ముంబై: ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచీకత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాకుండా అన్నీ ప్రభుత్వరంగ బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రుణాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఎస్‌బీఐ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ తీసుకున్న రుణాలపై బ్యాంక్ 8.50 శాతం వడ్డీని వసూలు చేస్తుందని దినేష్ ఖారా అన్నారు. ఇతర బ్యాంకుల వడ్డీల విషయానికి వస్తే విభిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అత్యవసర వ్యక్తిగత రుణ పథకం 4.0 (ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్) కింద కరోనా చికిత్సకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఛైర్మన్ రాజ్ కిరణ్ రాయ్, ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతాతో కలిసి ఎస్‌బీఐ ఛైర్మన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment