Dips
-
టోకు ధరలు మూడోనెలా మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక లోహాల ధరలు తగ్గుదల ప్రభావం మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) క్షీణతకు దారితీస్తోంది. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, టెక్స్టైల్స్ ధరలు కూడా జూలై తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 4.12 శాతంగా నమోదయ్యింది. ఇలాంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. గత ఏడాది జూన్ నెల్లో హై బేస్ ఎఫెక్ట్ (16.23 శాతం) కూడా తాజా ప్రతిద్రవ్యోల్బణం పరిస్థితికి ఒక కారణం. ఈ తరహా పరిస్థితి నెలకొనడం వరుసగా ఇది మూడవనెల కావడం గమనార్హం. ఇక ఇంతటి స్థాయిలో ప్రతిద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టం కావడం మరో విషయం. 2015 అక్టోబర్‌లో మైనస్ 4.76 ప్రతిద్రవ్యోల్బణం రికార్డయ్యింది. మేలో 4.3 శాతం ఉన్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.8 శాతానికి పెరిగిన నేపథ్యంలోనే టోకు ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అయితే ఆర్థికవ్యవస్థకు కీలకమైన రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) రేటు నిర్ణయానికి సెంట్రల్ బ్యాంక్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రామాణికంగా తీసుకునే సంగతి తెలిసిందే. -
నిరుద్యోగం తగ్గింది.. జాతీయ శాంపిల్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు (15 ఏళ్లు నిండిన వారు) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.8 శాతానికి పరిమితమైంది. 2022 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఉన్న 8.2 శాతంతో పోలిస్తే చెప్పుకోతగ్గ మేర తగ్గింది. పనిచేసే శక్తి ఉండి, ఉపాధి లేని వారిని నిరుద్యోగుల కింద పరిగణిస్తారు. గతేడాది మొదటి త్రైమాసికంలో నిరుద్యోగం ఎక్కవగా ఉండడానికి కరోనా వైరస్ ఇంకా సమసిపోకపోవడమేనని చెప్పుకోవాలి. ఇక 2022 అక్టోబర్–డిసెంబర్, జూలై–సెప్టెంబర్ కాలంలో 7.2 శాతం చొప్పున నిరుద్యోగ రేటు నమోదైంది. 2022 ఏప్రిల్–జూన్‌లో 7.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగం 2023 మొదటి మూడు నెలల్లో 9.2 శాతానికి తగ్గింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇది 10.1 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతంగా ఉంది. 2022 అక్టోబర్–డిసెంబర్లో ఇది 6.5 శాతంగా ఉంది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.5 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 47.3 శాతంతో పోలిస్తే కొంత మెరుగుపడింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు -
పర్సనల్ లోనే కావాలి!
ముంబై: డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణాలకు డిమాండ్ తగ్గింది. కానీ, అదే కాలంలో అన్సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగిస్తుండంతో అన్సెక్యూర్డ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! రుణానికి దరఖాస్తు వచ్చిన తర్వాత, సంబంధిత దరఖాస్తు దారుడి క్రెడిట్ స్కోరు కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రిడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలను సంప్రదిస్తుంటాయి. డిసెంబర్ త్రైమాసికంలో తన వద్దకు గృహ రుణాల కోసం వచ్చిన విచారణలు ఒక శాతం తగ్గినట్టు సిబిల్ తెలిపింది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు సంబంధించి వచ్చిన విచారణలు 50 శాతం, 77 శాతం మేర పెరిగినట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఫలితంగా గృహ రుణాలకు విచారణలు తగ్గి ఉండొచ్చని సిబిల్ తెలిపింది. రుణాలు తీసుకుంటున్న వారిల్లో 43 శాతం మంది 18–30 ఏళ్లలోపు ఉన్నారని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వీరి శాతం 40 శాతంతో పోలిస్తే పెరిగినట్టు సిబిల్ తన నివేదికలో వెల్లడించింది. మెట్రోలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే విచారణలు పెరిగినట్టు పేర్కొంది. -
మూడో రోజు తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు రోజుకూడా తగ్గుముఖం పట్టాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల తగ్గింపుతో శనివారం మరో 15 పైసలు దిగి వచ్చింది. దీంతో ఈ మూడు రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు 44 పైసలు, డీజిల్‌పై లీటరుకు 45 పైసల ఉపశమనం లభించింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలను లీటరుకు 15 పైసలు తగ్గా, ఢిల్లీ కోల్‌కతాలో డీజిల్ ధరను 16 పైసలు తగ్గింది. ముంబై, చెన్నైలలో లీటరుకు 17 పైసలు తగ్గించడం గమనార్హం. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం పలు నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 75.26,లీటరు డీజిల్ ధర 68.61 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. రూ .77.85 లీటరు డీజిల్ ధర రూ .70.97 ముంబై: లీటరు పెట్రోలు రూ .80.85 లీటరు డీజిల్ ధర రూ .71.94 చెన్నై : లీటరు పెట్రోలు రూ .78.19 లీటరు డీజిల్ ధర రూ .72.50 హైదరాబాద్ : లీటరు పెట్రోలు రూ .80.03 లీటరు డీజిల్ ధర రూ .74.81 విజయవాడ లీటరు పెట్రోలు రూ .79.20 లీటరు డీజిల్ ధర రూ .73.66 -
తెలంగాణ మంత్రి నాన్‌స్టాప్ డిప్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. తాను నాన్‌స్టాప్‌గా డిప్స్ కొడుతున్న వీడియోను మంత్రి ట్విటర్లో పోస్ట్‌చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫ్రీడం హైదరాబాద్ పేరిట ఆదివారం రోజున నగరంలోని నెక్లెస్ రోడ్లో గల పీపుల్స్ ప్లాజా వద్ద 10కే రన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిట్నెస్ ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా.. వేదికపై ఆగకుండా 50కి పైగా డిప్స్ కొట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన శ్రీనివాస్‌గౌడ్.. ఫిట్నెస్ను ఇష్టమైన అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
మరింత క్షీణించిన మారుతి లాభాలు
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) మరోసారి నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది.వార్షిక ప్రాతిపదికన మారుతి లాభాలు 39శాతం పతనమయ్యాయి. గత 8 సంవత్సరాలలో త్రైమాసిక లాభంలో ఇదే అతిపెద్ద పతనం. ఏకీకృత నికర లాభం 38.99 శాతం క్షీణించిం రూ. 1,391 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,280.2 కోట్లు. ఎనిమిదేళ్లలో త్రైమాసిక లాభంలో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. ఆదాయంలో కూడా 25.19 శాతం పతనాన్ని నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ .16,123 కోట్లు అంతకు ముందు ఏడాది 21,553.7 కోట్ల రూపాయలు. అయితే ఆటోమందగమనం నేపథ్యంలో లాభాలు మరింత క్షీణిస్తాయన్న ఎనలిస్టుల అంచనాలను మారుతి బీట్ చేసింది. చివరిసారిగా కంపెనీ నికర లాభంలో పెద్ద క్షీణత 2011-12 రెండవ త్రైమాసికంలో 241 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .549 కోట్లతో పోలిస్తే 56 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో 3,38,317 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం తగ్గింది. ఆర్థిక పనితీరుపై ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సి భార్గవ మాట్లాడుతూ రెండవ త్రైమాసికం, ఆర్థిక మొదటి సగం ఫలితాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. అమ్మకాలు 22 శాతం (క్యూ 2 లో) పడిపోయాయన్నారు. బీమా, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు కొత్త సెక్యూరిటీ విధానాలు ఉద్గార నిబంధనల కారణంగా వాహనాల వ్యయం పెరగడం వల్ల ఆటో పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైందని ఆయన అన్నారు. అయితే భవిష్యత్తుపై చాలా నమ్మకంగా ఉన్నామని భార్గవ పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ఏమి జరుగుతుందన్న దానిపై రికవరీ ఆధారపడి ఉంటుందన్నారు. -
మోదీ సర్కార్‌కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఈజీ బిజినెస్, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పెట్టుబడులు దేశానికి రానున్నాయని ఊదరగొట్టిన బీజేపీ సర్కార్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్విస్ బాంకుల్లో భారీతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్న వార్త నరేంద్ర మోదీ సర్కారును ఇరుకున పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ డిపాజిట్లన్నీ అక్రమం కాదు...పూర్తి నివేదిక అనంతరం వివరాలు వెల్లడవుతాయంటూ డ్యామేజ్ కంట్రోల్లో పడిన కేంద్రానికి తాజాగా మరో షాక్ తగిలింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ల వృద్ది రేటు భారీగా పడిపోయింది. 2017 సంవత్సరంలో అయిదేళ్ల కనిష్టాన్ని నమోదు చేశాయి. భారత్‌లో 2017-18లో ఎఫ్‌డీఐలు కేవలం మూడు శాతం వృద్ధితో 44.85 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు భారీ పెరుగుదలను నమోదుచేశాయి. ఎఫ్‌డీఐ అవుట్ ఫ్లో 48వేలకోట్ల రూపాయలతో పదేళ్ళ ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2017-18లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల వృద్ధిరేటు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయివద్ద 44.85 బిలియన్ డాలర్లకు చేరింది. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2013-14ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 8 శాతం పెరిగాయి. 2012-13లో 38 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాల కింద విదేశీ పెట్టుబడులను 8 శాతం పెంచింది. ఎన్డీఏ ఆధ్వర్యంలో 2014-15లో 27శాతం, తర్వాతి సంవత్సరంలో 29 శాతం ఉండగా, 2016-17లో అది కేవలం 8.67 శాతం మాత్రమే పుంజుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు 2017-18 సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లో గరిష్ట స్థాయిల వద్ద రికార్డ్ పెట్టుబడులు సాధించింది. పెట్టుబడులు 44.8 బిలియన్ డాలర్ల వద్ద ఇంతకుముందెన్నడూ లేని వృద్ధిని నమోదు చేశాయి. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దేశంలో పెట్టుబడులను పునరుద్ధరించడంతో పాటు, దేశంలో వ్యాపారం చేయడం మరింత సులభంచేయాలని నిపుణులు చెబుతున్నారు. డాలరు మారకంలో 7శాతం క్షీణించి ఇప్పటికే బలహీనంగా దేశీయ కరెన్సీపై ఇంత భారం వేయనుందని హెచ్చరించారు. గత రెండు సంవత్సరాలలో దేశీయ పెట్టుబడుల రేటులో క్షీణత కనిపించిందనీ, ఇదే కోవలో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయని జెఎన్యూ ప్రొఫెషర్ విశ్వజిత్ ధార్ తెలిపారు. దేశీయ ఆర్థికస్థితిని, విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు ప్రతిబింబిస్తాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, దేశీయ పెట్టుబడులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎఫ్‌డీఐ పెట్టుబడుల రేటు క్షీణతకు కస్టమర్, రిటైల్ రంగాలలో ఎఫ్‌డీఐ తక్కువగా ఉండడానికి ప్రధానంగా విదేశీ పెట్టుబడుల విధానంలో అనిశ్చితి, సంక్లిష్టత కారణమని చెప్పవచ్చని డెలాయిట్ ఇండియా భాగస్వామి అనిల్ త్రేరెజా వ్యాఖ్యానించారు. నిబంధనలను సడలించడంలో, సందిగ్ధతలను తొలగించడంలో ప్రభుత్వం గణనీయమైన కృషిని చేపట్టినప్పటికీ, ప్రపంచ వినియోగదారుల మరియు రిటైల్ కంపెనీలు ఇప్పటికీ భారత్‌లో పెట్టుబడులవైపు నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడవుతున్నాయని ఆయన అన్నారు. బిజినెస్ చేయడం సులభతరం చేయడానికి ర్యాంకింగ్‌ను పెంచడం, విదేశీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా ఉండాలన్నారు. -
తగ్గిన బంగారం, వెండి ధరలు
సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖ పట్టాయి. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 180 రూపాయల మేర పడిపోయింది. తద్వారా వరుస రెండు రోజుల లాభాలకు చెక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో స్టాకిస్టు, రిటైలర్ల కోనుగోళ్లు పడిపోవడంతో పసిడి ధర క్షీణతను నమోదు చేసింది. అటు వెండి కూడా వెండి ధర 540 రూపాయల మేర పడిపోయింది. స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) రూ. 180 తగ్గి రూ .30,305 వద్ద ముగిసింది. 99.9 స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములకి 30,455 రూపాయల వద్ద ముగిసింది. వెండి కిలో 540 రూపాయలు పడిపోయి రూ .38,730 వద్ద ముగిసింది. గత సెషన్లో రెండు నెలల్లో అతిపెద్ద వన్డే నష్టాన్ని పోస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బంగారం పతనమైంది. విదేశీ మార్కెట్లో శుక్రవారం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి దాదాపు 11 డాలర్లు(0.8 శాతం) క్షీణించి 1337 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో వెండి మరింత అధికంగా ఔన్స్ 2.6 శాతం పడిపోయి 16.71 డాలర్ల వద్ద నిలిచింది. వెరసి గత వారం పసిడి ధర 1.1 శాతం నష్టపోగా.. వెండి 3.6 శాతం పడిపోయింది. ముఖ్యంగా శుక్రవారం జనవరి నెలకు అమెరికా ఉపాధి గణాంకాలు వెలువడ్డాయి. 2009 తరువాత తొలిసారి అత్యంత వేగవంత వృద్ధిని అందుకుంటూ 2 లక్షల ఉద్యోగ కల్పన జరిగినట్లు వెల్లడైంది. దీంతో ఇకపై కంపెనీలు పెరగనున్న సిబ్బంది వ్యయాలకు అనుగుణంగా ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశమున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయనుంది. మరోవైపు ఈ ఏడాది 2 శాతం లక్ష్యాన్ని చేరగలదని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత వారం నిర్వహించిన పాలసీ సమీక్షలో ఇప్పటికే పేర్కొనడంతో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక వ్యవస్థ పటిష్టత వంటి అంశాలు ఇటీవల నీరసించిన డాలర్ బాగా పుంజుకుంది. ఈ ప్రభావంతో అంతర్జాతీయంగానూ, దేశీయంగా పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. -
జియో ఎఫెక్ట్: భారీగా కుదేలైన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో నుంచి వస్తున్న ఉచిత ఆఫర్ల పోటీని తట్టుకోలేక టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కుదేలైంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు 54 శాతానికి పైగా దిగజారి రూ.503.7 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,108.1 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం కూడా 3 శాతం క్షీణించి రూ.23,363.9 కోట్లగా నమోదైనట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయిన ఆపరేటర్, ధరల విషయంలో తీవ్ర దోపిడీ విధానానికి దారితీస్తుందని, దీంతో కంపెనీ ఇరకాటంలో పడినట్టు భారతీ ఎయిర్టెల్ భారత, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల యేటికేటికి ఆర్జించే రెవెన్యూలను ఊహించని విధంగా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు. ఇది టెలికాం రంగంలో ఫైనాన్సియల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మిట్టల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జియో గతేడాది సెప్టెంబర్ నుంచి ఉచిత 4జీ సర్వీసులను అందిస్తూ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ తన ఉచిత సర్వీసులను మరోసారి 2017 మార్చి 31 వరకు పొడిగించింది. జియో దెబ్బకు కంపెనీలు సతమవుతున్నాయి. ఏకీకృత మొబైల్ డేటా రెవెన్యూలు కూడా ఎయిర్‌టెల్‌కు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. ఈ రెవెన్యూలు రూ.4,049 కోట్లగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ మార్కెట్ షేరు 33 శాతం గరిష్టానికి చేరుకుందట. నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్ కూడా ఆఫ్రికాలో కంపెనీపై ప్రభావం చూపినట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 27,215 నిఫ్టీ 8,218. దగ్గర ట్రేడవుతున్నాయి. ముందు లాభాలతో ప్రారంభమై, నష్టాల్లో జారుకున్నాయి. మళ్ళీ కొద్దిగా పుంజుకుని, స్వల్పలాభాలతో ట్రేడవుతూ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి12 పైసలు లాభపడి 63.36 దగ్గర ఉంది.