లేకపోవంతో నష్ట పోయారు. ఇలాంటి రైతులను ఆదుకోవాలని, సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలని అంతా కోరుకుంటున్నారు. వర్షం పడితే పంట బాగా వస్తుంది నేను నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నా. చెరువులకు నీరు నింపి వారం రోజులైంది. జూన్‌లో పిల్లలు వేయాల్సింది. రెండు నెలలు ఆలస్యం అయింది. నెలకు ఒక్కో పదును వర్షం పడితే పంట చేతికొచ్చి లాభం వస్తుంది. – పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల భారీగా నష్టపోతా... పది ఎకరాల్లో నీరు నింపా. వారం రోజుల్లో రొయ్య పిల్లలు స్టాక్ చేస్తా. వర్షం పడుతుందని నమ్మకంతో పిల్లలు ఒదులుతున్నాను. వర్షం పడకపోతే భారీగా నష్టపోతాను. పోయిన సారి కూడా వర్షం పడక భారీగా నష్టపోయా. – మూగ వెంకటేశ్వర్లు, కొత్తపట్నం -
‘రొయ్యో’ మొర్రో
* వైరస్.. ఫంగస్ దాడులు * ఏటా ఇదే దుస్థితి * దిక్కుతోచని రైతులు * అందుబాటులో లేని ల్యాబ్‌లు ఆకివీడు : రొయ్య రైతులు కుయ్యోమొర్రోమంటున్నారు. ఒక పక్క వైరస్, మరోపక్క ఫంగస్ వ్యాధులు విజృంభించడంతో కలవరపడుతున్నారు. ఆక్సిజన్‌తోపాటు, చెరువులోని నీటిలోపాల వల్ల ఈ వ్యాధులు సోకుతున్నాయి. వనామి రొయ్యకు వచ్చే ఈ వ్యాధులను నిర్మూలించడం రైతులు, శాస్త్రవేత్తల తరం కావడంలేదు. వాతావరణంలో వచ్చిన మార్పులతోనే ఇవి సోకుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రతిఏటా ఇదే దుస్థితి తలెత్తుతోందని, ఒక్కసారిగా విజృంభిస్తున్న వ్యాధులు రూ.వేల కోట్ల రూపాయలను దిగమింగేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. రొయ్య డొప్పపై బూడిద రంగు, ఆకుపచ్చని జిగురు వంటి పొర ఏర్పడడాన్ని పాకుడు వ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం అక్కడక్కడ కనిపిస్తోంది. దేహంపై నల్లని తుప్పు రంగు ఏర్పడడాన్ని బ్రౌన్ స్పాట్ వ్యాధి అని, మోప్పలు నలుపు రంగులోకి మారడాన్ని బ్లాక్గిల్ అని, ఎరుపు రంగులోకి మారడాన్ని రెడ్ గిల్ అని, రొయ్య మీసాలు, తోక కుళ్లడాన్ని రాట్ వ్యాధి అని, బాక్టీరియా పట్టడాన్ని విబ్రోయోసిస్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా అక్కడక్కడ చెరువుల్లో కనబడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని నియంత్రణకు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైంది వైరస్ రొయ్యలకు సోకే వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైంది వైరస్. ఇది సోకిన రొయ్యలు నిర్విరామంగా గట్టు వెంబడి తిరుగుతాయి. దేహంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నీలిరంగులోకి మారిన రొయ్యలకు పూర్తిగా వైరస్ సోకినట్టు నిర్ధారిస్తారు. ఇవి జీర్ణగ్రంధి పాడై గుట్టలుగుట్టలుగా చనిపోతాయి. ఈ వైరస్ సోకిన రొయ్యలను వెంటనే గుర్తించకపోతే రైతుకు పెట్టుబడులు కూడా దక్కవు. చెరువుల్లో ఒక్క రొయ్య కూడా కన్పించదు. ఈ వ్యాధి నివారణ కూడా కష్టమే. ఫంగస్ వ్యాధి(ఈహెచ్‌పీ) రొయ్య ఫంగస్ వ్యాధికి గురైతే ఎదుగు దల ఉండదు. ఈహెచ్‌పీ ఫంగస్ జీర్ణ గ్రంధికి వస్తోంది. చెరువుల్లో పెరిగిన రొయ్యలకు ఎంత మేత వేసినా ఎదుగుదల లేకపోవడంతో రైతు ఆర్థికంగా నష్టపోతాడు. ఈ వ్యాధి పిల్ల దశలోనే రొయ్యకు సోకుతోంది. ఆ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ వ్యాధిని ప్రభుత్వం గత ఏడాది గుర్తించింది. అందుబాటులో లేని ల్యాబ్‌లు రొయ్యలు వ్యాధులకు గురైతే నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కనీసం ల్యాబ్ సౌకర్యాన్ని కూడా కల్పించడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు సాగుతోంది. రైతులే శాస్త్రవేత్తలుగా ఆయా వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు అక్కడక్కడా ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. పన్ను వసూళ్లకు యత్నాలు అసలే వ్యాధులు, ప్రతికూలవాతావరణంతో సతమతమవుతున్న రైతులకు సహాయసహకారాలు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా యత్నాలు సాగించడం లేదు. పెపైచ్చు ఆక్వా రంగంపై పన్ను విధించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆక్వా జోన్లను ఏర్పాటు చేసి చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి భారీగా అనుమతులు మంజూరు చేసేందుకు యత్నిస్తోంది. తదనంతర చర్యగా రొయ్య, చేపల అమ్మకంపై పన్ను, ఎక్సైజ్ సుంకం, ఇతరత్రా సవా లక్ష పనులు విధించే యోచనలో ఉంది. ఇంతవరకూ ఆహారోత్పత్తుల కేటగిరిలో చేపలు, రొయ్యల సాగు, అమ్మకాలు, ఎగుమతులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో పన్ను విధింపునకు సిద్ధపడుతున్న ప్రభుత్వం ఆక్వా రైతుల బాగోగులనూ పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో గుర్తించాలి ప్రస్తుతం 50శాతం చెరువుల్లో ఫంగస్, 30 శాతం చెరువుల్లో వైరస్ వ్యాధులు కనిపిస్తున్నాయి. సీడ్ దశలో ఈ వ్యాధులు సోకితే నష్టం తీవ్రంగా ఉంటుంది. రొయ్యలు ఎదిగిన తర్వాత వస్తే ప్రభావం తక్కువగా ఉంటుంది. సీడ్ దశలో సకాలంలో గుర్తిస్తేనే నివారణ సాధ్యం. - ఎ.రవికుమార్ శాస్త్రవేత్త -
రూ.10 నోట్ల ఎర..రూ.20 లక్షలకు టోకరా
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : వేటగాడు.. కాసిని నూకలు చల్లి, పక్షులను పన్నిన వలలోకి రప్పించినట్టు- మోసగాళ్లు.. చిల్లరనో, నోట్లనో ఎరగా వేసి, దృష్టి మళ్లించి.. లక్షలు కాజేసే ఉదంతాలు కోకొల్లలు. అయినా- జగమెరిగిన ఈ టోకరా తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటుంది. తాజాగా గురువారం కాకినాడలో పునరావృతమైన ఈ దగాపర్వం ఖరీదు ఏకంగా రూ.20 లక్షలు! తాళ్లరేవులోని రాజువర్మ ఎంటర్ప్రైజెస్ అకౌంటెంట్ బులుసు వెంకట రామశర్మ.. రోడ్డుపై పడిఉన్న రూ.10 నోట్లను ఏరుకునే ఆదుర్దాలో అంత పెద్ద మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొయ్య రైతులకు సీడ్, కెమికల్స్ సరఫరా చేసే రాజు వర్మ ఎంటర్‌ప్రైజెస్‌లో శర్మ 12 ఏళ్ల నుంచి అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. సంస్థ పేరిట వచ్చిన చెక్కులను కాకినాడ బాలాజీచెరువు సమీపంలోని యూనియన్ బ్యాంకులో జమ చేసి సొమ్ము తీసుకు వెళుతుంటాడు. గురువారం రూ.20 లక్షల చెక్కును నగదుగా మార్చి, ఆ మొత్తాన్ని బ్యాగ్‌లో ఉంచి బ్యాంకు బయటకు వచ్చాడు. బ్యాగ్‌ను మోటార్ బైక్ ఆయిల్ ట్యాంక్‌పై ఉంచి స్టార్ట్ చేయబోతుండగా ఓ ఆగంతకుడు వచ్చి, కింద పడి ఉన్న రూ.10 నోట్లను శర్మకు చూపించాడు. శర్మ బైక్ దిగకుండానే వంగి నోట్లు ఏరుకుని, జేబులో పెట్టుకోబోయేసరికి ట్యాంక్ మీద ఉండాల్సిన బ్యాగ్ కనిపించలేదు. ఆ ఆగంతకుడూ పత్తా లేడు. చేష్టలుడిగిన శర్మ తేరుకుని చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. వారంతా సమీపంలో గాలించినా ఫలితం లేకపోయింది. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి, వన్‌టౌన్ క్రైం ఎస్సై పి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శర్మ నుంచి వివరాలు సేకరించారు. యూనియన్ బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరాల క్లిప్పింగ్‌లను పరిశీలించారు. ఆగంతకుడు రూ.పది నోట్లు కింద పడేయడమే కాక శర్మ వీపుపై కిళ్లీ ఉమ్మినట్టు కనిపించింది. దీన్నిబట్టి శర్మ పది నోట్లు తీసుకునేలోపు బ్యాగ్ చోరీ సాధ్యం కాకపోతే కిళ్లీ ఉమ్మి తుడుస్తున్నట్టు నటిస్తూ బ్యాగ్ కాజేయాలన్నది ఆగంతకుడి పన్నాగమై ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాలను బట్టి స్థానిక నిందితుడే నేరానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు సవాలు కాగా నిత్యం రద్దీగా ఉండే బాలాజీ చెరువు సెంటర్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు క్రైం పోలీసులు గస్తీ నిర్వహిస్తుంటారు. అలాంటి చోట పట్టపగలు ఇంత మొత్తం చోరీ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ సంఘటన బ్యాంకు సిబ్బందిని కూడా కలవరపరిచింది. శర్మ ఫిర్యాదుతో వన్‌టౌన్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.