కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు కదం తొక్కాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు కదం తొక్కాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు చేపట్టాయి. కార్పొరేట్ల అనుకూల వైఖరి మార్చుకోకుంటే దేశవ్యాప్త సమ్మెకు దిగుతామన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు నిర్ణయాలను తప్పుబడుతూ వేలాది మంది ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో ధర్నాలు చేశారు.