credit card loan
-
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!
సాక్షి, ముంబై: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డు వినియోగింకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందనీ, జీవిత బీమా సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. (కర్మను నమ్ముతారా? లేదా?ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర) ఇన్సూరెన్స్ పాలసీలను తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించే సౌకర్యాన్ని నిలిపేయాలని ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. పాలసీ లోన్ అంటే జీవిత బీమా సంస్థలు పాలసీదారుని పాలసీ సరెండర్ విలువ ఆధారంగా స్వల్పకాలిక లోన్స్ ఇవ్వడం. పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను తనఖాపెట్టి రుణాలు తీసుకోవడం. ఎండోమెంట్, మనీ-బ్యాక్ లేదా ఫుల్-లైఫ్ పాలసీ లాంటి జీవిత బీమా పాలసీల ద్వారా లోన్ ఫెసిలిటీ అందిస్తోంది. అయితే, టర్మ్,యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్స్) ఈ సదుపాయం లేదు. కోటక్ లైఫ్ ప్రకారం ప్రతీ జీవిత బీమా పాలసీపై రుణాన్ని పొందలేరు. ఈనేపథ్యంలో ప్లాన్‌ను కొనుగోలుకు ముందే బీమా కంపెనీని సంప్రదించాలి. అలాగే యూలిప్లపై కూడా రుణం తీసుకోవచ్చు. ఇది ఆయా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? సాధారణంగా బీమా పాలసీ సరెండర్ విలువలో 90శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీపై రుణాలపై వడ్డీ తక్కువ. కస్టమర్లు పాలసీ లోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లించ వచ్చు. అయితే వడ్డీ, లోన్ కలిపి పాలసీ సరెండ్ వ్యాల్యూని మించితే పాలసీ రద్దవుతుంది. కాగా గత ఏడాది ఆగస్టులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ( పీఎఫ్ఆర్డీఏ) కూడా దాదాపు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-2 అకౌంట్ సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు, నగదు జమ చేసేందుకు క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
నందిగామ: బ్యాంకు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఓ చదువుల తల్లిని బలితీసుకున్నాయి. తండ్రి తీసుకున్న అప్పు కట్టేయాలనడమే కాక నోటికొచ్చినట్లు నానా మాటలు ఆనడంతో ఆమె తట్టుకోలేకపోయింది. మరోవైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి అరుణ తెలిపిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉంటున్న జాస్తి ప్రభాకరరావు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన కొద్దినెలల క్రితం ఓ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ 3.50 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. దీంతో ఈ నెల 26న సంబంధిత బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి తీసుకున్న రుణం వెంటనే చెల్లించాలంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఆ మాటలు విన్న ప్రభాకరరావు పెద్ద కుమార్తె జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటినుంచి అదే ఆలోచనతో ఉన్న ఆమె గురువారం ఉదయం సూసైడ్ లెటర్ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. అమ్మా.. నన్ను క్షమించు నిజానికి.. హరిత వర్షిణి చిన్నతనం నుంచి చదువులో బాగా శ్రద్ధ చూపేది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్)లో 15 వేల ర్యాంకు సాధించింది. మరింత మంచి ర్యాంకు కోసం ఈనెల 30న జరగనున్న తెలంగాణ ఎంసెట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. అప్పు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి నానా మాటలు అనడం.. అదే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు వర్ణిణిని తీవ్రంగా కుంగదీశాయి. కుటుంబానికి తాను భారం కాకూడదనుకుని సూసైడ్ నోట్ రాసి తనువు చాలించింది. అందులో.. ‘‘అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టమవుతుంది. నా కాలేజి ఫీజు, చెల్లి స్కూల్ ఫీజుకు కూడా డబ్బుల్లేవు. మావల్ల నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. చెల్లిని బాగా చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకోమను. నేను నీకు భారం కాకూడదని ఇలాచేశా. నన్ను క్షమించు అమ్మ. నీకు నేనేమీ చేయలేకపోతున్నా. నా గురించి నువ్వు ఏడవకు. చెల్లి జాగ్రత్త. ఎవరన్నా అడిగితే ఎంసెట్ ర్యాంకు రాలేదని చనిపోయిందని చెప్పండి.. డాడీకి నిజం చెప్పొద్దు’’.. అంటూ రాసిన లేఖ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఘటనపై అన్ని కోణాలలో దర్యాప్తు వర్షిణి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ కనకారావు తెలిపారు. -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్‌పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్‌పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్‌పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్‌పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్‌పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్‌పెయిడ్, జెస్ట్‌మనీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్‌పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్‌పీఎల్‌తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్‌పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్‌పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్‌పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్‌పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్‌పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్‌పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్‌కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్‌పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్‌లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్‌కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్‌తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్‌ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్‌లో యాక్టివ్‌గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్‌లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్‌పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్‌లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..
పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఎలాంటి రుణం కావాలన్నా సిబిల్ స్కోర్(క్రెడిట్ స్కోర్) చాలా అవసరం. సిబిల్ స్కోర్ బాగుంటేనే ఫైనాన్షిల్ క్రైసిస్ నుంచి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆదుకుంటాయి. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం..వరల్డ్ వైడ్ గా 190 మిలియన్ల మంది రుణాల్ని తీసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు తేలింది. అయితే ఆర్ధిక వ్యవహారాల్లో కీరోల్ ప్లే చేసే సిబిల్ స్కోర్‌ను పెంచుకునే మార్గాలు అనేకం ఉన్నా..వాటిలో ఉద్యోగస్తులు సిబిల్ స్కోర్‌ను పెంచేందుకు ప్రత్యేక పద్దతులు ఉన్నాయి. లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు అంత ముఖ్యం? వన్ స్కోర్ సీఈఓ అనురాగ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 'క్రెడిట్ స్కోరు అనేది 300 నుండి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మన ఆర్ధిక వ్యవహారాలు ఎలా ఉన్నాయో చెబుతోంది. లోన్ కోసం అప్లై చేసినప్పుడు.. ఆ లోన్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకునే ముఖ్యమైన బెంచ్ మార్కే ఈ సిబిల్ స్కోర్. ''సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్లు ఇచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తాయి. అదే స్కోర్ తక్కువగా ఉంటే మీరు ఆర్ధికంగా ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించి రుణాల్ని ఇచ్చేందుకు తిరస్కరిస్తాయి.అందువల్ల తక్కువ వడ్డీ రేటు, క్రెడిట్ కార్డ్‌లో లిమిట్ ఎక్కువగా కావాలాన్ని ఈ సిబిల్ స్కోర్ చాలా అవసరమని' అనురాగ్ సిన్హా అన్నారు. ఉద్యోగస్తులు తమ సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే చాలా మంది తొలిసారి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చని వన్ స్కోర్ సీఈఓ అనురాగ్ సిన్హా తెలిపారు.అంతేకాదు సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలిపారు. సురక్షితమైన క్రెడిట్ కార్డును పొందాలి: కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి సెక్యూర్ లేని క్రెడిట్ కార్డ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా క్రెడిట్ కార్డ్‌లను అందిస్తుంటాయి. వాటిలో సెక్యూర్ క్రెడిట్ కార్డ్‌లు 75-80 శాతం సిబిల్ స్కోర్ బాగుండేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మంచిదో ముందే తెలుసుకోవాలి. సకాలంలో ఈఎంఐ చెల్లించడం : లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవలను (ECS) సెట్ చేయడం ద్వారా మీ EMI,లేదా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్లు చేసుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు అనేక కారణాల వల్ల మొత్తం ఈఎంఐని చెల్లించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో చెల్లింపును కోల్పోకుండా డిఫాల్ట్‌ని నివారించడానికి మీరు కనీసం మొత్తాన్ని చెల్లించాలి. ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లయ్ చేయడం : సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. మీరు ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లయ్ చేస్తే దాని ప్రభావం సిబిల్ స్కోర్ పై పడుతుంది. సిబిల్ స్కోర్ పూర్తిగా తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ లేకుండా రుణం పొందవచ్చా? తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడానికి ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండటం మంచిది. సిబిల్ స్కోర్ స్కోరు లేనప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్లు ఆధారంగా బ్యాంకులు మీరు ఆర్ధికంగా ఎలా ఉన్నారనే విషయాన్ని అంచనా వేస్తాయి. కాబట్టి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండటమే మంచిది సురక్షిత రుణాల రకాలు: - మాటిగేజ్ లోన్ లేదా ప్రాపర్టీ లోన్ - కారు లోన్ - హౌజ్‌లోన్ - ఏదైనా బిజినెస్ లోన్ (యంత్రాలు/ముడి పదార్థాలు/భవనాలు) - ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు: ఆలస్యంగా చెల్లించడం: ఒకటి లేదా రెండు ఆలస్యమైన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆలస్యంగా లోన్ పే చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్, సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. క్రమపద్దతిలో చెల్లించకపోవడం: ఉదాహరణకు తీసుకున్న లోన్ ఈఎంఐ కొన్నిసార్లు చెల్లించాల్సిన మొత్తంలో కొద్ది మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంటాం. అలా పే చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎక్కువ సంఖ్యలో లోన్ల కోసం అప్లయ్ చేయడం: సిబిల్ స్కోర్ అనుగుణంగా బ్యాంకులు రుణాల్ని ఇస్తుంటాయి. అయితే బ్యాంకులు రుణాల్ని ఇచ్చేందుకు తిరస్కరిస్తే మనం వేరే బ్యాంక్ ద్వారా లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. మీ సిబిల్ స్కోర్ తక్కువగా చూపించడం: కొన్ని సార్లు మన సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నా.. మోసపూరిత కార్యకలాపాల వల్ల సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని చూపిస్తాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉందని అనిపిస్తే బ్యాంకు అధికారుల్ని సంప్రదించి సిబిల్ స్కోర్‌ను సరిచేయించుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో రుణాల్ని పొందే అవకాశాన్ని కోల్పోతాము. చదవండి: క్రెడిట్ స్కోర్ బాగున్నా, లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా? -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇది చదవండి
సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్‌లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు.. ఇలా ప్రతీ ఒక్కటీ తెలిస్తే నెలవారీ బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. గడువు తేదీ తర్వాత చెల్లిస్తే మాత్రం అధిక వడ్డీ రేట్లు, అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. కనుక కుదిరితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించటమే ఉత్తమం. పెద్ద మొత్తంలోని బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఈఎంఐ విధానాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డును మెరుగ్గా నిర్వహించే మార్గాలను చూద్దాం.. ఈఎంఐ ఆప్షన్.. నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, ఈ తర్వాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ రహిత కాల వ్యవధిని రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించకపోతే మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి (ఈఎంఐ) సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది. నో కాస్ట్ ఈఎంఐతో లాభమే.. ‘నో కాస్ట్ ఈఎంఐ’.. ‘రూపాయి చెల్లించి నచ్చిన ఉత్పత్తిని ఇంటికి తీసుకెళ్లండి.. ఆ తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆఫర్లు.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ పోర్టళ్లు క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై ఈఎంఐలను ఆఫర్ చేస్తాయి. తయారీదారులు/వ్యాపారుల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా.. ఈఎంఐ వడ్డీ రేట్లు, కాల వ్యవధులు నిర్ణయించడం జరుగుతుంది. ఆఫర్లలో భాగంగా ఆయా సంస్థలు ప్రకటించే ఈఎంఐ వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వడ్డీ రేట్లతో పోలిస్తే తక్కువగానే ఉండ డం ఆకర్షణీయం. అందుకే భారీ కొనుగోళ్లకు ముందుగా.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ కంపెనీల ఈఎంఐ ఆఫర్లను తనిఖీ చేయాలి. పైగా ఈ ఆఫర్లకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. క్రెడిట్ కార్డులపై రుణాలు.. మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డులపై రుణాల జారీ వేగంగా ఉంటుంది. వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ కంటే ఎక్కువ ఉండవని పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా తెలిపారు. -
ఏ సమయంలో ఏ రుణం..?
కౌశిక్‌కు ఉన్న పళంగా డబ్బులతో పని పడింది. వేతన జీవి అయిన అతడి ముందు పలు అవకాశాలు ఉన్నాయికానీ, ఏది ఎంచుకోవాలో అతడికి ఎంతకీ తేలడం లేదు. దీంతో ఫైనాన్షియల్ ప్లానర్‌ను వెతుక్కుంటూ వెళ్లాడు. పర్సనల్ లోన్, పేడే లోన్, క్రెడిట్ కార్డ్ లోన్... ఇవి సులభంగా లభించే రుణాలు. వీటికి అదనంగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. అవసరానికి వచ్చేసరికి వీటిలో ఏది అనువైనదో, వాటి విధానాలు ఎలా ఉంటాయో ఫైనాన్షియల్ ప్లానర్ వివరించాడు. పేడే లోన్ ఇది చాలా స్వల్ప కాలానికి ఇచ్చే రుణం. అంటే గరిష్టంగా ఓ నెల రోజుల వ్యవధికి అన్నమాట. తదుపరి వేతనం వచ్చిన వెంటనే బాకీ తీర్చేయాలి. వీటిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ నయం. పెద్దగా వ్యయ ప్రయాసలు లేకుండా రుణాన్ని పొందవచ్చు. పేడే లోన్ వల్ల ప్రయోజనాలు లేవా..? అంటే ఉన్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. పేడే లోన్‌కు క్రెడిట్ స్కోర్‌తో పని లేదు. క్లిష్టమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉండదు. అప్‌ఫ్రంట్ ఫీజులు గట్రా ఉండవు. ప్రాసెస్ వేగంగా ఉంటుంది. రుణం కూడా చేతికి వేగంగా అందుతుంది. అయితే, స్వల్ప కాలిక రుణాలు ఏవైనా గానీ అధిక వడ్డీ రేటు, ఇతర అంశాల కారణంగా ఖరీదైనవిగా చెప్పుకోవాలి. వీటన్నింటి కంటే ఓవర్ డ్రాఫ్ట్ అనేది చాలా సులభంగా అందేది. వడ్డీ రేటు కూడా తక్కువే ఉంటుంది. వీలును బట్టి తీర్చే వెసులుబాటు ఉంటుంది. అత్యవసరాల్లో ఆదుకోవడమే కాదు, చెక్బౌన్సలు కాకుండా కూడా ఓడీ ఆదుకుంటుంది. ఓడీ - పేడే లోన్ పేడే లోన్స కాల వ్యవధి అపరాధ రుసుంతో రెండు నెలలే ఉంటుంది. అదే ఓడీ అరుుతే 60 నెలల కాలంలో తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. పేడే లోన్ గరిష్టంగా రూ.40వేల వరకే. ఓడీ అరుుతే ఇంతకంటే ఎక్కువే తీసుకోవచ్చు. పేడే లోన్‌పై వడ్డీ రేటు 30 శాతం వరకు ఉంటుంది. నిర్ణీత గడువులోపల రుణం తీర్చడంలో ఒక్క రోజు ఆలస్యమైనా జరి మానా భారీగా చెల్లించాల్సి రావచ్చు. పర్సనల్ ఓవర్ డ్రాఫ్ట్‌పై వడ్డీ రేటు భరించగలిగే స్థారుులోనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైనంత విత్ డ్రా చేసుకోవచ్చు. పేడే లోన్‌కు కచ్చితంగా పూర్తి స్థాయి ఉద్యో గి అయి డాలి. పర్సనల్ ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఉద్యోగం ఏదైనా సరిపోతుంది. ఓవ ర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందడం సులభం. క్రెడిట్ కార్డ్ - పర్సనల్ లోన్ ఈ రెండింటిలో క్రెడిట్ కార్డ్ లోన్ ఎంతో సులభం. పర్సనల్ లోన్ అయితే పే స్లిప్‌లు, ఫామ్ 16, బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. రుణ జారీ ప్రక్రియకు కూడా కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇది రెండు మూడు రోజులు అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. అదే క్రెడిట్ కార్డు లోన్ అరుుతే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి కోరితే ఒక్క రోజులోనే రుణం లభిస్తుంది. క్రెడిట్ కార్డు రుణం తక్కువ కాల వ్యవధిపై లభిస్తుంది. ఇది ఆరు నెలల వరకు ఉంటుంది. పర్సనల్ లోన్ అరుుతే ఏడాది నుంచి రెండేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు. రుణం తక్కువ మొత్తంలో కావాల్సి ఉంటే అందుకు క్రెడిట్ కార్డు లోన్ అనువైనది. పర్సనల్ లోన్ సాధారణంగా 13 శాతం నుంచి 22 శాతం మధ్య వడ్డీ రేటుపై లభిస్తుంది. క్రెడిట్ కార్డు రుణంపై వడ్డీ రేటు 10 నుంచి 18 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డు రుణాలు ఫ్లాట్ వడ్డీ రేటుపై లభించేవి కాగా, పర్సనల్ లోన్స రెడ్యూసింగ్ బ్యాలన్స రేటుపై లభించేవి.