ప్రభుత్వ విధానాలపై ‘సమ్మె’ట
-
పట్టణాల్లో కార్మిక సంఘాల ర్యాలీలు
-
పాల్గొన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు
-
మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు
-
తెరుచుకోని బ్యాంకులు, నడవని ఆటోలు
-
జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతం
సాక్షి, రాజమహేంద్రవరం:
కార్మికుల, ఉద్యోగుల హక్కులను కాలరాసేలా చట్టాలు సవరించాలని చూస్తున్న ప్రభుత్వాల తీరును నిరసిస్తూ, తమ హక్కులను కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ, వైఎస్‌ఆర్‌టీయూ, ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్ వర్కర్‌్సయూనియన్, ఆర్టీసీ ఎంప్లాÄæూస్ యూనియన్, ఆర్టీసీ ఎంప్లాÄæూస్ ఫెడరేషన్, పీడీఎస్‌యూ, బీఎస్‌ఎన్‌ఎల్, రెవెన్యూ అసోసియేషన్, ఏపీఎన్‌జీవోలు, అంగన్‌వాడీలు, హమాలీలు, మెడికల్ రిప్రజంటేటివ్స్, ఎల్‌ఐసీ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు కాకినాడ, రాజమహేద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించాయి.
కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్న సర్కార్లు
జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. అక్కడ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం నేతృత్వంలో బహిరంగ సభ జరిగింది. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఏవీ నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ఐఎఫ్‌టీయూ నేత జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు. సభకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు హాజరై సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. కార్మిక సంఘాలు సంఘటితంగా ఉంటే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు.
చట్టాలు అమలు కాకుండా కుట్రలు
అమలాపురంలో వివిధ కార్మిక సంఘాలు, దింపు, వలుపు కార్మికులు, ది సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్, కోనసీమ జేఏసీలు కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వíß ంచాయి. పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు ర్యాలీలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాలు శ్యామలా సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు ర్యాలీ నిర్వహించాయి. అక్కడ జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడుతూ ఇప్పటికే 90 శాతం మంది కార్మికులకు ఉన్న చట్టాలు అమలు కావడంలేదని, మిగిలిన 10 శాతం సంఘటిత రంగ కార్మికులకు కూడా ఈ చట్టాలు అమలు కాకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. నగరంలో కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు మూతపడ్డాయి. ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజన్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ధవళేశ్వరం, కడియంలలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఏజñ న్సీలో సీఐటీయూ, ఏఐటీయూసీ చేపట్టిన బంద్‌కు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు రంపచోడవరంలో జరిగిన సమ్మెలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో బంద్, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముమ్మిడివరం, కొత్తపేట, అంబాజీపేటల్లో కార్మిక సంఘాలు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాయి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురం ప్రధాన రహదారిలో ర్యాలీ జరిగింది. కె.గంగవరంలో భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పిఠాపురం, రాజానగరంలో ఉపాధ్యాయ సంఘాలు, కార్వీ కార్మికులు, అంగన్‌వాడీలు సమ్మెలో పాల్గొన్నారు.