సాక్షి, విజయవాడ బ్యూరో: బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆంధ్రా, తెలంగాణలోని 30 వేల మంది ఉద్యోగులు మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు వెయ్యికి పైగా కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్‌తో పాటు ఎన్‌ఎఫ్‌పీఈ, ఎస్‌ఎన్‌ఈఏ, టీఎన్‌పీవో, బీటీఈ యూనియన్లన్నీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి సమ్మెను విజయవంతం చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగులందరం ఏకమై కేంద్రంపై ఐక్యపోరాటం జరుపుతామని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సంపత్ రావు, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు.