సాక్షి, న్యూఢిల్లీ: ఈజీ బిజినెస్, ఇబ్బడి ముబ‍్బడిగా విదేశీ పెట్టుబడులు దేశానికి రానున్నాయని ఊదరగొట్టిన బీజేపీ సర్కార్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్విస్ బాంకుల్లో భారీతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్న వార్త నరేంద్ర మోదీ సర్కారును ఇరుకున పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ డిపాజిట్లన్నీ అక్రమం కాదు...పూర్తి నివేదిక అనంతరం వివరాలు వెల్లడవుతాయంటూ డ్యామేజ్ కంట్రోల్‌లో పడిన కేంద్రానికి తాజాగా మరో షాక్ తగిలింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ల వృద్ది రేటు భారీగా పడిపోయింది. 2017 సంవత్సరంలో అయిదేళ్ల కనిష్టాన్ని నమోదు చేశాయి. భారత్‌లో 2017-18లో ఎఫ్‌డీఐలు కేవలం మూడు శాతం వృద్ధితో 44.85 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు భారీ పెరుగుదలను నమోదుచేశాయి. ఎఫ్‌డీఐ అవుట్ ఫ్లో 48వేలకోట్ల రూపాయలతో పదేళ్ళ ఏళ్ల గరిష్టాన్ని తాకాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2017-18లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల వృద్ధిరేటు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయివద్ద 44.85 బిలియన్ డాలర్లకు చేరింది. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2013-14ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 8 శాతం పెరిగాయి. 2012-13లో 38 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాల కింద విదేశీ పెట్టుబడులను 8 శాతం పెంచింది. ఎన్‌డీఏ ఆధ్వర్యంలో 2014-15లో 27శాతం, తర్వాతి సంవత్సరంలో 29 శాతం ఉండగా, 2016-17లో అది కేవలం 8.67 శాతం మాత్రమే పుంజుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు 2017-18 సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్‌లో గరిష్ట స్థాయిల వద్ద రికార్డ్ పెట్టుబడులు సాధించింది. పెట్టుబడులు 44.8 బిలియన్ డాలర్ల వద్ద ఇంతకుముందెన్నడూ లేని వృద్ధిని నమోదు చేశాయి.
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దేశంలో పెట్టుబడులను పునరుద్ధరించడంతో పాటు, దేశంలో వ్యాపారం చేయడం మరింత సులభంచేయాలని నిపుణులు చెబుతున్నారు. డాలరు మారకంలో 7శాతం క్షీణించి ఇప్పటికే బలహీనంగా దేశీయ కరెన్సీపై ఇంత భారం వేయనుందని హెచ్చరించారు. గత రెండు సంవత్సరాలలో దేశీయ పెట్టుబడుల రేటులో క్షీణత కనిపించిందనీ, ఇదే కోవలో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయని జెఎన్‌యూ ప్రొఫెషర్ విశ్వజిత్ ధార్ తెలిపారు. దేశీయ ఆర్థికస్థితిని, విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు ప్రతిబింబిస్తాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, దేశీయ పెట్టుబడులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎఫ్‌డీఐ పెట్టుబడుల రేటు క్షీణతకు కస్టమర్, రిటైల్ రంగాలలో ఎఫ్‌డీఐ తక్కువగా ఉండడానికి ప్రధానంగా విదేశీ పెట్టుబడుల విధానంలో అనిశ్చితి, సంక్లిష్టత కారణమని చెప్పవచ్చని డెలాయిట్ ఇండియా భాగస్వామి అనిల్ త్రేరెజా వ్యాఖ్యానించారు. నిబంధనలను సడలించడంలో, సందిగ్ధతలను తొలగించడంలో ప్రభుత్వం గణనీయమైన కృషిని చేపట్టినప్పటికీ, ప్రపంచ వినియోగదారుల మరియు రిటైల్ కంపెనీలు ఇప్పటికీ భారత్‌లో పెట్టుబడులవైపు నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడవుతున్నాయని ఆయన అన్నారు. బిజినెస్ చేయడం సులభతరం చేయడానికి ర్యాంకింగ్ను పెంచడం, విదేశీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment