ముంబై: డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణాలకు డిమాండ్ తగ్గింది. కానీ, అదే కాలంలో అన్‌సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగిస్తుండంతో అన్‌సెక్యూర్డ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
రుణానికి దరఖాస్తు వచ్చిన తర్వాత, సంబంధిత దరఖాస్తు దారుడి క్రెడిట్ స్కోరు కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రిడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలను సంప్రదిస్తుంటాయి. డిసెంబర్ త్రైమాసికంలో తన వద్దకు గృహ రుణాల కోసం వచ్చిన విచారణలు ఒక శాతం తగ్గినట్టు సిబిల్ తెలిపింది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు సంబంధించి వచ్చిన విచారణలు 50 శాతం, 77 శాతం మేర పెరిగినట్టు ప్రకటించింది.
ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!
ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఫలితంగా గృహ రుణాలకు విచారణలు తగ్గి ఉండొచ్చని సిబిల్ తెలిపింది. రుణాలు తీసుకుంటున్న వారిల్లో 43 శాతం మంది 18–30 ఏళ్లలోపు ఉన్నారని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వీరి శాతం 40 శాతంతో పోలిస్తే పెరిగినట్టు సిబిల్ తన నివేదికలో వెల్లడించింది. మెట్రోలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే విచారణలు పెరిగినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment