labour unions
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు హ్యాండిచ్చిన సీఎండీ అరుణ్ భక్షీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కార్మిక సంఘాలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అరుణ్ భక్షీ హ్యాండిచ్చారు. ఈరోజు కార్మిక సంఘాలను సమావేశానికి రావాలని పిలిచి ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్లిపోయారు.కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం అరుణ్ భక్షీ.. కార్మిక సంఘాలకు భారీ షాకిచ్చారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్మిక సంఘాల నేతలను సమావేశాలని రావాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ, ఇంతలోనే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక, సీఎండీ పిలుపుతో కార్మిక సంఘాలు సమావేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా జరగడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్ ప్లాంట్ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
నీళ్లు తాగాలంటే భయం
షాపింగ్ మాల్స్ రంగురంగుల లైట్ల వెలుగు లో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ మాల్స్‌లో ఉద్యోగం చేసే సేల్స్‌గాళ్స్ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగకూడదు. ఇది ఆ ఉద్యోగ నియమం. దేహం ఎంత బాధిస్తున్నా సరే, నవ్వు మాయం కాకూడదు. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. కొనుగోలుదారుల సేవ కోసం ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే కూర్చోకూడదు... ఇది ఎక్కడా రాయరు, కానీ ఇది కూడా ఒక నియమం. ఇంకా ఘోరం ఏమిటంటే... బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్తున్నారనేది కూడా లెక్కలోకి వస్తుంటుంది. ఉదయం ఏడు గంటలకు ఇల్లు వదిలిన వాళ్లు రాత్రి ఎనిమిది వరకు షాపులోనే ఉండాలి. తిరిగి ఇల్లు చేరేటప్పటికి తొమ్మిదవుతుంది. దాదాపుగా సేల్స్గాళ్స్గా పని చేసే యువతులందరూ నీళ్లు తాగడం తగ్గిచేశారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి తరచూ వెళ్లాల్సి ఉన్న ఓ మహిళ ఉద్యోగం పోతుందనే భయంతో ట్యూబ్ అమర్చుకుని ఉద్యోగం చేసింది. ఇది కేరళ రాష్ట్రం, కోళికోద్ జిల్లాలో చోటుచేసుకున్న దయనీయ స్థితి. ఈ దుస్థితికి మంగళం పాడిందో మహిళ. పేరు విజి పెన్‌కూట్టు. చైతన్యవంతమైన కేరళ రాష్ట్రంలో కూడా ఉద్యమిస్తే తప్ప శ్రామిక చట్టాలు అమలు కాలేదంటే ఆశ్చర్యమే. అయినా ఇది నిజం. యాభై రెండేళ్ల సామాజిక కార్యకర్త విజి పెన్‌కూట్టు మహిళల కోసం పోరాడింది. న్యాయం కోసం గళం విప్పింది. బాధిత మహిళలతోపాటు సానుభూతిపరులైన మహిళలు కూడా ఆమెతో కలిసి నడిచారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిదేళ్ల పోరాటం. ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (అమెండ్మెంట్) యాక్ట్, 2018 చట్టాన్ని అమలులోకి తెచ్చింది. విజి పోరాటంతో అక్కడి ఉద్యోగినులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని ప్రదేశంలో కనీస సౌకర్యాల ఏర్పాటు సాధ్యమైంది. మన సమాజం ఆధునిక సమాజంగా మారింది. కానీ మెరుగైన సమాజంగా మారలేదింకా. అందుకే చట్టం కోసం కొన్ని పోరాటాలు, వాటి అమలు కోసం మరికొన్ని పోరాటాలు... తప్పడం లేదు. విజి పెన్‌కూట్టు వంటి సామాజిక కార్యకర్తలు తమ గళాలను వినిపించకా తప్పడం లేదు. -
బొగ్గుగనులు ప్రైవేటుపరం
గోదావరిఖని(రామగుండం) : బొగ్గుగనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ బొగ్గు ధర నిర్ణయిస్తూ విక్రయించుకునే అధికారం కూడా సంస్థలకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ చర్యపూర్తిగా సింగరేణి, కోల్ఇండియా లాంటి ప్రభుత్వ రంగసంస్థల మూసివేతకు దారి తీస్తుందని ఆయా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరిఖనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయగా, ఈనెల 23న సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు ఏఐటీయూసీ ప్రకటించింది. 1938 నిజాం పాలనలో సింగరేణి బొగ్గుగనులను పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్పుచేశారు. 1973 వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనున్న బొగ్గుగనులను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారు. అప్పటి ఎనిమిది సబ్సిడరీ సంస్థల పరిధిలోని బొగ్గుగనులు కోల్ఇండియా లిమిడెట్ పరిధిలోకి తీసుకువస్తూ పార్లమెంట్లో చట్టం చేశారు. ఇలా సింగరేణి, కోల్ఇండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీలుగా వర్ధిల్లుతున్నాయి. ఆయా సంస్థల్లో కొన్ని గనులను క్యాప్టివ్ మైన్‌గా గుర్తించి వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించి బొగ్గును వెలికితీసేలా చూశారు. కానీ బొగ్గును విక్రయించే అధికారం మాత్రం పబ్లిక్ సెక్టార్ కంపెనీలకే ఇచ్చారు. ఇలా సాగుతున్న క్రమంలో బొగ్గుగనులను క్యాప్టివ్ మైన్స్‌గా గుర్తిస్తూ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం.. బొగ్గును విక్రయించే అధికారం కూడా ఆయా ప్రైవేటు సంస్థలకే అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పార్లమెంట్లో చట్టంగా రావడమే తరువాయి. ఉద్యమానికి సిద్ధంగా కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. కోల్ఇండియా పరిధిలో జాతీయ కార్మిక సంఘాలు ఉద్యమానికి సిద్దమవుతున్నాయి. సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ నెల 23న సింగరేణి వ్యాప్తంగా అన్నిగనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తెలిపారు. సింగరేణిలో ఐక్యంగా ఉద్యమం చేసేందుకు గురువారం అన్నికార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్మికలోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, డి.కొమురయ్య, వెంకటేశ్‌బాబు, సీహెచ్. ఓదెలు, ఉల్లి మొగిలి, జి.గోపాల్, రాములు, గౌస్, పానుగంటి కృష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచుదాం
అనంతపురం రూరల్ : కార్పొరేట్ సంస్థల మాయలోపడి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాల్సిన అవసరం ఆసన్నమైందని కార్మిక సంఘాలకు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపు నిచ్చారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రం ఆర్థికలోటులో ఉందంటూనే రూ. కోట్ల ప్రజాధనాన్ని పర్యటనల పేరుతో వృథాగా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులను సమీక్షల పేరిట మానసిక ఇబ్బందులకు గురి చేయడం తప్ప.. వాటితో ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు శకుంతలమ్మ, రాజారెడ్డి, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, నాయకులు మల్లికార్జున, నరసింహులు, రామక్రిష్ణ, అల్లీపీరా, పద్మావతి, శ్రీరాములు, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్, మధు, మనోహర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. -
త్వరలో వేతన చట్టం సవరణ: కేంద్ర మంత్రి
హైదరాబాద్: సంస్థలు, వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల వేతనాలను చెక్కులు లేదా ఆన్లైన్లో చెల్లించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం త్వరలో వేతన చట్టానికి సవరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల వేతనాలను నగదు రూపంలో చెల్లిస్తున్నారని, అయితే ఇందులో ఉద్యోగి మోసానికి గురవుతున్నాడని వివరించారు. లెక్కల్లో చూపే వేతనానికి, చెల్లించే అసలు మొత్తానికి తేడా ఉంటోందని, దీనిపై కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. మనీ ట్రాన్సాక్షన్లలో పారదర్శకత సాధించటంతోపాటు మోసానికి తావులేకుండా కొత్త విధానం తేనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విధానం అమలులోకి వస్తే ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు బ్యాంకు అకౌంట్ల ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఈ సవరణతోపాటు మెటెర్నిటీ బెనిఫిట్, ఉద్యోగుల పరిహార చట్టాలను కూడా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చేయనున్నట్లు వెల్లడించారు. -
ప్రభుత్వ విధానాలపై ‘సమ్మె’ట
పట్టణాల్లో కార్మిక సంఘాల ర్యాలీలు పాల్గొన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోని బ్యాంకులు, నడవని ఆటోలు జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతం సాక్షి, రాజమహేంద్రవరం: కార్మికుల, ఉద్యోగుల హక్కులను కాలరాసేలా చట్టాలు సవరించాలని చూస్తున్న ప్రభుత్వాల తీరును నిరసిస్తూ, తమ హక్కులను కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, వైఎస్‌ఆర్‌టీయూ, ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్ వర్కర్్సయూనియన్, ఆర్టీసీ ఎంప్లాÄæూస్ యూనియన్, ఆర్టీసీ ఎంప్లాÄæూస్ ఫెడరేషన్, పీడీఎస్‌యూ, బీఎస్ఎన్ఎల్, రెవెన్యూ అసోసియేషన్, ఏపీఎన్జీవోలు, అంగన్వాడీలు, హమాలీలు, మెడికల్ రిప్రజంటేటివ్స్, ఎల్ఐసీ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు కాకినాడ, రాజమహేద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించాయి. కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్న సర్కార్లు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. అక్కడ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం నేతృత్వంలో బహిరంగ సభ జరిగింది. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఏవీ నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ఐఎఫ్టీయూ నేత జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు. సభకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు హాజరై సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. కార్మిక సంఘాలు సంఘటితంగా ఉంటే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు. చట్టాలు అమలు కాకుండా కుట్రలు అమలాపురంలో వివిధ కార్మిక సంఘాలు, దింపు, వలుపు కార్మికులు, ది సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్, కోనసీమ జేఏసీలు కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వíß ంచాయి. పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు ర్యాలీలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాలు శ్యామలా సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు ర్యాలీ నిర్వహించాయి. అక్కడ జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడుతూ ఇప్పటికే 90 శాతం మంది కార్మికులకు ఉన్న చట్టాలు అమలు కావడంలేదని, మిగిలిన 10 శాతం సంఘటిత రంగ కార్మికులకు కూడా ఈ చట్టాలు అమలు కాకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. నగరంలో కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు మూతపడ్డాయి. ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజన్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ధవళేశ్వరం, కడియంలలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఏజñ న్సీలో సీఐటీయూ, ఏఐటీయూసీ చేపట్టిన బంద్‌కు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు రంపచోడవరంలో జరిగిన సమ్మెలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో బంద్, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముమ్మిడివరం, కొత్తపేట, అంబాజీపేటల్లో కార్మిక సంఘాలు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాయి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురం ప్రధాన రహదారిలో ర్యాలీ జరిగింది. కె.గంగవరంలో భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పిఠాపురం, రాజానగరంలో ఉపాధ్యాయ సంఘాలు, కార్వీ కార్మికులు, అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికలోకం
-
సమ్మెతో ప్రభుత్వాలకు గుణపాఠం
బైక్ ర్యాలీలో కేంద్ర కార్మికసంఘాల పిలుపు కాకినాడ సిటీ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న 2వ తేదీ దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సాయంత్రం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ తదితర కేంద్ర కార్మిక సంఘాలు జేఎన్టీయూ నుంచి బైక్‌ర్యాలీ చేపట్టి సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరాయి. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె జరుగుతోందన్నారు. జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా జేఏసీ మాజీ చైర్మన్ ఆచంటరామారాయుడు, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సీహెచ్.అజయ్‌కుమార్, తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ ప్రచారం వివిధ పరిశ్రమల గేట్ల ముందు కార్మికుల కూడలిలో ఏఐటీయుసీ సమ్మె విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యదర్శి జుత్తుక కుమార్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి నక్క కిషోర్ పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 2 సమ్మెతో కేంద్రం దిగిరావాలి
ఉద్యోగ, కార్మిక, అనుబంధ సంఘాల పిలుపు ముకరంపుర : అఖిలభారత కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో కేంద్రం దిగిరావాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్యవేదిక సన్నాహాక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్కేవీ బొల్లంపల్లి ఐలయ్య, సీఐటీయూ జనగాం రాజమల్లు, ఏఐటీయూసీ పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల గొంతు నొక్కితే పుట్టగతులుండవని హెచ్చరించారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదానికి కార్మికవర్గం కదిలిరావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ కార్యదర్వి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నెలకు రూ.18 వేల జీతాలు లేకుంటే కార్మికులు బతకలేరని నిర్ధరించిన బీజేపీ ప్రభుత్వం.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పురోగతి సాధించడంలో కీలకపాత్ర పోషించే కార్మికులు అర్దాకలితో అలమటిస్తుంటే కేంద్రం పెట్టుబడుల పేరుతో ధనికవర్గాలకు కొమ్ము కాస్తోందని ఏఐటీయూసీ నేత యేసురత్నం అన్నారు. నాయకులు తిరుపతి, దావు రాజమల్లు, జి.శంకర్, కె.మధునయ్య, ఎన్.లక్ష్మి, రవి, టేకుమల్ల సమ్మయ్య తదితరులున్నారు. -
‘గుర్తింపు’ ఎన్నికలు మరింత ఆలస్యం
2017 జనవరిలో నిర్వహించే అవకాశం ? గోదావరిఖని : సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరింత ఆలస్యంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2012 జూన్ 28వ తేదీన ఐదో దఫా ఎన్నికలు జరగగా.. అదే ఏడాది ఆగస్టు 6వ తేదీన గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకెఎస్)కు అధికారికంగా యాజమాన్యం, ఆర్ఎల్సీ హోదా పత్రాన్ని అందజేసింది. నాలుగేళ్ల కాలపరిమితితో సంఘం కార్యకలాపాలను సాగించగా... ఈ నెల 6వ తేదీతో కాలపరిమితి పూర్తయింది. అయితే రీజినల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వíß ంచాల్సి ఉండగా... ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు ముందుకు సాగకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో సింగరేణిలో గుర్తింపు సంఘం నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయిందనే సమాచారాన్ని సింగరేణి యాజమాన్యం ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్మిక శాఖ డెప్యూటీ ఛీప్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి, హైదరాబాద్‌లో ఉన్న రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి లేఖలు పంపించింది. ఆ తర్వాత తాము ఎన్నికలకు సిద్ధమంటూ మరో లేఖను ఈ శాఖల కార్యాలయాలకు పంపించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎన్నికలకు సిద్ధమనే లేఖ పంపలేదు. ఇదిలా ఉండగా గుర్తింపు సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఆగస్టు 6వ తేదీతో పూర్తి కావడంతో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారులకు లేఖలు రాశాయి. అదే సమయంలో యాజమాన్యంపై కూడా ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచేందుకు.. సింగరేణిలో మళ్లీ గుర్తింపు సంఘంగా గెలవాలనే లక్ష్యంతో టీబీజీకేఎస్ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో పొందుపర్చడం, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిన తర్వాతనే గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. అందువల్ల ప్రభుత్వం నుంచి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సిద్ధమంటూ కేంద్ర కార్మిక శాఖ, ఆర్ఎల్సీకి లేఖలు రాసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ జరగడానికి డిసెంబర్ వరకు సమయం తీసుకునే అవకాశాలున్నాయి. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత 2017 జనవరి నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ఇటు యాజమాన్యం, ఆటు ఆర్ఎల్సీ సిద్ధంగా ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తమ్మీద నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపనున్న సింగరేణిలో మళ్లీ గులాబీ జెండా ఎగిరేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ యూనియన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
కార్పొరేట్లకు కొమ్ముకాస్తే సమ్మె చేస్తాం: కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు కదం తొక్కాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు చేపట్టాయి. కార్పొరేట్ల అనుకూల వైఖరి మార్చుకోకుంటే దేశవ్యాప్త సమ్మెకు దిగుతామన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు నిర్ణయాలను తప్పుబడుతూ వేలాది మంది ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో ధర్నాలు చేశారు.