ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) సంస్థ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నగదు నిల్వ, వడ్డీలు, పన్ను మినహాయింపు, పింఛన్ లాంటి పలు రకాల సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఏడాదికిగానూ ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీని అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు పన్ను ఆదా ప్రయోజనాలతో పాటు ఈపీఎఫ్ ఖాతా ద్వారా ఇంటితో సహా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీ వివాహం, మీ కొడుకు & కుమార్తె వివాహం కోసం రుణం పొందవచ్చు. ఇలా పలు రకాల రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల ఈ కింది పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోండి.
- ఈపీఎఫ్‌వో అధికారిక ఈపీఎఫ్ వెబ్‌సైట్ లో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
- మేనేజ్ సెక్షన్ వెళ్లి అందులో ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా లాంటి కేవైసి వివరాలు వెరిఫై చేసుకోవాలి.
- ఆన్‌లైన్ సర్వీసెస్ కు వెళ్లి అందులో క్లెయిమ్(ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేయాలి.
- ఇప్పుడు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అనంతరం మీ వివరాలు మొత్తం నమోదు పూర్తయ్యాక ఎస్ ఆప్షన్ ఓకే చేయాలి.
- అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై I want to Apply For అప్షన్ మీద క్లిక్ చేయాలి.
- లోన్ తీసుకోవడానికి గల కారణాలు, ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో తెలియజేయాల్సి ఉంటుంది.
- మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత Employer ఆమోదం తెలిపితే అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌కు నగదు జమ అవుతుంది.
చదవండి:
2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment