సాక్షి, ముంబై: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డు వినియోగింకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందనీ, జీవిత బీమా సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. (కర్మను నమ్ముతారా? లేదా?ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర)
ఇన్సూరెన్స్ పాలసీలను తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించే సౌకర్యాన్ని నిలిపేయాలని ఐఆర్‌డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. పాలసీ లోన్ అంటే జీవిత బీమా సంస్థలు పాలసీదారుని పాలసీ సరెండర్ విలువ ఆధారంగా స్వల్పకాలిక లోన్స్ ఇవ్వడం. పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను తనఖాపెట్టి రుణాలు తీసుకోవడం. ఎండోమెంట్, మనీ-బ్యాక్ లేదా ఫుల్-లైఫ్ పాలసీ లాంటి జీవిత బీమా పాలసీల ద్వారా లోన్ ఫెసిలిటీ అందిస్తోంది. అయితే, టర్మ్,యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్స్) ఈ సదుపాయం లేదు. కోటక్ లైఫ్ ప్రకారం ప్రతీ జీవిత బీమా పాలసీపై రుణాన్ని పొందలేరు. ఈనేపథ్యంలో ప్లాన్‌ను కొనుగోలుకు ముందే బీమా కంపెనీని సంప్రదించాలి. అలాగే యూలిప్‌లపై కూడా రుణం తీసుకోవచ్చు. ఇది ఆయా సంస్థలపై ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
సాధారణంగా బీమా పాలసీ సరెండర్ విలువలో 90శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీపై రుణాలపై వడ్డీ తక్కువ. కస్టమర్లు పాలసీ లోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లించ వచ్చు. అయితే వడ్డీ, లోన్ కలిపి పాలసీ సరెండ్ వ్యాల్యూని మించితే పాలసీ రద్దవుతుంది.
కాగా గత ఏడాది ఆగస్టులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ( పీఎఫ్‌ఆర్‌డీఏ) కూడా దాదాపు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-2 అకౌంట్ సబ్‌స్క్రిప్షన్ చేసుకునేందుకు, నగదు జమ చేసేందుకు క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment