మరింత క్షీణించిన మారుతి లాభాలు | Maruti Suzuki Q2 profit dips 39percent YoY | Sakshi
Sakshi News home page

మరింత క్షీణించిన మారుతి లాభాలు

Published Thu, Oct 24 2019 6:36 PM | Last Updated on Thu, Oct 24 2019 7:09 PM

Maruti Suzuki Q2 profit dips 39percent YoY  - Sakshi

సాక్షి, ముంబై:   దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) మరోసారి నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది.వార్షిక ప్రాతిపదికన మారుతి లాభాలు 39శాతం పతనమయ్యాయి. గత 8 సంవత్సరాలలో త్రైమాసిక లాభంలో ఇదే అతిపెద్ద పతనం.  ఏకీకృత నికర లాభం 38.99 శాతం క్షీణించిం రూ. 1,391 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,280.2 కోట్లు. ఎనిమిదేళ్లలో త్రైమాసిక లాభంలో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది.   ఆదాయంలో కూడా 25.19 శాతం పతనాన్ని నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ .16,123 కోట్లు అంతకు ముందు ఏడాది 21,553.7 కోట్ల రూపాయలు.  అయితే ఆటోమందగమనం నేపథ్యంలో లాభాలు మరింత క్షీణిస్తాయన్న ఎనలిస్టుల అంచనాలను  మారుతి బీట్‌ చేసింది.   చివరిసారిగా కంపెనీ నికర లాభంలో పెద్ద క్షీణత 2011-12 రెండవ త్రైమాసికంలో 241 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .549 కోట్లతో పోలిస్తే  56 శాతం  క్షీణించింది. 

ఈ త్రైమాసికంలో  3,38,317 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం తగ్గింది. ఆర్థిక పనితీరుపై ఎంఎస్‌ఐ చైర్మన్ ఆర్‌సి భార్గవ మాట్లాడుతూ రెండవ త్రైమాసికం, ఆర్థిక మొదటి సగం ఫలితాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. అమ్మకాలు 22 శాతం (క్యూ 2 లో) పడిపోయాయన్నారు. బీమా, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు  కొత్త సెక్యూరిటీ విధానాలు ఉద్గార నిబంధనల కారణంగా వాహనాల వ్యయం పెరగడం వల్ల  ఆటో పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైందని ఆయన అన్నారు.  అయితే భవిష్యత్తుపై చాలా నమ్మకంగా ఉన్నామని  భార్గవ పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ఏమి జరుగుతుందన్న దానిపై రికవరీ ఆధారపడి ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement