కార్మిక వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచుదాం
అనంతపురం రూరల్ : కార్పొరేట్ సంస్థల మాయలోపడి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాల్సిన అవసరం ఆసన్నమైందని కార్మిక సంఘాలకు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపు నిచ్చారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాష్ట్రం ఆర్థికలోటులో ఉందంటూనే రూ. కోట్ల ప్రజాధనాన్ని పర్యటనల పేరుతో వృథాగా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులను సమీక్షల పేరిట మానసిక ఇబ్బందులకు గురి చేయడం తప్ప.. వాటితో ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు శకుంతలమ్మ, రాజారెడ్డి, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, నాయకులు మల్లికార్జున, నరసింహులు, రామక్రిష్ణ, అల్లీపీరా, పద్మావతి, శ్రీరాములు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు జాన్సన్, మధు, మనోహర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.