పార్లమెంటు సమయంలో సమ్మె చేస్తాం | Bank, insurance firm unions threaten nationwide stir over govt policies | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమయంలో సమ్మె చేస్తాం

Published Sun, Jul 15 2018 4:06 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Bank, insurance firm unions threaten nationwide stir over govt policies - Sakshi

చెన్నై: బ్యాంకింగ్, బీమా రంగాల్లో అనుసరిస్తున్న విధానాలను కేంద్రం సమీక్షించకుంటే డిసెంబర్‌లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమ్మెకు దిగుతామని బ్యాంకులు, బీమా సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు ది కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ బ్యాంక్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌ యూనియన్స్‌(సీసీబీఐఎఫ్‌యూ) చైర్మన్‌ సీహెచ్‌ వెంకటాచలం ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బీమా, బ్యాంకింగ్‌ రంగాల్లో ప్రస్తుతం పాటిస్తున్న విధానాలను సమీక్షించకుంటే ఈ ఏడాది డిసెంబర్‌లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమ్మెకు దిగుతాం. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద రూ.115 లక్షల కోట్ల నగదు ఉంది. ఇదంతా సామాన్యులది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులు కేవలం నిరర్ధక ఆస్తుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వం బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే.. ఈ మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుంది’ అని వెంకటాచలం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement