పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరగాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే అధికారులు ఆమోదించి లోన్ మంజూరు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో లేదా యాప్‌లో లభించే వ్యక్తిగత రుణాన్ని డిజిటల్ లోన్ అంటారు. దీన్నే ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అని కూడా పిలుస్తారు. సాధారణ పర్సనల్ లోన్‌తో పోలిస్తే డిజిటల్ లోన్ చాలా తక్కువ సమయంలో మంజూరవుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతం అయినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ కీలకం.
బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!
అర్హత
సాధారణ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ పర్సనల్ లోన్‌కి కూడా అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కనీస ఆదాయం లేదా టర్నోవర్ కలిగిన స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ లోన్ పొందవచ్చు. ఆన్‌లైన్ పర్సనల్ లోన్‌కు అర్హత దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అందుబాటులో లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పించే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వయస్సు, ఉపాధి, వృత్తిపరమైన అనుభవం వంటి సమాచారం కూడా అవసరమవుతుంది.
డాక్యుమెంట్లు
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచడం వలన అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలు, అభ్యర్థనలు లేకుండా లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. డిజిటల్ లోన్ దరఖాస్తు ప్రక్రియ సాఫీగా జరగడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఇక్కడ ఇస్తున్నాం..
ఐడెంటిటీ ప్రూఫ్
లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణగ్రహీతలు తమ గుర్తింపును నిర్ధారించేందుకు
చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్‌ను అందించాలి. వీటిలో ముఖ్యమైనవి పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్.
అడ్రెస్ ప్రూఫ్
లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్ కూడా అవసరం. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి కొన్ని చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్‌లు.
ఇన్‌కమ్ ప్రూఫ్
రుణగ్రహీతలు తమ ఆదాయాన్ని చూపించే ఏదైనా డాక్యుమెంట్‌ను కలిగి ఉండాలి. ఇందు కోసం లేటెస్ట్ శాలరీ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి సమర్పించవచ్చు. ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారు ఆర్థిక స్థిరత్వాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తాయి.
సంతకం ప్రూఫ్
దరఖాస్తుదారు, రుణ సంస్థ మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి ఈ-సైన్ అని పిలిచే డిజిటల్ సంతకం అవసరం. ఇది పరస్పర అంగీకారం, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment