Insurance companies
-
శబరిమల యాత్రికులకు బీమా.. కంపెనీల ఆసక్తి
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్ పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు.శబరిమల కొండపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె ఆగిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటి ప్రమాదం కాని కారణాల వల్ల సంభవించినవేనని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లోనే దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని ప్రశాంత్ చెప్పారు.గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు.గరిష్ట ప్రయోజనాలుశబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు రూ.10 వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్‌తో బ్యాండ్ బాజా బారాత్, షాన్‌దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్‌తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
Ayodhya: 22న బ్యాంక్యులు పనిచేసేది సగం రోజే!
ముంబై: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) జనవరి 22న సగం రోజు మాత్రమే పనిచేస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత వ్యవహారాలు, శిక్షణా శాఖ కూడా ఒక కీలక ఉత్వర్వులు జారీచేస్తూ, జనవరి 22న కేంద్ర ప్రభుత్వ స్థాపనను సగం రోజు పనిదినాన్ని ప్రకటించింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న మనీ మార్కెట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు (ప్రాధమిక– ద్వితీయ), విదేశీ మారకద్రవ్యం, ద్రవ్య మార్కెట్లు, రూపీ ఇంట్రస్ట్ డెరివేటివ్‌లలో ఎటువంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఇక రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే, డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కూడా 22వ తేదీ ఉండదని ఆర్బీఐ మరో సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ సౌలభ్యం తిరిగి జనవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. ‘‘భారత ప్రభుత్వం ప్రకటించిన సగం రోజు పని దినం కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనూ 2024 జనవరి 22, సోమవారం రూ. 2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు’’ అని సెంట్రల్ బ్యాంక్ ప్రకటన తెలిపింది. -
ఈసారి బీమా సంస్థలకు అదనపు మూలధనం లేనట్లే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలకు కేంద్రం నుంచి అదనపు మూలధనం లభించకపోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ అవసరాలకు తగినన్ని నిధులు ఆయా సంస్థల దగ్గర ఉండవచ్చని, ఈసారి ఒక కంపెనీ నుంచి కేంద్రానికి డివిడెండ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. మూడు పీఎస్‌యూ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం గతేడాది రూ. 5,000 కోట్ల మేర మూలధనం సమకూర్చింది. అయితే, 2023–24 బడ్జెట్లో మాత్రం బీమా కంపెనీలకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు తాము చెల్లించాల్సి వచ్చే క్లెయిమ్ మొత్తాలకన్నా కొంత ఎక్కువగా మూలధన నిల్వలను ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన పరిస్థితులేమైనా తలెత్తితే అన్ని క్లెయిమ్‌లను చెల్లించగలిగేందుకు (సాల్వెన్సీ మార్జిన్) ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం దేశీయంగా నాలుగు పీఎస్‌యూ బీమా సంస్థలు ఉండగా.. వాటిలో న్యూ ఇండియా అష్యూరెన్స్ మాత్రమే మెరుగ్గా రాణిస్తోంది. 2024 మార్చి నాటికి మూడు పీఎస్‌యూ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు రూ. 17,200–17,500 కోట్ల మేర నిధులు అవసరమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2020–21లో మూడు పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం రూ. 9,950 కోట్లు కేటాయించింది. -
బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!
సాక్షి, ముంబై: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డు వినియోగింకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందనీ, జీవిత బీమా సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. (కర్మను నమ్ముతారా? లేదా?ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర) ఇన్సూరెన్స్ పాలసీలను తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించే సౌకర్యాన్ని నిలిపేయాలని ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. పాలసీ లోన్ అంటే జీవిత బీమా సంస్థలు పాలసీదారుని పాలసీ సరెండర్ విలువ ఆధారంగా స్వల్పకాలిక లోన్స్ ఇవ్వడం. పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను తనఖాపెట్టి రుణాలు తీసుకోవడం. ఎండోమెంట్, మనీ-బ్యాక్ లేదా ఫుల్-లైఫ్ పాలసీ లాంటి జీవిత బీమా పాలసీల ద్వారా లోన్ ఫెసిలిటీ అందిస్తోంది. అయితే, టర్మ్,యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్స్) ఈ సదుపాయం లేదు. కోటక్ లైఫ్ ప్రకారం ప్రతీ జీవిత బీమా పాలసీపై రుణాన్ని పొందలేరు. ఈనేపథ్యంలో ప్లాన్‌ను కొనుగోలుకు ముందే బీమా కంపెనీని సంప్రదించాలి. అలాగే యూలిప్లపై కూడా రుణం తీసుకోవచ్చు. ఇది ఆయా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? సాధారణంగా బీమా పాలసీ సరెండర్ విలువలో 90శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీపై రుణాలపై వడ్డీ తక్కువ. కస్టమర్లు పాలసీ లోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లించ వచ్చు. అయితే వడ్డీ, లోన్ కలిపి పాలసీ సరెండ్ వ్యాల్యూని మించితే పాలసీ రద్దవుతుంది. కాగా గత ఏడాది ఆగస్టులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ( పీఎఫ్ఆర్డీఏ) కూడా దాదాపు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-2 అకౌంట్ సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు, నగదు జమ చేసేందుకు క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? బ్లాక్ లిస్ట్ హాస్పిటల్స్ గురించి తెలుసా?
హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఒకవైపు జీవనశైలి వ్యాధులతో అస్పత్రుల్లో చేరాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మధ్యతరగతి వాసులకు ఆరోగ్యపరమైన సామాజిక రక్షణ ఏదీ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా ముందు నాటితో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని ఎక్కువ మంది నేడు అర్థం చేసుకుంటున్నారు. దీంతో దీన్ని కొనుగోలు చేసే వారి సంఖ్యలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. అయితే ఎవరో చెప్పారనో, ఏదైనా ప్రకటన చూసో హెల్త్ ప్లాన్ తీసుకోవడం కాదు. ఎంపిక చేసుకునే ప్లాన్‌లో రక్షణ ఏ మేరకు? ఏ ఏ వ్యాధులకు కవరేజీ ఉంది? ఉప పరిమితులు ఉన్నాయా? పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చా? ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు కవరేజీ లభిస్తుందా? ఇలాంటి ముఖ్యమైన అన్నింటి గురించి పాలసీదారులు తెలుసుకుని ఉండాల్సిందే. లేదంటే క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చికిత్సకు అయిన బిల్లు మొత్తంలో కోతపడుతుంది. పాలసీదారుడు తనవంతు చెల్లించాల్సి వచ్చినప్పుడు విచారిస్తే వచ్చేదేమీ ఉండదు. ఇటువంటి కీలక అంశాలను వివరించే కథనమిది... మన దేశంలో ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్‌ను పన్ను ఆదా కోణంలో తీసుకుంటూ ఉంటారు. పాలసీదారులకు సాధారణంగా కొన్ని ఫీచర్లపై అవగాహన ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మేటర్నిటీ ప్రయోజనాలు ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ ఉంటుందనే విషయాలపై సాధారణంగా అవగాహన ఉంటుంది. కానీ, ఎక్కువ మందికి తెలియని విషయం బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ గురించి. మీరు కొనుగోలు చేయబోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కువ ఆస్పత్రుల్లో చికిత్సలకు కవరేజీ ఇచ్చే విధంగా ఉండాలి. ఇంటి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినా కవరేజీ వస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇంటి సమీపంలోని హాస్పిటల్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటే, అందులో నగదు రహిత చికిత్స కాదు కదా, ముందే డబ్బులు చెల్లించి తీసుకున్న చికిత్సకు సైతం రీయింబర్స్మెంట్ రాదు. ఎందుకంటే సదరు ఆస్పత్రిని బీమా సంస్థ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వల్లేనని తెలుసుకోవాలి. అందుకనే హెల్త్ పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ముందుగా బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితా చూడాలి. అలాగే, మీరు నివాసం ఉండే ప్రాంతంలో నగదు రహిత చికిత్సలను అనుమతి ఉన్న ఎన్ని ఆస్పత్రులు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ జాబితాలో ఉన్నదీ చూడాలి. కొన్ని చిన్న ఆస్పత్రులు లేదా వ్యక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తుంటారు. అందుకని అన్ని బీమా సంస్థల పరిధిలో సొంతంగా ఓ ఇన్వెస్టిగేషన్ డెస్క్ ఉంటుంది. ఏదైనా ఒక ఆస్పత్రి నుంచి క్లెయిమ్‌లు భారీగా వస్తుంటే అప్పుడు సదరు ఆస్పత్రిపై ఓ కన్నేసి ఉంచాలని బీమా సంస్థ తన ఇన్వెస్టిగేషన్ డెస్క్‌ను కోరుతుంది. అప్పు డు సంబంధిత విభాగం క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్న లేదా అనుమానాస్పద క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్న ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తుంది. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బీమా సంస్థ తదుప రి చర్యలు తీసుకుంటుంది. క్లెయిమ్‌ల విషయంలో చట్టవిరుద్ధమైన చర్యలు లేదా నిబంధనలకు వ్యతిరేకంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే ఆయా ఆస్పత్రిని నిషేధిత జాబితాలోకి మారుస్తుంది. ఇలా బీమా సంస్థలు తాము నిషేధించిన, బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన హాస్పిటల్స్ వివరాలను పాలసీదారులతో ఎప్పటికప్పుడు పంచుకుంటాయి. వెయిటింగ్ పీరియడ్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే ఏ సమస్య వచ్చినా క్లెయిమ్ చేసుకుంటామంటే నిబంధనలు అంగీకరించవు. కొన్ని రకాల వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉంటుంది. ఈ వివరాలు పాలసీ డాక్యుమెంట్లో వివరంగా ఉంటాయి. ఉదాహరణకు మెటర్నిటీ (ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరడం) కవరేజీ అనేది చాలా పాలసీల్లో ఉన్నా, మొదటి రోజు నుంచే కవరేజీ వస్తుందనుకోవద్దు. ఇందుకోసం కనీసం 12 నెలలు అంతకుమించి వేచి ఉండే కాలం నిబంధన ఉంటుంది. ఆ తర్వాతే మెటర్నిటీ కవరేజీ క్లెయిమ్ చేసుకోగలరు. మరికొన్ని రకాల వ్యాధులకు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. పాలసీ తీసుకునే నాటికే వ్యాధులు కలిగి ఉంటే, వాటిని పాలసీ ప్రపోజల్లో వెల్లడించి ఉంటే, కవరేజీ పొందేందుకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలకు అన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. ఇది యాడాన్ కవరేజీగా వస్తుంది. హాస్పిటల్లో కనీసం 24 గంటల పాటు చేరి చికిత్స తీసుకుంటేనే ఇండెమ్నిటీ ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. డే కేర్ చికిత్సల కోసం అయితే ఆస్పత్రిలో ఇన్ని గంటల పాటు చేరాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకునే వాటికి కనీసం 24 గంటల నిబంధన అమలవుతుంది. కనుక పాలసీదారులు మొదట బ్లాక్ లిస్ట్ హాస్పిటళ్లు, తర్వాత ఏ వ్యాధికి కవరేజీ కోసం ఎంత కాలం పాటు వేచి ఉండాలి, క్లెయిమ్ కోసం ఎంత సమయం పాటు ఆస్పత్రిలో చేరాలనే విషయాలను తెలుసుకోవాలి. ఫీచర్లపై అవగాహన అవసరం: బీమా సంస్థ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో సాధారణ నిబంధనలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఒక్కో బీమా సంస్థ తమ ఉత్పత్తిని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని అదనపు ఫీచర్లు, కవరేజీలను పాలసీల్లో భాగం చేస్తుంటాయి. ఉదాహరణకు రీస్టోరేషన్ ఫీచర్. దీన్ని చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా మొత్తం ఖర్చయిపోయిందని అనుకోండి. అప్పుడు అదే ఏడాది మరో వ్యక్తి లేదా అదే వ్యక్తి మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తే? అలాంటి సందర్భాల్లో ఆదుకునేదే రిస్టోరేషన్ ఫీచర్. ఏదైనా క్లెయిమ్ కారణంగా బీమా కవరేజీ ఖర్చయిన సందర్భాల్లో బీమా సంస్థలు తిరిగి అంతే మొత్తాన్ని రీసోర్టేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే ఏడాది మరోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అది ఆదుకుంటుంది. కొన్ని బీమా సంస్థలు అయితే ఒక ఏడాదిలో ఎన్నిసార్లు ఇలా క్లెయిమ్‌లు వచ్చినా, అన్ని సార్లు రీస్టోరేషన్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరి పూర్తి బీమా కవరేజీని క్లెయిమ్ పొందాడనుకుందాం. అప్పుడు అదే వ్యక్తి అదే వ్యాధితో హాస్పిటల్లో చేరితే రీస్టోరేషన్ కవరేజీని చాలా ప్లాన్లు ఇవ్వడం లేదు. కొన్ని మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా లేక మరో సమస్యతో చేరాల్సి వచ్చినా రీస్టోరేషన్ కింద కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కనుక ఈ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. తప్పక తెలిసి ఉండాలి: ముందు నుంచి ఉన్న వ్యాధులు: అధిక రక్తపోటు, కేన్సర్, మధుమేహం, ఆస్తమా, డిప్రెషన్, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ), స్థూలకాయం, లూపస్, అధెరోస్కెలరోసిస్, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు. పాలసీ కొనుగోలు చేసే నాటికి నాలుగేళ్ల ముందు వైద్యులు నిర్ధారించి, చికిత్స తీసుకున్నవి ముందస్తు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ముందస్తు వ్యాధుల సమాచారం కావాలని వెల్లడించకపోతే.. తర్వాత క్లెయిమ్ సమయంలో బీమా సంస్థ దీన్ని గుర్తిస్తే పరిహారాన్ని నిరాకరిస్తుంది. పాలసీ తీసుకుని ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత క్లెయిమ్ వస్తే అది ముందుగా వెల్లడించని వ్యాధి అయినా సరే తిరస్కరించడం కుదరదు. కనుక పాలసీ దరఖాస్తులో అంతకుముందుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా, చికిత్స తీసుకున్నా ఆ వివరాలను తప్పకుండా వెల్లడించడం మంచిది. 30 రోజుల వెయిటింగ్: పాలసీ విడుదల చేసిన తేదీ నుంచి మొదటి 30 రోజుల్లో ప్రమాదం లేదా ప్రమాదం కారణంగా తలెత్తే సమస్యలకే క్లెయిమ్ చేసుకోవచ్చు మరే విధమైన చికిత్సకూ క్లెయిమ్‌ను బీమా సంస్థలు అనుమతించవు. స్పెసిఫిక్ వెయిటింగ్: ముందు నుంచి ఉన్న వ్యాధులు కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత 24 నెలల వరకు క్లెయిమ్ చేసుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిజం, జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపిక్ మోకాలు సర్జరీ, చెవి, ముక్కు, గొంతు సమస్యలు లేదా సర్జరీలు (సైనసైటిస్, అడెనాయిడ్స్), ప్రొస్టేటిక్ హైపర్ట్రోఫీ, క్యాటరాక్ట్, ఫిస్టులా, హెమరాయిడ్స్, గ్యాస్టిక్ డుయోడినల్ అల్సర్లు, అన్ని రకాల హెర్నియా, హిస్టరెక్టమీ, ఫైబ్రోమయోమా, ట్యూమర్లు, కిడ్నీలో రాళ్లు, యూరెటెరిక్ స్టోన్స్, గ్లాల్ బ్లాడర్‌లో రాళ్లు, వారికోస్ వెయిన్స్, పార్కిసన్స్/అల్జీమర్స్/డిమెన్షియా తదితర వాటితో బీమా కంపెనీ డాక్యుమెంట్లో 24 నెలల వెయిటింగ్ జాబితా ఉంటుంది. వీటికి రెండేళ్ల తర్వాతే క్లెయిమ్ వస్తుంది. శాశ్వత మినహాయింపులు: హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, దేనికైనా పరిహారం వస్తుందిలేనని అనుకోవద్దు. కొన్నింటికి శాశ్వతంగా క్లెయిమ్ రాదు. వీటి జాబితా బీమా నియమ, నిబంధనల డాక్యుమెంట్లో ఉంటుంది. ఏదైనా వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. వైద్యుల సిఫారసు లేకుండా బరువు తగ్గేందుకు సొంతంగా తీసుకునే చికిత్సలు, లింగమార్పిడి చికిత్సలు, కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీలకు (ప్రమాదం కారణంగా చేసుకోవాల్సిన వాటికి మినహాయింపు) క్లెయిమ్ రాదు. మెటర్నిటీ వెయిటింగ్: సాధారణంగా మెటర్నిటీ కవరేజీ కోసం బీమా సంస్థలు ఏడాది నుంచి మూడేళ్ల పాటు వేచి చూడాలనే నిబంధన అమలు చేస్తున్నాయి. వెయిటింగ్‌ను తగ్గించుకోవచ్చా..? వేచి ఉండే కాలాన్ని తగ్గించుకునేందుకు చాలా బీమా సంస్థలు ప్రత్యేక రైడర్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ముందస్తు వ్యాధులకు కవరేజీని 2 ఏళ్లకు తగ్గిస్తున్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచే ముందస్తు వ్యాధులకూ కవరేజీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో దాదాపుగా వెయిటింగ్ పీరియడ్ ఉండడం లేదు. వేచి ఉండే కాలంలో కొత్తగా నిర్ధారణయ్యే వ్యాధులను ముందు నుంచి ఉన్నవిగా పరిగణించరు. సమీప బంధువులకు షేర్ చేయాలి: ఆస్పత్రిలో చేరిన వెంటనే బీమా సదుపాయం ఉందా? అని అక్కడ సిబ్బంది ప్రశ్నించడం వినే ఉంటారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెబితే, అందులో చికిత్స వ్యయాలకు ఎంత మేర కవరేజీ వస్తుంది? రాదనే విషయాలను వారు చెబుతారు. ముందుగా నిర్ణయించుకుని తీసుకునే చికిత్సల విషయంలో కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే డిశ్చార్జ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే సాధారణంగా పాలసీదారులు చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఆస్పత్రిలో చేరగా, వారి సంబంధీకులు బీమా తదితర వ్యవహారాలు చూస్తుంటారు. వారికి కవరేజీ విషయమై అవగాహన ఉండదు. అందుకని పాలసీదారులు తమ బీమా క్లెయిమ్‌కు సంబంధించి తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు కొన్ని ఫీచర్లు, ముఖ్యమైన అంశాల గురించి తప్పకుండా చెప్పాలి. అందులో ముఖ్యమైనది రూమ్‌రెంట్ కవరేజీ. రూమ్ రెంట్‌కు ఎలాంటి పరిమితులు లేనట్టయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ షేర్డ్ రూమ్, సింగిల్ రూమ్ అని నిబంధన ఉంటే మిమ్మల్ని ఆస్పత్రిలో ఆయా వసతుల్లోనే చేర్చాలని సూచించాలి. పాలసీలో చెప్పినదానికంటే ఖరీదైన వసతి తీసుకుంటే బిల్లు ఎక్కువ వస్తుంది. దాంతో ఆ మేరకు బీమా సంస్థ క్లెయిమ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మిగిలినది పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ముందు నుంచి వ్యాధులు ఉండి, వాటిని పాలసీ దరఖాస్తులో వెల్లడించి ఉంటే వాటి గురించి వివరంగా చెప్పాలి. లేదంటే లిఖితపూర్వకంగా ఈ విషయాలను ఒక పేపర్‌పై రాసి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. హాస్పిటల్ క్యాష్ ఫీచర్ ఉంటే అది కూడా తప్పకుండా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ అనేది.. చికిత్స కోసం ఆసుపత్రిలో పాలసీదారు చేరినప్పుడు, వారికి సహాయంగా ఉండే వారికి రోజువారీ చెల్లింపులు చేస్తుంది. ఇది రోజువారీ రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది. రీస్టోరేషన్ గురించి కూడా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది కొన్ని ప్లాన్లలో ఇన్‌బిల్ట్‌గా ఉంటే, కొన్నింటిలో యాడాన్ కవర్‌గా వస్తోంది. -
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు..
సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలను రూపొందించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కోరింది. ఒక సంస్థ ప్రతిష్ట దాని ఉద్యోగుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, సంస్థ ప్రతిష్టను పెంచేలా, విలువను జోడించే విధంగా ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించాలని పేర్కొంది. ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త! ఐఆర్డీఏఐ సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాల్లో సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. దాని ప్రకారం.. ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించి ధ్రువీకరించని, గోప్యమైన సమాచారాన్ని ఉద్యోగులు తమ బ్లాగ్లు, చాట్ ఫోరమ్‌లు, డిస్కషన్ ఫోరమ్‌లు, మెసెంజర్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయకూడదు. ఏ ఉద్యోగికైనా సంస్థకు సంబంధించిన సమాచారం మెయిల్, మీడియా ఫోరమ్‌లలో లేదా ఇతర మార్గాల ద్వారా వస్తే దాన్ని ఏదైనా మీడియా ఫోరమ్‌లో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు సంస్థ సమ్మతి కచ్చితంగా తీసుకోవాలి. సంస్థ సేవా లోపాన్ని నివేదించడానికి లేదా ఫిర్యాదు చేయడానికి మీడియా ఫోరమ్‌లను ఉపయోగించకూడదు. ఏదైనా సమాచారం వ్యక్తిగతంగా పోస్ట్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా తన వ్యక్తిగతమైనదని, సంస్థకు ఎలాంటి సంబంధం లేదనే సూచనను తప్పకుండా ఉంచాలి. వ్యక్తిగత వెబ్సైట్లు లేదా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సంస్థ లేదా దాని వ్యాపారంపై ఎలాంటి విమర్శలు లేదా వ్యాఖ్యానాలు చేయకూడదు. విదేశీ రీ-ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లు (FRB)తో సహా ఐఆర్డీఏఐ పరిధిలోని అన్ని బీమా సంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. బీమా సంస్థల కోసం 2017లో ఈ ఇన్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలను ఐఆర్డీఏఐ జారీ చేసింది. తర్వాత 2022లో తమ పరిధిలోని అన్ని సంస్థలకూ విస్తరించింది. విస్తృతంగా పెరిగిన డిజిటల్ సాంకేతికత, సైబర్ భద్రతా సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటూ సైబర్ దాడుల నుంచి బీమా పరిశ్రమ రక్షణ, సంబంధిత పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఐఆర్డీఏఐ మార్గదర్శకాలను సవరించింది. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. -
పరిశీలనలో మరో 20 బీమా కంపెనీల దరఖాస్తులు
ముంబై: ఇటీవలే కొన్ని బీమా సంస్థలకు లైసెన్సులు ఇచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ మరో 20 దరఖాస్తులను పరిశీలిస్తోంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా ఈ విషయాలు చెప్పారు. కొన్నాళ్ల క్రితం జీవిత బీమా విభాగంలో క్రెడిట్ యాక్సెస్ లైఫ్, ఎకో లైఫ్‌కు లైసెన్సులు ఇవ్వగా కొత్తగా సాధారణ బీమాలో క్షేమా జనరల్ ఇన్సూరెన్స్‌కు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. 2017 తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఒక సంస్థకు అనుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలన్న లక్ష్యాన్ని కేవలం నినాదంగా చూడొద్దని, దాన్ని సాకారం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటే డెడ్‌లైన్ కన్నా ముందే సాధించగలమని పాండా తెలిపారు. ఇందుకోసం పరిశ్రమ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవాలని, వినూత్నంగా ఆలోచించాలని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఆధారిత నవకల్పనలతో ఉత్పత్తుల వ్యయాలు తగ్గుతాయని పాండా తెలిపారు. ఈ విషయంలో అందరికీ ఆర్థిక సేవలను అందించే దిశగా బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించవచ్చని సూచించారు. ఆఖరు వ్యక్తి వరకూ చేరేందుకు ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాల తోడ్పాటు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 23 జీవిత బీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి వాటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 59 లక్షల కోట్లుగా నమోదైంది. -
బీమా సంస్థలు పెరగాలి..అప్పుడే అందరికీ బీమా సాకారం!
ముంబై: దేశంలో 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాకారానికి మరిన్ని బీమా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అభిప్రాయపడ్డారు. విస్తృతమైన, వైవిధ్యమైన బీమా ఉత్పత్తులు, మరిన్ని పంపిణీ భాగస్వాములు కూడా కావాలన్నారు. ప్రైవేటు ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ పరిశ్రమ అసోసియేషన్ వార్షిక సదస్సును ఉద్దేశించి పాండా మాట్లాడారు. ‘‘బీమా పరిశ్రమలో ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచి రెండు దశాబ్దాలకు పైనే గడిచింది. బీమా మార్కెట్ ఎంతో వృద్ధి చెందింది. గడిచిన ఐదేళ్లలో బీమా రంగం ఏటా 10 శాతం వృద్ధిని చూసింది. అయినప్పటికీ 2021నాటికి బీమా విస్తరణ 4.2 శాతంగానే ఉంది. మరింత మందికి చేరువ కావాల్సి ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న వైవిధ్యభరిత దేశం. అందరికీ ఒక్కటే విధానం సరిపోదు. అధిక ధనవంతులు, పేద ప్రజల కోసం విభిన్నమైన బీమా పరిష్కారాలు అవసరం. అలాంటి వినూత్నమైన ఉత్పత్తులను నేడు ఉన్న 70 కంపెనీల నుంచి సాధ్యం కాదు. కనుక మరిన్ని కంపెనీలు రావాలి. విస్తృతమైన బీమా ఉత్పత్తులు, పంపిణీదారులు కూడా అవసరం. అప్పుడే 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించగలం’’అని దేవాశిష్ పాండా వివరించారు. -
నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: వాహన బీమాలో కొన్ని సంస్థలు మాయాజాలం చేస్తున్నాయి. ఏకంగా ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నాయి. సదరు సంస్థల బీమాకు వాహన్ పోర్టల్లోనూ ఆమోదం లభించడం గమనార్హం. సాధారణంగా ఎలాంటి వాహనాలకైనా ఏడాదికోసారి బీమాను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. బీమా సంస్థలు కనీసం ఏడాది ప్రీమియాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు నెల రోజుల వ్యవధితో పత్రాలను అందజేస్తున్నాయి. వీటి ఆధారంగానే కొందరు అధికారులు వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్, బదిలీ, అమ్మకాలు, చిరునామా మార్పు వంటి అంశాల్లో అన్ని రకాల డాక్యుమెంట్లతో పాటు సదరు వాహనానికి ఉన్న బీమా కాలపరిమితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం ఏడాది పాటు బీమా గడువు ఉన్న వాహనాలకే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించి వాహన సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణా వాహనాల్లో ఇది బేఖాతరు అవుతోంది. ప్రయాణికులు, వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో కీలకంగా భావించే బీమాపత్రాల్లో ఎలాంటి పారదర్శకతను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి బీమా పత్రాలకు వాహన్ పోర్టల్‌లో సైతం ఆమోదం లభించడం విచిత్రంగా ఉంది’ అని ఇబ్రహీంపట్నానికి చెందిన మోహన్ అనే వాహన యజమాని విస్మయం వ్యక్తం చేశారు. తప్పించుకొనేందుకే... నెల రోజుల గడువుతో ఇస్తున్న బీమా పత్రాలు ఇటు వాహనదారులకు, అటు సదరు బీమా సంస్థలకు ఉభయ తారకంగా మారాయి. కొందరు వాహన యజమానులు బీమా భారాన్ని తప్పించుకొనేందుకు కేవలం రూ.1500 చెల్లించి నెల గడువు కలిగిన బీమాను పొందుతున్నారు. ఇది ఆ సంస్థలకు చక్కటి ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, తదితర వాహనాలకు ఏడాది ప్రీమియం కలిగిన థర్డ్‌పార్టీ బీమా పొందాలంటే రూ.7000 నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. వ్యక్తిగత కార్లకు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకొనేందుకే బీమా సంస్థలు, వాహనదారులు కొత్త ఎత్తుగడను ఎంచుకొన్నాయి. బీమా ప్రీమియం గడువును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ ఇచ్చేస్తున్నారు. యాజమాన్య మార్పిడి, చిరునామా మార్పు, తదితర రవాణా సేవలను అందజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. నకిలీల వెల్లువ.. మరోవైపు వాహన బీమాలో నకిలీ పత్రాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల రెన్యువల్స్‌లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఏజెంట్లు ఏడాది విలువ కలిగిన నకిలీ పత్రాలను సృష్టించి రూ.1000 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇలాంటి పత్రాల ఆధారంగానే వాహనదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. కొన్ని చోట్ల అవి నకిలీవో, అసలువో నిర్ధారించుకోకుండానే ఏజెంట్లపై ఆధారపడి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు! -
బీమా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
న్యూఢిల్లీ: బీమా ఒప్పందాల్లో అస్పష్టత, షరతులు అసౌకర్యంగా ఉండడం వంటి ఆరు అంశాలను కేంద్ర ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), బీమా కంపెనీల ముందు ప్రస్తావించింది. వెంటనే వీటిని పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న వినియోగదారుల కేసులను తగ్గించాలని బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో కోరింది. కోర్టు బయట పరిష్కారాల విషయమై బీమా కంపెనీల ప్రతినిధులకు అధికారాల్లేకపోవడం, వినియోగదారులతో ఒప్పందంపై సంతకం చేయించుకోవడానికి ముందు పాలసీకి సంంధించి అన్ని డాక్యుమెంట్లను అందించకపోవడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల పేరిట క్లెయిమ్‌లను తిరస్కరించడం, పంట బీమా క్లెయిమ్‌లను కేంద్ర పథకంతో ముడిపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతానికి పైగా బీమా రంగానికి సంబంధించే ఉంటున్నాయనేది వాస్తవం ‘‘ఐఆర్డీఏఐ, ఇతర భాగస్వాముల (బీమా సంస్థలు, టీపీఏలు) వద్ద ఈ అంశాలను ప్రస్తావించాం. బీమా సంస్థలు స్వచ్చందంగా వీటిని పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. అవసరనుకుంటే వీటిని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏఐని కోరతాం’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ అంశాల వల్లే దేశవ్యాప్తంగా బీమాకు సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమ 8 శాతం విస్తరణ రేటును చేరుకోవాలంటే, ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీమా పాలసీ నిబంధనలు, షరతులు సులభతరంగా, స్పష్టంగా, అర్థం చేసుకోతగిన భాషలో ఉంటే ఫిర్యాదులను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోకుండా డాక్యుమెంట్‌పై సంతకం చేయరాదన్న అవగాహనను పాలసీదారుల్లో కాల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
ఇన్సూరెన్స్ కంపెనీలకు షాకిచ్చిన నిర్మలాజీ, రూ. 5 లక్షలు దాటితే బాదుడే!
సాక్షి,ముంబై: యూనియన్ బడ్జెట్లో వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన బీమా కంపెనీలకు మాత్రం భారీ షాక్ఇచ్చింది. ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీంతో బీమా కంపెనీలకు డిమాండ్ తగ్గపోతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించింది. దీంతో బుధవారం నాటి మార్కెట్లో బీమా కంపెనీల షేర్లు భారీగా పతనమైనాయి. సాంప్రదాయ బీమా ప్లాన్లపై పన్ను బాదుడుకు సీతారామన్ ప్రతిపాదించారు.పాలసీల మొత్తం ప్రీమియం ఏడాదికి 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేసే జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (ULIPలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని పేర్కొన్నారు. ప్రీమియం మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మొత్తం ప్రీమియం ఉన్న పాలసీల నుండి మాత్రమే ఆదాయం పొందాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం అంటే రూ. 5 లక్షలవరకు, 31 మార్చి, 2023 వరకు జారీ చేయబడిన బీమా పాలసీలను కూడా ప్రభావితం చేయదు. అలాగే బీమా చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు పొందే మొత్తానికి అందించే పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త ప్రతిపాదన యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై పన్నును ప్రభావితం చేయదు. ఈ ప్రకటన ఫలితంగా హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్, మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5 -11శాతం మధ్య నష్టపోయాయి. అయితే, ఇది అధిక విలువ కలిగిన సాంప్రదాయ బీమాలను కొనుగోలు చేయడానికి వ్యక్తుల ఆసక్తిని తగ్గించి, ఇది టర్మ్ ప్లాన్లు, రిస్క్ కవర్లపై దృష్టిని పెరగడమే మంచి పరిణామమే అయినప్పటికీ పూర్తిగా పెట్టుబడి ఆధారిత యూనిట్ లింక్ ఇన్సూరెన్స్‌ల వైపు గణనీయమైన మార్పుకు దారితీస్తే ఆందోళనకరమని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా చెప్పారు. అంటే, ఎండోమెంట్ ప్లాన్లు, మనీ బ్యాక్ ప్లాన్లు వంటి సాంప్రదాయ బీమా ప్లాన్లపై పాలసీదారుల ఇంట్రస్ట్ తగ్గిపోతుందన్నారు. అంతిమంగా ఇది బీమా కంపెనీలకు నష్టమని భావిస్తున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్ షేర్ల షాక్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభాలకు పరిమితమై 59,708వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. యూనియన్ బడ్జెట్లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. -
పెట్స్‌కు బీమా.. యజమానికి ధీమా
సాక్షి, హైదరాబాద్: ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు జంతువులకు బీమా కల్పించడం ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఆపదలో ఉన్న పెట్స్‌కు బీమా రూపంలో ఆపన్న హస్తం అందించేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. ఇటీవలికాలంలో సంపన్న వర్గాలతోపాటు ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి చెందిన వారు కూడా తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడంపై మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, పక్షులకు బీమా సౌకర్యం కల్పించేందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇటీవల వేలాది జంతువులకు ఇలాంటి భరోసా కల్పించినట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి. సాధారణ అనారోగ్యం మొదలు చిన్నపాటి సర్జరీలు, కేన్సర్, గుండెజబ్బుల వంటి ప్రమాదకర వ్యాధుల చికిత్సలకు సైతం డబ్బులు చెల్లిస్తారు. వ్యాక్సినేషన్, డీవార్మింగ్, టిక్ట్రీట్మెంట్, డాక్టర్ విజిట్ వంటివి కూడా బీమా పరిధిలోకి రావ డం విశేషం. ఒకవేళ ఆ పెట్ ఆకస్మికంగా మరణించినా యజమానికి బీమా మొ త్తాన్ని చెల్లించే కంపెనీలు కూడా ఉన్నాయి. నెలకు రూ.122 నుంచి 500 వరకు.. సాధారణంగా ఇళ్లలో పెంచుకునే శునకాల జీవితకాలం సుమారు 12 ఏళ్లు ఉంటుంది. అయితే బీమా కంపెనీలు రెండు నెలల నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న కుక్కలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందుకోసం పెట్స్ యజమానులు నెలకు రూ.122 నుంచి 500 వరకు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. పెంపుడు జంతువులకు అనారోగ్యానికి నెలకు రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తున్న వారికి ఈ బీమా ఆర్థికంగా బాగా కలిసివస్తుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్‌కు చికిత్సకయ్యే ఖర్చులో 80 శాతం వరకు కంపెనీ చెల్లిస్తుంది. కేన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర ప్రమాదకర వ్యాధుల సర్జరీలకు సుమారు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ చికిత్సలు కూడా బీమా పరిధిలోకి వస్తాయి. ముందుకొస్తున్న కంపెనీలు.. పెట్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్న వాటిలో పాటెక్టో వెటీనా హెల్త్‌కేర్ ఎల్ఎల్పీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, పావ్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ బీమా వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఇతర కంపెనీలు సైతం ఈ రంగంలోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో పెట్స్‌ను విక్రయించే దుకాణాలు, వాటికి అవసరమైన ఆహారం, మందులు అందించే సంస్థలు సైతం బాగా విస్తరించాయి. ఇదే క్రమంలో బీమా సదుపాయం రావడంతో పెంపుడు జంతువుల బతుకులకు భరోసా లభిస్తోందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్ బీమా అత్యవసర జాబితాలోకి.. ఇçప్పుడు పెట్స్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసర జాబితాలోకి చేరింది. హెల్త్‌కేర్, సర్జరీ వంటివి యజమానికి భారం కాకుండా పలు బీమా కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. ఎక్కువ మంది నగరవాసులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. –డాక్టర్ ఎం.అరుణ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సరూర్‌నగర్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్ -
కొత్త ఏడాదిలో అలర్ట్ : దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయా కంపెనీల ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు జనవరి 4న సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనం అవుతాయని జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్‌టీయూ) ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల లాభాల్లో ఉన్న ఆఫీసులతో పాటు పలు కార్యాలయాలను విలీనం చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా దాదాపు 1,000 కార్యాలయాలు మూతబడ్డాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. ఇవన్నీ ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండేవని వివరించింది. ఫలితంగా పాలసీదారులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సౌరభ్ మిశ్రా ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లోని 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అధికారులు జనవరి 4న ఒక రోజు సమ్మెకు దిగనున్నట్లు జేఎఫ్‌టీయూ తెలిపింది. -
బీమాలో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో కీలకమైన సంస్కరణకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా కొత్త సంస్థల ప్రవేశ నిబంధనలను సడలించింది. సాల్వెన్సీ రేషియోను సైతం తగ్గించింది. దీంతో ప్రస్తు్తత బీమా సంస్థలకు అదనంగా రూ.3,500 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. బీమా సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఐఆర్డీఏఐ శుక్రవారం నాటి బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలను (పీఈ) అనుమతించింది. సబ్సి డరీలు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా మారేందుకు ఓకే చెప్పింది. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. కీలక నిర్ణయాలు.. ► బీమా రంగంలో సులభతరమైన వ్యాపార విధానాలకు వీలుగా, కొత్త సంస్థల రాకను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించనున్నట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. ► కార్పొరేట్ ఏజెంట్లు ఇక మీదట గరిష్టంగా 9 బీమా సంస్థలతో టైఅప్ పెట్టుకోవచ్చు. ఈ పరిమితి ప్రస్తుతం 3గానే ఉంది. ఇన్సూరెన్స్‌ను మార్కెటింగ్ చేసే ఒక్కో సంస్థ గరిష్టంగా ఆరు బీమా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 2గా ఉంది. ► సాధారణ బీమా సంస్థలు తమ నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను, క్రాప్ ఇన్సూరెన్స్ సాల్వెన్సీ రేషియోను 0.70 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించింది. దీనివల్ల కంపెనీలకు రూ.1,460 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. ► ఇక జీవిత బీమా కంపెనీలకు సంబంధించి యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్‌లు) సాల్వెన్సీ రేషియోను 0.80% నుంచి 0.60% చేసింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సాల్వెన్సీ రేషియోను 0.10% నుంచి 0.05% చేసింది. దీనివల్ల జీవిత బీమా కంపెనీలకు రూ.2,000 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ► బీమా కంపెనీ చెల్లించిన మూలధనంలో ఒక ఇన్వెస్టర్ 25%, ఇన్వెస్టర్లు ఉమ్మడిగా 50% వాటా కలిగి ఉంటే ‘ఇన్వెస్టర్లు’గా పరిగణించనుంది. అంతకుమించితే ప్రమోటర్లుగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఒక ఇన్వెస్టర్‌కు 10%, ఇన్వెస్టర్ల సమూహానికి 25% పరిమితి ఉంది. ► ప్రమోటర్లు 26 శాతం వరకు వాటాను తగ్గించుకునేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్‌లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెల గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్ అలియాంజ్ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది. -
వాహన 'ధీమా'
సాక్షి, అమరావతి: ఓ వాహనం ప్రమాదానికి గురై ఆ వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆ వాహనానికి చెల్లించిన ఇన్సూరెన్స్ పత్రాలను జతచేసి పరిహారం కోసం దరఖాస్తు చేస్తే.. ఆ వాహనానికి చేసిన బీమా నకిలీదని తేలింది. దాంతో బాధిత కుటుంబానికి ఎలాంటి పరిహారం లభించలేదు. వాహన బీమా నకిలీ దందా ఉచ్చులో పడి ఆ కుటుంబం మోసపోయింది. ఏటా ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 లక్షల వాహనాలకు నకిలీ బీమా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రంగంలోకి దిగిన రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీ డీఆర్ఐ), రవాణా శాఖ సంయుక్తంగా ‘వాహన బీమా మిత్ర’ అనే వెబ్ అప్లికేషన్ రూపొందించాయి. అందుకోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు చెందిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)తో ఏపీ డీఆర్ఐ ఇటీవల ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ అప్లికేషన్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. దశాబ్దాలుగా దందా రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న వాహన నకిలీ బీమా దందాపై గతేడాది ‘వాహన బీమాకు నకిలీ మకిలీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కొందరు నకిలీ ఏజెంట్లు, వాహన కాలుష్య తనిఖీ వాహనాల కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై రాష్ట్ర డీఆర్ఐ రెండు దశల్లో జరిపిన దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. 15 బీమా కంపెనీల పేరిట జారీ చేసిన 2,80,873 వాహనాల బీమా పాలసీలను పరిశీలించగా.. వాటిలో ఏకంగా 1,20,623 పాలసీలు బీమా కంపెనీల డేటాతో మ్యాచ్ కాలేదు. రెండో దశలో రాష్ట్ర రవాణా శాఖ డేటాబేస్‌లో ఉన్న 1,111 వాహన బీమా ప్రీమియంలను పరిశీలించారు. వాటిలో ఏకంగా 468 బీమా పాలసీలు నకిలీవని, మరో 80 పాలసీలు అర్హతలేని కంపెనీలవని తేలింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 1.25 కోట్ల వాహనాలకు బీమా చేస్తున్నారు. వాటిలో దాదాపు 40 లక్షల పాలసీలు నకిలీవేనని డీఆర్ఐ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 5వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నకిలీ పాలసీలు చేయించిన వారికి పరిహారం అందడం లేదు. ఇకపై నకిలీలకు తావుండదు ‘వాహన బీమా మిత్ర’ వెబ్ అప్లికేషన్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ప్రభుత్వం విస్తరిస్తోంది. ఐఐబీ తమ వద్ద ఉన్న దేశంలోని వాహన బీమా కంపెనీల డేటాబేస్‌ను ఈ అప్లికేషన్లో అందుబాటులో ఉంచుతుంది. ఏ వాహనదారుడైన తన వాహనం నంబర్, బీమా పాలసీ నంబర్లను ఆ వెబ్ అప్లికేషన్లో నమోదు చేస్తే.. వెంటనే ఆ బీమా పాలసీ అసలైనదా కాదా అన్నది తెలుసుకోవచ్చు. నకిలీ బీమా పాలసీ అని తేలితే ఆ పాలసీ చేయించిన ఏజెంట్‌పై వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో పోలీసులు ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకుంటారు. దాంతో నకిలీ బీమా పాలసీలు చేయించే ఏజెంట్ల ఆటకట్టించడం సాధ్యమవుతుంది. తాము చేయించింది నకిలీ బీమా అని నిర్ధారణ అయితే వాహనదారులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సరైన బీమా పాలసీని ఆన్లైన్ ద్వారా గానీ బీమా కంపెనీ అధికారికంగా గుర్తించిన ఏజెంట్ ద్వారా గానీ తీసుకోవచ్చు. దాంతో ఆ వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే బీమా రక్షణ లభిస్తుంది. ఈ వెబ్ అప్లికేషన్‌ను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆ గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో ఉన్న వాహనాల బీమా పాలసీలను పరిశీలించి వాటిలో నకిలీవి ఉంటే వెంటనే సదరు వాహనదారులను అప్రమత్తం చేస్తారు. డిస్కౌంట్ ఇచ్చేలా చర్చలు ‘వాహన బీమా మిత్ర’ వెబ్ అప్లికేషన్ ద్వారా వాహన బీమా చేయించుకునే సౌలభ్యం కల్పించాలని డీఆర్ఐ భావిస్తోంది. అందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆ వెబ్ అప్లికేషన్ ద్వారా పాలసీ తీసుకుంటే కొంత డిస్కౌంట్ ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తోంది. వాహన బీమా పాలసీ కాల పరిమితి ముగుస్తుందనగా ఆ వాహనదారు మొబైల్‌కు మెసేజ్ పంపి అప్రమత్తం చేస్తారు. గడువులోగా పాలసీని రెన్యువల్ చేసుకునేలా చూస్తారు. -
బీమా కంపెనీలు లిస్టింగ్‌కు వెళ్లాలి!
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్‌లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్డీఏ చైర్మన్‌గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌ను ఐఆర్డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది. -
అలా చేస్తే ఒప్పుకోం.. ఇన్సురెన్సు కంపెనీలకు సుప్రీం కోర్టు హెచ్చరిక!
న్యూఢిల్లీ: బీమా తీసుకునే సమయంలో పాలసీదారు దరఖాస్తులో వెల్లడించిన (అప్పటి) వైద్య పరిస్థితిని ఉదహరించడం ద్వారా.. బీమా సంస్థ సంబంధిత వ్యక్తి క్లెయిమ్‌ను తిరస్కరించలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. బాధ్యత ఉంది బీమా తీసుకునే వ్యక్తిపైనా తనకు తెలిసిన అన్ని వాస్తవాలను బీమా సంస్థకు వెల్లడించాల్సిన అవసరం, బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.‘‘బీమా చేసిన వ్యక్తి వైద్య పరిస్థితిని అంచనా వేసి, పాలసీ జారీ చేసిన తర్వాత ఏదై నా క్లెయిమ్‌కు సంబంధించి బీమాదారుడికి అప్పటికే ఉన్న వైద్య పరిస్థితిని ఉదహరించడం ద్వారా ఆ క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించలేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఒక రూలింగ్‌పై దాఖలైన అప్పీల్‌ను పరిష్కరిస్తూ, సుప్రీం తాజా తీర్పు ఇచ్చింది. చదవండి:ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
మూడేళ్లలో 30% మార్కెట్ గోవిందా!
ముంబై: కరోనా మహమ్మారి చూపిన ప్రభావంతో మోటారు బీమా వ్యాపారం గతేడాది కుదేలై తిరిగి కోలుకుంటుండగా.. మరోవైపు ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు మాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి. క్రమక్రమంగా మార్కెట్ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నాయి. మోటారు బీమా మార్కెట్లో ఏడాది క్రితం ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు 36.6 శాతం వాటా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 32.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీలు తమ వాటాను 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెంచుకున్నాయి. కానీ, 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 13.9 శాతం (30 శాతం క్షీణత) మార్కెట్ వాటాను మూడేళ్ల కాలంలో కోల్పోయినట్టు తెలుస్తోంది. 2018 మార్చి నాటికి మొత్తమ మోటార్ బీమా విభాగంలో ప్రభుత్వరంగ సంస్థలకు 46.5శాతం వాటా ఉంటే, ప్రైవేటు సంస్థల చేతుల్లో 53.5 శాతం వాటా ఉండేది. 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల వాటా 40.7 శాతానికి తగ్గిపోయి, ప్రైవేటు బీమా కంపెనీల వాటా 59.3 శాతానికి పెరిగింది. 2020 మార్చి నాటికి ప్రభుత్వరంగ బీమా సంస్థల వాటా 34.2 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఈ వాటా 32.6 శాతానికి దిగిపోవడం గమనార్హం. విడిగా చూస్తే.. మోటార్ ఓడీ (ఓన్ డ్యామేజ్/వాహనదారుకు వాటిల్లేనష్టం) విభాగంలో 2018 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 37.5 శాతం వాటా, ప్రైవేటు బీమా సంస్థలు 62.5 శాతం వాటా చొప్పున కలిగి ఉన్నాయి. కానీ, 2021కు వచ్చే సరికి ప్రభుత్వరంగ కంపెనీల వాటా 25.5 శాతానికి పరిమితమైతే.. ప్రైవేటు కంపెనీల వాటా 74.5 శాతానికి పుంజుకున్నది. థర్డ్ పార్టీ (వాహనదారు కాకుండా ఎదుటి వారికి కలిగే నష్టం) మోటారు బీమాలో ప్రభుత్వరంగ సంస్థలకు 2018 మార్చి నాటికి 52.7 శాతం ఉంటే, అది తాజాగా 39.7 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 46.3 శాతం నుంచి 60.3 శాతానికి పుంజుకున్నది. శాఖలను క్రమబద్ధీకరించుకోండి ► ఖర్చులు తగ్గించుకోండి ► పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీలకు సూచనలు ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు వీలుగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ పలు సూచనలు చేసింది. శాఖలను క్రమబదీ్ధకరించుకోవాలని, అనవసర వ్యయాలను నియంత్రించుకోవాలని కోరింది. ప్రభుత్వరంగంలో నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తుండగా.. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒక్కటే లాభాలతో నడుస్తోంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. వీటి ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందడం గమనార్హం. తక్కువ వ్యయాలతో కూడిన డిజిటల్ మాధ్యమంలో వ్యాపారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలని కూడా బీమా కంపెనీలను కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాకపోతే దీనిపై ఉద్యోగుల సంఘం భిన్నంగా స్పందించింది. ‘‘ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాయి. శాఖల క్రమబద్ధీకరణ అన్నది పేదలకు భారంగా మారకూడదు. ఎందుకంటే చిన్నపాటి క్లెయిమ్ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్యాటిల్ ఇన్సూరెన్స్ లేదా ఫసల్ బీమా’’ అని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే గోవిందన్ అన్నారు. ప్రతీ జిల్లాకు ఒక శాఖ కచి్చతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లను యాజమాన్యాలకు తెలియజేసినట్టు చెప్పారు. 2021–22 బడ్జెట్లో ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రస్తావించడం తెలిసిందే. -
ఐపీవోలకు ‘బీమా’ సంస్థల క్యూ
ముంబై: ఇప్పటికే కిక్కిరిసిపోయిన పబ్లిక్ ఇష్యూల మార్కెట్లో కొత్తగా బీమా రంగానికి సంబంధించిన మరో మూడు సంస్థలు ఐపీవోకి సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి రూ. 10,000 కోట్లు పైగా సమీకరించనున్నాయి. ఇన్సూరెన్స్ బ్రోకరేజి సంస్థ పాలసీబజార్ని నిర్వహించే పీబీ ఫిన్‌టెక్, ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 40 పైగా కంపెనీలు ఐపీవోకి రాగా .. సుమారు రూ. 70,000 కోట్ల పైగా నిధులు సమీకరించాయి. ఆగస్టులో ఇప్పటిదాకా 24 పైగా సంస్థలు ఐపీవోకి సంబంధించి పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాదిలో ఏకంగా 100 పైగా పబ్లిక్ ఇష్యూలు రాగలవని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. రెండో భారీ ఇష్యూగా పీబీ ఫిన్‌టెక్.. పీబీ ఫిన్‌టెక్ సుమారు రూ. 6,017 కోట్లు సమీకరించనుంది. టైగర్ గ్లోబల్, టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి దిగ్గజాలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాదిలో జొమాటో తర్వాత పీబీ ఫిన్టెక్ది రెండో అతి భారీ ఇష్యూ కానుంది. జొమాటో రూ. 9,375 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టాండెలోన్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉంది. అటు దేశీయంగా అతి పెద్ద థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న మెడి అసిస్ట్ సుమారు రూ. 840–1,000 కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించనున్నట్లు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ల (డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది. పీబీ ఫిన్‌టెక్ ఆగస్టు 4న, స్టార్ హెల్త్ జులై 28న, మెడి అసిస్ట్ మే 11న సెబీకి డీఆర్‌హెచ్‌పీలు సమర్పించాయి. ఒక్కో ఇష్యూ ఇలా.. దేశీయంగా ప్రైవేట్ రంగంలో స్టార్ హెల్త్ అతి పెద్ద స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థగా ఉంది. దీనికి సుమారు 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో పాటు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 2,000 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, వాటాదారులు 6 కోట్ల పైచిలుకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.06 కోట్ల షేర్లు, ఎపిస్ గ్రోత్ 76 లక్షల షేర్లు విక్రయించనున్నాయి. మరోవైపు, పాలసీబజార్, ఆన్లైన్ రుణాల ప్లాట్‌ఫాం పైసాబజార్‌లను పీబీ ఫిన్‌టెక్ నిర్వహిస్తోంది. పరిమాణంపరంగా ప్రస్తుతం ఆన్లైన్లో పాలసీ విక్రయాలకు సంబంధించి పాలసీబజార్‌కు 93.4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్ ఇన్సూరెన్స్ విక్రయాల పరిమాణంలో సుమారు 65.3 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరిగాయి. పాలసీబజార్ కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత వాటాదారులు సుమా రు రూ. 2,267 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇక మెడిఅసిస్ట్ విషయం తీసుకుంటే.. ఆదాయాలు, ప్రీమియం వసూళ్ల సేవలు తదితర అంశాలపరంగా దేశంలోనే అతిపెద్ద థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 722 నగరాలు, పట్టణాల్లో 11,000 పైచిలుకు ఆస్పత్రులతో భారీ నెట్వర్క్ ఉంది. అపోలో హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్‌కేర్ వంటి పేరొందిన హాస్పిటల్ చెయిన్లకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటరుగా (టీపీఏ) వ్యవహరిస్తోంది. పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రమ్‌జిత్ సింగ్ చత్వాల్, మెడిమ్యాటర్ హెల్త్ మేనేజ్మెంట్, బెస్సీమర్ హెల్త్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 1 మొదలైన ఇన్వెస్టర్లు 25,39,092 షేర్లను విక్రయిస్తున్నాయి. -
Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
బీమా పాలసీల్లోని సదుపాయాలను సులభంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడేది కాదు. ఒక్కో కంపెనీ ప్లాన్ భిన్నమైన ప్రయోజనాలు, మినహాయింపులు, షరతులతో ఉంటుంది. కనుక పాలసీదారులు వీటిని అర్థం చేసుకోవడం కష్టమని తెలుసుకున్న బీమా రంగ నియంత్రణ , అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఒకే విధమైన ఫీచర్లతో అన్ని బీమా కంపెనీలు.. ఒకే పేరుతో ఒక ప్రామాణిక పాలసీని ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు తీసుకొచి్చంది. వీటినే స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా పిలుస్తారు. ఆరోగ్య సంజీవని, సరళ్ జీవన్ బీమా, సరళ్ పెన్షన్, సరళ్ సురక్షా ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పాలసీలే. వీటి ప్రీమియంలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కాకపోతే వీటిల్లో పరిమితులు కూడా ఉంటాయి కనుక అందరికీ కాకుండా.. కొందరికే అనుకూలం. బీమా పాలసీల విషయంలో ‘కరోనా’ఓ కనువిప్పుగానే చూడాలి. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల పాలై ఆరి్థకంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు బీమా రక్షణ లేని కారణంగా మరణించిన వారి కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణం/వైకల్య పరిహార బీమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లేని వారు పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ, సదుపాయాలు, రైడర్లు బీమా సంస్థలు అన్నింటిలోనూ ఒకే మాదిరిగా ఉంటాయి. ఆరోగ్య సంజీవని పేరుతో హెల్త్ ప్లాన్, సరళ్ జీవన్ బీమా పేరుతో టర్మ్ ప్లాన్.. సరళ్ పెన్షన్ (యాన్యుటీ/పెన్షన్) ప్లాన్, సరళ్ సురక్షా బీమా (వ్యక్తిగత ప్రమాద కవరేజీ) ప్లాన్, కరోనా కవచ్, కరోనా రక్షక్ (కరోనా చికిత్సల ప్లాన్లు), భారత్ గృహ రక్ష (హోమ్ ఇన్సూరెన్స్) ఇవన్నీ స్టాండర్డ్ బీమా పథకాలే. వీటిని ఎంపిక చేసుకోవడానికి ముం దు.. నియమ, నిబంధనలు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ పాలసీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి.. ప్రీమియం ఎంతన్నదీ చూడాలి. తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చేవేనా? అన్న పరిశీలన కూడా చేసుకోవాలి. అప్పుడే వీటిపై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. సరళ్ జీవన్ బీమా అచ్చమైన టర్మ్ పాలసీ ఇది. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఎటువంటి రాబడులను రానటువంటి పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే నామినీకి పరిహారం లభిస్తుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంతో కలిపి 105 శాతం, లేదా సమ్ అష్యూరెన్స్ (బీమా కవరేజీ) వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం నామినీకి కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ సింగిల్ ప్రీమియం పాలసీలు అయితే చెల్లించిన ప్రీమియానికి 125 శాతం లేదా బీమా కవరేజీ ఈ రెండింటిలో గరిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల మేరకు సరళ్ జీవన్ బీమా ప్లాన్‌తోపాటు రెండు రైడర్లను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇతర టర్మ్ పాలసీలతో పోలిస్తే సరళ్ జీవన్ బీమా ప్లాన్‌లో 45 రోజుల వేచి ఉండే కాల వ్యవధి (పాలసీ జారీ చేసిన తేదీ నుంచి) అమలవుతుంది. కాకపోతే ఈ 45 రోజుల వ్యవధిలో ప్రమాదం కారణంగా మరణిస్తే పరిహారం లభిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర ఏ రూపంలో మరణం సంభవించినా బీమా పరిహారానికి అర్హత లభించదు. కేవలం చెల్లించిన ప్రీమియం వరకే నామినీకి లభిస్తుంది. టర్మ్ పాలసీలు ముక్కుసూటి పథకాలు. ఎటువంటి గందరగోళం లేకుండా జీవితానికి పూర్తి రక్షణ కల్పించేవి. వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు అయినా బీమా పరిహారం కచ్చితంగా ఉండాలన్నది సాధారణంగా అనుసరించే విధానం. కానీ, సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను చాలా కంపెనీలు గరిష్టంగా రూ.25 లక్షలకే ఇస్తున్నాయి. కనుక తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆదాయం ఉన్న వారు సాధారణ టర్మ్ ప్లాన్‌ను తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. సాధారణ టర్మ్ ప్లాన్ వ్యక్తి ఆదాయానికి తగినట్టు గరిష్ట కవరేజీతో వస్తుంది. ∙ ఉదాహరణకు.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను 40 ఏళ్ల కాలానికి రూ.25లక్షల కవరేజీతో తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.12,312 (జీఎస్టీ కాకుండా). అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేసే ఐప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి జీఎస్టీ కాకుండా వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,987. ఈ విధంగా చూసుకుంటే సరళ్తో పోలిస్తే సాధారణ టర్మ్ ప్లాన్‌లో తక్కువ ప్రీమియానికి అధిక కవరేజీ లభిస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రమాదం కారణంగా పాలసీదారు శాశ్వత వైకల్యానికి గురైతే ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండే ప్రీమియం వైవర్ ఐప్రొటెక్ట్ సస్మార్ట్ ప్లాన్‌లో ఉంది. టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి రుజువులు కచి్చతంగా ఉండాల్సిందే. కొన్ని రకాల ఉద్యోగాల్లోని వారికి టర్మ్ ప్లాన్‌ను కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. కనుక ఇటువంటి వారు సరళ్ జీవన్ బీమాను పరిగణనలోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బీమా కవరేజీని కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. అవసరమైతే ఈ రంగంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆరోగ్య సంజీవని అన్ని సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను బేసిక్ పాలసీ కింద ఆఫర్ చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. డేకేర్ ట్రీట్మెంట్లకు (ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేని చికిత్సలు) ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. పాలసీ తీసుకున్న 30 రోజుల వరకు వేచి ఉండే కాలం అమలవుతుంది. అలాగే, కొన్ని వ్యాధులకు పాలసీ అమల్లోకి వచి్చన రెండేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుంది. ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్‌లు లేనట్టయితే బోనస్ కూడా ఇందులో అందుకోవచ్చు. అయితే, ఆరోగ్య సంజీవని హెల్త్ ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సబ్ లిమిట్స్ ముఖ్యమైనది. ఆస్పత్రిలో గది అద్దె, ఐసీయూ చార్జీలకు ఇందులో పరిమితులు అమలవుతాయి. బీమా సంస్థ నిర్దేశించిన పరిమితులకు మించి గది అద్దె, ఐసీయూ చార్జీలు ఉంటే కనుక అప్పుడు పాలసీదారు మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని తన చేతి నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ.10 లక్షల కవరేజీతో ఆరోగ్య సంజీవని ప్లాన్ తీసుకున్నా సరే సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు తనవంతుగా ఎంతో కొంత చెల్లించుకోక తప్పదు. మరో ముఖ్యమైన ప్రతికూల అంశం.. 5 శాతం కోపే నిబంధన ఇందులో ఉంటుంది. అంటే ప్రతీ క్లెయిమ్‌కు 5 శాతాన్ని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్న సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు కొంత మొత్తాన్ని సొంతంగా చెల్లించుకోవాల్సిన దానికి ఇది అదనం. సాధారణ హెల్త్ప్లాన్లు నేడు చాలా వరకు సబ్ లిమిట్స్, కోపే లేకుండానే వస్తున్నాయి. ముఖ్యంగా రూమ్‌రెంట్, ఐసీయూ చార్జీల విషయంలో పరిమితుల్లేకుండా ప్లాన్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంజీవని ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం లేదు. ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా కవరేజీ మొత్తం ఒకే విడత ఖర్చయిపోయిందనుకోండి.. అప్పుడు బీమా సంస్థలు అంతే మొత్తం కవరేజీని అదే సంవత్సరానికి రీస్టోరేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే వ్యక్తి మళ్లీ అదే పాలసీ సంవత్సరంలో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే (మరో సమస్య వల్ల), లేదా కుటుంబ సభ్యుల్లో వేరొకరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైతే రీస్టోరేషన్ అక్కరకు వస్తుంది. వార్షిక ప్రీమియం, సబ్ లిమిట్స్, నో క్లెయిమ్ బోనస్, కోపే, ఏటా ఉచితంగా హెల్త్ చెకప్‌లు, ఓపీడీ చికిత్సలకు కవరేజీ సదుపాయాలను సాధారణ హెల్త్ ప్లాన్లలో చూడొచ్చు. మీ అవసరాలు, ప్రీమియం చెల్లింపుల సామర్థ్యం ఆధారంగా ఆరోగ్య సంజీవని లేదా సాధారణ హెల్త్ ప్లాన్లలో ఏదన్నది నిర్ణయించుకోవాలి. చాలా కంపెనీలు ఆరోగ్య సంజీవని ప్లాన్ ప్రీమియం స్థాయిల్లోనే మరింత మెరుగైన ఫీచర్లతో సాధారణ హెల్త్ ప్లాన్లను (నామమాత్రపు పరిమితులు లేదా పరిమితుల్లేకుండా) ఆఫర్ చేస్తున్నాయి. సరళ్ సురక్షా బీమా ఇది వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్. అన్ని సాధారణ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి, పాక్షిక అంగవైకల్యం (శాశ్వతంగా) పాలైన సందర్భంలో ఈ ప్లాన్ కింద నామినీకి పరిహారం లభిస్తుంది. ప్రమాదానికి గురైన తర్వాత 12 నెలల్లోపు మరణించినా కానీ పరిహారానికి అర్హత లభిస్తుంది. ప్రమాదం వల్ల వైకల్యానికి లోనయితే పాలసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శాశ్వత అంగవైకల్యం పాలైతే 100 శాతం బీమా పరిహారంగా అందుకోవచ్చు. ప్రమాదం నమోదైన తేదీ నుంచి 12 నెలల్లోపు అంగవైకల్యానికి గురైనా పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్ కింద మూడు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 1. పాక్షిక అంగవైకల్యం కలిగినట్టయితే బీమా కవరేజీ మొత్తంలో 0.2 శాతాన్ని ప్రతీ వారం చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. పాలసీదారు తిరిగి పని చేసుకునే స్థితిలోకి వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 2. ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సల కోసం బీమాలో 10 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది. 3. పాలసీదారు పిల్లలకు విద్యాసాయం కింద బీమాలో 10 శాతాన్ని (ఒక్కొక్కరికి) ఒకే విడతగా కంపెనీ చెల్లిస్తుంది. కాకపోతే పిల్లల వయసు 25 ఏళ్లు దాటి ఉండకూడదు. రూ.2.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను తీసుకోవచ్చు. సాధారణంగా టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్లకు రైడర్లుగా వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్లు లభిస్తున్నాయి. కనుక ఎవరైనా కానీ తమ టర్మ్ ప్లాన్ లేదా హెల్త్ ప్లాన్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంపిక చేసుకుని ఉంటే.. అటువంటి వారు విడిగా సరళ్ సురక్షా బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. విడిగా ప్రమాద బీమా ప్లాన్ల ప్రీమియం, సదుపాయాలను.. సరళ్ సురక్షా బీమా ప్రీమియం, సదుపాయాలతో పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి సరళ్ సురక్షా బీమా ప్లాన్, స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ప్రీమియంలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కనుక సదుపాయాలపై దృష్టి సారించడం అవసరం. ఇప్పటికే సరైన టర్మ్ ప్లాన్‌ను ఒకవేళ మీరు తీసుకుని ఉండి, ఆ ప్లాన్‌కు యాక్సిడెంటల్ డెత్/డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ లేనట్టయితే.. అప్పుడు సరళ్ సురక్షా బీమా తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. -
Telangana: పరిహారం.. ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలు పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతు ప్రీమియం చెల్లించినా రెండేళ్ల పరిహారం అందలేదని వాపోతున్నారు. 2018–20 కాలంలో రైతులకు చెల్లించాల్సిన రూ.933.90 కోట్ల పరిహారాన్ని బీమా కంపెనీలు చెల్లించకుండా నిలిపివేయడమే దీనికి కారణం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రెండేళ్లకు సంబంధించి రూ.450 కోట్ల ప్రీమియం మొత్తాన్ని సర్కారు చెల్లించలేదని తెలుస్తోంది. చదవండి: 22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా? 2018–19లో అరకొర చెల్లింపులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఏటా బీమా కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఆ మేరకు టెండర్లు పిలుస్తుంది. ఇలా 2018–19లో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఐసీ), బజాజ్ అలియాంజ్, టాటా ఏఐజీలు పీఎంఎఫ్‌బీవై పథకం అమలులో పాలుపంచుకున్నాయి. 2019–20లో ఏఐసీ, ఇఫ్కో టోకియో బీమా టెండర్లు దక్కించుకున్నాయి. 2018–19 సంవత్సరంలో తెలంగాణలో 7.9 లక్షల మంది రైతులు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించారు. ప్రభుత్వాల వాటాతో కలిపి రైతులు కంపెనీలకు రూ.532.61 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.190.71 కోట్లు కాగా అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించినా, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు మాత్రమే చెల్లించినట్టు సమాచారం. ఇలా కొద్ది మొత్తమే ప్రీమియం చెల్లించి రూ.135.71 కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో బీమా కంపెనీలు కేవలం 59 వేల మంది రైతులకు రూ.112.01 కోట్లు పరిహారం కింద చెల్లించాయి. రూ.413 కోట్ల పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టాయి. ఆ సొమ్ము కోసం 7.31 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం 2019–20లో పైసా ఇవ్వలేదు .. రాలేదు ఇక 2019–20 సంవత్సరంలో రాష్ట్రంలో 10.10 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 866.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.314.83 కోట్లు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో ఆ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.520.90 కోట్ల పరిహారం రైతులకు అందలేదు. మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో 17.41 లక్షల మంది రైతులకు రూ.933.90 కోట్ల పరిహారం నిలిచిపోయిందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 2019–20 సంవత్సరంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 23,645 కోట్ల పంటల బీమా పరిహారం అందగా, తెలంగాణ రైతులకు ఒక్క పైసా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పథకమూ లేదు బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకా న్ని అమలు చేస్తోంది. కానీ తెలంగాణ ఎలాంటి పథకం చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతుబంధు ఇస్తున్నందున పంట నష్ట పరిహారం ఎందుకని కొందరు అధికారులు వాదించడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీఎంఎఫ్‌బీవై నుంచి వైదొలిగిన తెలంగాణ పీఎంఎఫ్‌బీవై పథకం 2016–17లో ప్రారంభమైంది. టెండర్లలో ఖరారు చేసిన ప్రీమియం సొమ్ములో రైతులు వానాకాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగికి 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. వడగళ్ల వాన, వరదలు, స్థానిక ప్రమాదాలు, తుపాన్లు, అకాల వర్షాలు, సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు వంటి వాటివల్ల జరిగే పంట నష్టాలకు ఈ బీమా పరిహారం అందుతుంది. అయితే 2020 వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది. ఈ నేపథ్యంలో అనేక కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ఆ పథకం రాష్ట్రంలో అమలు చేయకుండా విరమించుకుంది. అతివృష్టిగా నిర్ధారించినా పరిహారం రాలే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొల్లూరి మోహన్‌రావు. ఇతనిది వరంగల్ జిల్లా వెంకటాపురం గ్రామం. ప్రతిఏటా బీమా పథకం కింద పసుపు పంటకు ప్రీమియం చెల్లిస్తున్నాడు. అదే క్రమంలో తనకున్న భూమిలో 2 ఎకరాల పసుపు పంటకు గాను ఏడాది క్రితం రూ.4,200 ప్రీమియం చెల్లించాడు. అదేవిధంగా మూడెకరాల మొక్కజొన్న పంటకు రూ.1200 చొప్పున కట్టాడు. ఆ తరువాత విపరీతంగా వర్షాలు కురిసి పసుపు, మక్క చేలు జాలువారిపోయాయి. వ్యవసాయ అధికారులు వచ్చి పంటలను పరిశీలించి అతివృష్టి ప్రభావంతో నష్టం జరిగిందని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ నేటికీ బీమా పరిహారం అందలేదు. పంటతో పాటు బీమా ప్రీమియం డబ్బులు కూడా నష్టపోయానని మోహన్‌రావు వాపోతున్నాడు. పరిహారం రాలేదు నేను 2018లో ఒక ఎకరం భూమిలో మిర్చి పంట, మరో ఎకరంలో వరి సాగు చేశా. మిర్చికి రూ.2,500, వరికి రూ.1,600 బీమా ప్రీమియం చెల్లించాను. ఆ ఏడాది వర్షాల వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. అయినా ఇప్పటివరకు నాకు ఎలాంటి పరిహారం రాలేదు. – మేక దామోదర్ రెడ్డి, కురవి, మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి 2019లో మొత్తం నాలుగు ఎకరాల్లో సోయా పంట వేశా. కాత చాలా బాగా వచ్చింది. సరిగ్గా కోత కోసి కుప్పలు వేసిన రోజునే వర్షం కురిసింది. దీంతో చేన్లోని కుప్పలు మొత్తం తడిసిపోయాయి. వరుసగా మూడు రోజులు ముసురు కమ్ముకోవడంతో చేతికి వచ్చిన పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి బీమా పరిహారం అందలేదు. ప్రభుత్వం పరిహారం అందేలా చేసి ఆదుకోవాలి. –ఎల్టి రాంరెడ్డి, ఖాప్రి, ఆదిలాబాద్ జిల్లా పంట నష్టం అంచనా వేసినా.. నాకు 8 ఎకరాల భూమి ఉంది. ఏడాది క్రితం సోయా, పసుపు పంటల కోసం ఎకరానికి రూ.1,500 వరకు బీమా ప్రీమియం చెల్లించాను. సోయా పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ బీమా వర్తించలేదు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి నివేదిక సమర్పించారు. అయినా ఇప్పటివరకు నయాపైసా పరిహారం అందలేదు. పంటలకు బీమా చేస్తే మంచిదనుకున్నా. కానీ వృథా అయిపోయింది. – కుంట రవిశంకర్, పాలెం, నిజామాబాద్ జిల్లా -
వాహన బీమాలకు 'నకిలీ' మకిలి
రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. వాహనాలకు ఇంతటి అవసరమైన బీమాలను కూడా నకిలీవి తయారు చేస్తున్నాయి. ప్రముఖ బీమా కంపెనీల పేరిట నకిలీ పాలసీలు విచ్చలవిడిగా చేస్తూ అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వ జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. సాక్షి, అమరావతి: విజయవాడ–హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ లారీ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆ లారీకి వాహన బీమా ఉండటంతో థర్డ్‌పార్టీ పరిహారం కోసం దరఖాస్తు చేశారు. కానీ సదరు బీమా కంపెనీ తాము అసలు ఆ లారీకి బీమానే చేయలేదని చెప్పడంతో అటు లారీ యజమాని, ఇటు బాధిత కుటుంబం అవాక్కయ్యారు. తాము బీమా చేశాము కదా అని సంబంధిత పత్రాలు చూపిస్తే అసలు అవి తమ కంపెనీవే కావని ఆ సంస్థ తేల్చిచెప్పింది. లారీ యజమాని, బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తమ కంపెనీ పేరిట నకిలీ బీమా దందా సాగుతోందని గ్రహించిన ఆ సంస్థ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో నకిలీ వాహన బీమా రాకెట్ దర్జాగా విస్తరించింది. ఏకంగా 12 కంపెనీల పేరిట నకిలీ వాహన బీమాలు చేయిస్తూ యథేచ్ఛగా మోసం చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో నకిలీ వాహన బీమా దందా బాగోతం. అటు ప్రజలను నష్టపరుస్తూ ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఈ దందాపై తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించడంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీమా కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. దాదాపు 25% నకిలీ పాలసీలే.. రాష్ట్రంలో నకిలీ బీమా పాలసీల దందాపై డీఆర్ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ బాగోతాన్ని అరికట్టేందుకు కార్యాచరణకు ఉపక్రమించారు. ర్యాండమ్‌గా 12 బీమా కంపెనీలకు చెందిన 3 లక్షల వాహన పాలసీలను పరిశీలించారు. వాటిలో 25 శాతం బీమా పాలసీలు నకిలివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న పాలసీలను పరిశీలిస్తే మరెన్ని నకిలీ బీమా పాలసీలు బయటపడతాయో అంతుచిక్కడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కట్టడికి తగిన విధివిధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై డీఆర్ఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఇది క్రిమినల్ చర్య కూడా కావడంతో దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని డీఆర్ఐ అధికారులు వారికి సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీమా కంపెనీలు కూడా నిర్ణయించాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ‘మా కంపెనీ పేరిట నకిలీ బీమా పాలసీలు చేస్తున్నట్లుగా గుర్తించాం. దీనిపై మా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు డీఆర్ఐ, పోలీసు అధికారులకు సహకరిస్తాం. – జితేంద్ర సాహూ, జనరల్ మేనేజర్, మాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీ, ముంబై కాలుష్య తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహన షోరూమ్‌లే కేంద్రంగా... రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా నకిలీ వాహన బీమా రాకెట్ వేళ్లూనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన కాలుష్య తనిఖీ వాహనాలు కేంద్రంగా ఈ దందా కేంద్రీకృతమైంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే షోరూమ్‌ల నుంచి కూడా ఈ బాగోతం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అండదండలతో ఈ రాకెట్ బలోపేతమైంది. వాహన బీమాలు అందించే అధీకృత ఏజెంట్ల కంటే ఈ కాలుష్య నియంత్రణ తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ షోరూమ్‌లలో తక్కువ మొత్తానికే బీమా పాలసీలు అందుబాటులో ఉంచారు. కాలుష్య తనిఖీల కోసం తమ వాహనాలను తీసుకువచ్చిన వాహనదారులకు అదే పనిగా బీమా పాలసీలు చేయిస్తారు. ఆ విధంగా అధీకృత ఏజంట్ వద్ద కంటే 50% తక్కువకే అందిస్తుండటంతో వాహనదారులు ఆకర్షితులై నకిలీ బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో నకిలీ బీమా పాలసీ చేసే కాలుష్య పరీక్షలు/సెకండ్ హ్యాండ్ షోరూమ్ సిబ్బందికి రూ.500వరకు కమీషన్ ముట్టజెబుతారు. దాంతో ఈ నకిలీ వాహన బీమా పాలసీల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది. -
కరోనా బీమా పాలసీ దారులు ఈ విషయాలు మీకు తెలుసా?
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాది సంక్రమణ రేటు, మరణాల రేటు అధికంగా ఉంది. చాలా మంది ఆసుపత్రుల్లో బెడ్స్ లభించక ఇంట్లోనే ఉండి ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఉన్న కూడా కరోనా వల్ల అయిన ఖర్చులను భీమా సంస్థ ద్వారా తిరిగి తెలుసుకోవచ్చు. కరోనా సోకిన వారు మీ ఆరోగ్య భీమా సంస్థ నుంచి చికిత్సకు సంబంధించిన ఖర్చులను క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇబ్బందులు లేని క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం ఈ క్రింది విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం తెలుసుకోవాల్సిన అంశాలు: కరోనా క్లెయిమ్‌లకు సంబందించి ఐఆర్డీఏఐ రెగ్యులేటర్ పేర్కొన్న మార్గదర్శకాలను పూర్తిగా చదవండి. చాలా బీమా సంస్థలు క్లెయిమ్ సెటిల్మెంట్ టర్నరౌండ్ సమయాన్ని తగ్గించాయి. కోవిడ్ -19కి సంబంధించిన ఏవైనా లక్షణాలు మీరు గమనించినట్లయితే, వెంటనే ప్రభుత్వం చేత గుర్తింపబడిన ప్రయోగశాలలో పరీక్షించుకోవాలి. మీకు కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ గందరగోళాన్ని నివారించడానికి.. మీరు తీసుకుంటున్న చికిత్సకు సంబందించిన పూర్తి వివరాలను వెంటనే మీ భీమా సంస్థకు తెలియజేయండి. మీరు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారా? లేదా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారా? అనేది వారికి తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల బీమా సంస్థకు క్లెయిమ్ మొత్తాన్ని అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దానికి తదనుగుణంగా క్లెయిమ్‌ను తిరిగి చెల్లిస్తారు. చాలా భీమా కంపెనీలు ఆసుపత్రిలో చేరడానికి అంబులెన్స్ ఛార్జీలు కూడా చెల్లిస్తాయి. ఒకసారి మీరు తీసుకున్న కరోనా హెల్త్ పాలసీలో ఇది మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోండి. మీరు గనుక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే, బీమా సంస్థ లేదా ఆసుపత్రిలోని మూడవ పార్టీ నిర్వాహకుడు(టిపీఎ)డెస్క్ నుంచి ప్రీ-ఆథరైజేషన్ ఆమోదం పొందాలి. ఆసుపత్రిలో చేరడానికి డాక్టర్ సిఫార్సు ఉండాలి. మీరు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయిన మొత్తం ఖర్చుల వివరాలను డాక్యుమెంట్ల ద్వారా బీమా సంస్థలు తేలియజేయలి. మీరు భీమా సంస్థ చెప్పిన నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే మీరు నగదు రహిత సదుపాయాన్ని పొందవచ్చు. నెట్వర్క్ కాని ఆసుపత్రి చికిత్స విషయంలో మీరు చికిత్స కోసం చెల్లించిన నగదును తిరిగి రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మెడికల్ హెల్త్ కార్డ్, హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్, ఆసుపత్రిలో చేరడానికి వైద్యుడు సూచించిన డాక్యుమెంట్లు వంటి పత్రాలను భీమా సంస్థకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించదగిన విషయం ఏమిటంటే, మీ చికిత్స చేయించుకుంటున్న ఆసుపత్రి భీమా నెట్వర్క్ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు మీ క్యాష్ లెస్ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు మీ బీమా సంస్థకు ఫిర్యాదు చేయాలి. దీంతోపాటు మీ ఫిర్యాదు కాపీని ఐఆర్డీఎకు కూడా సమర్పించాలి. చదవండి: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త! -
బీమా సంస్థలలో భారీ వాటాల విక్రయం!
ముంబై: కీలకం కాని బీమా బిజినెస్‌లలో బ్యాంకింగ్ సంస్థలు నియంత్రిత స్థాయిలో వాటాలను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీమా వెంచర్లకు బ్యాంకింగ్ సంస్థలు అధిక పెట్టుబడులను వెచ్చించాల్సి రావడంతో వాటాలపై పరిమితి విధించే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి బీమా రంగ సంస్థలలో బ్యాంకుల వాటాను గరిష్టంగా 20 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ బాటలోనే ఇటీవల మ్యాక్స్ లైఫ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌ను అనుమతించినట్లు పేర్కొన్నాయి. మ్యాక్స్ లైఫ్‌లో ప్రత్యక్షంగా 10 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండేందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదించింది. అంతేకాకుండా 20 శాతానికి వాటాను పరిమితం చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలియజేశాయి. ప్రస్తుతం 50 శాతం ప్రస్తుతం బీమా రంగ వెంచర్లలో బ్యాంకులు 50 శాతం వరకూ వాటాను పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ వాటాను 20 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర బ్యాంకు భావిస్తున్నట్లు ఒక నివేదిక అభిప్రాయపడింది. ఇది జరిగితే కేవలం మూడు బ్యాంకింగ్ దిగ్గజాలు విక్రయించే వాటా విలువే రూ.1.21 లక్షల కోట్లుగా ఉండగలదని విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ప్రతిపాదనల ప్రకారం బీమా అనుబంధ సంస్థలలో పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ, ప్రయివేట్ రంగ బ్లూచిప్స్ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలను విక్రయించవలసి వస్తే వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. బీమా వెంచర్లలో వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోమంటూ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశిస్తే.. ఈక్విటీ ఫ్రీఫ్లోట్ భారీగా పెరుగుతుందని తెలియజేశాయి. దిగ్గజాల తీరిలా లిస్టెడ్ కంపెనీలలో హెచ్‌డీఎఫ్‌సీకి బీమా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 50 శాతం వాటా ఉంది. తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈక్విటీని తగ్గించుకోవలసి వస్తే రూ. 44,100 కోట్ల విలువైన వాటాను విక్రయించవలసి ఉంటుంది. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 51 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర ప్రకారం రూ.22,100 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచవలసి వస్తుంది. ఇదే విధంగా ఐసీఐసీఐ లంబార్డ్‌లోనూ 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వెంచర్లో రూ. 21,700 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫ్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ బాటలో ఎస్బీఐ లైఫ్‌లో 55 శాతం వాటాను సొంతం చేసుకున్న స్టేట్‌బ్యాంక్ అయితే రూ. 32,200 కోట్ల విలువైన వాటాను తగ్గించుకోవలసి వస్తుంది. ఈ నాలుగు దిగ్గజాల వాటాలను పరిగణించినప్పటికీ వీటి విలువ రూ. 1.21 లక్షల కోట్ల వరకూ నమోదు కావచ్చని విశ్లేషకులు మదింపు చేశారు. పలు సంస్థలు.. అన్ని పీఎస్‌యూ బ్యాంకులతోపాటు.. పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సైతం బీమా రంగంలో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశాయి. అయితే.. కోవిడ్–19 నేపథ్యంలో మొండి రుణాలు తదితర సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా బ్యాంకులకు బీమా రంగ వెంచర్లు ఉపయోగపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీమా రంగ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకున్న నిధులను ప్రొవిజనింగ్ తదితరాలకు బ్యాంకులు వినియోగించుకునేందుకు వీలు చిక్కుతున్నట్లు తెలియజేసింది. ఉదాహరణకు 2016–18 కాలంలో హెచ్డీఎఫ్సీ ఇలా సమీకరించిన నిధులను 40 శాతం వినియోగించుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ఇదే స్థాయిలో ప్రొవిజన్లకు కేటాయించింది. జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా 2016 నుంచి చూస్తే హెచ్డీఎఫ్సీ రూ. 10,900 కోట్లు సమకూర్చుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 15,300 కోట్లు, ఎస్బీఐ రూ. 12,670 కోట్లు అందుకున్నట్లు నివేదిక తెలియజేసింది. చదవండి: డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్ ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు -
బీమా బ్రోకింగ్ సంస్థలు...
న్యూఢిల్లీ: బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా అంబుడ్స్‌మన్ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పాలసీదారులు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలను సవరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. అంబుడ్స్‌మన్‌కి కేవలం వివాదాలపైనే కాకుండా బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు, ఇతరత్రా మధ్యవర్తులు అందించే సేవల్లో లోపాలపైన కూడా ఫిర్యాదు చేసే విధంగా కంప్లైంట్ల పరిధిని విస్తృతం చేసినట్లు వివరించింది. ఇన్సూరెన్స్ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలు–2017కి ఈ మేరకు సమగ్రమైన సవరణలు చేసినట్లు పేర్కొంది. నిర్దిష్ట సవరణల ప్రకారం.. పాలసీదారులు ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆయా ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే తెలుసుకునేలా ప్రత్యేక మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా అంబుడ్స్‌మన్ విచారణ నిర్వహించవచ్చు. అంబుడ్స్‌మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్వతంత్రంగా, సమగ్రంగా జరిగే విధంగా తత్సంబంధ నిబంధనలను సవరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బీమా రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేసిన వారిని కూడా సెలక్షన్ కమిటీలో చోటు ఉంటుందని పేర్కొంది. -
పన్నులు తగ్గిస్తే.. పరిధి పైపైకి!
న్యూఢిల్లీ: బీమా పాలసీలపై పన్నుల భారాన్ని తగ్గిస్తే.. వాటి ధరలు అందుబాటులోకి వచ్చి మరింత మందికి చేరువ అవుతాయంటూ ఈ రంగం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. బడ్జెట్ ముందస్తు సూచనల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ముందు పలు డిమాండ్లను వినిపించింది. 2021–22 బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాలని, దాంతో బీమా ప్లాన్లు మరింత ఆకర్షణీయంగా మారతాయని జీవిత బీమా పరిశ్రమ కోరింది. సెక్షన్ 80సీ కింద బీమా ఉత్పత్తులకు మరింత పన్ను మినహాయింపులను ప్రత్యేకించాలని.. దాంతో పన్ను ఆదా సాధనంగా వీటిని మరింత మంది కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారంటూ వివరించింది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1.5లక్షల ఆదాయానికే పన్ను మినహాయింపు పొందగలరు. దీన్ని రూ.2లక్షలకు పెంచాలని లేదా బీమా ప్రీమియం చెల్లింపుల కోసం ప్రత్యేక ఉప పరిమితిని అయినా తీసుకురావాలంటూ ఈ పరిశ్రమ కోరింది. ప్రత్యేక విభాగం..: జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులపై పన్ను ప్రయోజనాల కోసం రానున్న బడ్జెట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నట్టు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ సంజయ్ తివారీ తెలిపారు. మోటారు బీమా, టర్మ్, యూనిట్ లింక్డ్ (యులిప్) ప్లాన్లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఎండోమెంట్ ప్లాన్లను సేవింగ్ సాధనంగా పరిగణిస్తూ వీటికి సంబంధించి మొదటి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, తర్వాతి సంవత్సరం నుంచి 2.25 శాతం జీఎస్టీని అమలు చేస్తున్నారు. సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్లపై జీఎస్టీ 1.8 శాతంగా ఉంది. ఎన్పీఎస్, బీమా ఉత్పత్తుల మధ్య పన్నుల పరంగా అంతరం ఉంది. దీంతో ఎన్‌పీఎస్‌తో పోల్చినప్పుడు పెన్షన్/యాన్యుటీ ప్లాన్ల విషయంలో ఒకే హోదా కల్పించాలని బీమా కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5లక్షలకు అదనంగా.. సెక్షన్ 80సీసీడీ కింద ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల పెట్టుబడులపై పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంది. ఇదే విధమైన ప్రయోజనాలను బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ ప్లాన్లపై అందించాలని కోరుతున్నట్టు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో కామేష్రావు తెలిపారు. స్విస్ ఆర్ఈ డేటా ప్రకారం.. దేశంలో బీమా తలసరి ప్రీమియం 2019–20లో 78 డాలర్లు (రూ.5,850)గా ఉంటే, అంతర్జాతీయంగా ఇది 818 డాలర్లు (రూ.61,350)గా ఉంది. బీమా వ్యాప్తి (జీడీపీలో ప్రీమియం శాతం) 2019–20లో 3.76 శాతంగా ఉంది. జీవిత బీమా వ్యాప్తి దేశీయంగా 2.82 శాతంగా ఉంటే, అంతర్జాతీయ సగటు 3.55%. ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి.. ‘‘ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం తన వ్యయాలను బడ్జెట్లో ప్రస్తుతమున్న 1.2% నుంచి కనీసం 2.5%కి అయినా వచ్చే మూడేళ్ల కాలంలో పెంచాల్సి ఉంది. ఇందులో అధిక భాగం నిధులను ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆధునికీకరణకు వినియోగించాలి. ఈ దిశగా 2021–22 బడ్జెట్ తొలి అడుగు వేస్తుందని ఆశిస్తున్నాము’’ అని మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ, సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ కామర్స్‌కీ చేయూత దేశంలో ఏటేటా భారీగా విస్తరిస్తున్న ఈ కామర్స్ రంగానికీ వచ్చే బడ్జెట్లో కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ కామర్స్ దిగుమతులు, ఎగుమతులకు ఒకే విడతలో పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడం ఇందులో భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘దేశంలో ఈ కామర్స్ రంగం (ఆన్లైన్ వేదికలపై విక్రయాలు నిర్వహించే సంస్థలు) ఎన్నో రెట్లు వద్ధి చెందింది. దీంతో భారీ మొత్తంలో దిగుమతులు చేసుకుంటూ.. తిరిగి భారత్ నుంచి ఎగుమతులు చేస్తుండడంతో నియంత్రణ, సదుపాయాల పరంగా సమతుల్యత అవసరం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవసాయానికి భారీ రుణ సాయం! రూ.19లక్షల కోట్లకు పెంచే అవకాశం న్యూఢిల్లీ: దేశంలో రైతు ఆదాయాన్ని 2020 నాటికి రెట్టింపును చేయాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర సర్కారు.. ఇందు కోసం సాగు రంగానికి రుణ వితరణ (క్రెడిట్) లక్ష్యాన్ని రూ.19లక్షల కోట్లకు పెంచనుంది. ఫిబ్రవరి 1న తీసుకురానున్న బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి క్రెడిట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.15లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా.. దీంతో పోలిస్తే 35 శాతానికి పైగా పెరగనుంది. నిజానికి ఏటా సాగు రంగానికి రుణ లక్ష్యాన్ని కేంద్రం పెంచుతూ వస్తోంది. అంతేకాదు, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి రుణ వితరణ కూడా నమోదవుతోంది. 2017–18 సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, రూ.11.68 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. అలాగే, 2016–17లోనూ రూ.9లక్షల కోట్ల లక్ష్యాన్ని మించి.. రూ.10.66 లక్షల కోట్లకు పెరిగింది. నామమాత్రపు వడ్డీ... వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలపై 9 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. దీనిపై కేంద్రం రాయితీలు ఇస్తోంది. 2 శాతం రాయితీపోగా 7 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తే చాలు. అది కూడా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించేస్తే మరో 3 శాతాన్ని ప్రోత్సాహకంగా అందిస్తోంది. వెరసి నికర వడ్డీ రేటు 4 శాతమే అవుతోంది. -
బీమా... పూర్తిగా డిజిటల్!
వ్యక్తుల మధ్య భౌతిక దూరం.. అత్యవసర పనులకే కాలు బటయటపెట్టడం.. వీలుంటే ఇంటి నుంచే కార్యాలయ పని (వర్క్ ఫ్రమ్ హోమ్).. ఇవన్నీ కరోనా వైరస్ కారణంగా వచ్చిన మార్పులు. బీమా పరిశ్రమ అభివద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ పరిస్థితులను అర్థం చేసుకుంది. అన్ని రకాల టర్మ్ పాలసీలను, ఇందుకు సంబంధించి ఇతర సేవలను డిజిటల్ గా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆఫ్ లైన్ విభాగంలోని టర్మ్ ప్లాన్లు, వాటి డాక్యుమెంట్లను కూడా బీమా సంస్థలు ఇప్పుడిక డిజిటల్ గానే అందించనున్నాయి. ఫలితంగా పాలసీదారులు సౌకర్యంగా, తామున్న చోటు నుంచే పాలసీలను పొందే వీలు కలిగింది. కోవిడ్–19 ్టకాలంలో ఆఫ్ లైన్ బీమాకు సంబంధించి ఇదొక వెసులుబాటు. కరోనా వైరస్ చాలా రంగాల్లో డిజిటైజేషన్ కు దారితీసిందనే చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. బీమా సంస్థలు ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా పాలసీలను విక్రయించేందుకు, అదే విధంగా పాలసీదారులు ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకునేందుకు, బీమా క్లెయిమ్ లు చేసుకునేందుకు వీలుగా ఐఆర్డీఏఐ నిబంధనల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో బీమా పాలసీలను దాదాపు అన్ని సంస్థలు ఇప్పటికే ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఆఫ్ లైన్ లో అందించే టర్మ్ పాలసీలను కూడా డిజిటల్ రూపంలో అందించడం తాజాగా వచ్చిన మార్పుల్లో భాగమని చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ పూర్తిగా డిజిటల్ రూపం సంతరించుకునే దిశగా ఇది తొలి మెట్టుగానే భావించాలి. బీమా పరిశ్రమ మరింత విస్తరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడే వీలుంది. ప్రపోజల్స్‌కు డిజిటల్ ఆమోదం ఆన్ లైన్ ద్వారా టర్మ్ ప్లాన్లను కొనుగోలు చేయడం నేటి యువతరానికి కొత్తేమీ కాదు. కానీ, ఆఫ్ లైన్ లో అంటే బీమా ఏజెంట్లు లేదా బీమా కార్యాలయాల నుంచి పాలసీలను తీసుకోవాలంటే ప్రస్తుతం వెనుకాడాల్సిన పరిస్థితులున్నాయి. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా బీమా పాలసీల పంపిణీ, ప్రచారం అన్నది కరోనా వైరస్ విస్తరణ సమయంలో కష్టసాధ్యమని ఐఆర్డీఏఐ గుర్తించింది. భౌతికంగా పాలసీదారులు ప్రపోజల్ పత్రాలను పూర్తి చేయడం, సంతకాలు చేసిన తర్వాత వాటిని సమర్పించడం వంటి పనులపై కరోనా ప్రభావం ఉన్నట్టు గుర్తించిన ఐఆర్డీఏఐ నిబంధనల పరంగా వెలుసుబాటు కల్పించింది. ‘‘టర్మ్ ప్లాన్లు అర్థం చేసుకునేందుకు ఎంతో సులభంగా ఉంటాయి. ఇప్పుడు టర్మ్ ప్లాన్లను తీసుకునేందుకు భౌతికంగా సంతకాలు అవసరం లేకుండా చేయడం అన్నది మంచి నిర్ణయమే అవుతుంది’’ అని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ పేర్కొన్నారు. ‘‘కరోనా నేపథ్యంలో కస్టమర్లు ఎవరిని కలవాలన్నా వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రపోజల్ పత్రాలను ఫోన్ ద్వారా లేదా వీడియోకాల్ ద్వారా తీసుకుంటున్నాం. అయితే, సంతకం తీసుకోవడం సవాలుగానే ఉంది. దీంతో డిజిటల్ రూపంలో ఓటీపీ ద్వారా ఆమోదం తీసుకోవడం దీనికి పరిష్కారం. ప్రపోజల్ పత్రాలకు సంబంధించి కస్టమర్ల సంతకాలు లేకుండానే వారి ఆమోదం తీసుకునేందుకు బీమా సంస్థలను ఐఆర్డీఏఐ అనుమతించింది’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ న్యాయ, నిబంధనల విభాగం హెడ్ అనిల్ పీఎం తెలిపారు. ఈ విధానంలో కస్టమర్ల మెయిల్ బాక్స్ కు ఈ మెయిల్ రూపంలో లేదా మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ రూపంలో లింక్ ను బీమా సంస్థలు పంపిస్తాయి. ఈ లింక్ ను క్లిక్ చేసి వచ్చే పేజీలో ఓటీపీ ఇవ్వడం ద్వారా ప్రపోజల్ పత్రానికి ఆమోదం తెలియజేసినట్టు అవుతుంది. పూర్తిగా నింపిన ప్రపోజల్ పత్రానికి పాలసీదారులు ఆమోదం తెలిపినట్టుగా చట్టపరమైన ఆధారాలను బీమా సంస్థలు కలిగి ఉండాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా అవసరమైన డిజిటల్ సదుపాయాలు కల్పించుకోవాలని ఆదేశించినట్టు అనిల్ తెలిపారు. అదే విధంగా డిజిటల్ విధానంలో కస్టమర్లు ప్రపోజల్ పత్రానికి సంబంధించి ఆమోదం తెలియజేసే వరకు ప్రీమియం ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రయోగాత్మకంగా ఐఆర్డీఏఐ అనుమతించినట్టు చెప్పారు. ‘‘టర్మ్ ప్లాన్ల వ్యాపారం ఎక్కువగా ఆన్ లైన్ విధానంలో కొనసాగుతోంది. కాకపోతే ఐఆర్డీఏఐ తాజా ఆదేశాల వల్ల ఆఫ్ లైన్ విధానంలోనూ టర్మ్ ప్లాన్లను విక్రయించే బీమా సంస్థలకు వెసులుబాటు లభించనుంది. నిజంగా ఇది సులభతరమైన ప్రక్రియే అవుతుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తే ఇతర బీమా ఉత్పత్తులకూ ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది’’ అని అనిల్ వివరించారు. ఈ–పాలసీలు ఈ సమయంలో బీమా పాలసీ పత్రాలను ప్రచురించడం, వాటిని కస్టమర్లకు అందించడం చాలా కష్టమైన పని అంటూ బీమా కంపెనీలు ఐఆర్డీఏఐకు మొరపెట్టుకున్నాయి. తద్వారా అన్ని రకాల జీవిత బీమా పాలసీలను ఆన్ లైన్ లో డిజిటల్ రూపంలో అందించేందుకు అనుమతి పొందాయి. దీంతో కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి పాలసీ డాక్యుమెంట్లను వారి మెయిల్ ఐడీకి బీమా సంస్థలు పంపిస్తున్నాయి. 2016లో ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన నిబంధనల మేరకు.. బీమా ప్లాన్ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపించడంతోపాటు.. హార్డ్ కాపీని కూడా పాలసీదారులకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ సదుపాయాన్ని వినియోగించుకున్న కస్టమర్లకు మాత్రం బీమా ప్లాన్ డిజిటల్ కాపీని పంపిస్తే సరిపోయేది. ఇప్పుడిక ఈ నియంత్రణల్లేవు. పాలసీబాండ్ ను పీడీఎఫ్ రూపంలో కస్టమర్ మెయిల్ బాక్స్ కు పంపించినా సరిపోతుందని, ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ ను పంపించడం తప్పనిసరి కాదని అనిల్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రీలుక్ పీరియడ్ పరంగానూ జాప్యం అవుతోంది. కస్టమర్లు బీమా పాలసీని అందుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు తమకు నచ్చకపోతే వెనక్కి తిప్పి పంపొచ్చు. అప్పుడు కట్టిన ప్రీమియంలో అధిక భాగం వెనక్కి వచ్చేస్తుంది. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీని అందుకుంటున్న కస్టమర్లకు బీమా సంస్థలు 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ను అమలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు తమ పాలసీ డాక్యుమెంట్ ను అర్థం చేసుకునేందుకు మరింత సమయం లభించినట్టు అయింది. పాలసీ వద్దనుకుంటే 30 రోజుల్లోపు వారు ఎలక్ట్రానిక్ రూపంలోనే తిప్పి పంపించేయవచ్చని, కేవలం ఈ మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేసినా సరిపోతుందని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ తెలిపారు. మొత్తంమీద బీమా రంగం విస్తరణకు కూడా తాజా నిర్ణయాలు దోహదపడతాయని విశ్లేషణ. కస్టమర్ల అభీష్టమే.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా డిజిటల్ పాలసీలను పంపిస్తే చాలన్న వెసులుబాటును ఐఆర్డీఏఐ కల్పించింది. కానీ, తమకు ఫిజికల్ గా పాలసీ బాండ్ కావాలంటూ పాలసీదారులు డిమాండ్ చేస్తే బీమా సంస్థలు తప్పకుండా పంపించాల్సి ఉంటుంది. అందుకు ఎటువంటి చార్జీలను కూడా అదనంగా వసూలు చేయకూడదు. డిజిటల్ రూపంలో పాలసీల జారీ ప్రక్రియ వల్ల బీమా కంపెనీలకు నిర్వహణ, ప్రాసెస్ ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఆదా అయిన మొత్తాన్ని కస్టమర్ల సేవల మెరుగుదలపై కంపెనీలు ఖర్చు చేయగలవని గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల సందిగ్ధత తొలగిపోవడంతోపాటు, బీమా కంపెనీలు, కస్టమర్లు నేరుగా అనుసంధానమయ్యేందుకు, పారదర్శకత పెంపునకు దారితీస్తుంది. కొనుగోలు ప్రక్రియ సులభతరం అవడం వల్ల మరింత మంది బీమా పాలసీల కొనుగోలుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని బీమా కంపెనీలు అంటున్నాయి. అన్నింటి మాదిరే బీమా పాలసీ బాండ్ ను కూడా ఫోన్ ద్వారా పొందడం మంచి పరిణామంగా అనిల్ పేర్కొన్నారు. భౌతికంగా పాలసీ పత్రాలను పంపే విషయంలో చిరునామాల్లో తప్పులు దొర్లడం కారణంగా కొన్ని కంపెనీలకు తిరిగి వెళుతుంటాయి. అదే డిజిటల్ పాలసీ విషయంలో ఇటువంటి ఇబ్బందులు ఉండకపోవడం కూడా కస్టమర్లు, బీమా కంపెనీలకు సౌకర్యంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. -
అందరి కోసం.. ఆరోగ్య సంజీవని!
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అన్నది ఎన్నో జాగ్రత్తలు, పరిశీలనలతో.. కాస్తంత శ్రమతో కూడుకున్నది. పాలసీలో కవరేజీ వేటికి లభిస్తుంది, వేటికి మినహాయింపులు, షరతులు, నియమ నిబంధనలు.. చూడాల్సిన జాబితా పెద్దదే. పైగా అందరికీ ఇవి అర్థమవుతాయని చెప్పలేము. దీంతో బీమా కంపెనీల వందలాది పాలసీల్లో ఏది మెరుగైనది అని తేల్చుకోవడం అంత ఈజీ కాదు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. అన్ని రకాల సాధారణ కవరేజీ సదుపాయాలతో ఒకే ప్రామాణిక పాలసీని ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో 2020 ఏప్రిల్ నాటికి తీసుకురావాలని బీమా సంస్థలను ఆదేశించింది. దీంతో అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వైద్య సేవల ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కవరేజీ అవసరం ఎంతో ఉంది. ‘ఆరోగ్య సంజీవని’ అందరికీ అనుకూలమేనా..? గరిష్టంగా రూ. 5 లక్షల వరకు హెల్త్ కవరేజీని ఆరోగ్య సంజీవని పాలసీ కింద అందించాలన్నది తొలుత ఐఆర్డీఏఐ నిర్దేశించిన షరతు. రూ.5లక్షలకు మించి కూడా ఆఫర్ చేయవచ్చంటూ ఐఆర్డీఏఐ ఇటీవలే సవరణలు తెచ్చింది. ఈ ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకోని ప్రతీ సంవత్సరానికి గాను సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) 5 శాతం పెరుగుతూ వెళుతుంది. గరిష్టంగా 50 శాతం వరకు ఇలా బీమా రక్షణ కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంది. మోస్తరు ప్రీమియానికే విస్తృతమైన కవరేజీనిచ్చే ఈ ప్లాన్‌ను మొదటిసారి తీసుకునే వారు ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పరిమిత బడ్జెట్ ఉన్న వారికి ఇది మంచి ఎంపికే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పట్ల అవగాహన పెరుగుతున్నా కానీ, తీసుకుంటున్న వారి సంఖ్య మన దేశంలో ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంటోంది. అర్థం చేసుకునేందుకు సంక్లిష్టతలు, ప్రీమియం భరించలేనంత ఉండడం సగటు గృహస్తుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయకుండా అడ్డుపడుతోంది. కానీ, ఆరోగ్య సంజీవని పాలసీ సులభంగా, సమంజసమైన ప్రీమియంతో ఉండడం అనుకూలత’’ అని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. ఆర్జన ఆరంభమై, తనపై ఆధారపడిన వారు లేకుంటే (అవివాహితులు) ఈ ప్లాన్‌ను తప్పకుండా పరిశీలించొచ్చని ఆయన సూచించారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ సమగ్ర కవరేజీ కోరుకునే యువతీయువకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండడంతోపాటు రోజువారీ చికిత్సలు సహా కవరేజీ విస్తృతంగా ఉంటుంది’’ అని ఫిన్‌సేఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ మృణ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ అన్నది సులభమైన ప్రాథమిక పాలసీ. పైగా చౌక అయినది. కాకపోతే ఇందులో 5 శాతం కోపేమెంట్ (ఆస్పత్రి బిల్లులో 5 శాతాన్ని పాలసీదారు భరించడం) షరతు ఉండగా, పూర్తి స్థాయి ఆరోగ్య బీమా ప్లాన్లలో ఇది ఉండదు’’ అని పాలసీఎక్స్ డాట్‌కామ్ సీఈవో నావల్ గోయల్ తెలిపారు. వీటిని చూసి తీసుకుంటే మంచిది.. అనుకూలమేనా..? రూ.5 లక్షల గరిష్ట కవరేజీకే ప్రస్తుతం అవకాశం ఉంది. కాకపోతే అంతకుమించి ఆఫర్ చేయవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా అనుమతించడం సానుకూలం. పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల దృష్ట్యా రూ.5 లక్షల కవరేజీ అందరికీ, అన్ని వయసుల వారికీ, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో నివసించే వారికి సరిపోకపోవచ్చు. కనుక రూ.5 లక్షలకు మించి కవరేజీ పెంచుకునే అవకాశం ఉంటే ఈ పాలసీని పరిశీలించొచ్చు. పెంచుకునేందుకు అవకాశం లేకపోతే మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ పా లసీ అంత అనుకూలం కాదనే చెప్పుకోవాలి. ‘‘అధిక ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉండి, మెట్రోల్లో నివసిస్తున్న వారు అయితే ఆరోగ్య సంజీవని పాలసీ కాకుండా సమగ్ర కవరేజీనిచ్చే ఇతర ప్లాన్లను పరిశీలించొచ్చు’’ అని బాజ్‌పాయ్ సూచిం చారు. ‘‘తనపై పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే అధిక కవరేజీ అవసరమవుతుంది. సరిపడా కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి’’ అని మృణ్ అగర్వాల్ సూచించారు. ఒకవేళ ఇప్పటికే సమగ్ర కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా ప్లాన్ కలిగిన వారు ఆరోగ్య సంజీవనిని పరిశీలించాల్సిన అవసరం లేదు. ప్రీమియంలో వ్యత్యాసం..: ‘‘ఎన్ని క్లెయిమ్‌లు రావచ్చన్న అంచనా రేషియోల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. ప్రతీ బీమా సంస్థకు యాక్చుయేరియల్ బృందం ఉంటుంది. వారి అంచనాలు వేర్వేరుగా ఉండడం వల్లే ప్రీమియం రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అలాగే, అన్ని బీమా సంస్థ సేవల నాణ్యత ఒకే విధంగా ఉండదు. ప్రీమియంలో వ్యత్యాసానికి ఇది కూడా ఒక కారణం’’అని నావల్ గోయల్ వివరించారు. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఒక బీమా కంపెనీ ఒక ఏడాదిలో పాలసీల ప్రీమియం రూపేణా ఆర్జించిన ప్రతీ రూ.100 నుంచి ఎంత మొత్తాన్ని క్లెయిమ్‌లకు చెల్లింపులు చేసిందో తెలియజేస్తుంది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే అది పాలసీదారులకు ప్రయోజనం. కానీ, ఇది నూరు శాతం మించితే అది బీమా కంపెనీకి నష్టం. ఎందుకంటే ప్రీమియం ఆదాయానికి మించి క్లెయిమ్‌లు వస్తే బీమా సంస్థ నష్టపోవాల్సి వస్తుంది. దాంతో ప్రీమియంలు భారీగా పెంచేయాల్సి వస్తుంది. లేదంటే క్లెయిమ్‌లకు కొర్రీలు వేయాల్సి వస్తుంది. ఈ రేషియో 60 శాతానికి తక్కువ కాకుండా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తనకు వచ్చిన మొత్తం క్లెయిమ్ దరఖాస్తులలో ఎన్నింటికి కంపెనీ చెల్లింపులు చేసిందో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ రేషియో 90 శాతానికి పైన ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. వేగం, సేవలు క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించే సంస్థ నుంచి పాలసీ తీసుకోవడం సౌకర్యాన్నిస్తుంది. అలాగే, కస్టమర్ సేవలు మెరుగ్గా ఉండే కంపెనీని ఎంచుకోవాలి. నెట్వర్క్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలో మీరు నివసించే ప్రాంతాలకు సమీపంలోని ఆస్పత్రులు ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల నగదు రహిత సేవలను ఆయా ఆస్పత్రుల్లో పొందొచ్చు. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ అనారోగ్యానికి సంబంధించి ఆస్పత్రి లో చేరడానికి ముందు వ్యాధి నిర్ధారణ తదితర ఖర్చులు ఎదురవుతాయి. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఖర్చులు ఎదురవుతాయి. కనుక ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ కింద ఎక్కువ రోజులకు కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిన తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు లేదా షేరింగ్ రూమ్‌కు లేదా ప్రైవేటు రూమ్‌కు షిఫ్ట్ చేస్తుంటారు. ఏ రూమ్ అయినా సరే అన్న నిబంధన ఉండే పాలసీని ఎంచుకోవాలి. అలా కాకుండా పాలసీలో రూమ్ రెంట్ పరిమితి ఉంటే.. అంతకుమించిన చార్జీలతో కూడిన రూమ్ తీసుకుంటే.. ఆయా ఖరీదైన స్టేయింగ్ వద్ద చేసే వైద్య ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో బీమా కంపెనీ పూర్తి స్థాయి చార్జీలను చెల్లించదు. సబ్ లిమిట్స్ కొన్ని రోజువారీ చికిత్సలు, కొన్ని రకాల వ్యాధులకు సంబంధిం చి ఇంతే పరిహారం చెల్లిస్తామనే నిబంధనలు ఉంటాయి. వాటి ని కూడా పరిశీలించి సమ్మతం అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. రీస్టోరేషన్ సదుపాయం ఉదాహరణకు రూ.5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారనుకోండి. ఒక ఏడాదిలో ఎవరైనా ఆస్పత్రి పాలై బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు మరో రూ.5 లక్షలు ఆటోమేటిక్‌గా కవర్‌ను బీమా సంస్థ విడుదల చేస్తుంది. ఇదే రీస్టోరేషన్ బెనిఫిట్. ఒకరికి మించి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చి బిల్లు సమ్ ఇన్సూర్డ్ మొత్తం దాటిపోయిన సందర్భాల్లోనూ ఇది ఆదుకుంటుంది. అయితే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్‌ను ఒక ఏడాదిలో అప్పటికే చికిత్స పొందిన సమస్య కోసం చాలా బీమా సంస్థలు అందించడం లేదు. అంటే పాలసీదారు వేరొక సమస్య కోసం రీస్టోరేషన్‌ను పొందొచ్చు. ఏ సమ స్య అయిన రీస్టోరేషన్‌ను అనుమతించే పాలసీ మంచి ఎంపిక. కోపే ఆప్షన్ ఆస్పత్రి బిల్లులో పాలసీదారు ఎంత పెట్టుకోవాలన్నది ఇందులో ఉంటుంది. కొన్ని పాలసీల్లో కోపే షరతు ఉంటోంది. ఇలా ఉన్న పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. సూపర్ టాపప్..: హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకునేందుకు సూపర్ టాపప్ లేదా టాపప్ పేరుతో ఉండే ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని నిపుణుల సూచన. బేసిక్ హెల్త్ కవరేజీకి యాడాన్‌గా (జోడింపుగా) ఈ ప్లాన్ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది. -
కరోన 'రక్షణ' ఉందా..?
ఆరోగ్య బీమా అవసరాన్ని మనలో అధిక శాతం మంది ఇంతకాలం గుర్తించలేదు. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆరోగ్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. అందరికీ ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాలని నిర్దేశించింది. దీంతో అన్ని ప్రముఖ సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరుతో రెండు రకాల పాలసీలను ప్రవేశపెట్టాయి. కరోనా కోసం బీమా సంస్థలు తీసుకొచ్చిన రెండు ప్రామాణిక పాలసీల్లో ఏది మీకు అనుకూలం..? వీటిల్లో కవరేజీ, మినహాయింపులు తదితర సమగ్ర అంశాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. పాలసీల్లో వైరుధ్యం.. కరోనా కవచ్, కరోనా రక్షక్ రెండు రకాల పాలసీలు కోవిడ్–19 చికిత్సలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించినవి. కరోనా కవచ్ పాలసీ ఇండెమ్నిటీ ప్లాన్. అంటే కరోనా కారణంగా చికిత్సలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. తీసుకున్న బీమా మొత్తానికి ఇది పరిమితం అవుతుంది. ఇక కరోనా రక్షక్ పాలసీ అనేది బెనిఫిట్ పాలసీ. అంటే కరోనా బారిన పడితే ఎంచుకున్న బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించేస్తుంది. కరోనా పాజిటివ్ అని తేలి, కనీసం 72 గంటలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తేనే కరోనా రక్షక్ పాలసీ ప్రయోజనం లభిస్తుంది. ప్రభు త్వం గుర్తింపు కలిగిన ల్యాబ్‌ల్లో పరీక్షల ద్వారా కరోనా నిర్ధారణ అయితేనే ఈ రెండు పాలసీల్లోనూ పరిహారం లభిస్తుంది. కరోనా కవచ్ పాలసీ విడిగా వ్యక్తులకు, లేదా కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ పాలసీ రూపంలో అందుబాటులో ఉంటుంది. కరోనా రక్షక్ పాలసీ అనేది కుటుంబానికి కాకుండా ప్రతీ వ్యక్తి విడిగా తీసుకోవాల్సిన పాలసీ. ఈ 2 రకాల పాలసీలు 105 రోజులు (3.5 నెలలు), 195 రోజులు (6.5 నెలలు), 285 రోజుల (9.5 నెలలు) కా లానికి లభిస్తాయి. ఆ తర్వాత అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. కనీస బీమా రూ. 50,000 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా కరోనా కవచ్ పాలసీలో రూ.5 లక్షల బీమాను ఎంచుకోవచ్చు. కరోనా రక్షక్ ప్లాన్‌లో గరిష్ట బీమా రూ.2.5 లక్షలకు పరిమితం అవుతుంది. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాల అర్హత మేరకు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీల్లో ప్రీమియం వాయిదాల రూపంలో కాకుండా ఒకే విడత చెల్లించాలి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరడం ద్వారా కరోనా కవచ్ పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. ఈ పాలసీలను ఆయా బీమా సంస్థల పోర్టళ్లు, పంపిణీ చానళ్లు, ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చా..? బీమా కంపెనీ ఏదైనా కానీ ఈ రెండు రకాల పాలసీలకు సంబంధించి అధిక శాతం నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రీమియం, బీమా సంస్థ అందించే సేవల నాణ్యత, క్లెయిమ్‌లను వేగంగా ఆమోదించడం వంటి విషయాలను పరిశీలించాలి. అదే విధంగా బీమా కంపెనీల చెల్లింపుల చరిత్రను చూసిన తర్వాతే మీకు అనుకూలమైన సంస్థ నుంచి పాలసీని ఎంచుకోవాలి. ఈ పాలసీల్లో ప్రాంతాల వారీగా ప్రీమియంలో వ్యత్యాసం ఉండదు. రెగ్యులర్ హెల్త్ ప్లాన్లలో ప్రాంతాల వారీగా ప్రీమియం మారిపోవడాన్ని గమనించొచ్చు. కానీ కోవిడ్ పాలసీల్లో ప్రీమియం అన్ని ప్రాంతాల వారికి ఒకే రీతిలో ఉంటుంది. 40 ఏళ్ల వ్యక్తి మూడున్నర నెలల కాలానికి కరోనా కవచ్ పాలసీని ఎంచుకుంటే ప్రీమియం కనిష్టంగా రూ.636 నుంచి గరిష్టంగా రూ.3,831 వరకు ఉంటుంది. అదే 9.5 నెలల కోసం ఇదే వయసున్న వ్యక్తికి ప్రీమియం రూ.1,286–5,172 మధ్య ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఓ సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండి, అందులో ఔట్ పేషెంట్ చికిత్సలకు కూడా కవరేజీ ఉండుంటే అప్పుడు ప్రత్యేకంగా కరోనా కవచ్ పాలసీని తీసుకోవాల్సిన అవసరం లేనట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని హెల్త్ ప్లాన్లలో కరోనాకు కవరేజీ లభిస్తుంది. కాకపోతే కరోనా వల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తే.. అన్ని ప్లాన్లలోనూ పరిహారం రాకపోవచ్చు. కానీ కరోనా రక్షక్ పాలసీ ఎవరికైనా అనుకూలమే. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ ప్లాన్ ఉన్నా కానీ.. కరోనా రక్షక్‌లో ఏకమొత్తంలో పరిహారం అందుకోవచ్చు. ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండి, బీమా మొత్తాన్ని మించిపోయినా అప్పుడు కరోనా రక్షక్ ఆదుకుంటుంది. కానీ, కరోనా రక్షక్‌లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటేనే పరిహారం లభిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ ప్లాన్ లేని వారు ప్రస్తుత కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ను తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. కవరేజీ వేటికి..? కరోనా కవచ్ పాలసీలో.. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నా.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా గరిష్ట బీమా మేరకు పరిహారం పొందొచ్చు. ఆస్పత్రిలో కనీసం 24 గంటల పాటు చికిత్స పొందినప్పుడే ఖర్చులను చెల్లిస్తుంది. రూమ్ అద్దె, బోర్డింగ్, నర్సింగ్ చార్జీలు, ఐసీయూ, అంబులెన్స్ (రూ.2,000వరకు) చార్జీలను కూడా పొందొచ్చు. వైద్య, కన్సల్టెంట్, ఆపరేషన్ థియేటర్, పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌కు అయ్యే వ్యయాలకూ బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స పొందితే.. గరిష్టంగా 14 రోజుల చికిత్స వ్యయా లను భరిస్తుంది. అది కూడా వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆయుర్వేద ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా చేరి చికిత్స తీసుకున్నా కరోనా కవచ్ పాలసీ కవరేజీనిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు (15 రోజులు), ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం 30 రోజుల వరకు ఔషధాలు, ఇతర వ్యాధి నిర్ధారణ, వైద్యుల కన్సల్టేషన్ కోసం అయ్యే ఖర్చులనూ పొందొచ్చు. కరోనా కవచ్ పాలసీలు ‘హాస్పిటల్ డైలీ క్యాష్’ రైడర్‌నూ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు అవుతుంటాయి. అటువంటప్పుడు ఈ కవరేజీ అక్కరకు వస్తుంది. దీన్ని ఎంచుకుంటే బీమా మొత్తంలో 0.5 శాతాన్ని ప్రతీ రోజుకు బీమా సంస్థలు అందిస్తాయి. కాకపోతే 24 గంటలకు మించి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. అదే కరోనా రక్షక్పాలసీ విషయంలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఎంచుకున్న బీమా పరిహారాన్ని ఏక మొత్తంలో పొందవచ్చు. ఉదాహరణకు రూ.2.5 లక్షల సమ్ ఇన్సూర్డ్ ఎంచుకున్నారనుకుంటే.. కరోనా పాజిటివ్ అయి 72 గంటలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు ఎంతయిందన్న దానితో సంబంధం లేకుండా బీమా సంస్థ రూ.2.5 లక్షలను చెల్లించేస్తుంది. 72 గంటల్లోపు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయితే ఈ పాలసీలో పరిహారం రాదు. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి ఇతర హెల్త్ ప్లాన్లలో మాదిరే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల్లోనూ 15 రోజులు వేచి ఉండే కాలం (వెయిటింగ్ పీరియడ్) అమల్లో ఉంటుంది. అంటే పాలసీ ఇష్యూ చేసిన మొదటి 15 రోజుల్లో కరోనా బారిన పడినా క్లెయిమ్‌కు అర్హత ఉండదు. పరిహారానికి సంబంధించి తగ్గింపు నిబంధనల్లేవు. పోర్టబులిటీ ఆప్షన్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నది బీమా సంస్థలను బట్టి నిబంధనలు వేర్వేరుగా అమల్లో ఉండొచ్చు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి కరోనా కవచ్ పాలసీ ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు రకాల పాలసీల్లో మినహాయింపులు కొన్ని ఉన్నాయి. ఆమోదం లేని చికిత్సా విధానాలకు ఇందులో కవరేజీ లభించదు. కరోనా చికిత్సలో భాగంగా కొన్ని మందులను ప్రయోగాత్మకంగా ఇస్తున్న వార్తలను వింటూనే ఉన్నాం. నియంత్రణ సంస్థల ఆమోదంతో ఇస్తున్న ఔషధాలు, చికిత్సలకు సంబంధించే కవరేజీ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రయాణ పరంగా ఆంక్షలు అమల్లో ఉన్న ఏ ఇతర దేశంలో పర్యటించినా పాలసీ రద్దయిపోతుంది. డే కేర్ చికిత్సలు (ఆస్పత్రిలో చేరకుండా తీసుకునే చికిత్సలు), ఔట్ పేషెంట్ చికిత్సలకు కరోనా కవచ్ పాలసీలో కవరేజీ ఉండదు. కరోనా ప్రత్యేక పాలసీలకు వస్తున్న స్పందన అనూహ్యం. పాలసీబజార్ వెబ్సైట్ నిత్యం 300–500 పాలసీలను విక్రయిస్తోంది. తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. – అముత్ చాబ్రా, హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్, పాలసీబజార్ ఎక్కువ మంది తొమ్మిదిన్నర నెలల కాలానికి పాలసీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ 40 శాతం మంది హాస్పిటల్ డైలీ క్యాష్‌ను ఎంచుకుంటున్నారు. – సుబ్రతా మోండల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (అండర్‌రైటింగ్), ఇఫ్కోటోకియా జనరల్ ఇన్సూరెన్స్ కుటుంబంలోని ఇతర సభ్యులకు కవరేజీతోపాటు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా ఖర్చులు చెల్లించే ఫీచర్లు ఉండడం ఎక్కువ ఆసక్తికి కారణం. – సుబ్రమణ్యం బ్రహ్మజోస్యుల, అండర్‌రైటింగ్ హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్‌బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
బీమా సంస్థల విలీనం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విలీన ప్రక్రియను నిలిపి వేసిన ప్రభుత్వం లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయం ప్రకారం మూడు బీమా సంస్థలకోసం 12,450 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెరో 5 వేల కోట్ల రూపాయలను నిధులు కేటాయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. బలహీనమైన ఆర్థిక స్థితికితోడు సంస్థలు వినియోగిస్తున్న వివిధ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు, తదితర కారణాల రీత్యా ప్రస్తుత ప్రరిస్థితుల్లో విలీనం ఒక సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. -
బీమా రంగంలో కొత్తగా 5వేల ఉద్యోగాలు!
జూన్ త్రైమాసికంలో వివిధ ఇన్స్యూరెన్స్ కంపెనీలు దాదాపు ఐదు వేల మందిని కొత్తగా నియమించుకోనున్నాయి. లాక్డౌన్ అనంతరం వ్యాపారం ఊపందుకుంటుందన్న అంచనాలతో అటు లైఫ్, ఇటు జనరల్ బీమా సంస్థలు నియామకాలకు సై అంటున్నాయి. ఈ త్రైమాసికంలో దాదాపు 1500 మందిని నియమించుకోవాలని పీఎన్బీ మెట్‌లైఫ్ సిద్దమవుతోంది. ఏడాది చివరకు ఈ నియామకాలను 3వేలకు పెంచుకోవాలని భావిస్తోంది. కెనరా హెచ్ఎస్బీసీ, ఓబీసీ లైఫ్ సంస్థలు చెరో వెయ్యిమందిని నియమించుకునే యత్నాల్లో ఉన్నాయి. టాటా ఏఐజీసంస్థ సైతం కొత్తగా వెయ్యిమందిని, టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా 500 మందిని నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పటికే 300 నియామకాలు చేపట్టిన రిలయన్స్ నిప్పన్ లైఫ్ మరో 400 మందిని రిక్రూట్ చేసుకునేందుకు తయారైంది. కరోనా సంక్షోభానంతరం బీమా తీసుకునేవాళ్లు పెరుగుతారని కంపెనీలు భావించి తదనుగుణంగా నియామకాలు చేపడుతున్నాయని టీమ్‌లీజ్ రిక్రూటింగ్ సంస్థ అధిపతి అజయ్ షా అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఈ రంగంలో చోటుచేసుకున్న కొత్త కలయికలు, విలీనాలతో ఉద్యోగాలు పెరగనున్నాయన్నారు. లాక్డౌన్ అనంతరం తిరిగి ఎకానమీలో వ్యాపార కార్యకలాపాలు ఆరంభమై, వేతన జీవులకు సమయానికి జీతాలు వచ్చే పరిస్థితులు నెలకొంటే ముందుగా బీమా ఉత్పత్తుల వైపు చూస్తారని ఎక్కువమంది ఇన్స్యూరెన్స్ నిపుణులు భావిస్తున్నారు. ప్రజలకు తమ ఆరోగ్యాలు, తమవారి జీవితాలపై శ్రద్ధ పెరగడం బీమా రంగం మరింత దూసుకుపోయేందుకు దోహదం చేస్తాయంటున్నారు. -
ఇలా చనిపోతే బీమా హుళక్కే!
బీమా పాలసీ ఉన్న వారు మరణానికి గురైతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం అన్నది సహజమే. బీమా పాలసీ తీసుకునేదే అందుకు కదా..! అయితే, ఏ కారణంతో మరణించినా జీవిత బీమా పరిహారం వస్తుందని నిశ్చింతగా ఉంటే కుదరదు. ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రకాల మరణాలకు జీవిత బీమా పాలసీల్లో కవరేజీ ఉండదన్న విషయం ముమ్మాటికీ నిజం. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కలిగిన వారు లేదా తీసుకోవాలనుకునే వారు ఏ మరణాలకు పరిహారం ఉండదన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలే ఇవి... హత్యకు గురైతే.. ఉదాహరణకు.. పాలసీదారుడు హత్య కారణంగా చనిపోయినట్టు ధ్రువీకరణ అయితే, అదే సమయంలో నామినీయే హత్యలో పాల్గొన్నట్టు విచారణలు స్పష్టం చేస్తుంటే బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. నామినీపై హత్యాభియోగాలు తొలగిస్తే లేదా నిర్దోషి అయితేనే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. కేసు నామినీకి అనుకూలంగా వచ్చేంత వరకు బీమా సంస్థ పరిహార చెల్లింపులను నిరవధికంగా నిలిపివేస్తుంది’’ అని ఇండియన్ మనీ డాట్ కామ్ సీఈవో సీఎస్ సుధీర్ తెలిపారు. అలాగే, పాలసీదారులు నేరపూరిత చర్యల్లో పాల్గొని చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీలు పరిహార చెల్లింపును తిరస్కరిస్తాయి. ‘‘నేర కార్యకలాపాల్లో పాలసీదారుడు పాల్గొన్నట్టు నిరూపితం అయితే నామినీలకు పరిహార చెల్లింపు జరగదు. ఎటువంటి నేర కార్యక్రమంలో పాల్గొని చనిపోయినా కానీ, చట్ట ప్రకారం అది కవరేజీ పరిధిలోకి రాదు. ఒకవేళ పాలసీదారుకు నేరపూరిత చరిత్ర ఉండుండి, సహజ కారణాల వల్ల.. ఉదాహరణకు స్వైన్ ఫ్లూ లేదా డెంగీ లేదా పిడుగుపాటు కారణంగా చనిపోతే పరిహారాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు’’ అని పాలసీబజార్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్ తెలిపారు. ముందస్తు వ్యాధుల వల్ల.. టర్మ్ పాలసీ తీసుకునే నాటికి ఉన్న అనారోగ్య సమస్యలను దరఖాస్తు పత్రంలో తప్పకుండా వెల్లడించాలి. లేదంటే ఆ సమస్యల కారణంగా ఆ తర్వాత కాలంలో పాలసీదారుడు మరణించినట్టయితే.. బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజీ కాని మరణ కేసులు ఎన్నో ఉన్నాయని సుధీర్ వెల్లడించారు. ‘‘స్వయంగా చేసుకున్న గాయాల కారణంగా, లేదా ప్రమాదకర విన్యాసాల కారణంగా, లైంగింకంగా సంక్రమించే హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి వ్యాధుల కారణంగా లేదా మందుల అధిక మోతాదు కారణంగా చనిపోతే.. వారికి ప్రత్యేక రైడర్లు ఉంటే తప్ప బీమా సంస్థలు పరిహారాన్ని నిరాకరిస్తాయి’’ అని సుధీర్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్నా.. బీమా పాలసీ తీసుకున్న వారు, మొదటి ఏడాది కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టయితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. అయితే, చాలా కంపెనీలు పాలసీదారులకు రెండో ఏడాది నుంచి ఆత్మహత్యకు కూడా పరిహారాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వ్యక్తి భూకంపం, తీవ్ర తుపాను వంటి ప్రమాదాల్లో మరణించినట్టయితే నామినీలకు పరిహారం రాదు. ‘‘సునామీ, భూకంపం వంటి ప్రకృతి ఉత్పాతాల వల్ల తలెత్తే మరణాలు టర్మ్ పాలసీల్లో కవర్ అవ్వవు’’ అని సుధీర్ తెలిపారు. ప్రసవం కారణంగా.. పాలసీ కలిగిన వారు గర్భధారణ కారణంగా లేదా ప్రసవం సమయంలో చనిపోయినట్టయితే బీమా సంస్థ నామినీకి పరిహారం చెల్లించదు. ఇటువంటి మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవర్ కావని అగర్వాల్ వెల్లడించారు. ప్రమాదకరమైన కార్యకలాపాలు.. సాహసోపేత లేదా ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మరణానికి గురైతే అటువంటి సందర్భాలకు బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ఎందుకంటే ఈ తరహా కార్యకలాపాల్లో ప్రాణ ప్రమాదం అధికంగా ఉంటుంది. ‘‘ప్రమాదకరమైన క్రీడలు.. కార్, బైక్ రేసింగ్, స్కైడైవింగ్, పారాగ్లైడింగ్, పారాచ్యూట్ తదితర వాటిల్లో పాల్గొనే వారు పాలసీ తీసుకునే సమయంలోనే వాటి గురించి వెల్లడించాలి. లేకపోతే ఈ వివరాలను వెల్లడించని కారణంగా బీమా కంపెనీలు భవిష్యత్తులో వచ్చే క్లెయిమ్‌లను అంగీకరించవు’’ అని అగర్వాల్ సూచించారు. మద్యం ప్రభావం కారణంగా.. ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాలు తీసుకుని వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీ పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తుంది. ‘‘మద్యం తరచుగా తీసుకునే వారికి, మాదకద్రవ్యాల అలవాటు ఉన్న వారికి బీమా కంపెనీలు అరుదుగానే పాలసీలను ఇస్తుంటాయి. టర్మ్ బీమా తీసుకునే సమయంలో ఈ అలవాట్ల గురించి వెల్లడించకపోతే, ఆ తర్వాత ఈ అలవాట్ల కారణంగా పాలసీదారులు మరణానికి గురైతే.. పరిహారాన్ని కంపెనీలు నిలిపివేస్తాయి. అధికంగా మద్యం సేవించే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ లభించడం కష్టమే’’ అని సుధీర్ వివరించారు. ‘‘ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకునే వారు అయితే, భవిష్యత్తులో మరణ పరిహార క్లెయిమ్ తిరస్కరణకు గురికాకూడదని భావిస్తే.. ఆల్కహాల్‌ను ఏ మోతాదులో తీసుకుంటారనే వివరాలను ప్రపోజల్ పత్రంలో వెల్లడించడం తప్పనిసరి’’ అని కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ అక్చుయరీ సునీల్‌శర్మ సూచించారు. పొగతాగే అలవాటు దాచిపెడితే.. సాధారణంగా పొగతాగే అలవాటును చాలా మంది బీమా పాలసీ దరఖాస్తు పత్రాల్లో వెల్లడించరు. వెల్లడిస్తే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందని అలా చేస్తుంటారు. కానీ, పొగతాగే అలవాటు ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అనారోగ్య అలవాటు కారణంగా వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలవాటు తీవ్రతను బట్టి కేన్సర్ వంటివి సోకి మరణించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ విధమైన రిస్క్ ఉంటుంది కనుకనే బీమా కంపెనీలు పొగతాగే అలవాటు ఉన్న వారికి బీమా ప్రీమియంను అధికంగా నిర్ణయిస్తుంటాయి. పొగతాగే అలవాటును బీమా పాలసీల్లో వెల్లడించని వారు, ఆ తర్వాత అదే అలవాటు కారణంగా అనారోగ్యంతో మరణిస్తే పరిహారాన్ని తిరస్కరించేందుకు దారితీస్తుందని సుధీర్ తెలిపారు. పాలసీ దరఖాస్తును పూర్తిగా చదివిన తర్వాతే టర్మ్ పాలసీని తీసుకోవాలని.. మినహాయింపుల గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని సూచించారు. -
కాలుష్య నగరాల ప్రజలకు మరో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న పలు నగరాల ప్రజలకు మరో షాక్ తగిలింది. కాలుష్య కాసారంలో మగ్గుతున్న వివిధ నగరాలవాసులు ఆరోగ్య బీమా పొందాలంటే ఇక మీద ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర శ్వాసకోశ వ్యాధులు తీవ్రం కానున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 5 శాతం అదనంగా చెల్లించాలని బీమా కంపెనీలు చెప్పబోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని క్లెయిమ్‌ల డేటా భారీ పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ వైపుగా ఆలోచిస్తున్నాయి. అంతేకాదు కొత్తగా పాలసీ తీసుకునే వారిని మరిన్ని ఆరోగ్య పరీక్షలను కూడా అడగవచ్చని భావిస్తున్నారు. జోన్ ఆధారిత ధరలను నిర్ణయించడం బావుంటుందని మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎండీ ఆశిష్ మెహ్రోత్రా అభిప్రాయపడగా, నివాస ప్రాంతాల ఆధారంగా పాలసీని లోడ్ చేయడం సంక్లిష్టంగా ఉంటుందని మరో ఆరోగ్య బీమా సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతోపాటు ఢిల్లీ, దాని చుట్లుపక్కల ప్రాంతాల ఆరోగ్య బీమా పాలసీల్లో అధిక స్థాయిలో మోసపూరిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండటంతో, ధరలను నిర్ణయించడంలో ఇది కూడా కీలకమని బీమా అధికారులు తెలిపారు. కాగా దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో మరోసారి కాలుష్య పొట దట్టంగా ఆవిరించింది. బుధవారం దట్టమైన కాలుష్య పొర నగరాన్ని కమ్మేసింది. కాలుష్య స్థాయిలు ప్రమాద స్థాయికి చేరడంతో నగర మున్సిపాలిటీ విభాగం (ఎన్ఎండీసీ) చెట్లపై నీళ్లను చల్లడం లాంటి ఉపశమన చర్యలను చేపట్టింది. Delhi: New Delhi Municipal Council (NDMC) sprinkles water in the area around Feroz Shah Road to settle the dust, as a pollution control measure. pic.twitter.com/1njTooN6X0 — ANI (@ANI) November 13, 2019 -
బీమా ‘పంట’ పండటంలేదు!
న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండటం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎం ఎఫ్బీవై కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్‌ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీఆర్ఈ) సైతం తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది. పెరిగిన స్థూల ప్రీమియం పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్‌గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర క్రాప్ ఇన్సూరెన్స్‌లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఎలాంటి క్రాప్ బీమా వ్యాపారాన్ని నమో దు చేయబోవడంలేదని రీ ఇన్సూరెన్స్ చార్జీలు దిగిరావాల్సి ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పరిస్థితులు ఇలా.. ► ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిధిలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారం నుంచి తప్పుకుంది. ► చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. ► అధిక నష్టాలు, పరిహారం కోరుతూ భారీగా వస్తున్న క్లెయిమ్‌లు. ► ప్రభుత్వరంగ రీఇన్సూరెన్స్ సంస్థ జీఐసీఆర్ఈ సైతం తన క్రాప్ పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుంది. ► ప్రభుత్వరంగ నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మాత్రం ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా చూస్తే... అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద పంటల బీమా మార్కెట్ మనదే కావడం గమనార్హం. -
‘బీమా’ సంగతేంటి..?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మధ్య మెగా విలీనానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న బీమా, ఇతర ఆర్థిక వ్యాపారాల పరిస్థితి ఏంటన్న సందేహం తలెత్తుతోంది. 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 4 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో పలు బ్యాంకులు అనుబంధంగా బీమా వ్యాపార కంపెనీలను నిర్వహిస్తున్నాయి. వీటిని ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానాలు లభించాల్సి ఉంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనలు.. ఒక సంస్థ ఒకటికి మించి బీమా కంపెనీలను నిర్వహించరాదు. ప్రభుత్వరంగ బ్యాంకులు పలు బీమా కంపెనీలకు ప్రమోటర్లుగా ఉండడంతో ఇప్పుడు చిక్కు వచ్చి పడింది. ఉదాహరణకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు స్టార్ యూనియన్ దైచి లైఫ్ ఇన్సూరెన్స్‌లో 25.10 శాతం వాటా ఉంది. అలాగే, తాను విలీనం చేసుకోబోతున్న ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 30 శాతం వాటా ఉంది. అలాగే, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటా ఉంది. ఇక పీఎన్బీ విలీనం చేసుకోనున్న ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) బ్యాంకుకు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 23 శాతం వాటా ఉంది. ఇదే హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్‌లో కెనరా బ్యాంకు 51 శాతం వాటా కలిగి ఉంది. అలహాబాద్ బ్యాంకుకు యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రణాళికల ప్రకారం... పీఎన్బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనమై పీఎన్బీగా కొనసాగుతాయి. యూనియన్ బ్యాంకు అయితే ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం చేసుకోనుంది. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకు విలీనం చేసుకోనున్నాయి. కన్సాలిడేషన్ తప్పదు.. ‘‘ఓ బీమా కంపెనీలో 15 శాతానికి మించి వాటాలు కలిగి ఉంటే ప్రమోటర్ అవుతారు. 15 శాతం కంటే తక్కువ ఉంటే ఇన్వెస్టర్‌గా పరిగణించడం జరుగుతుంది. రెండు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా ఉన్న రెండు బ్యాంకులను విలీనం చేస్తుంటే.. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకు రెండు బీమా కంపెనీల్లో ప్రమోటర్‌గా కొనసాగడానికి లేదు. కనుక రెండింటిలోనూ తన వాటాలను 15 శాతానికి తగ్గించుకోవడం ద్వారా ఇన్వెస్టర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. లేదా ఒక బీమా కంపెనీలో వాటాలను పూర్తిగా విక్రయించి, మరో బీమా కంపెనీలో ప్రమోటర్‌గా కొనసాగొచ్చు’’ అని ఐఆర్డీఏఐ మాజీ సభ్యుడు ఒకరు తెలిపారు. నిపుణులు ఏమంటున్నారు..? ‘‘విలీనానంతర బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలను కలిగి ఉంటే అప్పుడు.. ఒక బీమా సంస్థ ఒప్పందం చేసుకుంటే, రెండోది దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. అయితే, దీనిని ఎవరు చేయాలన్నదే ప్రశ్న. బ్యాంకులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో బీమా కంపెనీల్లో వాటాలను తీసుకుంటుంటాయి. పాలసీలను విక్రయించడం ద్వారా అవి ఆదాయం సంపాదిస్తాయి’’ అని అశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ ఎండీ అశ్విన్ పరేఖ్ అన్నారు. ‘‘బీమా కంపెనీల్లో క్రాస్ హోల్డింగ్స్‌ను పరిష్కరించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు స్టార్ యూనియన్ దైచీ లైఫ్‌లో యూనియన్ బ్యాంకు తనకున్న వాటాలను విక్రయించొచ్చు. ఎందుకంటే ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్‌లో ఇంతకంటే అధిక వాటాలు ఉన్నాయి. లేదంటే రెండు బీమా సంస్థల్లోనూ 10 శాతం చొప్పున వాటాలతో ఇన్వెస్టర్‌గా కొనసాగొచ్చు’’ అని ఓ ప్రైవేటు జీవిత బీమా సంస్థ సీఈవో అన్నారు. అయితే, భవిష్యత్తు వ్యాపార అవకాశాల దృష్ట్యా విలీనానంతర బ్యాంకు.. బీమా సంస్థల్లో మైనారిటీ వాటాలను కొనసాగిస్తూ, వాటి ఉత్పత్తులకు పంపిణీదారుగా వ్యవహరించడం సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని యూనియన్ బ్యాంకు ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. అయితే, విలీనం తర్వాత వాటాలు కలిగి ఉన్న ఒకటికి మించిన బీమా సంస్థలను విలీనం చేసుకోవచ్చు. కానీ, అవన్నీ ప్రైవేటు బీమా కంపెనీలు. పైగా వాటిల్లో విదేశీ భాగస్వాములు కూడా ఉన్నారు. కనుక విలీనానికి అంగీకారం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. -
వరుణ దేవుడా... క్రికెట్ మ్యాచ్‌లకు అడ్డురాకు...!
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ సందర్భంగా... భారత మ్యాచులకు అడ్డు పడొద్దు వరుణుడా..!? అని సగటు అభిమానులు ప్రార్థించడం సర్వ సాధారణం. కానీ, బీమా కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా భారత మ్యాచులు రద్దయితే బీమా కంపెనీలు పరిహారం రూపంలో రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత్ మరో నాలుగు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఈ నాలుగు కూడా వర్షం కారణంగా రద్దు కావన్న ఆశలతో బీమా కంపెనీలు ఉన్నాయి. తొలి దశలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా కోల్పోవాల్సి వచ్చిన విషయం గమనార్హం. ప్రస్తుత ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు వర్షం అడ్డుతగిలింది. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి మన దేశంలో రూ.150 కోట్ల బీమా మార్కెట్ ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ఈ తరహా బీమా పాలసీలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. క్లెయిమ్స్ ఎదురైతే వీటిపైనే ఎక్కువ భారం పడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌కు రూ.50కోట్లు భారీగా వెచ్చించి ఐసీసీ క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ప్రసార మాధ్యమాలు సాధారణంగా క్రికెట్ మ్యాచులు రద్దయితే తలెత్తే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ పాలసీలను తీసుకుంటుంటాయి. దీంతో వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా, వర్షం కారణంగా అవరోధం ఏర్పడి మ్యాచ్‌ను కుదించడం వల్ల ప్రకటనల ఆదాయం నష్టపోవడం జరిగినా పరిహారం పొందొచ్చు. మ్యాచ్ యథావిధిగా జరిగితే బీమా కంపెనీలు ఊపిరిపీల్చుకున్నట్టే. భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏకంగా రూ.50 కోట్ల బీమా తీసుకోవడం దీనికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు... ఒక్కో మ్యాచ్ ప్రసార సమయంలో ప్రకటనలపై రూ.5–50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అదే ఫైనల్స్, సెమీ ఫైనల్స్ వంఇ ప్రత్యేక మ్యాచుల్లో ఈ ఆదాయం రూ.70–80 కోట్ల వరకు ఉంటుంది. -
విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయంలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్టయితే మార్చి నెలలో రంగాల వారీగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బీమా రంగమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. 2018 మార్చి తర్వాత ఒక నెలలో బీమా రంగంలోకి అధిక పెట్టుబడులు రావడం కూడా గత నెలలోనే. ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో డీల్స్ ‘‘ఎఫ్‌పీఐల పెట్టుబడులను కంపెనీల మూలాలు, ధరల పనితీరు, మొత్తం మార్కెట్ పెట్టుబడుల కోణంలో చూడాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలు ఫిబ్రవరి నెల ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో శిల్పా కుమార్ పేర్కొన్నారు. ఒకవైపు అధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులకు తోడు బీమా రంగంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఒప్పందాలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ తనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాటాల్లో 3.7 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు). అలాగే, దీనికి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో స్టాండర్డ్ లైఫ్ 4.93 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలోనే తగ్గించుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒకానొక భాగస్వామి బీఎన్పీ పారిబాస్ కార్డిఫ్ సైతం 5 శాతం మేర వాటాలను బ్లాక్ డీల్ ద్వారా రూ.3,000 కోట్లకు మార్చి నెలలో విక్రయించింది. వృద్ధి అవకాశాలు... ఆర్థిక రంగంలో బీమా కూడా అధిక వృద్ధితో కూడిన రంగమని శిల్పా కుమార్ పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు బీమా సంస్థలు వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం పరంగా 20 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అదే సాధారణబీమా సంస్థలు వార్షికంగా మొత్తం మీద 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వైద్య బీమా వ్యాపారం అయితే 40 శాతం మేర వృద్ధి చెందింది’’ అని ఆమె వివరించారు. బీమా రంగం పట్ల ఆసక్తి తిరిగి పుంజుకుందని, భౌగోళికంగా భిన్న ప్రాంతాల నుంచి... ఎఫ్‌పీఐలు, సావరీన్ వెల్త్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి భాగస్వామ్యం ఉన్నట్టు చెప్పారు. నిజానికి దేశీ ఈక్విటీ మార్కెట్లలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం ఎఫ్‌పీఐలు అమ్మకాలు వైపు ఉండగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈక్విటీల్లో నికరంగా రూ.51,200 కోట్లు, బాండ్ల మార్కెట్లలో నికరంగా రూ.5,964 కోట్ల పెట్టుబడులతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం విశేషం. అంతర్జాతీయంగా లిక్విడిటీ మెరుగుపడడం, స్థిరమైన వడ్డీ రేట్లు, అధికార పార్టీయే తిరిగి మళ్లీ విజయం సాధిస్తుందన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్ల పట్ల ఆశావహ పరిస్థితి కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి తెలిపారు. ‘‘అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల విధానాల్లో మార్పు రావడంతోపాటు అమెరికాలో రేట్ల పెంపు అవకాశాలు లేకపోవడమే... ఎఫ్‌పీఐలకు భారత్ ఏడారిలో ఒయాసిస్‌లా మారింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ పేర్కొన్నారు. -
బీమా రంగంలోకి ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ఏజెంట్ లైసెన్సు దక్కించుకున్న ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపింది. ఇకపై తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే అన్ని ప్రముఖ మొబైల్ బ్రాండ్స్ ఫోన్లకు కస్టమైజ్డ్ బీమా పాలసీలు అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. నగదు చెల్లింపు లేదా ఉచిత పికప్, సర్వీస్, డ్రాప్ వంటి సర్వీసులు ఈ పాలసీల ప్రత్యేకతలని పేర్కొంది. అక్టోబర్ 10న ప్రారంభించే ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) సేల్ రోజు నుంచి ఈ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం మొదలవుతుందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి గరికపాటి తెలిపారు. కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీఎంపీ) పేరిట అందించే ఈ పాలసీ ప్రీమియం రూ. 99 నుంచి ఉంటుందని బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. ఫోన్ చోరీకి గురవడం, స్క్రీన్ దెబ్బతినడం మొదలైన వాటన్నింటికీ కవరేజీ ఉంటుంది. క్లెయిమ్స్ కోసం ఫ్లిప్‌కార్ట్‌కి యాప్ ద్వారా లేదా ఈమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్‌ను సర్వీస్ చేయించుకోవడం లేదా పరిహారం తీసుకోవడం అప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ పరిహారం తీసుకోదలిస్తే.. కస్టమర్ బ్యాంక్ ఖాతాకు బీమా సంస్థ నగదు బదిలీ చేస్తుంది. -
బీమా బ్రోకింగ్‌లోకి 100% ఎఫ్‌డీఐలు?
న్యూఢిల్లీ: బీమా రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం బ్రోకింగ్, బీమా కంపెనీలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ మొదలైన బీమా రంగ వ్యాపార విభాగాల్లోకి 49 శాతం వరకూ మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. ‘బీమా బ్రోకింగ్ కూడా ఇతరత్రా ఆర్థిక సేవలు, కమోడిటీ బ్రోకింగ్ సేవల్లాంటిదే. ఇందులో వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలనే యోచన ఉంది. ఇటీవలే అత్యున్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తోంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, బీమా కంపెనీల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న 49 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులున్న ఆర్థిక సర్వీసుల బ్రోకింగ్ సంస్థలతో సమానంగా బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా పరిగణించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు వచ్చాయని సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ‘‘దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవలే సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు. ఈ అంశంపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) ప్రధాని కార్యాలయం సూచించింది కూడా’’ అని ఆయన వివరించారు. కాగా ఇప్పటికే వాలెట్ ద్వారా ఆర్థిక సేవల్లోకి ప్రవేశించిన విదేశీ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్... తాను బీమా బ్రోకింగ్ సేవల్ని కూడా ఆరంభించాలని చూస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ప్రభుత్వం గనక అనుమతిస్తే బహుశా! తొలిసారి ఈ సేవల్లోకి ప్రవేశించే విదేశీ కంపెనీ అమెజాన్ కావచ్చన్నది మార్కెట్ వర్గాల మాట. -
బీమా కంపెనీలపై మంత్రి పోచారం ఫైర్
సాక్షి, హైదరాబాద్: పంటల పరిహారం చె ల్లింపుల్లో నిర్లక్ష్యం వహి స్తున్న బీమా కంపెనీ లపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015–16 వానా కాలం, యాసంగి అలాగే గతేడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి పంట నష్ట పరిహారం చెల్లింపులపై బీమా కంపెనీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించిందని, అయినా రైతులకు చెల్లింపులు మందకొడిగా సాగుతుండ టంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015–16కి సంబంధించి రూ.295 కోట్లను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఐసీ) 4.63 లక్షల మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంద న్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ, ఇందులో 70% పంపిణీ చేశామని, మరో వారం రోజుల్లో మిగతా మొత్తం పంపిణీ చేస్తామని తెలి పారు. 2017 వానాకాలానికి సంబంధించి 4 లక్ష ల మందికి పైగా రైతులకు రూ.483 కోట్లు పరి హారాల చెల్లింపులు మందకొ డిగా సాగుతుండ టంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా
సాక్షి, హైదరాబాద్: పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్ సెటిల్ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం చెక్ పెట్టింది. అందుకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ నుంచి అమలవుతాయని కేంద్రం ప్రకటించింది. అలాగే రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇదిలావుండగా ఏడాదంతా సాగయ్యే ఉద్యాన పంటలను కూడా పీఎంఎఫ్‌బీవై పథకంలోకి తీసుకొస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. అలాగే అడవి జంతువుల దాడిలో పంటకు నష్టం వాటిల్లితే దానికి కూడా బీమా వర్తింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే దీన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తారు. డూప్లికేషన్‌ను నివారించేందుకు బీమా పరిహారంలో ఆధార్ లింక్‌ను తప్పనిసరిగా అమలుచేయనున్నారు. కంపెనీలు తాము వసూలు చేసే ప్రీమియం సొమ్ములో 0.5 శాతాన్ని బీమాపై రైతులను చైతన్యం చేయడానికి ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది. తాజా మార్గదర్శకాలు ఈ పథకంలో ప్రస్తుతం నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు తీసుకున్నవేనని కేంద్రం స్పష్టం చేసింది. -
పెన్షన్ స్కీం సొమ్ముపై గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: పెన్షన్ స్కీంలో మీ డబ్బు ఇరుక్కుపోయిందా. అయితే మీకో శుభవార్త. పెన్షన్ పాలసీ దారులకు ఊరట కల్పించేలా రెగ్యులేటరీ తాజా ఆదేశాలు జారీ చేసింది. పాలసీ తీసుకొని, కొంతవరకు చెల్లించి వదిలేసిన లేదా క్లైమ్ చేయని సొమ్ము వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర వేలకోట్లరూపాయలు మూలుగుతున్నాయని ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పాలసీదారులను గుర్తించి, ఆ ఫండ్‌ను వారికి చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ కోరింది. పాలసీదారులకు చెందిన 15వేల కోట్ల రూపాయలు జీవిత బీమా సంస్థల వద్ద క్లైమ్ చేయకుండా పడివున్నాయని రెగ్యులేటరీ వివరించింది. ఈ సొమ్మును ఆయా పాలసీ దారులు, లేదా లబ్దిదారులను శోధించి మరీ తిరిగి చెల్లించాల్సిందిగా బీమా సంస్థలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు నిబంధనల ప్రకారం కనీస వాయిదాలు చెల్లించని జీవిత బీమా పాలసీ దారులు మెచ్యూరిటీ మొత్తాన్ని క్లెమ్ చేసే హక్కులేదు. అలాగే కొనుగోలు ధర కంటే మెచ్యూరిటీ వాల్యూ తక్కువగా ఉన్నా కూడా ఈ అవకాశం లేదు. తాజా ఆదేశాల ప్రకారం అలాంటి పాలసీదారులకు కూడా డబ్బును తిరిగి చెల్లించమని ఐఆర్డీఏఐ కోరింది. ఈ ఆదేశాలకు ప్రతికూలంగా ఇన్పూరెన్స్ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని, పేరుకుపోయిన ఫండ్ విలువ ఈచెల్లింపులకు సరిపోదని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన అనిల్‌కుమార్ సింగ్ తెలిపారు. 2015నాటి ప్రభుత్వ గెజిట్ ప్రకారం పాలసీదారుడు, నిర్దేశియ సమయంలో ప్రీమియంలను చెల్లించనప్పుడు లేదా గణనీయమైన మొత్తంలో చెల్లించని సందర్భాల్లో మెచ్యూరిటీ విలువ తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ సొమ్ము కంపెనీతోనే ఉంటుందని హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, చిన్మయ్ బేడే పేర్కొన్నారు. -
బీమా సొమ్ము ఇచ్చి రుణమాఫీ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా పాలసీల విషయంలో బీమా కంపెనీలు, వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. పాలసీదారుడు మృతి చెందిన ఓ కేసులో అతని భార్యకు బీమా సొమ్ము చెల్లించి ఇంటి రుణాన్ని మాఫీ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారులు నిరాకరించడాన్ని ఫోరం తప్పుబట్టింది. పాలసీ తీసుకునే నాటికే కేన్సర్ ఉందన్న విషయాన్ని మృతుడు దాచిపెట్టి పాలసీ తీసుకున్నారని, అందువల్ల అతనికి బీమా సొమ్ము ఇవ్వాల్సిన అవసరంలేదన్న ఎస్బీఐ వాదనను తోసిపుచ్చింది. ఇదీ కేసు.. విజయవాడకు చెందిన జి.శేషగిరిరావు 2012లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనిని తాకట్టు పెట్టి ఎస్బీఐ నుంచి ఆయన రూ.22 లక్షల రుణం తీసుకున్నారు. ఇందుకు ఎస్బీఐ అతనికి రూ.24,45,000 విలువైన జీవిత బీమా పాలసీ కూడా ఇచ్చింది. పాలసీ ఇచ్చే సమయంలో శేషగిరిరావుకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం 2014 లో శేషగిరిరావు కేన్సర్‌తో మృతి చెందారు. దీంతో అతని భార్య విజయకుమారి బీమా సొమ్ము కోసం క్లెయిమ్ దరఖాస్తు సమర్పించారు. ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. పాలసీ తీసుకునే నాటికి మృతుడు కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఈ విషయాన్ని దాచిపెట్టారని, అందువల్ల డబ్బు ఇవ్వడం సాధ్యంకాదని ఎస్బీఐ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆమె ఏపీ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ నౌషద్ ఆలీ, పి.ముత్యాలనాయుడులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజ్యాంగ హక్కును హరించడమే.. ‘బీమా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచు కునేందుకే ఆశలు చూపుతాయి. తీరా క్లెయి మ్లు చెల్లించాల్సి వచ్చేటప్పటికీ భిన్నంగా వ్యవహరిస్తాయి. ప్రతీ క్లెయిమ్‌ను అనుమానిస్తాయి. ఆసుపత్రులు, డాక్టర్ల వద్దకు వెళ్లి రోగి వ్యక్తిగత సమాచారాన్ని సంపాదిస్తుంటాయి. ఎంతో నమ్మకంతో రోగి చెప్పే వివరాలను వైద్యులు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమే కాక.. అనైతికం కూడా. గోప్యత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. పూర్తి పరీక్షలు చేయకుండా ఎవరు ఆపారు? ‘పాలసీ తీసుకునేటప్పుడు మృతుడు తనకు కేన్సర్ ఉందన్న విషయం దాచిపెట్టాడని, అందువల్ల అతనికి వర్తింపజేయాల్సిన ప్రయోజనాలను ఇవ్వాల్సిన అవసరంలేదని బీమా కంపెనీ చెబుతోంది. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా బీమా కంపెనీని ఎవరూ ఆపలేదు. పాలసీదారుకు ముందే కేన్సర్ ఉందని నిరూపించాల్సిన బీమా సంస్థ.. అది చేయకుండా క్లెయిమ్‌ను తిరస్కరించడం సరికాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. మృతుని భార్యకు బీమా సొమ్ముతోపాటు ఇంటి రుణాన్ని మాఫీచేసి ‘నో డ్యూ’సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. మానసిక వేదన కల్గించినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంతోపాటు రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలని చెప్పింది. -
పంటల బీమాకు కంపెనీల తూట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులను పంటల బీమా పరిధిలోకి తీసుకురావడంలో బీమా కంపెనీలు విఫలం అవుతున్నాయి. ఇప్పటివరకు 50 లక్షల ఎకరాలకు పైనే ఖరీఫ్ పంటలు సాగైతే కనీసం ఐదు లక్షల ఎకరాల రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద పత్తి పంట వస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైగా ఇదే సాగవుతోంది. ఇప్పటికే 37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అటువంటి పత్తికి పంటల బీమా ప్రీమియం గడువు ఈ నెల 15తో ముగిసింది. కానీ పత్తి బీమా ప్రీమియం చెల్లించని రైతులు లక్షలాది మంది ఉన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా రైతులు పత్తి సాగు చేస్తే, లక్షన్నర మందిని కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలున్నాయి. అన్ని పంటలకు కలిపి ఇప్పటివరకు కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. పైగా ఈ నెలలో వరుసగా 14, 15వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ విషయంలో ముందే మేల్కొనాల్సిన వ్యవసాయశాఖ గడువు ముగిసిన తరువాత బీమా కంపెనీలకు రెండు రోజులు పెంచాలని కోరింది. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ, జాతీయ వ్యవసాయ బీమా కంపెనీలు ఈ నెల 17 వరకు పెంచేందుకు అంగీకరించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ రాసిన లేఖకు ఏఐసీ సుముఖత వ్యక్తం చేసినా మిగతా రెండు కంపెనీలు గడువు పెంచేందుకు ససేమిరా అన్నాయి. ఇలా బీమా కంపెనీలు రైతుతో ఆడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాంకుల సహకారం సున్నా... మన రాష్ట్రంలో మొత్తం ఆరు క్లస్టర్లుగా పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇందులో ఈ వానాకాలం బీమాను రెండు క్లస్టర్లను వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) అమలు చేస్తుండగా, ఎన్ఐసీ మూడు, టాటా ఒక క్లస్టర్లో అమలు చేస్తున్నాయి. ఏఐసీ పత్తికి రెండ్రోజుల పొడిగింపునకు అంగీకరించినప్పటికీ ఆ పరిధిలోని రైతులకు తెలియజేయడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది. ఫలితంగా ఆ క్లస్టర్ పరిధిలో 10 జిల్లాల్లోని రైతులు నష్టపోయారుఇటు బ్యాంకులపై ఒత్తిడి పెంచి రుణాలు ఇప్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించగా, రుణం తీసుకోని రైతులను ప్రీమియం కట్టేలా అవగాహన కూడా కల్పించలేకపోయారు. వాస్తవంగా ఖరీఫ్‌లో పంట రుణాలు రూ.25 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.6 వేల కోట్లలోపే ఇచ్చాయి. వాస్తవంగా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు సగంపైనే సాగైతే, రుణాలు మాత్రం నాలుగో వంతు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో బ్యాంకు రుణాల ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా జూన్‌లోపే రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు రైతులను సతాయిస్తున్నాయి. అటు బీమా కంపెనీలు, ఇటు బ్యాంకులు రైతులను బీమా పరిధిలోకి తీసుకు రానీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. 50 శాతం బీమా లక్ష్యానికి సమస్యలు.. మన రాష్ట్రంలో సాగయ్యే భూమిలో బీమా పరిధిలోకి వచ్చే భూమి కేవలం 20 శాతం వరకే ఉంటుంది. ఒక్కోసారి అది 15 శాతానికే పరిమితమవుతోంది. అయితే కేంద్రం ఈ ఏడాది బీమా పరిధిలోకి 50 శాతం భూమిని తీసుకురావాలన్న నిబంధన పెట్టింది. కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మన రాష్ట్రంలో 2016లో వానాకాలం, యాసంగిలతో కలిపి 1.39 కోట్ల ఎకరాలు సాగు కాగా, కేవలం 20.95 లక్షలు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. అంటే సాగులో 15 శాతమే. అలాగే 2017లో వానాకాలం, యాసంగిలతో కలిపి మొత్తం 1.41 కోట్ల ఎకరాలలో సాగు కాగా 30 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చింది. అంటే 21 శాతం. ఈసారి అంత మొత్తంలో రావడం కష్టమేనని అధికారులే పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ ఏడాది 50 శాతమైనా బీమా పరిధిలోకి తీసుకు రావాలన్న లక్ష్యం నీరుగారే ప్రమాదముంది. పరిహారం చెల్లింపుల్లో నిబంధనలు పక్కాగా పాటించని బీమా కంపెనీలు, గడువు తేదీల విషయంలో మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే పత్తి పంటకు గులాబీ పురుగు సోకితే పరిహారం రావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. -
పార్లమెంటు సమయంలో సమ్మె చేస్తాం
చెన్నై: బ్యాంకింగ్, బీమా రంగాల్లో అనుసరిస్తున్న విధానాలను కేంద్రం సమీక్షించకుంటే డిసెంబర్లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమ్మెకు దిగుతామని బ్యాంకులు, బీమా సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు ది కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ బ్యాంక్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ యూనియన్స్(సీసీబీఐఎఫ్యూ) చైర్మన్ సీహెచ్ వెంకటాచలం ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బీమా, బ్యాంకింగ్ రంగాల్లో ప్రస్తుతం పాటిస్తున్న విధానాలను సమీక్షించకుంటే ఈ ఏడాది డిసెంబర్లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమ్మెకు దిగుతాం. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద రూ.115 లక్షల కోట్ల నగదు ఉంది. ఇదంతా సామాన్యులది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులు కేవలం నిరర్ధక ఆస్తుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వం బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే.. ఈ మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుంది’ అని వెంకటాచలం తెలిపారు. -
బీమా సంస్థల విలీనంపై సలహాలివ్వండి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థలను ఒక్కటి చేయాలని నిర్ణయించిన కేంద్రం... ఈ విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు గాను కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ను విలీనం చేయాలనుకుంటున్నట్టు ఈ ఏడాది బడ్జెట్ సమయంలోనే ప్రభుత్వం ప్రకటించింది. విలీనం ద్వారా బలమైన కంపెనీని సృష్టించడం, సంస్థ వ్యాపార విలువను, వాటాదారుల విలువను పెంచడం ప్రభుత్వ ఉద్దేశమని ఈ బీమా సంస్థలు తెలిపాయి. 2017 మార్చి నాటికి ఈ మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు ఉమ్మడిగా 200 బీమా ఉత్పత్తులుండగా, మొత్తం ప్రీమియం ఆదాయం రూ.41,461 కోట్లుగా ఉంది. మార్కెట్ వాటా 35 శాతం. ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లు. మొత్తం ఉద్యోగులు 44,000 మంది. కన్సల్టెంట్‌గా బిడ్లు వేసేందుకు జూలై 16 వరకు గడువు ఇచ్చారు. -
ప్రైవేటు బీమా కంపెనీల అడ్డగోలు దారులు!
ముంబై: ప్రైవేటు బీమా సంస్థలు బ్యాంకుల భాగస్వామ్యంతో విక్రయించే పాలసీల విషయంలో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రావడంతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) రంగంలోకి దిగింది. సాధారణంగా బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుని పాలసీలను విక్రయిస్తుంటాయి. అయితే, కొన్ని బీమా కంపెనీలు తమ పాలసీల విక్రయంపై నిబంధనలకు మించి అధిక కమీషన్లు, ప్రతిఫలాలను బ్యాంకులకు ఆఫర్ చేస్తున్నట్టు ఐఆర్డీఏ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం... ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ‘‘కొన్ని పెద్ద బీమా కంపెనీలు, వాటి మాతృ సంస్థలు పలు బ్యాంకుల వద్ద కరెంటు అకౌంట్ బ్యాలన్స్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాలన్స్‌లపై వడ్డీని బీమా కంపెనీలు వదులుకుంటున్నాయి. బీమా ఉత్పత్తుల విక్రయంపై పరిహారంగా వాటిని పరిగణిస్తున్నాయి. దీంతో ఈ విధమైన చర్యలు పాలసీదారుల ప్రయోజనాలకు చేటు చేస్తాయని, బ్యాంకుల్లో ఉంచే ఈ డిపాజిట్లపై రాబడులు సున్నాయే’’నని ఆ అధికారి వివరించారు. ఈ తరహా విధానాలు ఐఆర్డీఏ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిపారు. దీనిపై ఐఆర్డీఏ ప్రభుత్వానికి తెలియజేయగా, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఆమోదం లభించినట్టు చెప్పారు. ‘‘కార్పొరేట్ ఏజెన్సీ నిబంధనల మేరకు బ్యాంకుల ద్వారా బీమా కంపెనీలు పాలసీలను విక్రయిస్తే, వాటిపై బ్యాంకులకు కేవలం కమీషన్లను మాత్రమే ఇవ్వాలి. ఇక బ్యాంకులు బీమా సంస్థలకు మార్కెట్ రేటు కంటే అధిక ఫారెక్స్ రేట్లను ఆఫర్ చేయడం, మార్కెట్ రేటు, ఆఫర్ చేసిన రేటు మధ్య వ్యత్యాసం బ్యాంకులకు పాలసీలను విక్రయించినందుకు ప్రోత్సాహకరంగా వెళుతోంది. అలాగే, చాలా బీమా కంపెనీలు బ్యాంకుల ఏటీఎంలపై తమ ఉత్పత్తుల ప్రకటనలను ప్రదర్శించినందుకు ఫీజులు చెల్లిస్తున్నా యి. నిజానికి బ్యాంకులు ఫీజులు వసూలు చేయరాదు. ఆ భారాన్ని అవే భరించాలి. కానీ, ఈ ఫీజుల భారం పాలసీదారులపైనే పడుతోంది’’ అని అన్నారు. -
రైతులకు పరిహారం రూ.5
చెన్నై: వాతావరణం సహకరించక పంట దెబ్బతిని నష్టపోయిన తమిళనాడు రైతులకు బీమా కంపెనీలు షాకిచ్చాయి. దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.10, రూ.5, రూ.4, రూ.2 చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్ రైతులకు చెక్కుల రూపంలో ఫిబ్రవరిలో అందించింది. ఈ విషయంపై తమిళనాడు శాసనసభ గురువారం దద్దరిల్లింది. మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి ఈ చెక్కులను సభలో ప్రదర్శించారు. ‘కరుపసామి రూ.102 ప్రీమియం కట్టినప్పటికీ ఆయనకు రూ.10 మాత్రమే నష్టపరిహారంగా అందింది. తిరుమలైసామి అనే మరో రైతు రూ.50 ప్రీమియం కట్టగా, ఆయనకు కేవలం రూ.5 నష్టపరిహారం ఇచ్చారు. ఈ చెక్కుల్ని మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి రూ.500తో ఖాతాను తెరవాలి. మరి వీటితో ఉపయోగం ఏముంది?’ అని ధ్వజమెత్తారు. -
ఈక్విటీల్లో తగ్గిన ‘బీమా’ పెట్టుబడులు
2016–17లో రూ.16,793 కోట్లకు పరిమితం ముంబై: ఎల్ఐసీ సహా జీవిత బీమా కంపెనీలు ఈక్విటీల్లో తాజా పెట్టుబడులను గణనీయంగా తగ్గించాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో బీమా కంపెనీల పెట్టుబడులు నికరంగా రూ.39,535 కోట్లు ఉండగా, అవి గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో ఏకంగా 57 శాతం తగ్గి రూ.16,793 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మార్చి చివరికి గరిష్ట స్థాయి (సెన్సెక్స్ 29,620)లకు చేరుకోవడమే ఇందుకు కారణం. జీవిత బీమా కంపెనీల మొత్తం ఈక్విటీ పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.56 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.5.95 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 25% పెరిగింది. ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గించిన జీవిత బీమా కంపెనీలు... మరోవైపు రిస్క్ తక్కువగా ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ (అధిక శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు) పథకాల్లో 15% అధికంగా రూ.21,67,143 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. జీవిత బీమా సంస్థల అన్ని రకాల పెట్టుబడుల విలువ 2015–16లో రూ.25.29 లక్షల కోట్లుగా ఉంటే, ఈ విలువ 2016–17లో రూ.29.81 లక్షల కోట్లకు వృద్ధి చెందడం విశేషం. ‘‘2016–17లో ఈక్విటీల్లో బీమా సంస్థల కొనుగోళ్ల కంటే విక్రయాలే ఎక్కువ. బీమా కంపెనీల ఈక్విటీ పెట్టుబడుల విలు వ అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25.5% పెరిగి, రూ.7.56 లక్షల కోట్లకు చేరింది. ఈ వృద్ధి అన్నది పూర్తి ఏడాది పాటు కొనసాగింది’’ అని అని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ వి.మాణిక్యం తెలిపారు. రూ.1.61 లక్షల కోట్ల మేర పెట్టుబడుల విలువ పెరగ్గా, అందులో ఒక్క ఎల్ఐసీ వాటాయే రూ.1.28 లక్షల కోట్ల మేర ఉన్నట్టు చెప్పారు. -
ప్రీమియం రేట్ల పెంపునకు కంపెనీలు సిద్ధం
ముంబై : పెద్ద పెద్ద క్లయిమ్స్ సెటిల్ మెంట్, వడ్డీరేట్లు పడిపోవడం ఇన్సూరెన్స్ కంపెనీలకు భారంగా మారిపోయింది. దీంతో ప్రీమియం రేట్లను పెంచాలని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు భావిస్తున్నాయి.. 10 నుంచి 15 శాతం మేర ప్రీమియం రేట్లను పెంచి, కొంత భారాన్ని తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ కూడా ప్రీమియం రేట్ల పెంపుకు కంపెనీలకు మద్దతిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఐఆర్డీఏఐ మోటార్ ప్రీమియంను, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచుతున్నట్టు తెలిపింది. వీటిని ఏప్రిల్ 1 నుంచి ఐఆర్డీఏఐ అమలు చేయబోతోంది. ఫార్మా, పవర్, సిమెంట్ వంటి 10 సెగ్మెంట్లలో ప్రస్తుతం ప్రీమియం రేట్లు జీరోగా ఉన్నాయి. వాటిని పెంచాలని కంపెనీలు ప్లాన్స్ వేస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సెగ్మెంట్లలో ప్రీమియం రేట్లు 10-15 శాతం రేంజ్ లో పెరుగనున్నాయి. ఇన్సూరెన్స్ మార్కెట్లో చాలా పోటీగా ఉంటుందని, ప్రీమియంను పెంచడంపై చాలా తక్కువ అవకాశముంటుందని నేషనల్ ఇన్సూరెన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సనత్ కుమార్ అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ లో కూడా సమీక్షించిన ధరలను చూస్తామని ఆయన తెలిపారు. నాన్-లైఫ్ ఇన్సూరర్ గా పేరున్న న్యూ ఇండియా కొన్నిరంగాల్లో ప్రీమియంలను పెంచేందుకు సిద్ధమైంది. ఫైర్, గ్రూప్ హెల్త్ లో కొత్త ఏడాది నుంచి ప్రీమియం రేట్ల పెంపును చూస్తారని న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాసన్ కూడా తెలిపారు. -
ఆన్లైన్ పాలసీలకు డిస్కౌంట్లు ఇవ్వవచ్చు
⇒ బీమాలో ఈ కామర్స్‌పై ⇒ ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు న్యూఢిల్లీ: బీమా సంస్థలు ఆన్లైన్లో పాలసీలను విక్రయిస్తే, డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్డీఏ తెలిపింది. బీమా ఈ–కామర్స్ అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ)తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా సంస్థలు తమ పాలసీలను ఐఎస్ఎన్పీ(ఇన్సూరెన్స్ సెల్ఫ్–నెట్వర్క్ ప్లాట్ఫార్మ్) ద్వారా విక్రయిస్తే, డిస్కౌంట్లు ఇవ్వవచ్చని పేర్కొంది. ఈ–కామర్స్ సేవలను అందించడానికి ఐఆర్డీఏఐ అనుమతితో బీమా సంస్థలు ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫార్మ్ను ఐఎస్ఎన్పీగా వ్యవహరిస్తారు. తక్కువ ఖర్చుతో బీమాను మరింత మందికి అందుబాటులోకి తేవడమే.... బీమాలో ఈ కామర్స్ ముఖ్య ఉద్దేశమని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా పాలసీలు విక్రయించే కంపెనీలు పాలసీ ముఖ్య ఫీచర్లు, ఆప్షన్లు, కవరేజ్, మొత్తం ప్రీమియమ్, ఇతర చార్జీలు, పాలసీని రద్దు చేసుకునే విధానాల గురించి సవివరంగా తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది. -
ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల చేతికి మెజార్టీ వాటా
♦ మూడింట రెండొంతుల షేర్లకు బీమా సంస్థల నుంచి బిడ్లు ♦ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకొని ఐవీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాను తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వాటాను తీసుకోవాలని ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) నిర్ణయించినట్లు ఐవీఆర్సీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరును ఎస్డీఆర్ కింద రూ. 8.765 చొప్పున ఈక్విటీగా మార్చుకోనున్నాయి. ప్రస్తుతం కంపెనీ షేరు రూ. 7 వద్ద కదులుతోంది. ఫిబ్రవరి 23న జరిగిన జేఎల్ఎఫ్ సమావేశంలో ఎస్డీఆర్ ప్యాకేజీకి బ్యాంకులు ఆమోదముద్ర వేశాయి. ఇప్పటికే ఈ జేఎల్ఎఫ్కి కంపెనీలో సుమారుగా 49 శాతం వాటా ఉంది. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా రూ. 7,350 కోట్ల రుణానికి సంబంధించి బ్యాంకులు ఇప్పటికే ఈక్విటీగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ రుణ భారం సుమారు రూ. 9,000 కోట్లు దాటినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. బ్యాంకులు మెజార్టీ వాటాను తీసుకున్న తర్వాత కంపెనీని పునర్ వ్యవస్థీకరించి సరైన ధర లభిస్తే వేరే వారికి విక్రయించాలన్నది జేఎల్ఎఫ్ ఆలోచన. -
ఎన్టీపీసీ ఆఫర్ తో ఖజానాకు రూ. 5 వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కి రూ. 5,030 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూలో మూడింట రెండొంతుల షేర్లను బీమా సంస్థలు దక్కించుకున్నాయి. సింహభాగం షేర్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ), బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సంపన్న ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు వచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. సంస్థాగత ఇన్వెస్టర్లు తమకు కే టాయించిన షేర్లకు రెట్టింపు బిడ్లు దాఖలు చేశారు. మార్కెట్లు స్థిరంగా ఉన్న పక్షంలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా మంచి స్పందనే వచ్చి ఉండేదని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం కార్యదర్శి నీరజ్ కే గుప్తా తెలిపారు. దాదాపు 63 శాతం షేర్లను ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ సహా ఇతర బీమా కంపెనీలు దక్కించుకున్నాయి. చిన్న ఇన్వెస్టర్ల కోసం ఇష్యూలో 20 శాతం కేటాయించగా అందులో 8.5 శాతం షేర్లకు బిడ్లు వచ్చాయి. వీరికి 8.24 కోట్ల షేర్లు కేటాయించగా, 3.63 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్లు (44.11)దాఖలయ్యాయి. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఎన్టీపీసీలో 5 శాతం వాటాలను (41.22 కోట్ల షేర్లు) ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయానికి ఉంచింది. ఇందుకు షేరు ఒక్కింటికి రూ. 122 ధర నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5% అదనంగా డిస్కౌంటునిచ్చింది. తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్లకు 32.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా, రెండో రోజున రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 8.24 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. నాన్ రిటైల్ కేటగిరి విభాగానికి షేరు ఒక్కింటి ధరను రూ. 122.05గా నిర్ణయించింది. 5% వాటాల విక్రయానంతరం ఎన్టీపీసీలో ప్రభుత్వానికి 69.96% వాటాలు ఉంటాయి. బుధవారం ఎన్టీపీసీ షేరు ధర ఆఫర్ ధర కన్నా క్షీణించి బీఎస్ఈలో 4.2% తగ్గుదలతో రూ. 118.70 వద్ద ముగిసింది. -
‘స్మార్ట్ అగ్రికల్చర్’తోనే సంక్షోభానికి తెర
ఐఏఎస్ అధికారి డాక్టర్ రాంపుల్లారెడ్డి సూచన ♦ మార్కెట్ ధరల్లో మార్పులపై ముందస్తు సమాచారం ఉండాలి ♦ సాగును లాభదాయకంగా చేయాలన్న నిపుణులు ♦ అధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ విధానాలపై సమగ్ర చర్చ ♦ వ్యవసాయంపై రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సంక్షోభం నుంచి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలంటే స్మార్ట్ అగ్రికల్చర్ దిశగా ముందుకెళ్లడమే ఉత్తమమని కర్నూలు వాసి, కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాంపుల్లారెడ్డి చెప్పారు. సమాచార, సాంకేతిక వ్యవస్థను ఈ రంగ ంలో విరివిగా వినియోగించుకోవడమే స్మార్ట్ అగ్రికల్చర్ విధానమన్నారు. సాగు సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించే మంత్రదండం ప్రభుత్వం వద్ద లేనప్పటికీ, స్మార్ట్ అగ్రికల్చర్‌కు సంబంధించిన టూల్స్‌ను ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉత్పాదకత , మార్కెట్ ధరల్లో మార్పు లు.. తదితర అంశాలపై ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించగలిగితే వ్యవసాయం ప్రతి రైతుకూ లాభదాయకం కానుందని చెప్పారు. ‘రైతాంగ సమస్యలు-వ్యవసాయ స్థిరత్వానికి పరిష్కారాలు’ అంశంపై ఫోరం ఫర్ ఫార్మర్స్ సంస్థ శనివారం సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈ సమావేశానికి రాంపుల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘వ్యాస్’తో అనిశ్చితులకు చెక్ రైతులు ఎదుర్కొంటున్న నాలుగు రకాల అనిశ్చితులను తొలగించడానికి టెక్నాలజీ సహకారంతో తాను వ్యాస్ (వర్చువల్ అగ్రికల్చర్ సిస్టమ్) అనే కొత్త ఉత్పత్తిని రూపొందించినట్లు రాంపుల్లారెడ్డి తెలిపారు. ముఖ్యంగా వర్షాలు, వడగండ్లు, కరువు పరిస్థితులను అధికారులు, రైతులు ముందుగా అంచనా వేయలేకపోవడం, నష్టపోయిన రైతులకు పరిహారమిచ్చేందుకు అవసరమైన పక్కా సమాచారం (రైతు, భూమి విస్తీర్ణం, వేసిన పంట..తదితర వివరాలు) ప్రభుత్వాల వద్ద లేకపోతుండటం, ఉత్పత్తి పెరిగినా మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులను ముందుగానే పసిగట్టలేకపోవడం, విత్తనాలు, పురుగు మందుల్లో నాణ్యత కొరవడడం వంటి.. అనిశ్చితుల నుంచి వ్యవసాయ రంగాన్ని బయటపడేసేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. గ్రామాల్లో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాతావరణ పరిస్థితులపై ఆ ప్రాంత రైతులకు అవగాహన ఉంటుందన్నారు. రైతాంగం మూస పద్ధతుల నుంచి బయటపడి ఆధునిక సాగును అవలంబించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచడం, రైతులకు లాభసాటి ధర, కమతాల విస్తీర్ణం, శిక్షణ, సామర్థ్య పెంపు తదితరాలు సాగులో ప్రధాన సమస్యలని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ వర్సిటీ డెరైక్టర్ ఈఏ సిద్ధిఖీ, పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఆర్థిక సంస్థల నిపుణులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి కేవలం వ్యవసాయ ఉత్పత్తిపై మినహా రైతుల లాభదాయకతపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని, తాము అనుసరిస్తున్న సాగు విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వరి పండించిన రైతులకు 23 శాతం నష్టం వస్తోంటే, వివిధరకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి 19 శాతం లాభం వస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.1,850గా ఉంటే, మద్దతు ధర కేవలం రూ.1,410 మాత్రమే ఉందన్నారు. దీంతో రైతు క్వింటాలుకు రూ.450 నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ శక్తులతోనే నిర్వీర్యం ప్రపంచీకరణ సందర్భంగా సాగు రంగంలోకి కార్పొరేట్ మార్కెట్ శక్తులు ప్రవేశించడంతో ఈ రంగం నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో సాగుకు కేటాయింపులు పెంచాలన్నారు. వ్యవసాయ పరిశోధనలు మరింతగా ఊపందుకోవాలని కాంక్షించారు. దేశవ్యాప్తంగా 11 బీమా కంపెనీలు ఉంటే, వీటిలో 2 మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నారు. ప్రైవేటు బీమా సంస్థల ద్వారా రైతులకు ఏమాత్రం న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫోరం ఫర్ ఫార్మర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని తిరిగి ఊరికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
‘కారు’ చౌక బేరం!
♦ ఆడి కారు రూ.2 లక్షలే ♦ అదే దారిలో మరిన్ని లగ్జరీ కార్లు ♦ చెన్నైలో జోరుగా విక్రయాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘భలే మంచి చౌక బేరము.. ఇది సమయము.. మించినన్.. దొరకదు’ అన్న చందంగా ప్రస్తుతం చెన్నై ప్రజలు ‘కారు’చౌక బేరం ఆడేస్తున్నారు. లగ్జరీ కార్లను రూ.40 లక్షలు విలువజేసే ఆడి, మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లు కేవలం రూ.2 లక్షలకే అమ్మేందుకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బ్రాండ్ న్యూ కార్లకూ వీటికీ తేడా ఏమిటంటే.. ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు ఖరీదైన కార్లు నీట మునిగిపోయాయి. దాదాపు 30 వేల కార్లు రోజుల తరబడి నీటిలో నానిపోయాయి. సుమారు 10 వేల కార్లలో ఇంజిన్లు పాడయ్యాయి. వీటిని వేలం వేయడం మినహా మరో దారిలేదని బీమా కంపెనీలు తీర్మానించుకున్నాయి. కంపెనీ యాజమాన్యాలు సదరు కార్ల పరిస్థితిని బట్టి వాటికి ధర నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా అమ్మకాలు పెట్టగా ప్రజలు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలోని గోరాట్రక్ పార్కింగ్ మైదానంలో పాడైపోయిన ఖరీదైన కార్లను వరుస పెట్టారు. ప్రస్తుతం ఖరీదైన కార్లుగా పేరొందిన బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, బెంట్లీ, హమ్మర్ తదితర కార్లను కేవలం రూ.2 లక్షలకే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. మరమ్మతు సాధ్యం కాదని మెకానిక్‌లు చెబుతున్నా, తమకు తెలిసిన వారిచేత బాగుచేయించుకుంటామని కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. 2011 మోడల్ ఆడి కారు రూ.3 లక్షలకు అమ్ముడుపోయింది. సీవోపీఏఆర్టీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హై ఎండ్ లగ్జరీ కారును షోరూం ధరలో కనీసం 40 శాతం తక్కువకు ఇక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. -
చెన్నై కోసం ఆర్థిక సంస్థల సేవలు
చెన్నై వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇందుకోసం బీమా కంపెనీలు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే, బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు పెనాల్టీలను రద్దు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా ఎటువంటి పెనాల్టీలు విధించమని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ప్రకటించాయి. అలాగే బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడానికి 1800 209 7072 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. -
సంపన్నులకు ప్రత్యేకం..!
శ్రీమంతుల కోసం ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్న బీమా కంపెనీలు.. దేశీయంగా సంపన్నుల (హెచ్ఎన్ఐ) సంఖ్య పెరుగుతుండటంతో వారి బీమా అవసరాలపై ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. వారి అవసరాలకు తగ్గ బీమా పాలసీల్ని తయారు చేసి అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం బీమా కంపెనీల మొత్తం పాలసీదారుల్లో సంపన్నుల వాటా ఆరు నుంచి పది శాతం దాకా ఉంటుందని అంచనా. అయితేనేం.. సాధారణ పాలసీదారుతో పోలిస్తే సంపన్న పాలసీదారు నుంచి వచ్చే ప్రీమియం 20-30 శాతం అధికంగా ఉంటోంది. అందుకే హెచ్ఎన్ఐలకు ప్రాధాన్యమిస్తూ బ్యాంకులు ప్రత్యేక బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తున్నట్లే బీమా కంపెనీలు కూడా గోల్డ్, ప్లాటినం వంటి పేర్లతో ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. హెచ్ఎన్ఐల కోసమే ప్రత్యేకంగా హెల్త్ సురక్ష గోల్డ్, ప్లాటినం పాలసీలను అందిస్తోంది. వీటిలో మెటర్నిటీ, డెంటల్, కళ్లద్దాలు, హియరింగ్ ఎయిడ్స్, కాంటాక్ట్ లెన్సులు మొదలైన వాటికి కూడా అదనపు కవరేజీ ఉంటుంది. అలాగే, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే.. రూ. 1,00,000 పైచిలుకు వార్షిక ప్రీమియం కట్టే వారిని ఈ సంస్థ గోల్డ్ సర్కిల్ కేటగిరీ కింద చేరుస్తుంది. వీరికి ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఎస్ఎంఎస్ చేసిన రెండు గంటల్లోనే సదరు పాలసీదారును కంపెనీ ప్రతినిధి సంప్రదిస్తారు. సాధారణ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి నిమిషాల కొద్దీ వేచి చూడాల్సిన పని లేకుండా 20 సెకన్ల లోపే స్పందించే రిలేషన్షిప్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. వీరికి కంపెనీ ఈ-మ్యాగజైన్‌తో పాటు ఇంటి దగ్గరే చెక్ పికప్ సదుపాయమూ ఉంటుంది. మ్యాక్స్ లైఫ్ మొత్తం పాలసీదారులలో ఇలాంటి సంపన్నుల సంఖ్య దాదాపు 24 శాతం ఉంది. ప్లాటినం కవరేజీ..: మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిల్వర్, గోల్డ్, ప్లాటినం పేరుతో మూడు రకాల పాలసీలు అందిస్తోంది. అత్యంత సంపన్నుల కోసం రూపొందించిన ప్లాటినం కవరేజీ పాలసీలో గరిష్టంగా రూ. 50 లక్షల దాకా కవరేజీ మొత్తం ఉంటుంది. ఆస్పత్రిలో చేరితే ప్రైవేట్ రూమ్ ఖర్చులు మొదలుకుని పిల్లలకు పన్నెండేళ్లు వచ్చేదాకా వేయాల్సిన వివిధ టీకాలకయ్యే వ్యయాల దాకా ఇందులో అన్నింటికీ కవరేజీ ఉంటుంది. మరీ అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే కంపెనీ ప్రత్యేకంగా రిలేషన్షిప్ డాక్టర్‌ను కూడా పంపిస్తుంది. ఈ పాలసీని మధ్యలో ఆపకుండా కొనసాగిస్తూ ఉన్న పక్షంలో హెల్త్ రిలేషన్షిప్ ప్రోగ్రాం సర్వీసులు కూడా పొందవచ్చు. ఈ ప్రోగ్రాం కింద చివరిగా కట్టిన ప్రీమియంలో దాదాపు 10 శాతం దాకా విలువ చేసే వైద్య సేవలు పొందవచ్చు. ఏజెంట్లకూ ప్రయోజనాలు.. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో సంపన్న పాలసీదారులకే కాకుండా వారి పాలసీలను తెచ్చిపెట్టే టాప్ పర్ఫార్మెన్స్ ఏజెంట్లకు కూడా కంపెనీపరమైన ప్రయోజనాలు ఉంటాయి. పాలసీల వివరాల వెల్లడి, పత్రాల జారీ మొదలైనవి వేగవంతంగా జరిగేలా తోడ్పడేందుకు ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్లను కంపెనీ అందిస్తోంది. ప్రాధాన్యం గల ఏజెంట్ల నుంచి వచ్చే మెయిల్స్‌ను వెంటనే గుర్తించేలా వారికి స్పెషల్ ఈ మెయిల్ ఐడీలు ఇస్తుంది. సంస్థ ఖాతాలో ప్రస్తుతం 4,00,000 పైచిలుకు హెచ్ఎన్ఐ కస్టమర్లు ఉన్నారు. సంస్థ మొత్తం పాలసీదారుల్లో ఇది ఆరు శాతం. అందుబాటులోకి ఐటీ కొత్త వెబ్సైట్ ఆదాయ పన్ను విభాగం తాజాగా మరింత మెరుగుపర్చిన వెబ్‌సైట్‌ను పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుల పరిష్కారానికి, సత్వరం ఇతరత్రా సర్వీసులు సులువుగా పొందేందుకు అవసరమైన లింక్‌లను ఇందులో పొందుపర్చింది. www.incometaxindia.gov.in పేరిట అందుబాటులోకి వచ్చిన కొత్త వెబ్సైట్ మొదటి పేజీలో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ అనే కొత్త లింకు ఉంటుంది. పాన్ కార్డు పొందడం దగ్గర్నుంచి ఈ-రిటర్నుల దాఖలు, రీఫండ్ల గురించి తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయడం దాకా వివిధ సర్వీసుల పేజీని ఈ లింకుతో అనుసంధానం చేశారు. -
మేలుకో పాలసీదారుడా మేలుకో..
బీమా పాలసీలతో అనేక ప్రయోజనాలున్నాయి. జీవితంలో ఊహించడానికి వీలులేని సంఘటన ఏదైనా జరిగితే మనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అంతేకాదు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో బీమాపై ప్రజల్లో అవగాహన క్రమేపీ పెరుగుతోంది. కేవలం పాలసీ తీసుకోవడమే కాకుండా దానిపై ఉండే హక్కులపై కూడా అవగాహన పెంచుకోవాలి. పాలసీదారుడిగా వాటి హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. బీమా లో పాలసీదారునికి ఉండే హక్కులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాలసీ కొనుగోలు సంబంధిత హక్కులు, కొనుగోలు తర్వాత పాలసీ సర్వీసులను పొందే హక్కులు, క్లెయిమ్ సంబంధిత హక్కులు. కొనుగోలు హక్కులు బీమా కంపెనీలు పాలసీలను విక్రయించడానికి శత విధాలా ప్రయత్నిస్తాయి. తొందరపడి వారి బుట్టలో పడొద్దు. ముందుగా బీమా కంపెనీకి సంబంధించిన విషయాలతోపాటు, ఆ పథకం వివరాలన్నీ ఏజెంట్‌ను క్షుణంగా అడిగి తెలుసుకోండి. పాలసీ కొనుగోలుదారునిగా ఈ పథకానికి సంబంధించిన అంశాలతో పాటు బీమా కంపెనీ గత చరిత్ర, దాని పనితీరును, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంది. అవసరమైతే ఈ విషయాలను కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా పొందొచ్చు. మీరు ఎంచుకున్న పథకానికి సంబంధించిన లాభ నష్టాలను తెలియజేయాలి. ఏదైనా పథకం సూచించేటప్పుడు అతని వయసు, ఆర్థిక లక్ష్యాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి. అలాకాకుండా కస్టమరే ఏదైనా పథకాన్ని ఎంచుకుంటే... ఆ పథకానికి అతను అర్హుడా? కాదా? అనే అంశాన్ని 15 రోజుల్లోగా బీమా కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే పాలసీ కట్టించుకుంటే 30 రోజుల్లో డాక్యుమెంట్లను కస్టమర్లకు అందివ్వాలి. బీమా కంపెనీలు కస్టమర్ల వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలి. కస్టమర్లు కూడా ఎలాంటి ఇతర సమాచారాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని బీమా కంపెనీలు బయటి వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు. పాలసీ సర్వీసులను పొందే హక్కులు ఒక్కసారి పాలసీని తీసుకున్న తర్వాత ఆ పాలసీ ప్రయోజనాలను పొందే హక్కు వస్తుంది. ఒకవేళ ఆ పాలసీని వద్దనుకుంటే దాన్ని 15 రోజుల్లోగా తిరస్కరించే అవకాశం ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఇలా 15రోజుల్లోగా పాలసీని రద్దు చేసుకున్నప్పుడు సదరు బీమా కంపెనీ స్టాంప్ డ్యూటీ చార్జీలను, వైద్యపరీక్షల ఖర్చులను మినహాయించుకొని తిరిగి మన ప్రీమియాన్ని మనకు చెల్లిస్తుంది. కస్టమర్ బీమా కంపెనీ సర్వీసులు, ప్రాడక్టుతో సంతృప్తి చెందకపోతే అతను బీమా కంపెనీ నోడల్ ఆఫీస్‌లో కానీ, అంబూడ్స్‌మెన్, లేదా కన్సూమర్ కోర్టులో కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత ఈ కేసును 14 రోజుల్లోగా ముగించాల్సి ఉంటుంది. క్లెయిమ్ సంబంధిత హక్కులు బీమా కంపెనీ నిర్దేశించిన సమయంలో కస్టమర్‌కు లేదా అతని సంబంధీకులకు క్లెయిమ్‌ను అందిస్తే ఎలాంటి గొడవ ఉండదు. కానీ క్లెయిమ్ సెటిల్మెంట్లలో ఏవైనా జాప్యాలు జరిగితేనే అసలు సమస్య. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కంపెనీకి ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే క్లెయిమ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా అడగాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా దర్యాప్తు అవసరమైతే 180 రోజుల్లోగా పూర్తి చేయాలి. ఎలాంటి దర్యాప్తు అవసరం లేకపోతే 30 రోజుల్లోగా క్లెయిమ్‌ను సెటిల్ చేయాలి. -
బీమా కంపెనీల ఐపీవోలకు ఐఆర్డీఏ సానుకూలం
న్యూఢిల్లీ: సాధారణ బీమా సంస్థలు అవసరాన్ని బట్టి పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి రావొచ్చంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) ఒక ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొంది. దీని ప్రకారం ఐఆర్డీఏ నుంచి అనుమతి పొందిన ఏడాది వ్యవధిలోగా సదరు సంస్థ నిర్దేశిత నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. నియంత్రణ సంస్థ అనుమతి లేకుండా నాన్-లైఫ్ ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, కేవలం ఆరోగ్య బీమాకే పరిమితమైన సంస్థలు.. పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవడానికి ఉండదు. -
క్లెయిమ్ తిరస్కరించకుండా జాగ్రత్తలు ఇవీ!
వి.విశ్వానంద్: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబ పెద్దకి జరగకూడనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులపాలు కాకుండా చూసేందుకు తీసుకునేదే జీవిత బీమా పాలసీ. అయితే, కొన్ని సందర్భాల్లో క్లెయిములు తిరస్కరణకు గురవుతుంటాయి. ఇలాంటప్పుడు... అసలు పాలసీ లక్ష్యమే దెబ్బతింటుంది. బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్‌లను తిరస్కరించేందుకు చట్టబద్ధమైన కారణాలే ఉంటాయి. వీటిని గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే, క్లెయిమ్‌లు తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్తపడే వీలుంటుంది. ప్రపోజల్ ఫారంలో వివరాలన్నీ ఉండాలి.. చాలామటుకు పాలసీదారులు తమ పాలసీ దరఖాస్తును సొంతంగా నింపకుండా.. బీమా ఏజెంట్లకే వదిలేస్తుంటారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే సేల్స్ టార్గెట్లను సాధించాలన్న తాపత్రయంతో వారు కొన్ని సందర్భాల్లో సరైన సమాచారాన్ని దరఖాస్తుల్లో పొందుపర్చకపోవచ్చు. లేదా వారికి పాలసీదారు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు దరఖాస్తులో అరకొర సమాచారం మాత్రమే పొందుపర్చడం జరుగుతుంది. ఈ వివరాల ఆధారంగానే బీమా కంపెనీ పాలసీ జారీ చేస్తుంది. ఒకవేళ బీమా కంపెనీ మీరు దరఖాస్తులో పూర్తి వివరాలు పొందుపర్చలేదని భావించినా, ఏవైనా వివరాలు సరిగ్గా ఇవ్వలేదని భావించినా ఆ కారణం మూలంగానైనా క్లెయిమును తిరస్కరించే అవకాశాలున్నాయి. కాబట్టి, వృథా శ్రమ అని భావించకుండా ఎవరి దరఖాస్తును వారే పూర్తి చేయడం మంచిది. పాలసీ రెన్యువల్ మర్చిపోవద్దు.. యాక్టివ్‌గా ఉన్న పాలసీల క్లెయిములను మాత్రమే బీమా సంస్థలు సెటిల్ చేస్తాయి. కనుక ప్రీమియంను గడువులోగా కట్టేయాలి. లేకపోతే, ప్రీమియంలు చెల్లించకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందన్న కారణంతోనూ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సమయంలోగా ప్రీమియం కట్టలేకపోతే.. గ్రేస్ పీరియడ్లోనైనా కట్టేసేందుకు ప్రయత్నించాలి. సమాచారాన్ని దాచిపెట్టొద్దు.. మీరు దరఖాస్తులో పొందుపర్చే ప్రతీ వివరమూ కీలకమే. దీని ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ణయిస్తుంటాయి. మీ వయస్సు, వృత్తి, స్మోకింగ్.. డ్రింకింగ్ అలవాట్లు, అప్పటికే ఉన్న రుగ్మతలు, కుటుంబ ఆరోగ్య వివరాలు, ఇతరత్రా ఉన్న పాలసీల సమాచారం మొదలైనవన్నీ కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఏ వివరాన్నీ కూడా కప్పిపుచ్చకుండా అన్నీ అందజేయండి. లేదా క్లెయిము రిజెక్ట్ కావడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయానికొస్తే.. పాలసీ కింద ఏయే వ్యాధులకు కవరేజీ ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకోవాలి. నామినేషన్ వివరాలు అప్డేట్గా ఉండాలి.. సాధారణంగా వివాహం జరగడానికి ముందు తీసుకునే పాలసీల్లో తల్లిదండ్రులనే నామినీలుగా దరఖాస్తుల్లో పేర్కొంటూ ఉంటాం. అయితే వివాహం జరిగిన తర్వాత జీవిత భాగస్వామి పేరును కూడా చేర్చడం ఉత్తమం. ఇలాంటి మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే బీమా కంపెనీకి తప్పనిసరిగా తెలియజేసి నామినీ వివరాలను అప్డేట్ చేస్తే.. తదుపరి చెల్లింపుల్లో సమస్యలు ఉండవు. ఇక, చివరిగా .. క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో జాప్యం కూడదు. ఇది సందేహాలకు దారితీయొచ్చు.. క్లెయిమ్ చెల్లింపు ప్రక్రియ జాప్యం కావొచ్చు. సాధారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో సహాయం చేసేందుకు ప్రత్యేక అధికారి సర్వీసులు అందిస్తుంటాయి. మాట్లాడటానికి కష్టతరమైన అంశమే అయినప్పటికీ.. పాలసీదారు తాను తీసుకున్న పాలసీల గురించి, ఏజెంటు కాంటాక్టు నంబరు, జీవిత బీమా సంస్థ గురించి, క్లెయిముకు అవసరమైన పత్రాల గురించి నామినీలకు అన్ని వివరాలు తెలియజేయాలి. బంగారం... నెల గరిష్టం విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతుండటం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరగటం వంటి తదితర అంశాల వల్ల దేశంలో బం గారం ధరలు నెల గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,490తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,755 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,340తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,605 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఒకానొక సందర్భంలో నెల గరిష్ట స్థాయి అయిన 1,156 డాలర్లకు చేరింది. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ ప్రకటనతో 1,145 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది అంతక్రితం వారంతో పోలిస్తే 8 డాలర్లు అధికం. -
నేడు బ్యాంకు, బీమా ఉద్యోగుల సమ్మె
ముంబై: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ కార్మిక సంఘాలు బుధవారం (నేడు) తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో బీమా కంపెనీల సిబ్బంది... ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. దీంతో ఆర్థిక సేవలు అంతరాయం కలగనుంది. 25 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్, తొమ్మిది విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది. వీటితో పాటు 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 650 సహకార బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, సిడ్బి సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొంది. మొత్తం మీద బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు ప్రాతి నిధ్యం వహించే 14 యూని యన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభు త్వ రంగ బ్యాంకులను దొడ్డిదారిన కార్పొరేట్ల చేతికి అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కాగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది. -
‘ఈ’ ధీమా మీకుందా!?
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా పాలసీలు - రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ - పాలసీదారులకు ప్రయోజనాలెన్నో.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ కార్యక లాపాలన్నీ దాదాపుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారిపోయాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలూ ఇదే బాటపట్టాయి. ఇప్పుడు జాబితాలో బీమా కంపెనీలూ చేరాయి. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) కొన్నాళ్ల కిందటే ఈ-ఇన్సూరెన్స్ పాలసీలకు వీలు కల్పించినా... దేశంలో తొలి డిజిటలైజ్ బీమా పాలసీ 2013 సెప్టెంబర్‌లో ఆరంభమైనా... ఇప్పటివరకు 2 శాతం కంటే తక్కువ పాలసీలు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో అమ్ముడుపోయాయి. ఈ మధ్య కాలంలో కాగిత రహిత ఎలక్ట్రానిక్ రికార్డుల వైపు ప్రపంచం మొగ్గుచూపుతుండటం.. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల వినియోగం ఎంతగానో పెరుగుతుండటంతో ఈ-ఇన్సూరెన్స్లకు గిరాకీ పెరిగిందన్నది పరిశ్రమ వర్గాల మాట. ప్రత్యేకంగా రిపాజిటరీలుంటాయ్.. బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ చేయడానికి 2013లో ఐఆర్డీఏ అనుమతించింది. ఈ సేవలను అందించటానికి ఇన్సూరెన్స్ రిపాజిటరీలకు లెసైన్సులు జారీ చేసింది. ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్, షిల్ ప్రాజెక్ట్స్, కార్వీ ఇన్సూరెన్స్, క్యామ్స్ వంటివి ఇందులో ఉన్నా యి. దాదాపు అన్ని బీమా కంపెనీలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాలసీలను అందించేందుకు రిపాజిటరీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కూడా. ఏం చేయాలంటే.. బీమా వినియోగదారులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా పాలసీలు భద్రపరుచుకోవాలంటే ముందుగా ఏదైనా ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థ వద్ద ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాలసీ కొనుగోలు చేస్తే, ఆ పాలసీ వివరాలు ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఖాతాలో కనిపిస్తాయి. ఒక్కో పాలసీకి ఒక్కో ఖాతా కాకుండా ఎన్ని బీమా కంపెనీల నుంచి ఎటువంటి పాలసీలు కొనుగోలు చేసినా వాటన్నింటినీ ఒకే రిపాజిటరీ ఖాతాలో భద్రపరుచుకునే వీలుంటుంది. అంతేకాకుండా అప్పటికే ఫిజికల్ సర్టిఫికెట్ల రూపంలో ఉన్న బీమా పాలసీలను సైతం ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిపాజిటరీ ఖాతాలోకి మార్చుకోవచ్చు. రూ.100 కోట్ల ఆదా.. ఈ-ఇన్సూరెన్స్‌కు ఒక్కో పాలసీకి రూ.75-80 ఖర్చవుతుంది. దీనికి సర్వీసు ఛార్జీలు అదనం. ఇవి ఏటా రూ.500-900 వరకు ఉంటాయి. ఇవన్నీ పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ఫిజికల్ రూపంలో పాలసీలు నిర్వహించడానికి ఒకో పాలసీకి ఏటా రూ.150-200 ఖర్చవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలుంటే పరిశ్రమకు ఏటా రూ.100 కోట్ల ఆదా అవుతుందని ఐఆర్డీఏ చెబుతోంది. దీంతో నాలుగైదేళ్లలో బీమా పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జారీ అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రయోజనాలెన్నో.. - విడివిడిగా ప్రతి పాలసీకి ఒక పాలసీ సర్టిఫికెట్ తీసుకుని భద్రపరుచుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి రిపాజిటరీ ఖాతా తెరిస్తే చాలు.. ఎన్ని బీమా పాలసీలు కొనుగోలు చేసినా వాటన్నింటినీ ఇందులోనే జమ చేసుకోవచ్చు. - ఎలక్ట్రానిక్ ఖాతా కాబట్టి పాలసీదారు వద్ద సర్టిఫికెట్లు ఉండవు. దీంతో సర్టిఫికెట్లు పోతాయనే భయం.. భద్రపరచాల్సిన అవసరమూ ఉండదు. - వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సర్టిఫికెట్లు, ముఖ్యమైన పత్రాలు పోతాయన్న భయం అవసరం లేదు. - పాలసీ ప్రీమియం చెల్లింపులు, మెచ్యూరిటీ బెనిఫిట్లకు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ రూపంలో పాలసీదారులకు వస్తుంటుంది. - ఈ-ఇన్సూరెన్స్‌తో క్లెయిమ్ పరిష్కారం చాలా సులువు. పాలసీ సర్టిఫికెట్, దానికి సంబంధించిన ఇతరత్రా పత్రాలు, ధృవీకరణ అంతగా అవసరం ఉండదు. - ఏడాదికోసారి లేదా కోరినప్పుడు రిపాజిటరీ సంస్థ ఈ-ఇన్సూరెన్స్ పాలసీల ఖాతా స్టేట్మెంట్ పాలసీదారుకు అందజేస్తుంది. -
అమెరికా టు హైదరాబాద్.. వ్యాపార బాట
♦ హైదరాబాద్ కేంద్రంగా..అమెరికాలోని ఆసుపత్రులకు సేవలు ♦ ఒక్క ఏడాదిలోనే 6 మిలియన్ డాలర్ల బీమా చెల్లింపుల రికవరీ ♦ బీమా ఆదాయ విశ్లేషణల్లో వినూత్న సేవలందిస్తున్న డేటా మార్షల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గతేడాది అమెరికాలోని బీమా కంపెనీలు అక్కడి ఆసుపత్రులకు 58 బిలియన్ డాలర్లను అండర్ పేమెంట్ (తక్కువ మదింపు) చేశాయని అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ మదింపు ఆధారంగా వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకుంది డాటా మార్షల్. దాంతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వ్యాపార బాటలు వేసింది. తప్పుగా మదింపు చేసిన క్లయిమ్‌లను పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీసెస్ (పీఐఎస్) విధానంతో విశ్లేషించి.. బీమా చెల్లింపులను రికవరీ చేయించడమే దీని పని. ఇలా ఒక్క ఏడాదిలోనే రికవరీ చేసిన సొమ్మెంతో తెలుసా.. అక్షరాల 6 మిలియన్ డాలర్లకు పైమాటే. ఇది చాలదు బీమా రంగంలో డేటా మార్షల్ అందిస్తున్న వినూత్న సేవలోంటే చెప్పేందుకు!! మరిన్ని విశేషాలు డేటా మార్షల్ కో-ఫౌండర్ రవి ర్యాలీ మాటల్లోనే.. 2000వ సంవత్సరంలో మన దేశంలో బీమా పాలసీలను ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశ్యంతో అప్పటివరకున్న ప్రభుత్వ బీమా సంస్థలతో పాటుగా ప్రైవేటు బీమా కంపెనీలకూ అవకాశం కల్పించింది ప్రభుత్వం. అలాంటి సమయంలోనే దేశంలో ఇంటర్నెట్ బూమ్ కూడా వచ్చింది. అప్పుడే అనిపించింది.. ఆన్లైన్లో బీమా పాలసీలను విక్రయిస్తే ఎలా ఉంటుందని! చేతిలో ఉన్న కొంత మొత్తంతో సంరక్ష.కామ్ పేరుతో కంపెనీ ప్రారంభించి.. ఆన్లైన్లో బీమా పాలసీలను విక్రయించడం ప్రారంభించాను. హైస్ట్రీట్ వాసులు తిరిగే చోట కార్పొరేట్ స్థాయిలో పాలసీలను విక్రయించడం మొదలుపెట్టాను. ఇది చూసిన చాలా బీమా కంపెనీలు డొమైన్ నాలెడ్జ్ ఇస్తాం.. మరింత విస్తరింప చేయండని ప్రోత్సహించారు. 2001 డిసెంబర్లో అమెరికాలోని ఒక ఆరోగ్య బీమా కంపెనీ.. ఫిజికల్‌గా ఉండే బీమా క్లయిమ్‌లను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చే పనిని అప్పజెప్పింది. ఆరోగ్య బీమాలకు సంబంధించిన పేషెంట్ వివరాలు, డేటా వంటి సమాచారం ఫిజికల్ కాపీలు వచ్చేవి. వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో తర్జుమా చేయడం డేటా గ్రిడ్ పని. సంరక్ష.కామ్‌ను కాస్త డాటా గ్రిడ్‌గా పేరు మార్చి 5 మంది ఉద్యోగులతో అమెరికాలో సేవలను ప్రారంభించాం. అసలేం జరుగుతుందో.. ఆరోగ్య బీమాకు సంబంధించిన ఫిజికల్ కాపీలు మా దగ్గరి రావడానికి ముందు.. ఎలక్ట్రానిక్ రూపంలో తర్జుమా చేశాక జరిగే తతంగం ఏంటనే విషయంపై నోయిడాకు చెందిన ఇద్దరు నిపుణుల సహాయంతో విశ్లేషించాం. అప్పుడే అర్థమైంది.. ఆరోగ్య బీమా ఎలా క్లయిము చేయాలో.. బీమాను ఎలా పే చేస్తున్నారనే విషయం. బీమా రంగంలో ఎంత వ్యాపారముందో కూడా తెలిసింది. అమెరికాలో చాలా ఆసుపత్రులు వెయ్యి డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న క్లయిమ్‌లను మాత్రమే డాక్టర్స్ బ్యాక్‌ఆఫీస్ ఫాలోఅప్ చేస్తుంటారు. కానీ ఈ విభాగం 20 శాతం కంటే ఎక్కువ ఉండదు. చాలా వరకూ వంద డాలర్ల లోపే క్లయిమ్లుంటాయి. ఈ సమయంలోనే కంపెనీ పేరును డేటా మార్షల్‌గా మార్చాం. డేటా మార్షల్ ప్రత్యేకత ఇక్కడే ఉంది. ఆసుపత్రుల తరపున వంద డాలర్ల క్లయిమ్‌లను కూడా ఫాలో చేస్తుంది మా సంస్థ. మెడికల్ బిల్లింగ్ మాత్రమే కాదు.. క్లయిమ్ రైజ్ చేయటం దగ్గరి నుంచి ఆసుపత్రికి బీమా డబ్బులొచ్చే వరకూ మాదే బాధ్యత. డాటా మార్షల్ సక్సెస్ సీక్రెట్.. అత్యంత నిపుణతలో పనిచేయడం సంస్థ విజయ రహస్యం. 5 మందితో ప్రారంభించిన డేటా మార్షల్లో ఇప్పుడు 400 మంది ఉద్యోగులు స్థాయికి ఎదిగింది. రెండేళ్లలో మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం. ఒక్క ఏడాదిలో 6 మిలియన్ డాలర్లు.. పేషెంట్ ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి మొదలుపెడితే.. బెడ్‌కు ఎంత.. తిండికెంత.. ట్రీట్మెంట్కెంత.. మందులకెంత.. వంటి అనేక అంశాలపై క్లయిమ్‌కు ఎంత చెల్లించాలనే విషయంపై ముందుగానే ఆసుపత్రులకు, బీమా కంపెనీలకు మధ్య ఒప్పందం ఉంటుంది. దాని ప్రకారమే బీమా కంపెనీలు ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తాయి. ప్రతి వెయ్యి క్లయిమ్స్‌లో 7 శాతం క్లయిమ్‌లు అండర్ పేమెంట్‌గా జరుగుతుంటాయి. 2014 సంవత్సరంలో బీమా కంపెనీలు ఆసుపత్రులకు 58 బిలియన్ డాలర్లు (రూ.3.64 లక్షల కోట్లు) అండర్ పేమెంట్‌గా చేశాయని అక్కడి ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. దీన్ని కూడా పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీస్ (పీఐఎస్) విధానంతో విశ్లేషించి.. ఒక్క ఏడాదిలోనే 18 కంపెనీలకు 6 మిలియన్ డాలర్ల బీమా చెల్లింపుల రికవరీ (అండర్ పేమెంట్ రీకవరి) చేసిచ్చాం. ఇందుకు గాను ఇటీవలే ముంబైలో జరిగిన కార్యక్రమంలో 2015 సంవత్సరానికి గాను వైద్య రంగంలో ఇండో అమెరికన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎక్స్‌లెన్స్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ఈ ఏడాదిలో 55-60 ఆసుపత్రులకు.. ప్రస్తుతం అమెరికాలోని 19 రాష్ట్రాల్లో.. 22 ఆసుపత్రులు డేటా మార్షల్ సేవలను వినియోగించుకుంటున్నారు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని సాధించాం.రూ.6 కోట్ల పెట్టుబడులతో హైటెక్‌సిటీలో మరో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నాం. గతంలో 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మెడికల్ బిల్లింగ్ కంపెనీ ఫోనిక్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (పీఎంజీ)ని కొనుగోలు చేశాం. -
పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!
బీమా కంపెనీలను ఆదేశించిన ఐఆర్డీఏ న్యూఢిల్లీ : పాలసీదారులకు పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం చెయొద్దని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇం దుకోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పెన్షన్ ఉత్పత్తులను తీసుకున్న పాలసీదారులతో చర్చలు జరపాలని బీమా కంపెనీలకు తెలియజేసింది. ఈ చర్చల్లో పాలసీదారులు వారి పెన్షన్ చెల్లింపుల కోసం ఏలాంటి ఆప్షన్ కోరుకుంటారో బీమా కంపెనీలు తెలుసుకుంటాయి. అలాగే సదరు బీమా కంపెనీ పెన్షన్‌ను ఏ విధానంలో చెల్లిస్తుందో పాలసీదారులకు 6 నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారులు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే.. అప్పుడు బీమా కంపెనీ ఆ పాలసీదారు బీమా తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా చెల్లింపులు జరుపుతుంది. అలాగే నిబంధనలను అతిక్రమించడంతో రిలయన్స్ లైఫ్‌కు ఐఆర్డీఏ రూ.85 లక్షల జరిమానా విధించింది. -
ఆసుపత్రిలో క్లెయిమ్ కష్టమేం కాదు!
♦ క్యాష్‌లెస్ చికిత్సకు జాగ్రత్తలు తప్పనిసరి ♦ నెట్వర్క్ ఆసుపత్రి కాకుంటే రీయిఇంబర్స్మెంటే ♦ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి బీమా కంపెనీల చర్యలు ♦ 4 గంటల్లోనే పరిష్కరించేలా ఐసీఐసీఐ లాంబార్డ్ సెంట్రల్ వ్యవస్థ అందరికీ కావాల్సిందిపుడు ఆరోగ్యమే. ఒంట్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకోవటం మామూలు మనుషుల వల్ల అయ్యేపని కాదు. కాబట్టి ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులతో పాటు సొంత వ్యాపారాలు చేసుకునేవారు, వృత్తి నిపుణులు... ఆఖరికి రిటైరైన వారు కూడా ఏదో ఒక ఆరోగ్య బీమా పాలసీని ఆశ్రయించకతప్పటం లేదు. ఇక పాలసీలు తీసుకునేవారు పెరుగుతుండటంతో వారిని ఆకట్టుకోవటానికి బీమా కంపెనీలూ పోటీ పడుతున్నాయి. కొత్త పథకాలతో పాటు మెరుగైన సేవలపైనా దృష్టి సారిస్తున్నాయి. వీటన్నిటితో పాటు తమ కస్టమర్లకు క్లెయిమ్‌లు సమస్యగా మారకుండా జాగ్రత్త పడుతున్నాయి. గంటల వ్యవధిలోనే క్లెయిమ్స్ పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ లాంబార్డ్ గరిష్టంగా 4 గంటల్లోనే క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను పరిష్కరించేలా హైదరాబాద్‌లో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం పనితీరును వివరించడంతో పాటు, ఇబ్బందులేవీ లేకుండా వేగంగా క్లెయిమ్స్ ఆమోదం పొందడానికి ఏం చేయాలన్నది ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రతినిధులు ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’కి వివరించారు. ఆ వివరాలు మీకోసం... వైద్య బీమా ఉంటే చాలు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా వైద్య చికిత్స పొందే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు చాలా బీమా కంపెనీలు వాటి నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిలో క్యాష్‌లెస్ చికిత్సను అందిస్తున్నాయి. కీలకమైన సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ ప్రక్రియ సులువుగా పూర్తి చేయడానికి పలు బీమా కంపెనీలు సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుండగా... మరికొన్ని కంపెనీలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తున్నాయి. క్లెయిమ్... రెండు రకాలు ఆరోగ్య బీమాలో క్లెయిమ్స్‌ను ప్రధానంగా రెండు రకాలుగా... అంటే క్యాష్‌లెస్, రీయింబర్స్‌మెంట్‌గా విభజిస్తారు. క్యాష్‌లెస్ విధానమైతే బీమా కంపెనీ నెట్వర్క్ పరిధిలో ఉన్న హాస్పిటల్స్‌లో చేరితే ఎటువంటి నగదు లేకుండా చికిత్స పొందవచ్చు. ఒకవేళ అత్యవసర సమయంలో నెట్వర్క్ ఆసుపత్రిలో కాకుండా దగ్గర్లోని వేరే ఏదైనా ఆసుపత్రిలో చేరితే ముందుగా చికిత్సా వ్యయాన్ని మనం భరించాల్సి ఉంటుంది. తర్వాత ఈ మొత్తాన్ని రీయింబర్స్మెంట్ విధానంలో వెనక్కి తెచ్చుకోవచ్చు. క్లెయిమ్ చేసేటపుడు పాలసీదారులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా వేగంగా ఈ ప్రక్రియను ముగించొచ్చుననేది బీమా కంపెనీల మాట. క్యాష్‌లెస్, రీయింబర్స్మెంట్ విధానాల్లో ఎలా వ్యవహరించాలో చూస్తే... క్యాష్‌లెస్: దీన్ని కూడా రెండు రకాలుగా విభజిస్తారు. ముందస్తు ప్రణాళికతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే కేసులు కొన్ని ఉంటే, అప్పటికప్పుడు అత్యవసరంగా చికిత్స కోసం చేరేవి మరికొన్ని. ముందే తెలిస్తే... చికిత్స కోసం హాస్పిటల్లో చేరాల్సి ఉంటుందని ముందే తెలిసిన సందర్భాల్లో... అంటే డెలివరీ, కొన్ని శస్త్రచికిత్సల క్లెయిమ్ విషయంలో బీమా కంపెనీని ముందే సంప్రదించడం ఉత్తమం. క్లెయిమ్ కోసం బీమా కంపెనీని సంప్రదించే ముందు మీరు చేయాల్సిందల్లా.. ► క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం నెట్వర్క్ హాస్పిటల్‌ను ఎంపిక చేసుకోవడం. ► హాస్పిటల్లో చేరాలనుకుంటున్న రోజు కంటే కనీసం రెండు మూడు రోజుల ముందే ఆ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకోవటం. ► ఇందుకోసం మీ ఇన్సూరెన్స్ వివరాలు, చికిత్స కోసం చేరుతున్న వ్యక్తి ఐడీ కార్డు వంటి వివరాలు ఆసుపత్రికి ఇవ్వటం. ► అప్పుడు హాస్పిటల్ సిబ్బంది ఆ చిక్సితకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి క్లెయిమ్ కోసం బీమా కంపెనీ లేదా టీపీఏని సంప్రదిస్తారు. ►హాస్పిటల్ నుంచి రిక్వెస్ట్ వచ్చాక బీమా కంపెనీ అన్ని వివరాలనూ పరిశీలిస్తుంది. ఇదే కీలకమైన ప్రక్రియ. మీరు తీసుకునే చికిత్స బీమా పరిధిలోకి వస్తుందా.. రాదా? వస్తే బీమా పరిహారంపై ఏమైనా పరిమితులున్నాయా? అన్న విషయాలను పరిశీలిస్తుంది. ►సాధారణంగా ఈ పరిశీలన కార్యక్రమాన్ని గరిష్టంగా 2 నుంచి 4 గంటలలోపే కంపెనీలు పూర్తి చేస్తాయి. ►అన్నీ సక్రమంగా ఉంటే క్యాష్‌లెస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అనుమతిస్తాయి. ఒకవేళ చికిత్సా వ్యయంపై ఏమైనా పరిమితులు ఉంటే... వాటి కారణాలను తెలుపుతూ.. ఎంత మొత్తానికి క్యాష్‌లెస్ చికిత్సను అందిస్తారో తెలియజేస్తాయి. ►బీమా కంపెనీ నుంచి అనుమతి లభించగానే రూపాయి కట్టకుండానే హాస్పిటల్లో చేరి చికిత్స పొందవచ్చు. ►కొన్ని సందర్భాల్లో క్యాష్‌లెస్ ఫెసిలిటీకి తిరస్కరించినట్లయితే... మొత్తం క్లెయిమ్‌నే తిరస్కరించినట్లు భావించనక్కర్లేదు. ►అలాంటి సందర్భాల్లో హాస్పిటల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకొని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లొచ్చు. అత్యవసర సమయాల్లో.. ప్రమాదాలు, హార్ట్ఎటాక్ వంటి సమయాల్లో అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఇలాం టపుడు కూడా క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పొందవచ్చు. అదెలాగంటే... ► అత్యవసర చికిత్స కోసం నెట్వర్క్ హాస్పిటల్‌కు మాత్రమే వెళ్లాలి. ►చికిత్స అవసరమైన వ్యక్తి బీమా వివరాలు, ఐడీ కార్డు, ఇతర వివరాలు ఇవ్వాలి. ► ఈ వివరాలను హాస్పిటల్ సిబ్బంది వెంటనే బీమా కంపెనీకి తెలియచేస్తారు. ► అవసరమైతే మీరు కూడా బీమా కంపెనీ లేదా టీపీఏను సంప్రదించి అత్యవసర పరిస్థితిని తెలియచేయొచ్చు. ► ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీలు సాధ్యమైనంత తొందరగా క్యాష్‌లెస్ చికిత్సకు అనుమతిస్తాయి. ► కొన్ని అత్యవసర కేసుల్లో టీపీఏ అనుమతి రాకుండానే చికిత్సను ప్రారంభిస్తాయి కూడా. ► సాధారణంగా అర్ధరాత్రి సమయాల్లో చేరినప్పుడు అనుమతుల జారీలో ఆలస్యం జరుగుతుంది. ► ఇటువంటి సమయంలో చికిత్స చేయడానికి కంపెనీ అభ్యంతరం పెట్టదు. ► ఒకవేళ క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే నగదు చెల్లించి చికిత్స చేయించుకొని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దాఖలు చేయొచ్చు. రీయింబర్స్మెంట్.. కొన్నిసార్లు నెట్వర్క్ పరిధిలో లేని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసులకు కూడా బీమా పరిహారం లభిస్తుంది. కానీ, క్యాష్‌లెస్ ఫెసిలిటీ లభించదు. ఇలాంటప్పుడు ముందుగా చికిత్సా వ్యయాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రీ-ఇంబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి కేసుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఏడు రోజుల లోగా క్లెయిమ్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫారంతో పాటు డిశ్చార్జి కాగితాలు, ఆసుపత్రి బిల్లులు, డయాగ్నొస్టిక్ రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి... ► అన్ని వ్యాధుల చికిత్సకూ బీమా రక్షణ ఉండదు. క్లెయిమ్ దరఖాస్తు చేసే ముందు ఆ చికిత్సకు బీమా పరిహారం ఉందో లేదో పరిశీలించండి. ► గ్రూపు ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్‌కు దరఖాస్తు చేస్తున్నప్పుడు ప్రధాన పాలసీదారుడి గుర్తింపు కార్డుతో పాటు, చికిత్స తీసుకునే కుటుంబ సభ్యుడి గుర్తింపు కార్డు కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. ► క్యాష్‌లెస్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు చికిత్సకు సంబంధించిన రిపోర్టులను స్కాన్ చేసి పంపిస్తే సరిపోతుంది. ► రీయింబర్స్మెంట్ సమయంలో బిల్లులు, డిశ్చార్జి సమ్మరీ ఇవ్వాల్సి ఉంటుంది. ► ఒరిజినల్ పత్రాలు ఇచ్చేటప్పుడు వాటి ఫొటో కాపీలు ఉంచుకోవడం మర్చిపోవద్దు. -
బ్యాంకు ఉద్యోగులకు ఆరోగ్య బీమా
ముంబై : అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు బ్యాంకు ఉద్యోగుల కోసం కొత్తగా ఒక ఆరోగ్య బీమా పాలసీని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నెల చివరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ద్వారా ఒక మాస్టర్ మెడిక్లెయిమ్ పాలసీని బ్యాంకు ఉద్యోగులకు అందించడానికి బీమా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లకు, ఐబీఏ మధ్య మే 25న కుదిరిన కొత్త వేతన ఒప్పందం ప్రకారం.. ఐబీఏలోని 43 సభ్యత్వ బ్యాంకులు వారి ఉద్యోగులకు ఒక ఆరోగ్య బీమా పాలసీని అందించాలి. ఉద్యోగుల ఆరోగ్య బీమా అంశంపై తాము ఐబీఏతో చర్చిస్తున్నట్లు న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్, ఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. -
ఇక బీమాలోకి విదేశీ నిధుల వరద..
⇒ రూ. 60,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా... ⇒ భారతి బీమా వెంచర్లో యాక్సా వాటా 49 శాతానికి పెంపు: సునీల్ మిట్టల్ ⇒ భాగస్వాములతో చర్చిస్తాం: రిలయన్స్ కేపిటల్ ⇒ పెట్టుబడులకు అదనపు వనరు ఈ పరిమితి పెంపు: చందా కొచర్ ⇒ వాటా పెంపుపై మా భాగస్వామికి ఆసక్తి: ఎస్బీఐ సాక్షి బిజినెస్ విభాగం: ఎట్టకేలకు బీమా బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడటంతో ఇటు స్వదేశీ బ్యాంకులు, సంస్థలకు, అటు విదేశీ బీమా కంపెనీలకు దీర్ఘకాల నిరీక్షణ ఫలించినట్లయ్యింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు లైన్‌క్లియర్ కావడంతో ఈ రంగంలోకి క్రమేపీ విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో 24 జీవిత బీమా కంపెనీలు సహా 53 కంపెనీలున్నాయి. వాటిలో పలు దేశీయ బ్యాంకులు, ఆటోమొబైల్, బ్రోకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు విదేశీ భాగస్వామితో కలిసి జాయింట్ వెంచర్ బీమా కంపెనీల్ని అటు జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఏర్పాటుచేశాయి. బీమా వ్యాపారాలకు కొంత మూలధనాన్ని సమకూర్చడంతో పాటు కొత్త బీమా పత్రాలను రూపొందించడం వంటి సాంకేతిక సహకారాన్ని విదేశీ భాగస్వామ్య సంస్థలు అందిస్తూ వస్తున్నాయి. భారత్ బీమా రంగంలో అపార వ్యాపార అవకాశాలున్నందున, పూర్తిస్థాయిలో ద్వారాలు తెరవాలంటూ స్వదేశీ, విదేశీ కంపెనీలు ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటూ వస్తున్నాయి. తాజాగా బిల్లు క్లియరెన్స్‌తో ప్రైవేటు రంగ కంపెనీలు వాటి విదేశీ భాగస్వాముల నుంచి నిధులు సమీకరించడం, స్టాక్ మార్కెట్లో నమోదవటం ద్వారా నిధుల సేకరించడం వంటి ప్రణాళికల్ని హుటాహుటిన సిద్ధం చేస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లతో పాటు కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ తదితర ప్రభుత్వ బ్యాంకులకు వున్న బీమా జాయింట్ వెంచర్లలో సైతం విదేశీ భాగస్వామ్య కంపెనీలున్నాయి. బజాజ్ ఆటో, మహీంద్రా తదితర ఆటోమొబైల్ కంపెనీలకు, హెచ్డీఎఫ్సీ వంటి ఫైనాన్షియల్ సంస్థల వెంచర్లకు కూడా భాగస్వాములు విదేశీ సంస్థలే. ప్రయివేటు రంగంలోని ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బీమా కంపెనీలు స్టాక్ మార్కెట్లో వాటి వెంచర్లను లిస్ట్చేసేందుకు ఇప్పటికే సంకేతాలివ్వగా మరికొన్ని కంపెనీలు తెరవెనుక కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఈ మూడూ అటు జీవిత బీమా, ఇటు సాధారణ బీమా రెండు రంగాల్లోనూ ఉన్నాయి. ఐసీఐసీఐ సంస్థ దక్షిణాఫ్రికాకు చెందిన లాంబార్డ్‌తో కలిసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన ప్రుడెన్షియల్‌తో కలిసి జీవితబీమా సేవల్ని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కూడా జర్మనీకి చెందిన ఇర్గోతో కలిసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన స్టాండర్డ్‌తో కలిసి జీవిత బీమా సేవల్ని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ సంస్థ ఎంత వాటాను విక్రయించాలనుకుంటున్నదీ చెప్పకపోయినా... ఐసీఐసీఐ మాత్రం 5% వాటాను విక్రయించే అవకాశం ఉం దని తెలియజేసింది. అధిక ఎఫ్‌డీఐ పరిమితి కలిగిన వెంచర్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్చేసుకుంటే వాటికి అధిక వాల్యుయేషన్ పలుకుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. కంపెనీలు ఖుషీ ఖుషీ.. న్యూఢిల్లీ: బీమా బిల్లును పార్లమెంటు ఆమోదించడం దేశీ ఇన్సూరెన్స్ రంగ సంస్థల్లో ఉత్సాహం నింపింది. ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు పలు విదేశీ కంపెనీలతో జాయింట్ వెంచర్లు (జేవీ) ఏర్పాటు చేసిన దేశీ బీమా సంస్థలు తెలిపాయి. ఇక, జేవీల్లో విదేశీ భాగస్వామ్య కంపెనీలు వాటాలు పెంచుకోవడానికి మార్గం సుగమమైందని గురువారం బిల్లు ఆమోదం పొందిన కొద్ది సేపటికే ప్రకటించాయి. భారతీ, రిలయన్స్, ఎస్బీఐ గ్రూప్, మ్యాక్స్ తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. పరిమితి పెంపు ద్వారా బీమా రంగంలోకి 8-10 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 48,000 కోట్లు-రూ. 60 వేల కోట్లు) రాగలవని కంపెనీలు అంచనా వేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి ఇది సానుకూల పరిణామమని ఫ్రాన్స్‌కి చెందిన యాక్సాతో జేవీ ఏర్పాటు చేసిన భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభిప్రాయపడ్డారు. జాయింట్ వెంచర్లో యాక్సా ఇక తన వాటాలను 49 శాతానికి పెంచుకుంటుందని, ఇందుకోసం త్వరలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బోర్డు (ఎఫ్ఐపీబీ)కు దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ‘తాజా పరిణామంతో ఇన్సూరెన్స్ రంగంలోకి 8-10 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయంగా బీమాను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. జీవిత బీమా వెంచర్లో తమ వాటాలను పెంచుకునేందుకు మా భాగస్వామ్య సంస్థలతో చర్చలు మొదలుపెడతాం’ అని రిలయన్స్ క్యాపిటల్ సీఈవో శామ్ ఘోష్ చెప్పారు. బీమా కంపెనీలు పెట్టుబడులు సమకూర్చుకునేందుకు మరో వనరు లభించినట్లవుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు. అనిశ్చితి తొలగింది..: బీమా బిల్లు ఆమోదంతో అనిశ్చితి తొలగిందని, స్పష్టత వచ్చిందని ఎస్బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. ఎస్బీఐ లైఫ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి 74 శాతం, బీఎన్పీ పారిబాకి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీఎన్పీ తన వాటాలను పెంచుకోవడంపై ఆసక్తిగా ఉందని, ఎంత మేర పెంచుకుంటుందో .. ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని బసు తెలిపారు. మరోవైపు, మ్యాక్స్ బూపా జేవీలో బ్రిటన్ భాగస్వామ్య సంస్థ బూపా కూడా వాటాలు పెంచుకోవాలనుకుంటోందని మ్యాక్స్ ఇండియా చైర్మన్ అనల్జిత్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం దేశీ జీవిత బీమా రంగంలో రూ. 35,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని, ఇందులో ఎఫ్‌డీఐలు (26 శాతం పరిమితిని బట్టి చూస్తే) సుమారు రూ. 8,700 కోట్లు ఉంటాయని పీఎన్బీ మెట్‌లైఫ్ ఎండీ తరుణ్ చుగ్ చెప్పారు. పరిమితిని పెంచడం వల్ల అదనంగా మరో రూ. 7,800 కోట్ల ఎఫ్‌డీఐలు రాగలవన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతం: ఈ బిల్లు ఆమోదం బీమా రంగంలో నూతన అధ్యాయానికి తెర తీసిందని ఫిక్కీ జనరల్ డెరైక్టర్ అరబింద్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. బీమా బిల్లు ఆమోదంతో దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఐఐ జనరల్ డెరైక్టర్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. -
క్లెయిమ్‌కు దారిదీ!
బీమా కంపెనీలందించే సేవల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది క్లెయిమ్. అన్ని కాగితాలతో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే కంపెనీలు ఏడు రోజుల్లోపే వీటిని పరిష్కరిస్తాయి. కానీ సరైన సమాచారం ఇవ్వకుండా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే మటుకు బీమా కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అసలు క్లెయిమ్ చెయ్యడానికి ఏవి అవసరమో, ఏ పత్రాలు కావాల్సి వస్తాయో ఓసారి చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్.. ఇందులో 2 రకాల క్లెయిమ్లుంటాయి. ఒకటి క్యాష్‌లెస్. మరోటి రీ-ఇంబర్స్మెంట్. క్యాష్‌లెస్ సౌకర్యం ఉంటే బీమా కంపెనీ సూచించిన ఆసుపత్రిలో చేరి పాలసీతో పాటు మీకిచ్చిన కార్డును ఇస్తే సరిపోతుంది. మిగిలినదంతా వారే చూసుకుంటారు. అదే రీ-ఇంబర్స్మెంట్ అయితే కనుక బిల్లులు మొత్తం జాగ్రత్త చేసి వాటిని క్లెయిమ్ దరఖాస్తుతో పాటు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బీమా కంపెనీ వీటిని పరిశీలించిన తర్వాత క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది. హోమ్ ఇన్సూరెన్స్.. ఇతర క్లెయిమ్‌లతో పోల్చితే హోమ్ ఇన్సూరెన్స్ విషయంలో కొద్దిగా హోం వర్క్ ఎక్కువ చేయాలి. వరదలు, తుపాను, అగ్ని ప్రమాదం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం వివరాలను పూర్తిగా వాటి వాస్తవ విలువలతో తెలియజేయాల్సి ఉంటుంది. ఇతర సంఘటనలో జరిగిన నష్టాల్లో కూడా నష్టపోయిన ఆస్తి విలువలను (అసలు) పేర్కొంటూ క్లెయిమ్ మొత్తాన్ని కోరాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసిన తర్వాత సర్వేయర్ వచ్చి నష్టం విలువ అంచనా వేస్తాడు. అదే దొంగతనం, దోపిడీ వంటి విషయాల్లో అయితే పై వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆనంద్కి దూరదృష్టి ఎక్కువే. తను ఉన్నా.. లేకున్నా తన కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలూ తీసుకున్నాడు. ఇందులో భాగంగానే తగిన బీమా పాలసీ కూడా తీసుకున్నాడు. కానీ, తను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామికి ఎలాంటి కష్టాలూ రాకూడదన్న ఉద్దేశంతో పాలసీలు తీసుకున్న ఆనంద్.. ఆవిషయాన్ని మాత్రం భార్యకు చెప్పలేదు. అప్పుడప్పుడు ఆయన చెప్పబోతే.. అలాంటి అపశకునం మాటలెందుకంటూ ఆయన భార్య పెద్ద రాద్ధాంతమే చేసేది. దీంతో ఎప్పుడూ వారిద్దరూ తమ పాలసీలు, క్లెయిమ్‌ల గురించి చర్చించుకోవటమే కుదరలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రమాదాలు మనకు తెలిసిరావు. ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన భార్య కష్టాలు. అసలు ఆనంద్ ఏ పాలసీలు తీసుకున్నాడో ఆమెకు తెలియదు. ఆయన ఎక్కడెక్కడ డిపాజిట్లు చేశాడో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న పత్రాల ఆధారంగా కొన్ని పాలసీల గురించి తెలుసుకుంది. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలన్న అవగాహన కూడా ఆమెకు లేదు. చివరికి బంధువుల సహాయంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూనే క్లెయిమ్‌లు పూర్తి చేసింది. ఇంకా విచిత్రమేమిటంటే ఆనంద్ మరణించిన ఆరు నెలలకు ఓ బీమా కంపెనీ నంచి ప్రీమియం కట్టాలంటూ లేఖ వచ్చింది. దాంతో ఆ పాలసీ కూడా ఉన్నట్లు ఆయన భార్యకు తెలిసి.. ఆ క్లెయిమ్ కూడా పూర్తి చేసింది. ఆనంద్ కట్టిన పాలసీలన్నింటినీ ఆయన భార్య క్లెయిమ్ చేసిందా. అన్న ప్రశ్నకు నిజామానికి ఆమె దగ్గర సమాధానమే లేదు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుటుంబీకులతో చర్చించకపోతే అసలు లక్ష్యం నెరవేరటం కష్టం. పెపైచ్చు క్లెయిమ్‌పై కూడా అవగాహన అవసరం. లేదంటే సమయం, డబ్బు వృథా కాకతప్పదు. జీవిత బీమాతో పాటు, ఆటో, హెల్త్, ట్రావెల్, ఇన్సూరెన్స్‌ల విషయంలో క్లెయిమ్ ఎలా చేయాలన్న విషయమై అవగాహన పెంచేందుకు ఈ ప్రాఫిట్ కథనం.. మోటార్ ఇన్సూరెన్స్.. ఇందులో యాక్సిడెంట్ క్లెయిమ్, ఓన్ డ్యామేజీ, దొంగతనం వంటి రకరకాల క్లెయిమ్లుంటాయి. ముందుగా యాక్సిడెంటల్ క్లెయిమ్ గురించి చూస్తే. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. - ప్రమాదానికి మరో వాహనం కారణమైతే వెంటనే ఆ వాహనం నంబర్ రాసుకోవాలి. - అలాగే ఆ ప్రమాదానికి ఎవరైన ప్రత్యక్ష సాక్షులుంటే వారి వివరాలు, చిరునామా లేదా ఫోన్‌నంబర్లు సేకరించి పెట్టుకోవాలి. - ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించాలి. - ఒక వేళ మీరే ఎదుటి వాహనాన్ని ఢీకొన్నా.. థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం జరిగితే పారిపోకుండా సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం అందించండి. ఢీకొట్టి పారిపోవటాన్ని మన చట్టాలు అతిపెద్ద నేరంగా పరిగణిస్తాయి. - ప్రమాదం తర్వాత మీ వాహనం కదల్లేని స్థితిలో ఉంటే బీమా కంపెనీకి ఆ సమాచారం అందించి దగ్గర్లోని గ్యారేజీకి తీసుకెళ్లండి. - ప్రమాదం జరిగిన వెంటనే తొలుత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాక క్లెయిమ్ కోసం బీమా కంపెనీని సంప్రదించాలి. నేరుగా లేదా ఏజెంట్ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయవచ్చు. కావాల్సిన పత్రాలు.. - సంతకం చేసిన క్లెయిమ్ దరఖాస్తు - పాలసీ డాక్యుమెంట్లు (మొదటి రెండు పేజీలు) - వాహనం ఆర్సీ కాపీ - మీ డ్రైవింగ్ లెసైన్స్ - రిపేరు వ్యయానికి సంబంధించి ఒరిజినల్ బిల్ ఈ కాగితాలన్నీ జతపరిచి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే చాలు. థర్డ్‌పార్టీ, దొంగతనం, యాక్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజీలకే ఎఫ్ఐఆర్ కావాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్వేయర్ వచ్చి నష్టాన్ని అంచనా వేసి క్లెయిమ్ మొత్తాన్ని నిర్ధారిస్తాడు.ఇప్పుడు చాలా కంపెనీలు రిపేర్లకు క్యాష్‌లెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే బీమా కంపెనీ ప్యానెల్లో ఉన్న గ్యారేజీల్లో ముందు డబ్బులివ్వకుండానే రిపేరు చేయించుకోవచ్చు. సర్వేయర్ గ్యారేజీకొచ్చి నష్టాన్ని చూసి క్లెయిమ్‌ను అంచనా వేస్తాడు. ఆ మొత్తాన్ని గ్యారేజీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇంకా ఎక్కువైతే ఆ మొత్తాన్ని మీరే చెల్లించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్.. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం విదేశాలకెళ్లినప్పుడు ప్రయాణంలో బ్యాగేజీ పోవడమో, దెబ్బతినటమో జరిగినప్పుడు ప్రయాణం ఆలస్యం వల్ల నష్టం జరిగినా విమానం రద్దు కావటమో మరోటి జరిగి ప్రయాణం రద్దయి నష్టపోతే.. పాస్‌పోర్ట్ పోవటం, ప్రమాదం, ఆసుపత్రి పాలు కావటం.. తదితరాలు జరిగితే బీమా ర క్షణ ఉంటుంది. ప్రయాణించేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ కంపెనీది తీసుకున్నారో ఆ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్, పాలసీ నంబర్ దగ్గర పెట్టుకోవటం మర్చిపోవద్దు. మీరు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా క్లెయిమ్ సంభవించినప్పుడు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే కంపెనీ దగ్గర్లోని క్యాష్‌లెస్ సౌకర్యం ఉన్న ఆసుపత్రి వివరాలతో పాటు అక్కడెలా క్లెయిమ్ చెయ్యాలన్న విషయంలో కూడా మీకు సహాయం చేస్తుంది. జీవిత బీమా.. జీవిత బీమాలో క్లెయిమ్ రెండు రకాలు. ఒకటి మెచ్యూరిటీ క్లెయిమ్ కాగా, రెండోది డెత్ క్లెయిమ్. మెచ్యూరిటీ క్లెయిమంటే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారు చేతికి వచ్చే మొత్తం. దీనికి మనం చేయాల్సింది ఏమీ ఉండదు. పాలసీ కాలపరిమితి ముగియగానే చాలా బీమా కంపెనీలు నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాయి. లేదంటే మీ పేరు మీద చెక్కును మీ ఇంటికే పంపిస్తాయి. దీనికన్నా నెల రోజుల ముందు మీ పాలసీ గడువు పూర్తి కావ స్తోందని.. మెచ్యూరిటీ క్లెయిమ్ అందబోతోందని చెబుతూ ఒక పత్రాన్ని పంపిస్తాయి. దానిపై సంతకం పెడితే చాలు. అలాంటి పత్రాలేవీ రానట్లయితే దగ్గర్లోని బ్రాంచిని కానీ, ఏజెంట్‌ను కానీ సంప్రదిస్తే దానికి సంబంధించిన కాగితాలిస్తారు. డెత్ క్లెయిమ్.. మెచ్యూరిటీ క్లెయిమ్‌తో పోలిస్తే దీని విధానం కొంత సుదీర్ఘం. ఇక్కడ పాలసీదారుడికి కాకుండా నామినీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీలన్నీ క్లెయిమ్‌లను ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలించి కానీ సెటిల్ చెయ్యవు. ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని కాగితాలు ఉంటే క్లెయిమ్‌ను దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోపు సెటిల్ చేస్తారు. లేదంటే కొంత ఆలస్యమవుతుంది. అయితే బీమా నియంత్రణ రెగ్యులేటరీ సంస్థ (ఐఆర్ డీఏ) నిబంధనల ప్రకారం ఏ క్లెయిమ్నైనా దరఖాస్తు చే సిన 30 రోజుల్లోగా సెటిల్ చేయాలి. లేకపోతే వివాదాల పరిష్కార సెల్‌ను ఆశ్రయించవచ్చు. ఇవీ కావాల్సిన పత్రాలు.. - బీమా కంపెనీలకు క్లెయిమ్ కోరుతూ ఇచ్చే దరఖాస్తుతో పాటు పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. - ప్రమాదంలో మరణించినట్లయితే దాని ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వాలి. - ఏదైనా వ్యాధితో మరణిస్తే వైద్య చికిత్సకు సంబంధించిన కాగితాలు, డిశ్చార్జి కాగితాలు సమర్పించాల్సి ఉంటుంది. - మీరిచ్చిన సమాచారంతో బీమా కంపెనీలు తృప్తి చెందితే క్లెయిమ్‌ను వెంటనే పరిష్కరిస్తాయి. లేకపోతే అదనపు సమాచారాన్ని అడగవచ్చు. సాధారణ బీమా విషయానికొచ్చే సరికి ఇందులో మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి అవసరమైన సందర్భాల్లో క్లెయిమ్ చెయ్యటం మాత్రమే ఉంటుంది. వీటిలో చాలా కేసుల్లో మనకు ఎఫ్ఐఆర్ అవసరమవుతుంది. మోటార్ ఇన్సూరెన్స్, హోమ్, హెల్త్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ ఎలా చేయాలో, ఏ పత్రాలు అవసరమవుతాయో ఓ సారి చూద్దాం. మొదట ఏం చేయాలంటే.. - పాలసీదారు మరణించిన సందర్భంలో క్లెయిమ్ కు ఆ మరణం విషయాన్ని సాధ్యమైనంత త్వర గా బీమా కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలపాలి. - పాలసీదారు పేరు, పాలసీ నంబర్, మరణించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన వారి వివరాలు తెలియజేయాలి. - క్లెయిమ్ ఫారాన్ని మీ దగ్గర్లోని బ్రాంచి కార్యాలయం లేదా బీమా ఏజెంట్ ద్వారా పొందవచ్చు. కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి క్లెయిమ్ చేయడానికి తగిన సమాచారాన్ని ఇస్తారు. -
బీమా కంపెనీలతో ఐబీఏ సమావేశం
ముంబై: బడ్జెట్లో ప్రతిపాదించిన పలు కొత్త బీమా, పెన్షన్ పథకాల అమలుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) త్వరలో బీమా కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్త పథకాల ప్రారంభానికి ప్రీమియంను ఎలా సేకరించాలి, సర్టిఫికెట్లను ఎలా జారీచేయాలి, బీమా కంపెనీలకు సమాచారాన్ని ఎలా బదిలీ చేయాలి వంటి అంశాలు చర్చకు రానున్నాయని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. వీటితోపాటు క్లెయిమ్ పత్రాలను ఎవరు సేకరిస్తారు వంటి త దితర అంశాలు చర్చకు రానున్నాయన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి మూడు పథకాలపై మార్చి 3న ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హస్ముక్ అదియా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్, ఎల్ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ డెరైక్టర్ శశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీమా ఏజెంట్లకు లెసైన్స్ అక్కర్లేదు
ఏప్రిల్ 1 నుంచి బీమా సంస్థలే నేరుగా ఏజెంట్లను నియమించుకోవచ్చు... ⇒ ఆరోగ్య బీమాకు ఇక ప్రత్యేక విభాగంగా గుర్తింపు ⇒ 2025కల్లా 250 బిలియన్ డాలర్లకు బీమా రంగం ⇒ ‘సాక్షి’తో ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ఇప్పటివరకు బీమా ఏజెంట్ల నియామకం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) ద్వారానే జరిగేది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం రద్దవుతోంది. బీమా చట్టం సవరణ బిల్లును అమల్లోకి తెచ్చి, ఐఆర్డీఏ లెసైన్స్ లేకుండా బీమా సంస్థలకే సొంతగా వ్యక్తిగత ఏజెంట్లను నియమించుకునే వీలును కల్పిస్తున్నాం’’ అని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ చెప్పారు. ‘ఇండియా ఇన్సూరెన్ విజన్ 2025’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా గురువారం ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనేమన్నారంటే... ⇒ దేశంలో బీమా రంగంలో ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త మార్పులు కనిపిస్తాయి. అవేంటంటే.. ప్రస్తుతం బీమాలో రెండు రకాల వ్యాపారాలున్నాయి. 1.లైఫ్ ఇన్సూరెన్స్. 2.నాన్-లైఫ్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా అనేది నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య బీమానూ ప్రత్యేక విభాగంగా గుర్తిస్తాం. అలాగే ఈ విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తాం. మరో ముఖ్యమైన అంశమేంటంటే భారత దేశంలో వ్యాపారం చేసేందుకు విదేశీ రీ-ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతినిచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. (రీ ఇన్సూరెన్స్ అంటే బీమా కంపెనీలు తీసుకునే ఇన్సూరెన్స్. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ జీఐసీ ఒక్కటే ఈ సేవలందిస్తోంది) ⇒ బీమా రంగం ఎంతలా వృద్ధి సాధిస్తే దేశం కూడా ఆర్థికాభివృద్ధిలో అంతలా దూసుకెళుతుంది. అందుకే బీమా రంగంలోకి... ప్రత్యేకించి జీవిత బీమా రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరముంది. వచ్చే ఐదేళ్లలో బీమా రంగంలో రూ.50-55 వేల కోట్ల పెట్టుబడులు అవసరం. కానీ, ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటిని రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి 26 శాతంగా ఉంది. దీన్ని 74 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. ⇒ బీమా రంగ నియంత్రణలో పాత పరంపరకు స్వస్తి పలికి కొత్త ప్రణాళికలతో, ప్రాజెక్ట్‌లతో ముందుకెళుతున్నాం. బీమా పాలసీలు ఎలక్ట్రానిక్ రూపంలో చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అలాగే బీమా రిపోజిటరీ, రీ-ఇన్సూరెన్స్ ఎక్స్చెంజ్ల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చూస్తాం. దీంతో బీమా లావాదేవీల్లో సులభమైన, సమర్థవంతమైన పనితీరును కనబర్చవచ్చు. ⇒ మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న జనాభానే ఎక్కువ. అందుకే కేవలం 4% జనాభా మాత్రమే బీమా సదుపాయం కలిగి ఉన్నారు. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్తే అందుకయ్యే ఖర్చును నూటికి 86% మంది సొంతంగానే భరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సదుపాయాలలేమికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటమనేది తప్పనిసరి కాకపోవటం. ⇒ మరోపక్క ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్న వారిలో చాలా మందికి అప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటోంది. దీంతో బీమా క్లెయిమ్‌ల సంఖ్య అధికమై, ఆరోగ్య బీమా కంపెనీలపై భారం పెరుగుతోంది. ఇండియా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌లోని ముఖ్యాంశాలివే... ⇒ ఏటా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) బీమా రంగం 0.37-0.39 వృద్ధిని కనబరుస్తోంది. ప్రస్తుతం దేశంలో బీమా పరిశ్రమ విలువ 125-135 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2025 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ⇒ మొత్తం బీమా రంగంలో జీవిత బీమా వాటా ప్రస్తుతం 46 బిలియన్ డాలర్లు. ఏటా 12% వృద్ధిని కనబరుస్తోంది. 2025 నాటికి 160-175 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా. అలాగే 13 బిలి యన్ డాలర్లుగా ఉన్న సాధారణ బీమా రంగం.. ఏటా 22% వృద్ధి చెందుతోంది. 2025 నాటికల్లా 80 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. ⇒ ఈ ఏడాది దేశం మొత్తం మీద 11 శాతం బీమా విపత్తు నష్టాలకు, 12 శాతం బీమా మరణాలకు అందింది. ⇒ దేశంలోని అతి పెద్ద పరిశ్రమల్లో బీమా రంగం 16వ స్థానంలో ఉంది. 2025కి తొలి 10 పరిశ్రమల్లో నిలుస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.8 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. -
మొబైల్‌తోనే బీమా క్లెయిమ్!
ఫాస్ట్ ఫార్వర్డ్ యుగమిది. ఇంట్లో డ్రెస్ నుంచి రోడ్డు మీది రెస్టారెంట్ వరకు.. దేన్నీ వెతుక్కోవటం ఈ తరానికి అస్సలు నచ్చటం లేదు. శోధించి సాధించడం కాదు.. సిద్ధంగా ఉంటే సంతోషిస్తారంతే!! అందుకే రెస్టారెంట్లను వెదికిపెట్టడం దగ్గర్నుంచి ప్రతిదానికీ మొబైల్ యాప్‌లు తయారవుతున్నాయి. ఇపుడీ యాప్‌లు బీమా కంపెనీలకూ పాకాయి. ప్రీమియం చెల్లింపుల నుంచి క్షణాల్లో పాలసీ క్లెయిమ్ చేయటం వరకూ అన్నిటినీ మొబైల్ నుంచే చేయడానికి వీలు కల్పిస్తున్నాయివి. ⇒ ఒక్క క్లిక్‌తోనే క్లెయిమ్ చేసేందుకు వీలు ⇒ యాప్స్‌ను అందుబాటులోకి తెస్తున్న బీమా సంస్థలు ⇒ సమగ్ర సమాచారంతోపాటు పాలసీ చెల్లింపులు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ప్రస్తుతం దాదాపు ప్రతి బీమా కంపెనీ తన సొంత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాప్ వినియోగంతో బీమా చెల్లింపుల్లో చాలా మార్పులు వచ్చినట్లు ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో సైతం తేలింది. ‘‘యాప్స్ వినియోగం వల్ల బీమా సంస్థల విషయంలో కస్టమర్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో రెండేళ్ల కిందటిదాకా ఆన్లైన్లో పాలసీ చెల్లింపులు 5 శాతంగా ఉంటే.. యాప్స్‌ను వినియోగించటం మొదలుపెట్టాక ఇవి 15 శాతానికి పెరిగాయి’’అని బీసీజీ సర్వే తెలియజేసింది. బీమా అంతా యాప్స్‌లోనే.. పాలసీ తీసుకోవటం చాలామందికి ఓకే. కానీ నెలనెలా చెల్లించాలంటే కష్టమే. తేదీలు గుర్తుపెట్టుకోవటం, కంపెనీలకు వెళ్లటం, అక్కడ చెల్లించటం ఇవన్నీ కాస్త ఇబ్బందితో కూడుకున్నవే. అలాంటి అవసరమేదీ లేకుండా నేరుగా యాప్ ద్వారానే చెల్లించడాన్ని కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అంతేకాక ఎప్పుడు చెల్లించాలో... పాలసీ ఎప్పుడు పూర్తవుతుందో... ఒకవేళ ఏవైనా క్లెయిమ్‌లు చేసుకోవాల్సి ఉన్న పక్షంలో... సదరు పాలసీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆ వినియోగదారులకు ఎప్పటికప్పుడు మొబైల్‌కే చేరవేస్తున్నాయి. కొత్త పాలసీలు ఏవి అందుబాటులోకి వచ్చినా ఆ వివరాలు కూడా యాప్స్‌లో సిద్ధం చేస్తున్నాయి. ఒకరకంగా బీమా యాప్‌ను వినియోగించే వారు తమ చెల్లింపు తేదీలను, రెన్యువల్ తేదీలను మిస్ అయ్యే అవకాశం ఉండదన్న మాట. వీటితో పాటు ఫండ్ విలువలు, బ్రాంచ్‌లు, నెట్వర్క్ ఆసుపత్రులు, గ్యారేజీ స్టేషన్లు ఇలా బీమా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని యాప్‌లోనే చెబుతున్నాయ్. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు... యాప్స్ వినియోగంతో అటు బీమా సంస్థలు, ఇటు పాలసీదారులు ఇద్దరూ ఎల్లవేళలా సత్సంబంధాలు కొనసాగించొచ్చు. ప్రీమియం, పాలసీల విషయంలో పాలసీదారులకు తలెత్తే సవాలక్ష ప్రశ్నలను క్షణాల్లో నివృత్తి చేయడంలో అటు బీమా సంస్థలకు, ఎలాంటి జాప్యాల్లేకుండా వేగంగా పాలసీని క్లెయిమ్ చేసుకోవటంలో ఇటు పాలసీదారులకూ ఇద్దరికీ ఈ యాప్స్ అక్కరకొస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో క్లెయిమ్.. బీమా చేయటమే కాదు వాటిని క్లెయిమ్ చేసేటపుడే అసలైన సమస్యలు ఎదురవుతాయి. అయితే యాప్స్ వినియోగంతో ఈ చిక్కులేవీ ఉండవంటున్నాయి బీమా సంస్థలు. పాలసీ వివరాలు ముందుగానే యాప్‌లో నిక్షిప్తమై ఉంటాయి కనక.. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ గురించి, కస్టమర్ సర్వీస్ నంబర్ గురించి మనం అదే పనిగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో క్లెయిమ్ తాలూకా వివరాలు క్షణాల్లో సంబంధిత బీమా సంస్థకు చేరుతాయి. సంఘటన జరిగినప్పుడే కాదండోయ్.. ఎప్పుడైనా.. ఎక్కడైనా క్లెయిమ్ తాలూకు వివరాలను మనం తెలుసుకునే వీలుంటుంది. అలాగే అత్యవసర సమయాల్లో బీమా సంస్థలకు సంబంధించిన ఆసుపత్రులు, సర్వీస్ స్టేషన్ల సేవలనూ పొందవచ్చు. సరే! మీ మొబైల్లో మీ బీమా కంపెనీ యాప్ ఉందా? లేకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి మరి!! -
పొందూరులో టెక్స్టైల్ పార్కు
పొందూరు : పొందూరులో కనీసం వెయి మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. స్థానిక సాయిబాబా చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత వృత్తిలో ఆదాయం లేక, ఎంతోమంది కార్మికులు హైదరాబాద్‌లో మట్టితవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తులు కనుమరుగవ్వకుండా ఉండాలంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్ప ల్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే మార్కెటింగ్ జరగాలన్నారు. చేనేత వస్త్రాలను ధరిస్తే దాదాపు ఎలర్జీలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో విదేశీయులు వీటిపై మక్కువ చూపుతుంటారని తెలిపారు. విదేశాలకు ఉత్పత్తులను పంపిస్తే డిమాండ్ పెరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా లాభాలు వస్తాయని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు మండల రెవెన్యూ కార్యాలయం పరంగా అవసరమైన సహకారం అందిస్తామన్నారు. స్కాలర్‌షిప్‌ల పంపిణీ మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకం కింద తొమ్మిది, పది, ఇంటర్ చదువుతున్న 88 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1200లు చొప్పున స్కాలర్షిప్లను, చేనే త కార్మికులకు డిజైనింగ్ పరికరాలను కలెక్టర్, విప్, ఎల్ఐసీ డివిజనల్ మేనేజర్ కె.రవికాంత్ అందజేశారు. జిల్లాలో మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకం ద్వారా 1053 మం దికి స్కాలర్ అందిస్తున్నామని హ్యాండ్లూమ్ ఏడీ గుత్తు రాజారావు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాముల నాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు అనకాపల్లి అనూష, తహశీల్దార్ భువన్ మోహన్, ఎంపీడీవో బాలసుబ్రహ్మణ్యం, పొందూరు, తోలాపి చేనేత సహకార సంఘాల అధ్యక్షులు గంపల వీరభద్రస్వామి, బట్ట అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల సమీకరణకు
బీమా ఆర్డినెన్స్ తోడ్పాటు న్యూఢిల్లీ: బీమా కంపెనీలు బీమా రంగ సంస్కరణలకు సంబంధించి ఆర్డినెన్స్ జారీతో ఇన్సూరెన్స్ కంపెనీలు కొంగొత్త, వినూత్నమైన సాధనాల ద్వారా నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు లభించగలదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకూ తోడ్పడుతుందని తెలిపింది. భారీ పెట్టుబడులు అవసరమైన బీమా కంపెనీలు తమ వ్యాపార వృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి వీలు కల్పించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు పొందుపర్చినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బీమా చట్టాల (సవరణ) ఆర్డినెన్స్ 2014ని ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే తదుపరి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దేశీ బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం ఈ ఆర్డినెన్స్ ప్రధానోద్దేశం. దీనితో సుమారు 7-8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 50,000 కోట్లు) నిధులు బీమా రంగంలోకి రాగలవని అంచనా. దేశ ఎకానమీ.. ముఖ్యంగా బీమా రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టే దిశగా ఆర్డినెన్స్ ఉపకరించగలదని ఆర్థిక శాఖ వివరించింది. పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?
ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి ప్రస్తావన సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖపై భారం తగ్గేలా ఏవైనా బీమా కంపెనీల భాగస్వామ్యంతో రైలు ప్రయాణికులకు ప్రమాద బీమా కల్పించే యోచన ఏదైనా ఉందా? అంటూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని సోమవారం ప్రశ్నించారు. అలాంటి సౌకర్యం లేనిపక్షంలో ప్రమాదాల్లో ప్రాణాలు, సామాన్లు కోల్పోయిన ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఆయన లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమాధానమిస్తూ అలాంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదని వివరించారు. బీమా అంశంతో సంబంధం లేకుండా ప్రస్తుతం పరిహారం అందజేస్తున్నట్టు తెలిపారు. -
బీమా బిల్లుతో మరింత ధీమా
బీమా చట్టాల సవరణల బిల్లును ఇటీవలే కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల పెంపు మొదలైనవి కార్పొరేట్ స్థాయికి చెందినవే అయినా.. పాలసీదారులకు కూడా ప్రయోజనాలు కల్పించే నిబంధనలు సైతం ఇందులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఇవి.. మూడేళ్లు దాటితే.. తాజా నిబంధనల ప్రకారం బీమా తీసుకునేటప్పుడు సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో .. పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాత వచ్చే క్లెయిమును కంపెనీ తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి పాలసీ ఇచ్చేటప్పుడే సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఏజెంట్లు మోసం చేసినా.. కొత్త చట్ట సవరణ ప్రకారం.. ఏజెంట్లు చేసే తప్పులకు కూడా బీమా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించిన పక్షంలో కంపెనీలు ఏకంగా రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డులు: బీమా కంపెనీలు పాలసీ రికార్డులను, క్లెయిములను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని తమ వెబ్సైట్లలో ఉంచాలి. పారదర్శకతను మరింతగా పెంచేందుకు ఈ నిబంధనను ఉద్దేశించారు. ఏజెంట్ల సంఖ్య పెంపు.. ప్రస్తుతం బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ.. ఏజెంట్లకు లెసైన్సులు ఇస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఐఆర్డీఏ నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండి, నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని బీమా సంస్థలు నేరుగా ఏజెంట్లు కింద నియమించుకునే వీలు లభించనుంది. దేశవ్యాప్తంగా బీమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఉద్దేశించిన సవరణ ఇది. దీని వల్ల బీమా సంస్థలు మరింత మంది ఏజెంట్లను తీసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవచ్చు. అయితే, పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైతే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు ఐఆర్డీఏకి పూర్తి అధికారాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ విషయంలో పెద్దగా అడ్డంకులేమీ లేకపోయినా.. ఏజెంట్లు తప్పులు చేస్తే భారీ పెనాల్టీలు తప్పవు కాబట్టి, కంపెనీలు అత్యంత జాగ్రత్తగా నియామకాలు జరపాల్సి ఉంటుంది. -
బీమా కంపెనీల విలీనం యోచన లేదు
* లోక్‌సభలో పొంగులేటి ప్రశ్నకు సమాధానమిచ్చిన జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్‌లోని సాధారణ బీమా కంపెనీలను కలిపే యోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు శుక్రవారం మంత్రి సమాధానమిచ్చారు. అయితే ఆయా కంపెనీల నుంచి అటువంటి ప్రతిపాదనలు వచ్చాయని జైట్లీ తెలిపారు. అధిక పన్నుల కారణంగా దేశంలో ఏవైనా కంపెనీలు మూతపడిన దాఖలాలున్నాయా? వివరాలు తెలపాలంటూ పొంగులేటి అడిగిన మరో ప్రశ్నకు అలా కంపెనీలు మూతపడినట్టు ఎలాంటి సమాచారం లేదని మంత్రి పేర్కొన్నారు.