సాక్షి,ముంబై: ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 6.25 శాతం ఉన్న కీలకమైన రెపోరేటును 6.50 శాతానికి పెంచింది. దీని ప్రభావం అన్నిరకాల లోన్లపైనా పడనుంది. కార్లు, వివిధ రకాల వాహనాల లోన్లు, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి.
తాజా రెపో రేటు పెంపుతో అన్ని రకాల లోన్లపై రుణ భారం సుమారు 2-4 శాతం వరకు పెరగనుంది. దీంతో ఖాతాదారులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే ఈ భారం నుంచి కాస్త ఊరట కలగాలంటే.. అవకాశం ఉన్న రుణగ్రహీతలు లేదా వారి రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు నగదు చెల్లింపును లేదా ఈఎంఐ భారాన్ని భరించలేని వారు రుణకాలాన్ని పొడిగించుకోవడమో చేయాల్సి ఉంటుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారు కూడా పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీ శాతాన్నే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదుపులో ఉన్నప్పుడు తగ్గిస్తుంది లేదా అదే రేటును కొనసాగిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు వడ్డీ భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారుల మీదకు మళ్లించి ఆ మేరకు వడ్డీలను వసూలు చేస్తాయి.
ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధపడతాయి. అయితే ఈ మేరకు ఖాతాదారుల డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు కూడా పెరగ నుంది
(ఇదీ చదవండి: సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ)
Comments
Please login to add a commentAdd a comment