personal loan
-
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేట్లను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతాన్ని (5 బేసిస్ పాయింట్లు) పెంచడంతో 9 శాతానికి చేరింది. గృహ రుణం వంటి దీర్ఘకాల రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్‌నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎంసీఎల్ఆర్ రేట్లను ఎస్బీఐ రెండుసార్లు పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వ్యయాల పెరుగుదలతో బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాల్సి వస్తోంది. -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.వడ్డీ రేటులోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్సైట్లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.లోన్ వ్యవధిలోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ)పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. -
పర్సనల్ లోన్స్ అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే టాప్ 5 బ్యాంక్స్ ఇవే..
-
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్‌విలాస్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్‌గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్‌లోన్ ఇస్తామంటూ ఫోన్‌కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్‌లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్‌కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్‌కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్‌లో -
జియో ఫైనాన్స్ పర్సనల్ లోన్స్.. ఇవి ఉంటే చాలు!
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో ఫైనాన్స్ తన రుణ వితరణ వ్యాపారాన్ని ప్రారంభింంది. తొలుత పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని ఆరంభింంది. జియో ఫైనాన్స్, మై జియో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా వేతన జీవులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి డిజిటల్ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటే చాలు. రుణాన్ని వేగంగా పొందొచ్చు. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కింద ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఏసీలు, కెమెరా కొనుగోళ్లకు రుణాలను అందిస్తోంది. మర్చంట్ వెబ్ సైట్లపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ‘‘జియో ఫైనాన్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను అందిస్తోంది. తయారీదారులు, ఓఈఎంలు లేదా డీలర్లు ఈ రుణాలపై వడ్డీని భరిస్తారు. దీంతో నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని వినియోగదారులు పొందొచ్చు. కాకపోతే కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది’’అని జియో ఫైనాన్స్ పేర్కొంది. ఇన్వెంటరీ కొనుగోళ్లకూ రుణాలు వ్యాపారస్థులకు రుణాలను కూడా జియో ఫైనాన్స్ ప్రారంభింంది. అన్ సెక్యూర్డ్ మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన వర్తకులకు అందించనుంది. జియో ఫైనాన్షియల్ రిలయన్స్ నుం విడిపోయి ఎక్సే్ఛంజ్‌లలో లిస్టయింది. ఇన్సూరెన్స్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సేవలను సైతం ఈ సంస్థ త్వరలోనే అందించనుంది. -
బ్యాంకింగ్ స్థిరత్వమే ఆర్బీఐ లక్ష్యం - శక్తికాంత దాస్
ముంబై: క్రెడిట్‌కార్డ్‌సహా అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరు నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం.. బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ‘‘ముందస్తు’’ చర్యని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రిస్క్ కేటాయింపులను 25 శాతం పెంచుతూ ఆర్బీఐ కీలక నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వార్షికంగా ఈ రుణ విభాగం 30 శాతం పెరుగుదల దీనికి నేపథ్యం. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీలు అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూలధనంపై కూడా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ మారకపు విలువలో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉన్నట్లు గవర్నర్ తాజాగా వివరించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్– ఐబీఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ– ఫిక్కీ ఇక్కడ ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఐబీఏసీ 2023 (ఫిక్కీ బ్యాంకింగ్ సమావేశాలు–2023) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ శక్తికాంతదాస్ ప్రారంభోపన్యాసం చేశారు. గవర్నర్ ఈ సందర్భంగా ఏమన్నారంటే.. బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను తట్టుకుంటూ సుస్థిరంగా కొనసాగుతోంది. వ్యవస్థ గురించి ఆందోళన చెందడానికి తక్షణ కారణం ఏదీ లేదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. అయితే మొండిబకాయిలుగా మారే ఖాతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రమాదకర ధోరణిని ముందే గుర్తించాలి. వ్యక్తిగత రుణ నిబంధనలను కఠినతరం చేస్తూ ఇటీవల తీసుకున్న ఫలితాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. రుణదాతలు తమ రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను పటిష్టం చేసుకోవాలి. బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఎన్బీఎఫ్సీ పెద్ద రుణగ్రహీతగా ఉంది. రెండింటి మధ్య లోతైన అనుసంధానం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎన్‌బీఎఫ్‌ల రుణ పరిణామాలను నిరంతరం మందింపు చేయాలి. రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం తగిన ఫలితాలు ఇస్తోందన్న విషయం తెలియజేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇది ఆర్బీఐకి ‘అర్జునుడు లక్ష్యంపై గురి పెట్టడం లాంటిది’. వడ్డీరేట్ల విషయంలో హేతుబద్దత పాటించాలి వడ్డీ రేట్లు క్రమబద్ధీకరించబడినప్పటికీ, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీలు–ఎంఎఫ్ఐ) అధిక నికర వడ్డీ మార్జిన్లను పొందుతున్నట్లు కనిపిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఈ సంస్థలు తమ వడ్డీ రేట్లను నిర్ణయించేటప్పుడు రుణగ్రహీతల స్థోమత, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని దాస్ సూచించారు. అన్సెక్యూర్డ్ రుణాల్లో నెమ్మది: ఖారా అన్సెకూర్డ్ రుణ మంజూరీల విషయంలో ఆర్బీఐ నిబంధనల కఠినతరం ప్రభావం ఎస్బీఐపై కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతుందని బ్యాంకింగ్ ఎస్బీఐ చెర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ‘అధిక రిస్క్ కేటాయింపుల’ ప్రభావం డిసెంబర్ త్రైమాసికంలో ఎస్బీఐ నికర వడ్డీ మార్జిన్లపై 0.02–0.03 శాతం మేర ఉంటుందని అన్నారు. అయితే తదుపరి త్రైమాసికంలో పరిస్థితి మెరుగుపడుతుందన్న భరోసాను వెలిబుచ్చారు. వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు. -
డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం!
పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరగాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే అధికారులు ఆమోదించి లోన్ మంజూరు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఆన్లైన్లో పర్సనల్ లోన్ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. డిజిటల్ ప్లాట్ఫామ్లో లేదా యాప్‌లో లభించే వ్యక్తిగత రుణాన్ని డిజిటల్ లోన్ అంటారు. దీన్నే ఆన్లైన్ పర్సనల్ లోన్ అని కూడా పిలుస్తారు. సాధారణ పర్సనల్ లోన్‌తో పోలిస్తే డిజిటల్ లోన్ చాలా తక్కువ సమయంలో మంజూరవుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతం అయినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ కీలకం. బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! అర్హత సాధారణ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పర్సనల్ లోన్‌కి కూడా అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కనీస ఆదాయం లేదా టర్నోవర్ కలిగిన స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ లోన్ పొందవచ్చు. ఆన్లైన్ పర్సనల్ లోన్‌కు అర్హత దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అందుబాటులో లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పించే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వయస్సు, ఉపాధి, వృత్తిపరమైన అనుభవం వంటి సమాచారం కూడా అవసరమవుతుంది. డాక్యుమెంట్లు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచడం వలన అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలు, అభ్యర్థనలు లేకుండా లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. డిజిటల్ లోన్ దరఖాస్తు ప్రక్రియ సాఫీగా జరగడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఇక్కడ ఇస్తున్నాం.. ఐడెంటిటీ ప్రూఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణగ్రహీతలు తమ గుర్తింపును నిర్ధారించేందుకు చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్‌ను అందించాలి. వీటిలో ముఖ్యమైనవి పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్. అడ్రెస్ ప్రూఫ్ లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్ కూడా అవసరం. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి కొన్ని చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్‌లు. ఇన్కమ్ ప్రూఫ్ రుణగ్రహీతలు తమ ఆదాయాన్ని చూపించే ఏదైనా డాక్యుమెంట్‌ను కలిగి ఉండాలి. ఇందు కోసం లేటెస్ట్ శాలరీ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి సమర్పించవచ్చు. ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారు ఆర్థిక స్థిరత్వాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తాయి. సంతకం ప్రూఫ్ దరఖాస్తుదారు, రుణ సంస్థ మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి ఈ-సైన్ అని పిలిచే డిజిటల్ సంతకం అవసరం. ఇది పరస్పర అంగీకారం, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. -
స్కోర్ కొట్టు... లోన్ పట్టు!
అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే ఏం చేయాలో తోచదు. వైద్యం, ఇంటి మరమ్మతులు, వేతనంలో కోత, ఉద్యోగం కోల్పోవడం, స్కూల్ ఫీజు.. అవసరం ఏదైనా వెంటనే డబ్బు కావాల్సి వస్తే.. క్రెడిట్ కార్డు నుంచి పరిమితి మేరకు డ్రా చేసుకుని గట్టె్టక్కేస్తుంటారు. ఇది కాకుండా అందుబాటులో ఉన్న మరో మార్గం వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్). హామీతో పని లేకుండా ఆదాయ వనరు ఉన్న ప్రతి ఒక్కరూ సులభంగా పొందగలిగి రుణం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే రుణం మొత్తం చేతికి అందుతుంది. ప్రక్రియ ఎంతో సులభం, అందుకే నేటి రోజుల్లో పర్సనల్ లోన్ సాధనాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణం అయినా, గృహ రుణం అయినా వడ్డీ రేటు విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కనీసం ఐదారేళ్ల కాలానికి వ్యక్తిగత రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అన్నేళ్లలో వడ్డీ రూపేణా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. వీటిపై అవగాహన కల్పించే కథనమే ఇది. వ్యక్తిగత రుణం తీసుకునే వారు ముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజును పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, వడ్డీ రేటు ఆధారంగా బ్యాంక్‌ను ఖరారు చేసుకోవాలి. ఖాతా ఉన్న బ్యాంకులోనే వ్యక్తిగత రుణం పొందాలనేమీ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే ఇతర బ్యాంకుల ఆఫర్లను అయినా పరిశీలించొచ్చు. అయితే తక్కువ రేటుకు వ్యక్తిగత రుణం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇందులో ముందుగా వ్యక్తిగత క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒకవైపు మన వ్యక్తిగత రుణ చరిత్ర బలంగా ఉండేలా (మెరుగైన స్కోర్) చూసుకోవాలి. మరోవైపు తక్కువ రేటుకు వ్యక్తిగత రుణాన్ని ఆఫర్ చేసే బ్యాంక్‌లను గుర్తించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్నిచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఆ రుణం నమ్మకంగా తిరిగి వస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఉండవు. రిస్క్ దాదాపుగా ఉండదు కనుక తక్కువ రేటుకు ఇస్తాయి. ‘‘వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి తనఖా లేదా హామీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. కనుక బ్యాంకులు ఎంత రుణం ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత వడ్డీ రేటుకు ఇవ్వాలనే అంశాలను నిర్ణయించే విషయంలో రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న వారు వడ్డీ రేటు తగ్గించాలంటూ బ్యాంకులను డిమాండ్ చేయవచ్చు’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సూచించారు. (పెళ్లికొడుకు లుక్‌లో జబర్దస్త్‌గా..మస్క్: ఫోటోలు వైరల్) క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను ఉపయోగించుకునే వారు సకాలంలో బిల్లులను చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ కాకూడదు. అలాగే, రుణం ఏదైనా కానీయండి ఈఎంఐల చెల్లింపుల విషయంలో బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాలి. వీలుంటే ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరిగే ఆప్షన్ నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తుంటే, అప్పటికే ఉన్న ఇతర రుణాలను తీర్చివేయడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ‘‘మీ క్రెడిట్ కార్డ్ వినియోగ చరిత్ర చాలా సాఫీగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కొన్ని రోజులు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకటి రెండు సార్లు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, అది క్రెడిట్ చరిత్రలో మచ్చగా చేరొచ్చు. అప్పుడు రుణాలిచ్చే సంస్థలు దీన్ని రిస్క్‌గా భావిస్తాయి. రుణ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది’’ అని ఇన్‌క్రెడ్ రిస్క్ అండ్ అనలైటిక్స్ ప్రెసిడెంట్ పృథ్వీ చంద్రశేఖర్ తెలిపారు. అవగాహన లేక క్రెడిట్ కార్డ్, వాహన, ఇతర రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం చోటుచేసుకుంటే అది భవిష్యత్తులో వారు తీసుకోబోయే రుణాలపై అధిక రేట్లకు దారితీస్తుందని గమనించాలి. అందుకే బ్యాంక్‌లు రుణ చరిత్రలో మచ్చలు ఉండి, రిస్క్ ఖాతాలుగా భావిస్తే అటువంటి వారికి సాధారణం కంటే అధిక వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఎలాంటి వైఫల్యం లేని, మెరుగైన రుణ చరిత్ర ఉన్న వారికి తక్కువ రేటుకు ఆఫర్ చేస్తాయి. ఆఫర్లు.. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల ఆఫర్లను, రుణ రేట్లు, నియమ, నిబంధనలు, షరతులు అన్నీ చూడాలి. ఆ తర్వాతే ఆకర్షణీయమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలి. ముందుగా వేతన ఖాతా, డిపాజిట్లు ఉన్న బ్యాంకును అడిగి చూడాలి. ఆ తర్వాత వివిధ బ్యాంకుల రుణ రేట్లు, ఇతర ఆఫర్ల సమాచారం పొందొచ్చు. సాధారణంగా బ్యాంకుల వెబ్సైట్లో వ్యక్తిగత రుణాలపై ఫిక్స్డ్ రేటు ప్రదర్శించరు. కనిష్టం నుంచి గరిష్టం రేటును ప్రదర్శిస్తాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి అందులో కనిష్ట రేటుకే రుణం లభించే అవకాశాలున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు ఒక్కటే కాకుండా, కోరుకుంటున్న రుణం మొత్తం, లోన్ టు వ్యాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, ఉద్యోగ స్వరూపం, ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని పైసా బజార్ సీనియర్ డైరెక్టర్ సని అరోరా తెలిపారు. కొన్ని బ్యాంకులు పండుగలు, ఇతర సమయాల్లో ప్రత్యేక రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీ రేటుపై రాయితీలు ఇస్తుంటాయి. కనుక వాటిని పరిశీలించొచ్చు. వీలైనన్ని రుణ సంస్థల మధ్య వ్యక్తిగత రుణ ఆఫర్లను పోల్చుకోవాలని అరోరా సూచించారు. ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) మార్గాలు.. రుణ చెల్లింపులు సకాలంలో చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుణ వినియోగ రేషియో కూడా క్రెడిట్ స్కోరు లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న రుణం పరిమితిలో ఎంత వినియోగించుకున్నారనేది. రుణంపై మీరు ఏ మేరకు ఆధారపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. క్రెడిట్ యూసేజ్ రేషియో 30 శాతం లోపు కొనసాగించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందని అనుకుందాం. అప్పుడు మీ వినియోగం రూ.30 వేల వరకు ఉండాలి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకే సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేస్తుండడం కూ డా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభా వం చూపి స్తుంది. అందుకే ఒకేసారి వెంటవెంట ఒక టికి మించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవద్దు. అంతేకాదు ఒకటికి మించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద వ్యక్తిగత రుణానికి అభ్యర్థనలు ఇవ్వొ ద్దు. దీనివల్ల ఏకకాలంలో ఒకటికి మించిన క్రెడిట్ అ భ్యర్థనల సమాచారం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుంది. అది క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) వేతన ఖాతా.. ఉద్యోగులకు పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తీసుకోవడం అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ వేతన జమ, మీ ఖర్చులు, ఉపసంహరణ వివరాలు ఖాతాలో నమోదై ఉంటాయి. కనుక రుణానికి ముందు బ్యాంక్ అధికారి వాటిని చూసి ఓ అంచనాకు రాగలరు. అందుకే వేతన ఖాతాలున్న వారికి ఇన్స్టంట్ పర్సనల్ లోన్‌ను చాలా బ్యాంకులు డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి తక్కువ రేటుకు రుణం పొందొచ్చు. ‘‘బ్యాంకులు సాధారణంగా తమ ఖాతాదారులకు సంబంధించి నియమ నిబంధనలు, షరతుల విషయంలో కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. అంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించడం, వేగంగా మంజూరు చేస్తాయి. సంబంధిత ఖాతాదారుకు సంబంధించి వేతనం, ఇతర వ్యయాల సమాచారం అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేయగలవు’’అని అప్నా పైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీ స్వామినాథన్ పేర్కొన్నారు. ఇతర చార్జీలనూ చూడాలి.. వ్యక్తిగత రుణంలో ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా తీర్చేస్తే పడే చార్జీలు తెలుసుకుని నిర్ణయానికి రావాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు రుణం మొత్తంపై 1–3 శాతం మధ్య ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నాయి. రుణం ముందుగా చెల్లిస్తే విధించే చార్జీలు కూడా బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ముందుగా తీర్చివేసే ఉద్దేశం ఉందా అని చూడాలి. వడ్డీ రేటుపై అవగాహన... తక్కువ రేటుపై వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా.. రుణం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే చెల్లిస్తుంటారు. ముందుగా బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తాయన్నది తెలుసుకోవాలి. ఫ్లాట్ రేటు, లేదా తగ్గింపు రేటును బ్యాంకులు ఆఫర్ చేయొచ్చు. ఫ్లాట్ వడ్డీ రేటు అయితే రుణం కాల వ్యవధి అంతటా అసలు మొత్తం (ప్రిన్సిపల్)పైనే వడ్డీ రేటు అమలవుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారనుకోండి. మొత్తం మీద రూ.1,80,000ను వడ్డీ కింద చెల్లించాలి. నెలవారీ ఈఎంఐ రూ.18,889 అవుతుంది. అదే తగ్గింపు వడ్డీ రేటు విధానంలో.. ప్రతీ వాయిదాకు ముందు మిగిలిన ఉన్న బకాయిపైనే వడ్డీ రేటును బ్యాంకులు లెక్కిస్తాయి. రూ. 5 లక్షల రుణాన్ని తగ్గింపు రేటు విధానంలో 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మూడేళ్లలో వడ్డీ రూపేణా రూ.97,858 చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.16,607 అవుతుంది. దీంతో మొత్తం మీద ఈ విధానం వల్ల రూ.82,142 ఆదా అవుతుంది. అందుకే రెడ్యూసింగ్ ఇంటరెస్ట్ రేట్ విధానంలోనే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. పర్సనల్ లోన్‌పై తక్కువ రేటుకు ఇస్తామంటే బుట్టలో పడిపోకుండా.. రుణంపై వడ్డీ రేటును నెలవారీ ఎలా లెక్కిస్తారో అడిగి స్పష్టత తెచ్చుకోవాలి. -
పెరిగిపోతున్న హోమ్లోన్లు.. రూ.19.36 లక్షల కోట్లకు చేరిన రుణాలు!
ముంబై: వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ గృహ రుణాలు (రుణ గ్రహీతలు చెల్లించాల్సిన మొత్తం) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.19.36 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై రేట్లు పెరిగాయి. 2022 మార్చి చివరికి గృహ రుణాలు రూ.16.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి చివరికి రూ.14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల్లో 20.6 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 12.6 శాతంతో పోలిస్తే పెరిగింది. కన్జ్యూమర్ రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా, వాహన రుణాలన్నీ పర్సనల్ లోన్ కిందకు వస్తాయి. పరిశ్రమలకు రుణాల మంజూరు 5.7 శాతం పెరిగింది. పెద్ద పరిశ్రమలకు ఇది 3 శాతంగా ఉంది. మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాల మంజూరులో 19.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణ వితరణ 12.3 శాతం పెరిగింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాల మంజూరు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15.4 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంతో పోలిస్తే మంచి పురోగతి కనిపించింది. -
పర్సనల్ లోనే కావాలి!
ముంబై: డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణాలకు డిమాండ్ తగ్గింది. కానీ, అదే కాలంలో అన్సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగిస్తుండంతో అన్సెక్యూర్డ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! రుణానికి దరఖాస్తు వచ్చిన తర్వాత, సంబంధిత దరఖాస్తు దారుడి క్రెడిట్ స్కోరు కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రిడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలను సంప్రదిస్తుంటాయి. డిసెంబర్ త్రైమాసికంలో తన వద్దకు గృహ రుణాల కోసం వచ్చిన విచారణలు ఒక శాతం తగ్గినట్టు సిబిల్ తెలిపింది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు సంబంధించి వచ్చిన విచారణలు 50 శాతం, 77 శాతం మేర పెరిగినట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఫలితంగా గృహ రుణాలకు విచారణలు తగ్గి ఉండొచ్చని సిబిల్ తెలిపింది. రుణాలు తీసుకుంటున్న వారిల్లో 43 శాతం మంది 18–30 ఏళ్లలోపు ఉన్నారని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వీరి శాతం 40 శాతంతో పోలిస్తే పెరిగినట్టు సిబిల్ తన నివేదికలో వెల్లడించింది. మెట్రోలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే విచారణలు పెరిగినట్టు పేర్కొంది. -
RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!
సాక్షి,ముంబై: ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 6.25 శాతం ఉన్న కీలకమైన రెపోరేటును 6.50 శాతానికి పెంచింది. దీని ప్రభావం అన్నిరకాల లోన్లపైనా పడనుంది. కార్లు, వివిధ రకాల వాహనాల లోన్లు, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. తాజా రెపో రేటు పెంపుతో అన్ని రకాల లోన్లపై రుణ భారం సుమారు 2-4 శాతం వరకు పెరగనుంది. దీంతో ఖాతాదారులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే ఈ భారం నుంచి కాస్త ఊరట కలగాలంటే.. అవకాశం ఉన్న రుణగ్రహీతలు లేదా వారి రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు నగదు చెల్లింపును లేదా ఈఎంఐ భారాన్ని భరించలేని వారు రుణకాలాన్ని పొడిగించుకోవడమో చేయాల్సి ఉంటుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారు కూడా పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీ శాతాన్నే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదుపులో ఉన్నప్పుడు తగ్గిస్తుంది లేదా అదే రేటును కొనసాగిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు వడ్డీ భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారుల మీదకు మళ్లించి ఆ మేరకు వడ్డీలను వసూలు చేస్తాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధపడతాయి. అయితే ఈ మేరకు ఖాతాదారుల డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు కూడా పెరగ నుంది (ఇదీ చదవండి: సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ) -
హైదరాబాద్: లోన్ యాప్ సంస్థలపై ఈడీ కొరడా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లోన్ యాప్ సంస్థలపై ఈడీ కొరడా ఝుళిపించింది. నాలుగు కంపెనీలపై దాడి చేసి.. రూ.86 కోట్లను ఫ్రీజ్ చేసింది. దీంతో.. ఇప్పటిదాకా రూ.186 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్ చేసినట్లు అయ్యింది. కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీర్.. కంపెనీల్లో సోదాలు చేపట్టింది. దేశ చట్టాలకు వ్యతిరేకంగా చైనా కంపెనీలు 940 కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు, హవాలా ద్వారా విదేశాలకు చైనా కంపెనీలు ఆ డబ్బు పంపించాయని నిర్ధారించుకుంది ఈడీ. లోన్ యాప్ మోసాలు, ఎంతో మంది బాధితులు, మరెంతో మంది జీవితాలు నాశనం అవుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. లోన్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలోనే.. దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ విచారణలో దూకుడు చూపెడుతోంది. మరోపక్క నగర పోలీస్ శాఖ కూడా లోన్ యాప్ మోసాల మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. చదవండి: హైదరాబాద్: నెలకు మూడు లక్షల జీతమంటూ ఘరానా మోసం! -
కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!
ముంబై: మొదటిసారి రుణాలు తీసుకునే వారి విషయంలో (రుణాలకు కొత్త/ఎన్టీసీ) బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. వారికి బదులు ప్రస్తుత రుణ గ్రహీతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. పండుగల సీజన్ ముగిసిపోయిన తర్వాత కూడా రుణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని వెల్లడించింది. వినియోగంతోపాటు, వ్యక్తిగత రుణాలు డిమాండ్‌కు మద్దతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2021 నవంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో మొదటిసారి కస్టమర్లకు ఇచ్చే రుణాల(ఎన్టీసీ) వాటా 14 శాతానికి తగ్గిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 16 శాతంగా, 2019 సంవత్సరం ఇదే కాలంలో 17 శాతంగా ఉంది’’అని సిబిల్ పేర్కొంది. ఎన్టీసీ కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. ఎన్టీసీ విభాగంలో రుణాల అనుమతుల రేటు 27 శాతానికి తగ్గిందని, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 30 శాతంగా ఉన్నట్టు వివరించింది. రుణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని, కన్జన్యూమర్ రుణాలకు 97 శాతం వృద్ధి ఉంటే, వ్యక్తిగత రుణాలకు డిమాండ్ 80 శాతం పెరిగినట్టు సిబిల్ నివేదిక తెలిపింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా 2022 జనవరిలో రుణ విచారణలు 33 శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2021 జనవరిలో 10 శాతం క్షీణత ఉన్నట్టు పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలకు రిస్క్ ఎక్కువని, విలువ తరిగిపోయే ఆస్తులుగా పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో చెల్లింపులు చేయని రుణాలు (90 రోజులకు పైగా) 3.64 శాతానికి పెరిగాయని తెలిపింది. (చదవండి: హైదరాబాద్‌లో మెడికల్ కాలేజీ? ఆనంద్ మహీంద్రా సంచలన ప్రకటన!) -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!
ఎస్బీఐ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్ వంటి 3 రకాల లోన్స్ అంధించనున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వడ్డీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ గోల్డ్ లోన్ మీద వడ్డీ రేటు 7.3 శాతం నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. బుల్లెట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న బంగారం నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది. అలాగే, ఎస్బీఐ కారు లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. దీని మీద వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం కానుంది. కారు ధరలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని భావించే వారికి కూడా ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది. Upgrade to a good life with fantastic deals for your brand new four-wheels on Car Loan by SBI. Apply now on YONO app or Know more: https://t.co/aYhi3C6dC8#SBI #StateBankOfIndia #SBICarLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zOmgzHH4rS — State Bank of India (@TheOfficialSBI) January 17, 2022 Give your gold the opportunity to enhance your life with Gold Loan by SBI! Apply now on YONO app or Know more: https://t.co/u3h7OdQHtZ#SBI #StateBankOfIndia #SBIGoldLoan #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/XgJ8Z9ooAC — State Bank of India (@TheOfficialSBI) January 16, 2022 ఇక మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే వాటికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కేవలం 4 క్లిక్స్‌తోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ తరహా రుణాలపై కూడా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇకపోతే ఈ రుణాలు అన్నీ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. Grab the opportunity to fulfil all your dreams with great offers on Personal Loan by SBI. Avail SBI Personal Loan on YONO app or Know more: https://t.co/biL9usmNSz#SBI #StateBankOfIndia #SBIPersonalLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zLx823coPd — State Bank of India (@TheOfficialSBI) January 18, 2022 (చదవండి: ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!) -
బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్) ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ- ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు హోంలోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. దీంతో కొనుగోలు దారులు బ్యాంకులు ఇచ్చే లోన్ల సాయంతో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల్లో హోం లోన్, పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసేముందు కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఆర్దిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అప్పులు,క్రెడిట్ కార్డును క్లియర్ చేయడం బ్యాంకులో లోన్ల కోసం అప్లయ్ చేసే ముందు ఉన్న అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్స్‌ను పూర్తిగా చెల్లించడం మంచిదని అర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇక మీ ఆదాయాన్ని బట్టి బ్యాంకులు రుణాల్ని ఇవ్వడమో,లేదంటే ఆదాయం తక్కువగా ఉందని లోన్ రిజెక్ట్ చేస్తాయని క్లిక్ క్యాపిటల్ సంస్థ తెలిపింది. ఒకవేళ రుణం మంజూరైనా కట్టలేని పరిస్థితులు తలెత్తితే ఇబ్బందులు పడే అవకాశం ఉందని సూచించింది. సాధారణంగా, మీరు ప్రస్తుతం చెల్లించే మొత్తం ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో 30 లేదా 40శాతం మించకూడదు. లేదంటే లోన్ కోసం అప్లై చేసే ముందు.. మీకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తిన మీరు తీసుకున్న రుణాన్ని చెల్లించే ఆరు నెలలు,సంవత్సరం మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ క్రెడిట్ కార్డ్ స్కోర్ చాలా కీలకం. ఎందుకంటే పర్సనల్ లోన్, హోం లోన్ ఇవ్వాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డ్ స్కోర్‌ను బట్టి మీ ఆర్ధిక స్థోమతను అంచనా వేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు కావాల్సిన లోన్లను వెంటనే ఇచ్చేస్తాయి. సాధారణంగా 725 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే మీరు తీసుకున్న రుణాల్ని సరైన సమయానికే చెల్లిస్తున్నారని అర్ధం. 725 లోపు క్రెడిట్ కార్డ్ స్కోర్ ఉంటే మీరు తీసుకున్న మొత్తాన్ని చెల్లించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. అదే సమయంలో మీ లోన్లను రిజెక్ట్ చేస్తాయి. ఒకవేళ ఆన్లైన్ ద్వారా లోన్ అప్లయ్ చేయాలని చూస్తే బ్యాంకులు అధిక మొత్తంలో వడ్డీని విధిస్తాయి. అన్ని ఆదాయ వనరులను చేర్చండి బ్యాంక్‌లోన్ కోసం ప్రయత్నిస్తుంటే మీ శాలరీ ఎంత వస్తుంది. మీ పార్ట్ టైమ్ జాబ్ చేయడం వల్ల ఎంత సంపాదిస్తున్నారు. ఒకవేళ మీ సొంతిల్లును అద్దెకిస్తే .. నెలవారీ రెంట్ ఎంత వస్తుంది. అనే అంశాలపై బ్యాంకు అధికారులకు స్పష్టత ఇవ్వాలి. లోన్ కోసం ఎక్కువ సార్లు అప్లయ్ చేయొద్దు మీరు అప్లయ్ చేసిన ప్రతి సారి లోన్ రిజెక్ట్ అయ్యిందని మరోసారి ప్రయత్నిస్తారేమో? అలా చేయడం వల్ల బ్యాంకులు మీలోన్లను రిజెక్ట్ చేసే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. లోన్ అప్లయ్ చేసిన సమయంలో క్రెడిట్ బ్యూరో అధికారులు అన్నీ రకాలుగా విచారణ చేపడతారు. మీకు ఆర్ధిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తారు. అంతేకాదు క్రెడిట్ స్కోర్ తగ్గడం, బ్యాంక్ లోన్లను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అర్హత ఉందో లేదో చెక్ చేసుకోండి బ్యాంక్ లోన్ పెద్ద మొత్తంలో అప్లయ్ చేయొద్దు. అలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోన్ అప్లయ్ చేసే ముందుకు తీసుకున్న రుణాన్ని చెల్లించగలిగే సామర్ధ్యం ఉందా? లేదా? అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. చదవండి: హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్ -
రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు
పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఇటు బ్యాంకులు, అటు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహ రుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ చేసిన ఒక ట్వీట్లో కారు, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్ల గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్లో "కారు రుణం, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ పై ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో పండుగ వేడుకలను ప్రారంభించండి. ఈ రోజు ప్రారంభించండి!" అని పేర్కొంది. కారు రుణాన్ని లక్షకు రూ.1539, బంగారు రుణాన్ని 7.5 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాన్ని లక్షకు రూ.1832 ఈఎంఐకే అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!) Start the festive celebrations with special offers on Car Loan, Gold Loan and Personal Loan from SBI. Get started today! Apply Now: https://t.co/BwaxSb3HYQ#SBI #StateBankOfIndia #HarTyohaarShubhShuruaat #CarLoan #PersonalLoan #GoldLoan pic.twitter.com/Ebx69ujTYf — State Bank of India (@TheOfficialSBI) September 22, 2021 అలాగే, త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని గృహ రుణాలపై ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. -
ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పండుగ రాక ముందే తన రిటైల్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. బ్యాంకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసినట్లు ప్రకటించింది. గతంలో గృహ రుణాలపై ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారు రుణాలపై, బంగారం రుణాలపై, వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను 100 శాతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తుంది. యోనో(యు ఓన్లీ నీడ్ వన్ యాప్) అనేది ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్. యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను పొందవచ్చని తెలిపింది. యోనో ద్వారా బంగారు రుణాలను పొందే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. వారు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి బంగారు రుణాలను పొందవచ్చు అని పేర్కొంది. అంతేగాక, యోనో ద్వారా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులందరికీ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. Get drenched in happiness, as it's raining offers with SBI. Avail a 100% Processing Fee waiver on Car Loan, Gold Loan and Personal Loan. Know more at https://t.co/8gV2D7FEFG#SBI #CarLoan #GoldLoan #PersonalLoan #ItsRainingOffersWithSBI pic.twitter.com/fTcMvYShyq — State Bank of India (@TheOfficialSBI) August 16, 2021 కోవిడ్ యోధులకు వడ్డీ రాయితీ వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారుల కొరకు ప్రాసెసింగ్ ఫీజుల్లో బ్యాంకు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు 50 బీపీఎస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ప్రకటించింది. కారు, బంగారు రుణాలకు కూడా ఈ ఆఫర్ త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్లను’ ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది 2021 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబరు 14 వరకు అమల్లో ఉండనుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 6.70 శాతం వద్ద నుంచి ప్రారంభమవుతుంది. -
పర్సనల్ లోన్, బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే
ప్రతి ఒక్కరికి ఆర్ధిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు బ్యాంక్‌లోన్, లేదంటే బంగారంపై లోన్ తీసుకోవడమో చేస్తుంటారు. అదే సమయంలో ఏ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మంచిదో ఆలోచించరు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామా? లేదా? అనేది మాత్రమే ఆలోచిస్తుంటారు. అయితే ఆర్ధిక నిపుణులు మాత్రం బ్యాంక్ లోన్, బంగారంపై లోన్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాంక్‌లోన్, బంగారంపై లోన్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వడ్డీ రేట్లు: బ్యాంక్ లోన్ మన ఆర్ధిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంటే పర్సనల్ లోన్‌పై సాధారణంగా 10నుంచి 24 శాతం వరకు వడ్డీ ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో తీరుస్తారనే అంశంతో పాటు రిస్క్ అసెస్మెంట్ను బట్టి బంగారంపై తీసుకునే లోన్లపై వడ్డీ రేటు 7.00 నుంచి 29 శాతం వరకు ఉంటుంది. రుణం మొత్తం: తీసుకున్న మొత్తాన్ని ఎంత కాలంలో చెల్లిస్తారనే అంశాన్ని బట్టి రూ .50,000 నుండి 15 లక్షల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు 30 లక్షల నుండి 40 లక్షల వరకు లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తుంటాయి. బంగారంపై రుణం: బంగారంపై ఇచ్చే రుణం లోన్-టు-వాల్యూ (ఎల్టివి) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ బంగారం ఎన్ని గ్రాములు ఉంది. ప్రస్తుత మార్కెట్లో దాని వ్యాల్యూ ఎంత ఉంది. మీరు ఎంత లోన్ కావాలనుకుంటున్నారు? మీకు కావాల్సిన లోన్ కి, మార్కెట్ లో బంగారంపై ఉన్న రేట్‌కి ఎంత వ్యత్యాసం ఉంది' అనే విషయాల్ని పరిగణలోకి తీసుకొని లోన్ వ్యాల్యూను మార్చేస్తుంటాయి. బంగారు లోన్ ఎల్టివి నిష్పత్తిపై ఆర్బీఐ 75 శాతం విధించింది. ప్రాసెసింగ్ టైమ్ : లోన్ ఇచ్చే ముందు జరిగే ప్రాసెస్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు ఐటిఆర్ ఫారాలు / పేస్లిప్స్ జత చేయాల్సి ఉంటుంది. ఇలా జత చేసిన అనంతరం లోన్ ఇచ్చే సమయం 2 రోజుల నుంచి 7వరకు ఉంటుంది. లోన్ ప్రాసెస్ తొందరగా పూర్తయితే మనకు కావాల్సిన లోన్ తొందరగానే వస్తుంది. తిరిగి చెల్లించే సమయం : తీసుకున్న లోన్ ను కొన్ని బ్యాంక్ లు లేదంటే ఆర్ధిక సంస్థలు 7 సంవత్సరాల వరకు గడువును విధిస్తాయి. అయితే పర్సనల్ లోన్ సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. బంగారంపై తీసుకున్న లోన్ తిరిగి చెల్లించే సమయం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంక్‌లు 4 నుంచి 5 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువ సమయాన్ని ఇస్తుంటాయి. పేలవమైన క్రెడిట్ ప్రొఫైల్: వడ్డీ రేట్లు మీ బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారిపోతుంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్‌లు తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. క్రెడిట్ స్కోర్లు, నెలవారీ ఆదాయం, జాబ్ ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ మొదలైనవి పర్సనల్ లోన్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్స్ ఆధారంగా, కొన్ని సంస్థలు ఇచ్చే లోన్లపై ఎంత వడ్డీ విధించాలో నిర్ణయిస్తాయి. ఏది మంచిది : కొంతలో కొంత పర్సనల్ లోన్ కంటే బంగారంపై లోన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్యాంక్ లో తీసుకున్న పర్సనల్ లోన్‌ను విధించిన గడువులోపు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే ఎన్ని అనార్ధాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే బంగారంపై లోన్ తీసుకుంటే గడువులోపు పే చేయలేదంటే అదే బంగారాన్ని వేలం వేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు: బంగారంపై తీసుకునే లోన్ ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా 2 శాతం వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు లోన్ తీసుకునే వ్యక్తులు, సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. -
సులభంగా సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా..?
మీరు ఏదైన లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? లేదంటే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలి. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా కూడా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. సిబిల్ స్కోరు అంటే ఏమిటి? సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL). మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యాయా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి. సిబిల్ ట్రాన్స్‌యూనియన్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను సూచించే 3 అంకెల సంఖ్య. సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అధిక స్కోరు ఉంటే త్వరగా రుణాలు ఆమోదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి, స్కోరును ఎక్కువ శాతం 750 పైన ఉండే విధంగా చూసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే మీరు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ స్కోర్ కనుక 750 కంటే తక్కువగా ఉంటే ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీరు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించే క్రమంలో కచ్చితంగా సమయానికి తిరగి చెల్లించడం చాలా ముఖ్యం. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సమయానికి ఈఎంఐ చెల్లించక పోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వండి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించండి. హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. ఒకవేళ మీరు కనుక రెండు రుణాలు తీసుకుంటే అసురక్షిత రుణాలు ముందుగా క్లోస్ చేయండి. మల్టీపుల్ క్రెడిట్ కార్డులను తీసుకోవడం మానేయండి. ఎక్కువ లోన్స్ లేదా కార్డులు తీసుకోవడం వల్ల రుణ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో అంతిమంగా క్రెడిట్ స్కోర్‌గా ఎఫెక్ట్ పడుతుంది. గడువు తేదీ కంటే ముందే క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించండి. ఎప్పుడు క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించండి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగాఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉమ్మడిగా రుణాలు తీసుకోవడం తగ్గించండి లేదా గ్యారెంటీగా ఉండటం మానుకోండి, ఎందుకంటే అవతలి వ్యక్తి వల్ల ఏదైనా డిఫాల్ట్ ఉంటే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ వంటి ప్రముఖ బ్యాంకుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్‌కు వ్యతిరేకంగా సెక్యూర్ కార్డు తీసుకుంటే, ఆ బకాయిలను నిర్ణీత తేదీ లోపు తిరిగి చెల్లించడం వల్ల మీ సిబిల్ స్కోరు పెరుగుతుంది. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా రాకుండా ఉండటానికి మరొక రుణాన్ని తీసుకునే ముందు ప్రస్తుత రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా మంచిది. ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కోసం మీకు తగినంత నిధులు ఉండకపోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ త్వరగా పెరగాలంటే ఒక లోన్ తిరగి చెల్లించిన తర్వాతే మరో రుణాన్ని తీసుకోండి. రుణం తీసుకునేటప్పుడు డబ్బు తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలం ఎంచుకోండి. దీనివల్ల ఈఎంఐ తక్కువగా ఉండటం వల్ల మీ మీద ఆర్ధిక భారం తగ్గుతుంది. మీరు అన్ని చెల్లింపులను సకాలంలో సులభంగా చేయగలుగుతారు. మీరు డిఫాల్టర్ల జాబితా నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. అలాగే మీ స్కోర్ కూడా పెరగుతుంది. చాలా మంది తమ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడం కోసం ఇష్టపడరు. కానీ, ఈసారి అలాకాకుండా బ్యాంకులు మీ కార్డు లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆఫర్ చేస్తే తిరస్కరించొద్దు. దీని వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ లిమిట్ కూడా పెరుగుతుందని గమనించాలి. తక్కువ క్రెడిట్ కలిగి ఉండటం వల్ల మీ స్కోర్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితిని బట్టి మీ క్రెడిట్ స్కోర్‌ను పెరగడానికి 4- 13 నెలలు పడుతుంది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు, రుణం తీసుకునేటప్పుడు తెలివిగా ఉండాలి. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
వెబ్‌డెస్క్: సీజన్స్‌తో, సంక్షోభాలతో, సమస్యలతో సంబంధం లేకుండా డబ్బు అవసరమైన వారిని ఆదుకునేది ఏదైనా ఉందా అంటే అవి బ్యాంకులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు కోసం బ్యాంకులు పర్సనల్ లోన్ ఇస్తాయి. అలాగే, కొత్త ఇల్లు కొనుక్కోవాలి అన్న హోమ్ లోన్ పేరుతో బ్యాంకలు రుణాలు అందిస్తాయి. అయితే, ఇలా ధరఖాస్తు చేసుకున్న రుణాలను బ్యాంకులు తొందరగా ఆమోదించాలంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి. అందుకే ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సిబిల్ స్కోర్ గురుంచి ముందుగా తెలుసుకోవాలి. సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ నిర్ణయిస్తారు. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి. రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం? సిబిల్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను చూపిస్తుంది. మీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణదాత ఆమోదం తెలిపే శాతం పెరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్ గతంలో మీరు తీసుకున్న రుణాల తిరిగి చెల్లించడంలో ఎంత బాధ్యతగా ఉన్నారు అని చూపిస్తుంది. సిబిల్ స్కోర్ లో మినిమం స్కోర్ 300 కాగా అత్యదిక స్కోర్ 900గా ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీకు రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ స్కోర్ వస్తే.. మీ దరఖాస్తు చేసుకున్న లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ దరఖాస్తు ఆమోదం పొందాలంటే మీ క్రెడిట్ స్కోరు మాత్రమే ప్రమాణం కాదని గుర్తుంచుకోండి. మీకు నెలానెలా వచ్చే ఆదాయం, వేతనం ఎంత? ఆదాయంలోంచి వ్యయం పోగా మిగిలిన దాంట్లో తిరిగి రుణం చెల్లించే పరిస్థితి ఉందా లేదా? మీరు ఉంటున్న నగరం, అప్పులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి. వ్యక్తిగత రుణం కోసం ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి? మీరు ఇంటి అవసరాల కోసం వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ వెల్లడించిన వివరాల ప్రకారం 720-750 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే కానీ పర్సనల్ లోన్ మంజూరు చేయడం సులభం కాదు. అంతకంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే, మీరు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది లేదా సాధారణ స్థాయి వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేయడం జరుగుతుంది. గృహ రుణం ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి? బజాజ్ ఫిన్సర్వ్ వెల్లడించిన వివరాల ప్రకారం గృహ రుణం అనేది సురక్షితమైన లోన్, ఎందుకంటే మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు తాకట్టుగా పనిచేస్తుంది. అందువల్ల, మీ క్రెడిట్ స్కోరు 750 కన్నా తక్కువగా ఉన్నప్పటికీ గృహ రుణం పొందడం సాధ్యమవుతుంది. మీ క్రెడిట్ స్కోరు 650 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా కొంతమంది రుణదాతలు గృహ రుణాలను మంజూరు చేస్తారు. అయితే వడ్డీరేటు ఎక్కువ విధించే అవకాశం ఉంటుంది అని మరిచిపోవద్దు. చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఎలా..? -
పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్
కరోనా మహమ్మారితో ప్రజలు భాదపడుతున్న సమయంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. కరోనా చికిత్స కారణంగా ఆర్థిక ఒత్తిడితో చితికిపోతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 'కవాచ్ పర్సనల్ లోన్' పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేని రుణాన్ని ప్రవేశపెట్టింది. కోవిడ్-19 చికిత్స కోసం తన, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం వినియోగదారులకు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు సంవత్సరానికి 8.5% వడ్డీ రేటుతో ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ గరిష్ఠ గడువు చెల్లింపు కాలం 60 నెలలు. లోన్ తీసుకున్న మూడు నెలలు ఈఎమ్ఐ కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ కోవిడ్ సహాయక చర్యలకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తున్న కోవిడ్ -19 లోన్ లలో 'కవాచ్ పర్సనల్ లోన్' కూడా ఒకటని ఎస్బిఐ పేర్కొంది. "ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచీకత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నాము. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితిలో మా ఖాతాదారుల కుటుంబాలు ఆర్ధికంగా ఊబిలో చిక్కుకోకుండా ఉండటానికి దీనిని ప్రవేశ పెట్టినట్లు" ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం కూడా ఒక మంచి విషయం. It gives us immense pride to announce the launch of KAVACH Personal Loan by SBI. Avail at 8.50% p.a. only and take guard of your expenses towards COVID treatment. Know more - https://t.co/uoc6MvpNIU #InThisTogether #SBIAapkeSaath #SBI #StateBankOfIndia #KavachPersonalLoan pic.twitter.com/TwcATFeuEX — State Bank of India (@TheOfficialSBI) June 11, 2021 చదవండి: కరోనా రోగులకు సేవలందించనున్న "గ్రేస్ రోబో నర్స్" -
ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే పర్సనల్ లోన్
ముంబై: ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచీకత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. కేవలం ఎస్బీఐ మాత్రమే కాకుండా అన్నీ ప్రభుత్వరంగ బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రుణాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఎస్బీఐ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ తీసుకున్న రుణాలపై బ్యాంక్ 8.50 శాతం వడ్డీని వసూలు చేస్తుందని దినేష్ ఖారా అన్నారు. ఇతర బ్యాంకుల వడ్డీల విషయానికి వస్తే విభిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అత్యవసర వ్యక్తిగత రుణ పథకం 4.0 (ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్) కింద కరోనా చికిత్సకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఛైర్మన్ రాజ్ కిరణ్ రాయ్, ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతాతో కలిసి ఎస్బీఐ ఛైర్మన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. చదవండి: కోవిడ్ మృతుల కుటుంబాలకు ఫించన్: కేంద్రం -
వ్యక్తిగత రుణాలు వెంటనే ఆమోదించాలంటే?
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరికి ఎన్నోపాఠాలు నేర్పింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్ధిక వంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియజేసింది. భవిష్యత్ అవసరాల కోసం ముందస్తు జాగ్రత్తలు అవసరం అని తెలిపింది. ఈ మహమ్మరి కాలంలో ఎక్కువ శాతం వ్యక్తిగత ప్రజలు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ పరిస్థితులలో తీసుకోవడం అంత మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే, వారి ఆదాయం విషయంలో ఎటువంటి గ్యారెంటీ ఉండదు. కానీ, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం తప్పేలా లేదు. అయితే, ఈ రుణాల కోసం బ్యాంకుల నుంచి ఆమోదం పొందడం అంత సులభం కాదు ప్రధానంగా ఎవరికి అయితే అత్యంత అవసరం ఉంటుందో వారు తీసుకోవడం మంచిది. చాలా మంది ఎంచుకునే ఋణాలలో వ్యక్తిగత రుణం ఒకటి. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాక వారు మీ ప్రతి వివరాలను పరీక్షిస్తారు. కానీ, చాలా మంది చిన్న చిన్న కారణాల వల్ల వారి ధరఖాస్తులు రద్దు చేయబడుతున్నాయి. వ్యక్తిగత రుణం కోసం ఆమోదం పొందే అవకాశాలను మీరు ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి క్రెడిట్ స్కోరు అనేది మూడు అంకెల సంఖ్య, ఇది దరఖాస్తుదారుడి క్రెడిట్ చరిత్రను సూచిస్తుంది. దీని వల్ల గతంలో మీరు తీసుకున్న రుణాలకు సంబందించిన చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. గతంలో మీరు ఎప్పుడైనా తీసుకున్న ఋణాల ఈఎంఐ సకాలంలో చెల్లించరా? లేదా? అనే ప్రతి విషయం వారి దగ్గర ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే తొందరగా రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. మొదట, మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి? అవసరమైతే, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత సంపాదిస్తున్నారని వారికి తెలియాలి. తక్కువగా ఉద్యోగాలు మారే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సహ దరఖాస్తుదారు మీకు తగినంత ఆదాయం లేకపోతే, తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న లేదా బ్యాంకులు నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాలు లేకపోయిన, మీరు మంచి ఆదాయం, క్రెడిట్ స్కోర్ గల వ్యక్తితో కలిసి ఉమ్మడిగా రుణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ లేకపోతే మీకు ఇది సహాయపడుతుంది. ఎందుకంటే సహ దరఖాస్తుదారుడు కూడా రుణం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉమ్మడి ధరఖాస్తు వల్ల ఎక్కువ మొత్తం రుణం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ చరిత్ర ఉద్యోగ చరిత్ర మీ ఆదాయంతో సహా అందులో స్థిరత్వాన్ని చూపిస్తుంది. దరఖాస్తు దారులు తరచూ ఉద్యోగాలు మారుతున్నట్లయితే లేదా స్థిర ఆదాయం లేనట్లయితే వారి విషయంలో రిస్కు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకే తరహా ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగినట్లయితే కంపెనీని ఎక్కువ స్థిరత్వంగా పరిగణిస్తాయి. అంటే ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయాలని కూడా అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా రుణాలు కోసం ధరఖాస్తు చేయకండి అనేక బ్యాంకులలో రుణాలు ధరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ క్షీణించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బ్యాంకులు రుణం ఆమోదించే అవకాశం తక్కువగా ఉంటుంది. రుణ దరఖాస్తును తిరస్కరిస్తే మళ్లీ ఆరు నెలల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి ప్రయతించండి. అలాగే, మీకు ఆదాయం తక్కువగా ఉంటే ఎక్కువ ఈఎంఐలు తీసుకుంటే మంచిది. దీని వల్ల మీరు తక్కువ ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. చదవండి: బిగ్ బజార్ బంపర్ ఆఫర్ -
అప్పుల చెల్లింపునకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయం
కాలక్రమంలో మీ జీవితంలో బాధ్యతలు హఠాత్తుగా పెరిగిపోతాయి. అద్దె, యుటిలిటిలు, ఇన్సురెన్స్, కారు చెల్లింపుల ఖర్చులతో పాటు స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు రకరకాల క్రెడిట్ కార్డులపై ఉన్న అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, ఇవన్నీ మీ నెల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ ఖర్చులు పెరిగిపోతాయి. అవి మీ నెలవారీ బడ్జెటుకు లోబడి ఉన్నా వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క పేమెంట్ మిస్ అయిన అది మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయాల్లో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయపడుతుంది. ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అంటే ఏంటి? చాలా ఆర్థిక సంస్థలు ముందస్తు ఆమోదిత లోన్స్ అందిస్తుంటాయి. వీటికి డాక్యుమెంటేషన్ చాలా తక్కువుంటుంది, అప్రూవల్ కూడా 24 గంటల్లో వస్తుంది. ఆ రుణ మొత్తాలు గణనీయంగా ఉంటాయి, వాటి చెల్లింపు కూడా ఒక నిర్ణీత గడువులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లోన్ ను ఎంచుకోవడం ద్వారా స్వల్పకాలంలో మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని బకాయిలు సకాలంలో చెల్లించవచ్చు, ప్రతీ నెలా ఒక సింగిల్ ఈఎంఐ చెల్లింపుపై దృష్టి సారిస్తే సరిపోతుంది. పర్సనల్ లోన్ ఎటువంటి సమయాలలో తీసుకోవాలి? పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు క్రెడిట్ కార్డులతో పోల్చితే చాలా తక్కువుంటుంది. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకొని మీ క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించవచ్చు. తద్వారా వడ్డీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతే కాదు మీరు చెల్లిస్తున్న ఎక్కువ వడ్డీరేటు కలిగిన రుణాలను కూడా ఈ విధానంలో తిరిగి చెల్లించవచ్చు. అప్పులన్నీ తీర్చడానికి పర్సనల్ లోన్ బెస్ట్ అనేక ఈఎంఐలు చూసుకోవడం, వాటి వడ్డీ రేట్లు, పేమెంట్ చేయాల్సిన తేదీలు గుర్తుంచుకోవడం, పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. లెక్కల్లో చిన్న తప్పు పేమెంట్ డీఫాల్ట్కు దారి తీయడమే కాదు పెనాల్టీలు, చక్రవడ్డీల చెల్లింపుతో పాటు కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక ఇన్స్టంట్ పర్సనల్ లోన్ తీసుకొని మీ అప్పులన్నీ ఒకేసారి చెల్లించవచ్చు. తీసుకున్న పర్సనల్ లోన్ కు సంబంధించిన ఒక ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్ అప్పులను దూరం పెట్టేందుకు పర్సనల్ లోన్ తీసుకోండి వివాహలు, సెలవులు లేదా దేశంలో లేదా విదేశాల్లో చదువుతున్న మీ పిల్లల చదువుల ఖర్చులు, వీటి చెల్లింపులు సకాలంలో జరపకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి పెనాల్టీ బారిన పడవచ్చు. కొన్నిసార్లు లీగల్ నోటీసూ అందుకోవాల్సి రావచ్చు. అటువంటి సమయాలలో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ద్వారా మీ చెల్లింపులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. ఆ లోన్ మొత్తాన్ని చిన్న మొత్తాల్లో మీరు భరించగలిగే స్థాయిలో ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చు. బకాయిల చెల్లింపు కోసం పర్సనల్ లోన్ అప్లై చేసే ఆలోచన ఉంటే పర్సనల్ లోన్ ఆప్షన్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. దీని కోసం బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టంట్ పర్సనల్ లోన్'ను పరిగణనలోకి తీసుకోండి. దీనికి అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. ఆమోదం కూడా 5 నిమిషాల్లోనే లభిస్తుంది. మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి, రూ.25 లక్షల వరకు రుణం పొందవచ్చు. దాన్ని 60 నెలల వరకు ఉండే వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. మీరు కావాలనుకుంటే ఫ్లెక్సి ఫెసిలిటీని కూడా ఎంచుకోవచ్చు. దీనిలో మీరు మీ రుణ పరిమితి నుంచి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మీ అవసరాన్ని బట్టి డబ్బు తీసుకోవచ్చు, మీరు వాడుకున్న మొత్తానికి వడ్డీ కడితే సరిపోతుంది. దీని ద్వారా మీరు ఎక్కువ ఆదా చేసుకోవడమే కాదు అనుకోని ఖర్చుల నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. మీ వ్యవధి కాలానికి సంబంధించి తొలినాళ్లలో కేవలం వడ్డీని మాత్రమే ఈఎంఐగా చెల్లించుకునే వెసులుబాటూ ఉంది. దీని ద్వారా మీ ఈఎంఐ మొత్తాన్ని 45% వరకు తగ్గించుకోవచ్చు. దీన్ని ఎంచుకోవడం ద్వారా మీరు నగదును సక్రమంగా నిర్వహించుకోవచ్చు, మీ దగ్గర తగిన డబ్బు ఉన్నప్పుడు మీ లోన్(Loan) తిరిగి చెల్లించవచ్చు. మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు పాక్షిక ప్రీ-పేమేంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు, ఇంకా ఇతర విలువ ఆధారిత ఫీచర్స్ పొందేందుకు ఇప్పుడే అప్లై చేయండి, మీ అప్పులను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి. (Advertorial) -
ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా!
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) సంస్థ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నగదు నిల్వ, వడ్డీలు, పన్ను మినహాయింపు, పింఛన్ లాంటి పలు రకాల సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఏడాదికిగానూ ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీని అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు పన్ను ఆదా ప్రయోజనాలతో పాటు ఈపీఎఫ్ ఖాతా ద్వారా ఇంటితో సహా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీ వివాహం, మీ కొడుకు & కుమార్తె వివాహం కోసం రుణం పొందవచ్చు. ఇలా పలు రకాల రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల ఈ కింది పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈపీఎఫ్‌వో అధికారిక ఈపీఎఫ్ వెబ్సైట్ లో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. మేనేజ్ సెక్షన్ వెళ్లి అందులో ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా లాంటి కేవైసి వివరాలు వెరిఫై చేసుకోవాలి. ఆన్లైన్ సర్వీసెస్ కు వెళ్లి అందులో క్లెయిమ్(ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేయాలి. ఇప్పుడు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాలు మొత్తం నమోదు పూర్తయ్యాక ఎస్ ఆప్షన్ ఓకే చేయాలి. అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై I want to Apply For అప్షన్ మీద క్లిక్ చేయాలి. లోన్ తీసుకోవడానికి గల కారణాలు, ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత Employer ఆమోదం తెలిపితే అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌కు నగదు జమ అవుతుంది. చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ మారుతి సుజుకి బంపర్ అఫర్