ఏ సమయంలో ఏ రుణం..?
ఏ సమయంలో ఏ రుణం..?
Published Mon, Nov 21 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
కౌశిక్‌కు ఉన్న పళంగా డబ్బులతో పని పడింది. వేతన జీవి అయిన అతడి ముందు పలు అవకాశాలు ఉన్నాయికానీ, ఏది ఎంచుకోవాలో అతడికి ఎంతకీ తేలడం లేదు. దీంతో ఫైనాన్షియల్ ప్లానర్‌ను వెతుక్కుంటూ వెళ్లాడు. పర్సనల్ లోన్, పేడే లోన్, క్రెడిట్ కార్డ్ లోన్... ఇవి సులభంగా లభించే రుణాలు. వీటికి అదనంగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. అవసరానికి వచ్చేసరికి వీటిలో ఏది అనువైనదో, వాటి విధానాలు ఎలా ఉంటాయో ఫైనాన్షియల్ ప్లానర్ వివరించాడు.
పేడే లోన్
ఇది చాలా స్వల్ప కాలానికి ఇచ్చే రుణం. అంటే గరిష్టంగా ఓ నెల రోజుల వ్యవధికి అన్నమాట. తదుపరి వేతనం వచ్చిన వెంటనే బాకీ తీర్చేయాలి. వీటిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ నయం. పెద్దగా వ్యయ ప్రయాసలు లేకుండా రుణాన్ని పొందవచ్చు. పేడే లోన్ వల్ల ప్రయోజనాలు లేవా..? అంటే ఉన్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. పేడే లోన్‌కు క్రెడిట్ స్కోర్‌తో పని లేదు. క్లిష్టమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉండదు. అప్‌ఫ్రంట్ ఫీజులు గట్రా ఉండవు. ప్రాసెస్ వేగంగా ఉంటుంది. రుణం కూడా చేతికి వేగంగా అందుతుంది. అయితే, స్వల్ప కాలిక రుణాలు ఏవైనా గానీ అధిక వడ్డీ రేటు, ఇతర అంశాల కారణంగా ఖరీదైనవిగా చెప్పుకోవాలి. వీటన్నింటి కంటే ఓవర్ డ్రాఫ్ట్ అనేది చాలా సులభంగా అందేది. వడ్డీ రేటు కూడా తక్కువే ఉంటుంది. వీలును బట్టి తీర్చే వెసులుబాటు ఉంటుంది. అత్యవసరాల్లో ఆదుకోవడమే కాదు, చెక్‌బౌన్‌సలు కాకుండా కూడా ఓడీ ఆదుకుంటుంది.
ఓడీ - పేడే లోన్
పేడే లోన్‌స కాల వ్యవధి అపరాధ రుసుంతో రెండు నెలలే ఉంటుంది. అదే ఓడీ అరుుతే 60 నెలల కాలంలో తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. పేడే లోన్ గరిష్టంగా రూ.40వేల వరకే. ఓడీ అరుుతే ఇంతకంటే ఎక్కువే తీసుకోవచ్చు.
పేడే లోన్‌పై వడ్డీ రేటు 30 శాతం వరకు ఉంటుంది. నిర్ణీత గడువులోపల రుణం తీర్చడంలో ఒక్క రోజు ఆలస్యమైనా జరి మానా భారీగా చెల్లించాల్సి రావచ్చు. పర్సనల్ ఓవర్ డ్రాఫ్ట్‌పై వడ్డీ రేటు భరించగలిగే స్థారుులోనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైనంత విత్ డ్రా చేసుకోవచ్చు.
పేడే లోన్‌కు కచ్చితంగా పూర్తి స్థాయి ఉద్యో గి అయి డాలి. పర్సనల్ ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఉద్యోగం ఏదైనా సరిపోతుంది. ఓవ ర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందడం సులభం.
క్రెడిట్ కార్డ్ - పర్సనల్ లోన్
ఈ రెండింటిలో క్రెడిట్ కార్డ్ లోన్ ఎంతో సులభం. పర్సనల్ లోన్ అయితే పే స్లిప్‌లు, ఫామ్ 16, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. రుణ జారీ ప్రక్రియకు కూడా కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇది రెండు మూడు రోజులు అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. అదే క్రెడిట్ కార్డు లోన్ అరుుతే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి కోరితే ఒక్క రోజులోనే రుణం లభిస్తుంది.
క్రెడిట్ కార్డు రుణం తక్కువ కాల వ్యవధిపై లభిస్తుంది. ఇది ఆరు నెలల వరకు ఉంటుంది. పర్సనల్ లోన్ అరుుతే ఏడాది నుంచి రెండేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు.
రుణం తక్కువ మొత్తంలో కావాల్సి ఉంటే అందుకు క్రెడిట్ కార్డు లోన్ అనువైనది.
పర్సనల్ లోన్ సాధారణంగా 13 శాతం నుంచి 22 శాతం మధ్య వడ్డీ రేటుపై లభిస్తుంది.
క్రెడిట్ కార్డు రుణంపై వడ్డీ రేటు 10 నుంచి 18 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డు రుణాలు ఫ్లాట్ వడ్డీ రేటుపై లభించేవి కాగా, పర్సనల్ లోన్‌స రెడ్యూసింగ్ బ్యాలన్‌స రేటుపై లభించేవి.
Advertisement
Advertisement